Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ అష్టాదశాధిక ద్విశతతమో7ధ్యాయః
అథ రాజాభిషేక కథనమ్
అగ్ని రువాచ :
పుష్కరేణ చ రామాయ రాజధర్మంహి పృచ్ఛతే | యథాదౌ కథితం తద్వద్వశిష్ఠ కథయామి తే. 1
పుష్కర ఉవాచ :
రాజధర్మం ప్రవక్ష్యామి సర్వస్మాద్రాజధర్మతః | రాజా భ##వేచ్ఛత్రుహన్తా ప్రజాపాలః సుదణ్డవాన్. 2
పాలయిష్యతి వః సర్వాన్ధర్మస్థాన్ర్వత మాచరేత్ | సంవత్సరం స వృణుయాత్పురోహితమథ ద్విజమ్. 3
మన్త్రిణశ్చాఖిలాత్మజ్ఞాన్మహిషీం ధర్మలక్షణామ్ | సంవత్సరం నృపః కాలే ససంభారో7భిషేచనమ్. 4
కుర్యాన్మృతే నృపే నాత్ర కాలస్య నియమః స్మృతః | తిలైః సిద్ధార్థకైః స్నానం సాంవత్సర పురోహితౌ. 5
ఘోషయిత్వా జయం రాజ్ఞో రాజా భద్రాసనేస్థితః | ఉభయం ఘోషయేద్దుర్గాన్మో చయేద్రాజ్యపాలకే. 6
పురోధసా7భిషేకాత్ర్పాక్కార్యైన్ద్రీ శాంతిరేవచ | ఉపవాస్యభిషేకా హే వేద్యగ్నౌ జుహుయాన్మనూన్. 7
వైష్ణవానైన్ధ్రమంత్రాంస్తు సావిత్రాన్ వైశ్వదేవతాన్ | సౌమ్యాన్స్వస్త్యయనం శర్మ ఆయుష్యాభయదాన్మనూన్.
అపరాజితాంచ కలశం వహ్నేర్దక్షిణపార్శ్వగమ్ | సమ్పాతవన్తం హైమంచ పూజయేద్గంధపుష్పకైః. 8
ప్రదక్షిణావర్తశిఖస్తప్తజాంబూనదప్రభః | రథౌఘ మేఘనిర్ఘోషో విధూమశ్చ హుతాశనః. 9
అనులోమః సుగంధశ్చ స్వస్తీకాకారసన్నిభః | ప్రసన్నార్చిర్మహోజ్వాలః స్ఫులిఙ్గ రహితో హితః. 11
అగ్నిదేవుడు చెప్పెను : వసిష్ఠా! పూర్వము పరశురాముడు ప్రశ్నించగా పుష్కరుడు చెప్పిన రాజధర్మములను చెప్పెదను. పుష్కరుడు పలికెను: రామా! నేనుసకలరాజధర్మములనుండి గ్రహించి రాజుయొక్క ధర్మములను చెప్పెదను. రాజుధండమును ఉచితరీతిని ఉపయోగించుచు. శత్రువులనునశింపచేసి, ప్రజలనురక్షించవలెను. ''మీరందరును ధర్మమార్గమును అనుసరించి ఉండును. నేను మిమ్ములను రక్షించెదను'' అని ప్రజలకు చెప్పి తనమాట నిలుపుకొనవలెను. రాజు సంవత్సర ఫలమును చెప్పు ఒక్క జ్యోతిః శాస్త్రవేత్తయగు బ్రాహ్మణుని, పురోహితుని వరణము చేయవలెను. సకలరాజకీయ శాస్త్రనిపుణులు, ఆత్మజ్ఞానవంతులు అగు మంత్రులను నియమించి సకలగుణసంపన్నురాలగు దేవిని పట్టమహిషినిగా చేయవలెను. రాజ్యభారము వహించిన రాజు ఒక సంవత్సరముగడచిన పిమ్మట అభిషేకసంభారములన్నియు సంపాదించి ఉత్సవ పూర్వకముగా రాజ్యాభిషేకము పొందవలెను. రాజ్యముచేయుచున్న రాజు మరణించిన వెంటనే వారసుడు వెంటనే ముహూర్తాది చింతఏమియుచేయక రాజ్యభారము వహించవలెను. రాజు జ్యోతిషికపురోహితులద్వారా తిలసర్షపాది సామగ్రిని ఉపయోగించుచు స్నానము చేసి భద్రాసనము