Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏకోనవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథాభిషేకమన్త్రాః.
పుష్కర ఉవాచ :
రాజ దేవాద్యభిషేకమంత్రాన్వక్ష్యే7ఘమర్దనాన్ | కుంభాత్కుశోదకైః సించేత్తేన సర్వం హి సిద్ధ్యతి. 1
సురస్త్వానుభిషిఞ్చాన్తు బ్రహ్మవిష్ణుమహేశ్వరాః | వాసుదేవః సఙ్కర్షణః ప్రద్యుమ్నశ్చానిరుద్ధకః. 2
భవన్తు విజయాయైతే ఇంద్రాద్యా దశదిగ్గతాః | రుద్రోధర్మో మనుర్దక్షో రుచిఃశ్రద్ధా చ సర్వదా. 3
భృగురత్రిర్వశిష్ఠశ్చ సనకశ్చ సనందనః | సనత్కుమారో7ఙ్గిరాశ్చ పులస్త్యః పులహః క్రతుః. 4
మరీచిః కశ్యపః పాన్తు ప్రజేశాః పృథివీపతిమ్ | ప్రభాసురా బర్హిషదః హ్యగ్నిష్వాత్తాశ్చ పాన్తుతే. 5
క్రవ్యాదాశ్చోపహూతాశ్చ హ్యాజ్యపాశ్చ సుకాలినః | అగ్నిభిశ్చాభిషిఞ్చన్తు లక్ష్మ్యాద్యా ధర్మ వల్లభాః. 6
ఆదిత్యాద్యాః కశ్యపస్య బహుపుత్రస్య వల్లభాః | కృశాశ్వస్యాగ్ని పుత్రస్య భార్యాశ్చారిష్టనేమినః. 7
అశ్విన్యాద్యాశ్చ చంద్రస్య పులహస్య తథా ప్రియాః | భూతా చ కపిశా దంష్ట్రీ సురసా సరమా దనుః. 8
శ్యేనీ భాసీ తథాక్రౌంచీ ధృతరాష్ట్రీ శుకీ తథా | పత్న్యస్త్వామభిషిఞ్చన్తు అరుణశ్చార్కసారథిః. 9
అయతిర్నియతీ రాత్రిర్నిద్రా లోకస్థితౌ స్థితాః | ఉమా మేనా శచీ పాన్తు ధూమ్రోర్ణానిరృతిర్జయే. 10
గౌరీ శివాచ బుద్దిశ్చ వేలాయాచైవ నడ్వలా | అసిక్నీచ తథా జ్యోత్స్నా దేవపత్న్యో వనస్పతిః. 11
పుష్కరుడు పలికెను : ఇపుడు రాజదేవతాద్యభిషేకమునకు సంబంధించిన మంత్రములను గూర్చి చెప్పెదను. ఇవి సకలపాపములను తొలగించును. కలశను కుశయుక్తజలముతో నింపి రాజాభిషేకము చేసినచో సకల మనోరథములు సిద్ధించును. (మంత్రముల అర్థము)- రాజా! బ్రహ్మవిష్ణు శివాదిదేవతలందరును నీకు అభిషేకము చేయుదురు గాక! వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధులు, ఇంద్రాది దశదిక్పాలకులు, రుద్ర - ధర్మ - మను దక్ష - రుచి శ్రాద్ధాది దేవతలును నీకు సర్వదా విజయము నిచ్చెదరు గాక. భృగు - అత్రి - వసిష్ఠ - సనక సనందన - సనత్కుమార అంగిరన్ - పులస్త్య - పులహ - క్రతు - మరీచి - కశ్యపాదిమహర్షులు ప్రజాశాసనము చేయు భూపతిని రక్షింతురు గాక. ప్రకాశవంతులగు ''బర్హిషద్'' ''అగ్నిష్వాత్త'' అను పితృదేవతలు నిన్ను రక్షింతురు గాక. క్రవ్యాదులు, అవాహితులగు ఆజ్యపులు, సుకాలి, ధర్మప్రియ, లక్ష్మిమొదలగు దేవతలును వృద్ధిపొందిన అగ్నులును నీకు అభిషేకము చేయుదురు గాక. అనేక పుత్రవంతుడైన ప్రజాపతి, కశ్యపుని ఆదిత్యాది పుత్రగణము, అభినందన - కృశాశ్వులు, అరిష్టనేమిభార్యలును నీకు అభిషేకము చేయుదురుగాక. అశ్విన్యాది చంద్రభార్యలు, పులహుని భార్యలు, భూతా - కపిశా - దంష్ట్రీ - సురసాసరమా - దను శ్యేనీ - భాసీ - క్రౌంచీ - ధృతరాష్ట్రీ - శుకి మొదలగు దేవతలును, సూర్యుని సారథియైన అరుణుడును, నీ అభిషేకమును సుసంపన్నము చేయుదురు గాక. అతిథి - నియతి - రాత్రి - నిద్రాదిదేవతలును, లోక రక్షణ తత్పరురాలగు ఉమాదేవియు, మేనా - శచీప్రభృతి దేవతలును, ధూమ్రా - ఊర్ణా - నైరృతీ - గౌరీ - శివా బుద్ధి - వేలా - నడ్వలా - అసిక్నీ - జ్యోత్స్నా దేవతలును, దేవాంగనలును, వనస్సతులును నిన్ను పాలించుగాక.
