Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్తదశాధిక ద్విశతతమో7ధ్యాయః

పునర్గాయత్రీ నిర్వాణమ్‌

అగ్ని రువాచ :

లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యాయోగ మాప్తవాన్‌ | నిర్వాణం పరమంబ్రహ్మ వశిష్టో7న్యశ్చ శఙ్కరాత్‌. 1

సమః కనక లిఙ్గాయ వేదలిఙ్గాయ వై నమః | నమః పరమలిఙ్గాయ వ్యోమలింగాయ వై నమః. 2

నమః సహస్రలిఙ్గాయ వహ్నిలిఙ్గాయ వైనమః | నమః పురాణలిఙ్గాయ శ్రుతిలిఙ్గాయ వైనమః. 3

నమః పాతాళలిఙ్గాయ బ్రహ్మలిఙ్గాయ వైనమః | నమో రహస్యలిఙ్గాయ సప్తద్వీపోర్ధ్వలిఙ్గినే. 4

నమః సర్వాత్మలిఙ్గాయ సర్వలోకాఙ్గలిఙ్గినే | నమస్త్వవ్యక్త లిఙ్గాయ బుద్ధిలిఙ్గాయ వైనమః. 5

నమో7హఙ్కారలిఙ్గాయ భావలిజ్గాయ వైనమః | నమ ఇంద్రియలిఙ్గాయ నమస్తన్మాత్రలింగినే. 6

నమః పురుషలిఙ్గాయ భావలిఙ్గాయ వై నమః | నమో రజోర్ద్వలిఙ్గాయ సత్త్వలిఙ్గాయ వై నమః. 7

నమస్తే భవ లిఙ్గాయ నమసై#్రగుణ్యలింగినే | నమో7నాగత లిఙ్గాయ తేజోలిఙ్గాయ వైనమః. 8

నమో వాయూర్ధ్వలిఙ్గాయ శ్రుతిలిఙ్గాయ వై నమః | నమసే7థర్వలిఙ్గాయ సామలిఙ్గాయ వై నమః. 9

నమో యజ్ఞాఙ్గలిఙ్గాయ యజ్ఞలిఙ్గాయ వై నమః | నమస్తే తత్త్వలిఙ్గాయ దైవానుగతలిఙ్గినే. 10

దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా | బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో. 11

అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్‌|

అగ్నిరువాచ

వసిష్ఠేన స్తుతః శమ్భుస్తుష్టః శ్రీపర్వతేపురా | వశిష్ఠాయ వరం దత్త్వా తత్రైవాన్తరధీయత. 12

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గాయత్రీ నిర్వాణం లిఙ్గస్తోత్రం నామ

సప్తదశాధిక ద్విశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడిట్లు చెప్పెను : వసిష్ఠా! మరొకవసిష్టుడు గాయత్రీజపపూర్వకముగా లింగమూర్తియగు శివుని స్తుతించి శివుని అనుగ్రహముచే నిర్మాణస్వరూపమగు పరబ్రహ్మను పొందెను. వసిష్ఠుడిట్లు స్తుతించెను - ''కనకలింగమునకు నమస్కారము. వేదలింగమునకు నమస్కారము. పరమలింగమునకు నమస్కారము. ఆకాశలింగమునకు నమస్కారము. సహస్రలింగ - వహ్నిలింగ - పురాణలింగ-వేదలింగ శివునకు మాటిమాటికి నమస్కారము చేయుచున్నాను. పాతాలలింగ - బ్రహ్మలింగ - సప్తద్వీపోర్ధ్వ లింగమునకు మాటిమాటికి నమస్కారము. సర్వాత్మలింగ - సర్వలోకలింగ - అవ్యక్త లింగ - బుద్ధిలింగ - అహంకారలింగ - భూతలింగ - ఇంద్రియలింగ - తన్మాత్రలింగ - పురుషలింగ - భావలింగ రజోర్ధ్వలింగ - సత్త్వలింగ -భవలింగ - త్రైగుణ్యలింగ అనాగతలింగ - తేజోలింగ - వాయుర్ధ్వలింగ - శ్రుతిలింగ అథర్వలింగ - సమలింగ - యజ్ఞాంగలింగ - యజ్ఞలింగ - తత్త్వలింగ-దైవతానుగతలింగ స్వరూపుడవగు నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను. ప్రభూ! నాకుపరమయోగమును ఉపదేశించుము; నాతోసమానుడైన పుత్రుని ఇమ్ము. నాకు అవినాశి యగు పరబ్రహ్మయొక్క ప్రాప్తిని కలిగించుము. పరమశాంతినిమ్ము. నావంశము ఎన్నటికినీ క్షీణము కాకుండుగాక! నా బుద్ధి సర్వధా ధర్మముపై లగ్నమైయుండుగాక'' అగ్ని పలికెను : పూర్వము వసిష్టుడు శ్రీశైలముపై స్తుతించగా శంకరుడు ప్రసన్నుడై వసిష్ఠునకు వరములిచ్చి అచటనే అంతర్ధానము చెందెను.

అగ్నిమహాపురాణమునందు గాయత్రీనిర్వాణకథనమను రెండు వందల పదునేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page