అలంకరించి రాజ్యమునందుండును. తన విజయమును ఘోషించవలెను. అభయఘోషణ చేసి రాజ్యములో నున్న కైదీలను అందరిని బంధవిముక్తులను చేయవలెను. పురోహితునిచే, అభిషేకము పొందుటకు పూర్వము, ఇంద్రాదిదేవతా శాంతి చేయించవలెను. అభిషేకదివసమున ఉపవాసము చేసి వేదిపై స్థాపించబడిన అగ్నియందు మంత్రపాఠపూర్వకముగా హోమములు చేయవలెను. విష్ణు - ఇంద్ర - సవితృ - విశ్వదేవ - సోమదేవతా ఋక్కులను, స్వస్త్యయన - శాంతి ఆయుష్య - అభయదములగు మంత్రములను పఠించవలెను, అగ్నికి దక్షిణమున అపరాజితాదేవిని, అనేక భద్రములు గల సువర్ణ కలశను స్థాపించి చందనపుష్పాదులతో పూజించవలెను. అగ్నిశిఖ కుడివైపు తిరుగుచు, తప్తసువర్ణ కాంతితో రథ - మేఘ ధ్వనులతో సమానమగు ధ్వనిని కలిగించుచు, ధూమ రహితమై, ఉన్నచో, అగ్నిదేవుడు అనుకూలుడై హవిస్సును గ్రహించినచో, హోమాగ్నినుండి ఉత్తమగంధము బయల్వెడలినచో, మంటలు స్వస్తికాకారమున పై కెగసినచో, అగ్నిస్వచ్ఛమై ఎత్తుగా లేచినచో, నిప్పునెలసులు లేవకున్నచో అది శుభప్రదము.
న వ్రజేయుశ్చ మధ్యేన మార్జార మృగ పక్షిణః | పర్వతాగ్రమృదా తావన్మూర్ధానం శోధయేన్నృపః. 12
వల్మీకాగ్రమృదా కర్ణౌ వదనం కేశవాలయాత్ | ఇంద్రాలయ మృదా గ్రీవాం హృదయంతు నృపాజిరాత్. 13
కరి దంతోద్ధృతమృదా దక్షిణం తు తథాభుజమ్ | వృషశృంగోద్ధృత మృదా వామం చైవ తథా భుజమ్. 14
నరోమృదా తథా పృష్ఠముదరం సంగమాన్మృదా | నదీతటద్వయ మృదా పార్శ్వే సంశోధయేత్తథా. 15
వేశ్యాద్వార మృదా రాజ్ఞః కటిశౌచం విధీయతే| యజ్ఞస్థానాత్తథైవోరు గోస్థానాజ్జానునీ తథా. 16
అశ్వస్థానాత్తథా జజ్ఘే రథచక్రమృదాంఘ్రికే| మూర్ధానం పంచగవ్యేన భద్రాసనగతంనృపమ్. 17
అభిషిఞ్చే దమాత్యానాం చతుష్టయ మథో ఘటైః | పూర్వతోహేమకుమ్భేన ఘృతపూర్ణేన బ్రాహ్మణః. 18
పూర్వకుమ్భేన యామ్యేచ క్షీర పూర్ణేన క్షత్రియః | దధ్నాచ తామ్ర కుంభేన వైశ్యః పశ్చిమగేన చ. 19
మృణ్మయేన జలేనోదక్ శూద్రామాత్యో7భిషేచయేత్ | తతో7భిషేకం నృపతే ర్బహ్వృచ ప్రవరోద్విజః. 20
కుర్వీత మధునా విప్ర శ్ఛందోగశ్చకుశోదకైః | సంపాతవన్తం కలశం తథాగత్వా పురోహితః. 21
విధాయ వహ్నిరక్షాం తు సదస్యేషు యథావిధి | రాజాశ్రియాభిషేకేచ యేమన్త్రాః పరికీర్తితాః. 22
తైస్తు దద్యాన్మహాభాగ బ్రాహ్మణానాం స్వనైన్తథా | తతః పురోహితో గచ్ఛేద్వేదిమూలం తదేవతు. 23
శతచ్ఛిద్రేణ పాత్రేణ సౌవర్ణేనాభిషేచయేత్ | యా ఓషధీత్యోషధీభీరథే యుక్త్వేతి గంధకైః. 24
పుషై#్పః పుష్పవతీత్యేవ బ్రాహ్మణతి చ బీజకైః | రత్నైరాశుః శిశానశ్చ యేదేవాశ్చకుశోదకైః. 25