మహాకల్పశ్చ కల్పశ్చ మన్వంతర యుగాని చ | సంవత్సరాశ్చ వర్షాణి పాన్తు త్వామయనద్వయమ్. 12
ఋతవశ్చ తథా మాసాః పక్షా రాత్ర్యహానీ తథా | సంథ్యాతిథి ముహూర్తాశ్చ కాలస్యావయవాకృతిః. 13
సూర్యాద్యాశ్చ గ్రహాః పాన్తు మనుః స్వాయమ్భువాదికః |
స్వాయమ్భువః స్వారోచిష ఔత్తమస్తామసోమనుః. 14
రైవతశృఆ క్షుషః షష్ఠో వై వస్వత ఇహేరితః | సావర్ణీ బ్రహ్మపుత్రశ్చ ధర్మపుత్రశ్చ రుద్రజః. 15
దక్షజో రౌచ్యభౌత్యౌ చ మనవస్తు చతుర్దశ | విశ్వభుక్ చ విసశ్చిచ్చ సుచిత్తిశ్చ శిఖీవిభుః. 16
మనోజవస్తథౌజస్వీ బలిరద్భుతశాంతయుః | వృషశ్చ ఋతధామా చ దివఃస్పృక్ కవిరింద్రకః. 17
రైవన్తశ్చ కుమారశ్చతథా వత్సవినాయకః | వీరభద్రశ్చ నందీ చ విశ్వకర్మా పురోజవః. 18
ఏతే త్వామభిషిఞ్చన్తు సురముఖ్యాః సమాగతాః | నాసత్యౌ దేవభిషజౌ ధ్రువాద్యా వసవో7ష్టచ. 19
దశ చాంగిరసో వేదాస్త్వాభిషిఞ్చన్తు సిద్ధయే | ఆత్మాహ్యాయుర్మనో దక్షోమదః ప్రాణస్తథైవ చ. 20
హవిష్మాంశ్చ గరిష్ఠశ్చ ఋతః సత్యశ్చ పాన్తువః | ఋతుర్దక్షో వసుః సత్యః కాలకామోధురిర్జయే. 21
పురూరవా మాద్రవాశ్చ విశ్వేదేవాశ్చ రోచనః | అఙ్గారకాద్యాః సూర్యస్త్వాం నిరృతిశ్చ తథా యమః. 22
అజైకపాదహిర్బుధ్న్యో ధూమకేతుశ్చ రుద్రకః | భరతశ్చ తథా మృత్యుః కాపాలిరథ కింకిణిః. 23
భవనో భావనః పాన్తు స్వజన్యః స్వజనస్తథా | క్రతుశ్రవాశ్చ మూర్ధా చ యజనో7భ్యుశనాస్తథా. 24
ప్రసవశ్చావ్యయశ్చైవ దక్షశ్చ భృగవః సురాః | మనో7నుమన్తా ప్రాణశ్చ నవోపానశ్చ వీర్యవాన్. 25
వీతిహోత్రోనయః సాధ్యో హంసోనారాయణో7వతు | విభుశ్చైవ ప్రభుశ్చైవ దివశ్రేష్ఠా జగద్ధితాః. 26
ధాతామిత్రో7ర్యమా పూషా శక్రో7థ వరుణోభగః | త్వష్టా వివస్వాన్సవితా విష్ణుర్ద్వాదశ భాస్కరాః. 27
ఏకజ్యోతిశ్చ ద్విర్జ్యోతిస్త్రిశ్చతుర్జ్యోతిరేవచ | ఏకశక్రో ద్విశక్రశ్చ త్రిశక్రశ్చ మహాబలః. 28
ఇంద్రశ్చ మేత్యాదిశతు తతః ప్రతిమకృత్తథా | మితశ్చ నమ్మితశ్చైవ అమితశ్చ మహాబలః. 29
ఋత జిత్సత్యజిశ్చైవ సుషేణః సేనజిత్తథా | అతిమిత్రో7నమిత్రశ్చ పురుమిత్రో7పరాజితః. 30
ఋతశ్చ ఋతవాగ్ధాతా విధాతాధారణోధ్రువః | విధారణో మహాతేజా వాసవస్య పరః సఖా. 31
ఈదృక్షశ్చాప్యదృక్షశ్చ ఏతాదృగమితాశనః | క్రీడితశ్చ సదృక్షశ్చ శరభశ్చ మహాతపాః. 32
ధర్తాధుర్యో ధురిర్భీమో హ్యభిముక్తో7క్షపాత్సహ | ధృతిర్వసురనాధృష్యో రామః కామోజయోవిరాట్. 33
దేవా ఏకోన పఞ్చాశన్మరుతస్త్వామవన్తుతే | చిత్రాఙ్గదశ్చిత్రరథశ్ చిత్రసేనశ్చ వై కలిః. 34
ఊర్ణాయురుగ్రసేనశ్చ ధృతరాష్ట్రశ్చ నన్ధకః | హాహా హూహూ ర్నారదశ్చ విశ్వావసుశ్చ తుమ్బురుః. 35
ఏతేత్వామభిషిఞ్చన్తు గంధర్వా విజయాయతే | పాన్తుతే కురవో ముఖ్యా దివ్యాశ్చాప్సరసాం గణాః. 36
అనవద్యాసుకేశిచ మేనకా సహజన్యయా | క్రతుస్థలా ఘృతాచీ చ విశ్వాచీ పుఞ్జికస్థలా. 37
ప్రవ్లూెచా చోర్వశీ రంభా పంచచూడా తిలోత్తమా | చిత్రలేఖా లక్ష్మణా చ పుండరీకా చ వారుణీ. 38
మహాకల్ప-కల్ప-మన్వంతర-యుగ-సంవత్సర-వర్ష-ఆయన-ఋతుమాన-పక్ష-రాత్రి-దివస-సంధ్యా-తిథి- ముహూర్తములు, కాలము యొక్క విభిన్నావయవములును నిన్ను రక్షించుగాక. సూర్యాదిగ్రహములు, స్వాయం భువాది మనువులు నిన్ను రక్షింతురుగాక. స్వాయంభువ -స్వారోచిష-ఉత్తమ-తామస-రైవత-చాక్షుష-వైవస్వత-సావర్ణి-బ్రహ్మ-పుత్ర-ధర్మపుత్ర-రుద్రపుత్ర-దక్షపుత్ర-రౌచ్య-భౌత్యులను పదునాల్గురు మనువులు నిన్ను రక్షింతురుగాక. విశ్వభుక్-విపశ్చిత్-శిఖి-విభు-మనోజవ-ఓజస్వి-బలి-అద్భుతశాంతి-వృష-ఋతుధామ-దివస్పృక్-కవి-ఇంద్ర-రైవంత-కుమార-కార్తికేయ-వత్సవినాయక-వీరభద్రనంది-విశ్వకర్మ-పురోజవ -దేవవైద్య - అశ్వినీకుమారులు, ధ్రువాద్యష్టవసువులు-ఈ ప్రధాన దేవతలందరును ఇచట పాదార్పణము చేసి నీ అభిషేకకార్యమును సుసంపన్నము చేయుదురుగాక. అంగిరసుని కులమునందుద్భవించిన పదిమందిదేవతలున, నాలుగు వేదములును సిద్ధికొరకై నీకు అభిషేకము చేయదురుగాక. ఆత్మ-ఆయుష్-మనస్-దక్ష-మద-ప్రాణ-హవివ్మత్-గరిష్ఠ-ఋత-సత్యములు