యజుర్వేద్యథర్వవేదీ గంధద్వారేతి సంస్పృశేత్ | శిరః కంఠం రోచనయా సర్వతీర్థోదకైర్ద్విజాః. 26
రాజునకు అగ్నికి మధ్యనుండి పిల్లికాని, మృగముకాని, పక్షికాని వెళ్లకూడదు. రాజు మొదట పర్వత శిఖర మృత్తికతో శిరస్సును శుద్ధి చేసుకొనవలెను. పుట్ట మట్టితో చెవులను విష్ణ్వాలయ పరాగముతో ముఖమును, ఇంద్ర దేవాలయ మృత్తుతో కంఠమును, రాజగృహము వాకిలి యందలి మట్టితో హృదయమును, ఏనుగు దంతములతో త్రవ్విన మట్టితో కుడి చేతిని, ఎద్దుకొమ్ముతో త్రవ్విన మట్టితో ఎడమభుజమును, సరస్సునందలి మృత్తికతో వీపును, నదీద్వయ సంగమ మృత్తికతో ఉదరమును, నది రెండు తటముల మృత్తికతో పార్శ్వములను, వేశ్యాద్వార మృత్తికతో కటిభాగమును, యజ్ఞశాలా మృత్తికతో తొడలను, గోశాలా మృత్తికతో మోకాళ్లను, అశ్వశాలా మృత్తికతో కళ్లను, రథచక్ర మృత్తికతో పాదములను శుద్ధము చేసికొనవలెను. పిదప పంచగవ్యముతో శిరస్సును శుద్ధిచేసికొనవలెను. పిదప నలుగురు ఆమాత్యులు భద్రాసనముపై కూర్చున్న రాజునకు కలశోదకముతో అభిషేకము చేయవలెను. బ్రాహ్మణుడైన సచివుడు, తూర్పునుండి ఘృతపూర్ణ సువర్ణకలశముతో అభిషేకము ఆరంభించవలెను. క్షత్రియసచిపుడు దక్షిణమున నించి క్షీరపూర్ణమగు రజత కలశతోను, వైశ్యామాత్యుడు పశ్చిమమున నిలిచి దధిపూర్ణ తామ్రకలశతోను, శూబ్రామాత్యుడు ఉత్తరమునుండి జలపూర్ణ మృత్పాత్రతోను రాజాభిషేకము చేయవలెను. పిదప ఋగ్వేదములలో శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు తేనెతోను, సామవేదియైన విప్రుడు కుశజలముతోను అభిషేకము చేయవలెను. పిదప పురోహితులు అనేకచ్ఛిద్రయుక్తమగు సువర్ణ కలశము వద్దకు వెళ్లి, సదస్యులమధ్య యథాశాస్త్రముగ అగ్నిరక్షాకారయము నిర్వర్తించి అభిషేకమంత్రములు పఠించుచు అభిషేకము చేయవలెను. ఆ సమయమున బ్రాహ్మణుల వేదమంత్రములను పఠించవలెను. పిదప పురోహితుడు వేదిని సమీపించి సువర్ణ మయమగు శతచ్ఛిద్రకలశతో అభిషేకము ప్రారంభింపవలెను. 'యా ఓషధీః' ఇత్యాది మంత్రమును చదువుచు ఓషధుల తోను, ''అథేత్యుక్త్వాః'' ఇత్యాదిమంత్రము చదువుచు గంధములతోను, ''పుష్పవతీః'' ఇత్యాదిమంత్రము చదువుచు పుష్పములతోను, ''బ్రహ్మణః'' ఇత్యాదిమంత్రము చదువుచు బీజములతోను, ''అశుః - శిశానః'' ఇత్యాది మంత్రము చదువుచు రత్నములతోను, ''యేదేవాః'' ఇత్యాదిమంత్రమును చదువుచు కుశయుక్తజలముతోను అభిషేకము చేయవలెను. యజుర్వేది యగు బ్రాహ్మణుడును, అథర్వవేదియగు బ్రాహ్మణుడును ''గన్ధద్వారామ్'' ఇత్యాదిమంత్రములతో శిరస్సుపైనను, కంఠము నందును గోరోచనముతో తిలకముంచవలెను.