నిన్ను రక్షించుగాక. క్రతు-రక్ష-వాసు-సత్య-కాల-కామ-ధురి అనువారు నీకు విజయప్రదానము చేయుదురుగాక. పురూరవస్-ఆర్ద్రవ-విశ్వేదేవ-రోచన-అంగారకాదివిగ్రహ-సూర్య-నిరృతి-యములు నిన్ను రక్షించుగాక. అజైకపాద-అహిర్బుధ్న్య-ధూమకేతు-రుద్రకేతు-రుద్రపుత్ర-భరత-మృత్యుకాపాలి-కింకణి-భవన-భావన-స్వజన్య-స్వజన-క్రతుశ్రవన్-మూర్ధ యాజన-ఉశనసులు నిన్ను రక్షించుగాక. ప్రసవ-అవ్యయ-దక్ష-భృగువంశ్య ఋషి-దేవతా-మను-అనుమంతృ - ప్రాణ-నవ-బలవదపానవాయు-వీతిహోత్ర-నయ-సాధ్య-హంస-విభు-ప్రభు-నారాయణులను లోకక్షేమకారు లగు దేవతలు నిన్ను పాలింతురుగాక. ధాతృ-మిత్ర-అర్యమన్-పూషన్-శుక్ర-వరుణ-భగ-త్వష్టృ-వివస్వత్-సవితృ-భాస్కర విష్ణువులను పండ్రెండుగురు సూర్యులు నిన్ను రక్షించుగాక. ఏకజ్యోతి-ద్విజోతి-చతుర్జ్యోతి-ఏకశక్ర-ద్విశక్ర-మహాబల-త్రిశక్ర-ఇంద్ర-పతికృత్-మిత-సంమిత-మహాబలి.అమిత-ఋతజిత్-సత్యజిత్-సుషేణ-సేనజత్-అతిమిత్ర-పురుమిత్ర-అపరాజిత- ఋత- ఋతవాక్- ధాతృ-విధాతృ-ధారణ-ధ్రువులును, ఇంద్రుని పరమమిత్రుడును తేజః శాలియు నగు విధారణుడును, ఐదృక్ష-అదృక్ష-ఏతాదృక్-అమితాశన-క్రీడిత-సదృక్ష-సరభ - మహాతపన్-ధర్తృ -ధుర్య - ధురి - భీమ - అభియుక్త - అక్షపాత - సహ - ధృతి - వసు అనాధృష్య - రామ - కామ - జయ - విరాట్టులను నలుబది తొమ్మండుగురు మరుత్తులును దేవతలును నీకు అభిషేకము చేసి, నీకు లక్ష్మి నొసంగును గాక. చిత్రాంగద - చిత్రరథ - చిత్రసేన - కలి - ఊర్ణాయు - ఉగ్రసేన - ధృతరాష్ట్ర - నందన - హాహా - హూహూ - నారద - విశ్వావసు - తుంబురులను గంధర్వులు నీ అభిషేకమును సుసంపన్నము చేయుదురు గాక; నీకు విజయము నిత్తురుగాక. అతి ప్రధానులైనమునులు, అనవద్యా - సుకేశీ - మేనకా - సహజన్యా - క్రతుస్థలా - ఘృతాచీ - విశ్వాచీ - పుంజికస్థలా - ప్రవ్లూెచా - ఊర్వశీ - రంభా - పంచచూడా - తిలోత్తమా - చిత్రలేఖా - లక్ష్మణా - పుండరీకా - వారుణీ అను దివ్యాప్సరలు నిన్ను రక్షింతురు గాక.
ప్రహ్లాదో విరోచనో7థ బలిర్బాణో7థ తత్సుతాః | ఏతే చాన్యే7భిషిఞ్చాన్తు దానవా రాక్షసాస్తథా. 39
హేతిశ్చైవ ప్రహేతిశ్చ విద్యుత్స్పూర్జథురగ్రకాః | యక్షః సిద్ధాత్మకః పాతు మణిభద్రశ్చనన్దనః. 40
పిఙ్గాక్షోద్యుతిమాంశ్చైవ పుష్పవంతో జయావహః | శంఖః పద్మశ్చ మకరః కచ్ఛపశ్చ నిధిర్జయే. 41
పిశాచా ఊర్ధ్వ కేశాద్యా భూతా భూమ్యాదివాసినః | మహాకాలం పురస్కృత్య నరసింహం చ మాతరః. 42
గుహః స్కందో విశాఖస్త్వాం నైగమేయో7భిషిఞ్చతు | డాకిన్యో యాశ్చ యోగిన్యః ఖేచరాబూచరాశ్చయాః. 43
గరుడశ్చారుణః పాన్తు సంపాతిప్రముఖాః ఖగాః | అనంతాద్యా మహానాగాః శేషవాసుకి తక్షకాః. 44
ఐరావతో మహాపద్మః కంబలాశ్వతరావుభౌ | శంఖః కర్కోటకశ్చైవ ధృతరాష్ట్రోధనంజయః. 45
కుముదైరావణౌపద్మః పుష్పదంతో7థవామనః | సుప్రతీకో7ంజనోనాగాః పాంతుత్వాంసర్వతః సదా. 46
వైతామహస్తథా హంసో వృషభః శంకరస్యచ | దుర్గాసింహశ్చ పాన్తుత్వాం యమస్యమహిషస్తథా. 47
ఉచ్చైఃశ్రవాశ్చాశ్వపతి స్తథా ధన్వంతరిః సదా | కౌస్తుభః శంఖరాజశ్చ వజ్రం శూలంచ చక్రకమ్. 48
నందకో7స్త్రాణిరక్షంతు ధర్మశ్చ వ్యవసాయకః | చిత్రగుప్తశ్చదండశ్చ పిఙ్గలో మృత్యుకాలకౌ. 49
వాలఖిల్యాదిమునయో వ్యాసవాల్మీకిముఖ్యకాః | పృథుర్దితీపోభరతో దుష్యంతః శక్రజిద్వలీ. 50
మల్లః కకుత్థ్సశ్చానేన యువనాశ్వో జయద్రథః | మాంధాతా ముచుకుందశ్చ పాంతుత్వాంచ పురూరవాః. 51
వాస్తుదేవాః పంచవింశత్తత్త్వాసి విజయాయతే | రుక్మభౌమః శిలా భౌమః పాతాలోనిలమూర్తికః. 52
పీతరక్తః క్షితిశ్చైవశ్వేతభౌమో రసాతలమ్ | భూర్లోకో7థ భువర్ముఖ్యా జంబూద్వీపాదయః శ్రియే. 53
ఉత్తరాః కురవః ఫాంతు రమ్యాహిరణ్యకస్తథా | భద్రాశ్వః కేతుమాలశ్చ వర్షశ్చైవ బలాహకః. 54
అ (3)
హరివర్షః కిమ్పురుష ఇంద్రద్వీపః కశేరుమాన్ | తామ్రవర్ణో గభస్తిమాన్నాగద్వీపశ్చ సౌమ్యకః. 55
గంధర్వోవరుణోయశ్చ నవమఃపాన్తు రాజ్యదః | హిమవాన్హేమకూటశ్చ నిషధోనీలఏవచ. 56
శ్వేతశ్చ శృంగవాన్మేరుర్మాల్యవాన్గంధమాదనః | మహేంద్రోమలయః సహ్యః శుక్తి మానృక్షవాన్గిరిః. 57
వింధ్యశ్చపారియాత్రశ్చ గిరయః శాంతిదాస్తుతే | ఋగ్వేదాద్యాః షడఙ్గాని ఇతిహాసపురాణకమ్. 58
ఆయుర్వేదశ్చ గంధర్వ ధనుర్వేదోపవేదకాః | శిక్షాకల్పోవ్యాకరణం నిరుక్తం జ్యోతిషాంగతిః. 59
ఛందో7ఙ్గాని చ వేదాంశ్చ మీమాంసా న్యాయవిస్తరః | ధర్మశాస్త్రం పురాణం చ విద్యాహ్యేతాశ్చతుర్దశ.