గీత వాద్యాది నిర్ఘోషైశ్చామర వ్యజనాదిభిః | సర్వౌషధిమయం కుంభం ధారయేయుర్నృపాగ్రతః. 27
తం పశ్యేద్దర్పణం రాజా ఘృతం వైమఙ్గలాదికమ్ |
అభ్యర్చ్య విష్ణుం బ్రహ్మాణమింద్రాదీంశ్చ గ్రహేశ్వరాన్. 28
వ్యాఘ్ర చర్మోత్తరాం శయ్యాముపవిష్టః పురోహితః | మధుపర్కాదికం దత్వా పట్టబంధం ప్రకారయేత్. 29
రాజ్ఞో ముకుటబంధం చ పంచచర్మోత్తరం దదేత్ | ధ్రువాద్యౌరితి చ విశేద్వృషజం వృషదంశజమ్. 30
ద్వీపిజం సింహజం వ్యాఘ్రజాతం చర్మ తదాసనే | అమాత్యసచివాదీంశ్చ ప్రతీహారః ప్రదర్శయేత్. 31
గో7 జావిగృహదానాద్యైః సాంవత్సర పురోహితౌ |
పూజయిత్వా ద్విజాన్ప్రార్చ్య హ్యన్యాన్భూగో7న్నముఖ్యకైః . 32
వహ్నిం ప్రదక్షిణీకృత్య గురుం నత్వాథ పృష్ఠతః | వృషమాలభ్య గాం వత్సాం పూజయిత్వాథ మంత్రితమ్. 33
అశ్వమారుహ్య నాగం చ పూజయేత్తం సమారుహేత్ | పరిభ్రమేద్రాజమార్గే బలయుక్తః ప్రదక్షిణమ్. 34
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రాజా7భిషేకో
నామాష్టాదశాధిక ద్విశతతమోధ్యాయః.
కొందరు గీతవాద్యాది ధ్వనులు బయల్వెడలుచుండగా చామర్యవ్యజనములు గ్రహించి, సర్వౌషధియుక్త కలశముతో రాజు ఎదుట నిలబడవలెను. రాజు మందుగా ఆకలశమును, పిదప అద్దమును, ఘృతాది మాంగళిక వస్తువులను చూడవలెను. పిదప విష్ణు- బ్రహ్మ- ఇంద్రాది దేవతలను, గ్రహములను పూజించి వ్యాఘ్రచర్మ యుక్తాసనముపై కూర్చుండవలెను. ఆసమయమున పురోహితుడు మధుపర్కాదు లిచ్చి రాజు శిరస్సుపై కిరీటముంచవలెను. పంచచర్మాసనములపై కూర్చుండి రాజముకుట ధారణము చేయవలెను. ''ధ్రువాద్యౌః'' ఇత్యాదిమంత్రముతో ఆ అసనముపై కూర్చుండవలెను. ఆ సమయమున వృష - వృషదంశ - వృక - వ్యాఘ్ర - సింహచర్మాసనములు - ఉపయోగింపబడును. అభిషేకానంతరము ప్రతీహార - అమాత్య - సచివాదులను చూపుచు ప్రజలకు పరిచయము చేయవలెను. పిదప రాజు, గోవు, మేక, గొఱ్ఱ, గృహము మొదలగు వాటిని దానము చేసి జ్యౌతిషిక పురోహితులను పూజించవలెను. భూమి - గోవులు, అన్నము మొదలగునవి ఇచ్చి ఇతర బ్రాహ్మణులను కూడ పూజించవలెను. అగ్ని ప్రదక్షిణ చేసి గురువును పూజించవలెను. పిదప వృషభపీఠమును స్పృశించి, సవత్సయగు గోవును పూజించి, అభిమంత్రితమగు అశ్వమును ఎక్కవలెను. దాని నుంచిదిగి గజమును పూజించి, దానిని అధిరోహించి, సేనాసహితుడై ప్రదక్షిణ క్రమమున మార్గముపై కొంచెము దూరము వెళ్లవలెను. పిదప దానాదులచే అందరిని సత్కరించి, వీడ్కోలిచ్చి రాజధానిలో ప్రవేశించవలెను.
అగ్నిమహాపురాణమునందు రాజ్యాభిషేక కథనమను రెండువందలపదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.