ప్రహ్లాద - విరోచన - బలి - బాణులు, బాణునిపుత్రులు, ఇతరదానవులు, రాక్షసులు, నీ అభిషేకమును సిద్ధము చేయుదురుగాక. హేతి - ప్రహేతి - విద్యుత్ - స్పూర్జథు - అగ్రక - యక్ష - సిద్ధ -మణిభద్ర - నందనులు నిన్ను రక్షించుగాక. పింగాక్ష - ద్యుతిమత్ -పుష్పవన్త - జయావహ - శంఖ - పద్మ - మకర - కచ్ఛపములను నిధులు నీకు జయప్రదము లగు గాక. ఊర్ధ్వకేశాది పిశాచములు, భూమ్యాదులందు నివసించు భూతములు, మాతృదేవతలు, మహాకాలనృసింహులను ఉందు ఉంచుకొని నిన్ను పాలింతురుగాక. గుహ - స్కంద - విశాఖ - నైగమేయులు నీకు అభిషేకము చేయుదురుగాక. భూతలమునందును ఆకాశము నందును సంచరించు డాకినులు, యోగినులు, గరుడ - అరుణ-సంపాత్యాది పక్షులు నిన్ను పాలించు గాక. అనంతుడు మొదలగు మహానాగములు, శేష - వాసుకి - తక్షక - ఐరావత - మహాపద్మ - కంబల - అశ్వతర - శంఖ - కర్కోటక - ధృతరాష్ట్ర - ధనంజయ - కుముద - ఐరావత - పద్మ - పుష్పదంత - వామన - సుప్రతీక - అంజనములను నాగములు ఎల్లప్పుడును అన్ని వైపులనుండియు నిన్ను రక్షించుగాక. బ్రహ్మవాహనమైన హంసయు, శంకరుని వాహనమైన వృషభము, దుర్గాదేవీ వాహనమైన సింహము, యముని వాహనమైన మహిషము నిన్ను పాలించు గాక. అశ్వరాజమైన ఉచ్చశ్రవస్సు, ధన్వంతరి, కౌస్తుభమణి, శంఖజమైన పాంచ జన్యము, వజ్ర - శూల -చక్ర - నందకఖడ్గాది శస్త్రములు నిన్ను రక్షించు గాక. దృఢ నిశ్చయవంతుడగు యమధర్మ రాజు, చిత్రగుప్త - దండ - పింగల - మృత్యు - కాలులు, వాలఖిల్యాది మునులు, వ్యాసవాల్మీక్యాది మహర్షులు, పృథు - దిలీప - భరత - దుష్యన్తులు, అత్యంత బలవంతుడగు శత్రుజిత్తు, మను - కకుత్థ్స - అనేనా - యువనాశ్వ - జయద్రథ - మాంధాతృ - ముచుకుంద - పురూరవులు నిన్ను రక్షింతురు గాక. వాస్తుదేవతయు, ఇరువది యైదు తత్త్వములును నీకు విజయము కూర్తురుగాక. రుక్మభౌమ - శిలాభౌమ - పాతాల - నీలమూర్తి - పీతరక్త - క్షితి. శ్వేతభౌమ - రసాతల - భూర్లోక - భువర్లోకాదిలోకములు, జంబూద్వీపము మొదలగు ద్వీపములు నీకు రాజ్యలక్ష్మి నిచ్చుగాక. ఉత్తరకురు - రమ్య - హిరణ్యక - భద్రాశ్వ - కేతుమాల - బలాహక - హరివర్ష - కింపురుష - ఇంద్రద్వీప - కుశేరుమత్ - తామ్రవర్ణం - గభస్తిమత్ - నాగద్వీప - సౌమ్యక - గాంధర్వ - వారుణ - నవమాది వర్షములు నిన్ను రక్షించు గాక; నీకు రాజ్యము నిచ్చుగాక. హిమవత్ - హేమకూట - నిషధ - నీల - శ్వేత - శృంగవత్ - మేరు - మాల్యవత్ - గంధమాదన - మహేంద్ర - మలయ - సహ్య - శుక్తిమత్ - ఋక్షవత్ - వింధ్య - పారియాత్ర - పర్వతములు నీకు శాంతి నిచ్చుగాక. ఋగ్వేదాది వేద చతుష్టయము, షడ్వేదాంగములు, ఇతిహాస - పురాణ - ఆయుర్వేద - గాంధర్వవేద - ధనుర్వేదాద్యుపవేదములు, శిక్షా-వ్యాకరణ- ఛందస్ - నిరుక్త - జ్యోతిష- కల్పము అను ఆరు వేదాంగములు, మీమాంసా - న్యాయ- ధర్మశాస్త్ర - పురాణములు అను ఈ పదునాలుగు విద్యలు నిన్ను రక్షించు గాక.
సాంఖ్య యోగః పాశుపతం వేదావైపాంచరాత్రకమ్ | కృతాంతపంచకం హ్యేతద్గాయత్రీ చ శివా తథా.
దుర్గా విద్యా చ గాంధారీ పాంతుత్వాం శాంతిదాశ్చతే | లవణక్షుసురాసర్పిర్దధిదుగ్ధజలాబ్ధయః. 62
చత్వారః సాగరాః పాన్తు తీర్థాని వివిధానిచ | పుష్కరశ్చ ప్రయాగశ్చ ప్రభాసోనైమిషః పరః. 63
గయాశీర్షో బ్రహ్మశిరస్తీర్థముత్తర మానసమ్ | కాలోదకోనందికుండ తీర్థం పఞ్చానదస్తథా. 64
భృగుతీర్థం ప్రభాసంచ తథా చామరకంటకమ్ | జంబూమార్గశ్చ విమలః కపిలస్య తథాశ్రమః. 65
గంగాద్వారకుశావర్తౌ వింధ్యకో నీలపర్వతః | వరాహపర్వతశ్చైవ తీర్థం కనఖలం తథా. 66
కాలంజరశ్చ కేదారోరుద్రకోటిస్తథైవ చ | వారాణసీ మహాతీర్థం బదర్యాశ్రమ ఎవచ. 67
ద్వారకా శ్రీగిరిస్తీర్థం తీర్థం చ పురుషోత్తమః | శాలగ్రామో7థ వారహః సింధుసాగరసంగమః. 68
ఫల్గుతీర్థం బిందుసరః కరవీరాశ్రమస్తథా | నద్యో గంగాసరస్వత్యౌశతద్రుర్గండకీ తథా. 69
అచ్ఛోదా చ విపాశా చ వితస్తా దేవికా నదీ | కావేరీ వరుణాచైవ నిశ్చిరాగోమతీనదీ. 70
పారా చర్మణ్యతీరూపా మందాకినీ మహానదీ | తాపీ పయోష్ణీవేణాచ గౌరీవైతరణీ తథా. 71
గోదావరీ భీమరథీ తుంగభద్రారణీ తథా | చంద్రభాగా శివాగౌరి అభిషిఞ్చంతు పాన్తువః. 72
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అభిషేకమంత్రా నామైకోన వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
సాంఖ్య- యోగ - పాశుపత - వేద - పాంచరాత్రములకు సిద్ధాంతపంచకమని పేరు. ఇవియు, గాయత్రీ - శివా - దుర్గా - విద్యా - గాంధారీ దేవులును నిన్ను రక్షించు గాక. లవణ - ఇక్షురస - సురా - ఘృత - దధి - దుగ్ధ - జలసముద్రములు నీకు శాంతి నొసగు గాక. నాలుగు సముద్రములును, వివిధ తీర్థములును నిన్ను రక్షించుగాక. పుష్కర - ప్రభాస - నైమిశారణ్య - గయాశీర్ష - బ్రహ్మశిరస్తీర్థ - ఉత్తరమానస - కోలోదక - నందికుండ - పంచనదతీర్థ - భృగుతీర్థ - అనురకంటక - జంబూమార్గ - విమల కమలాశ్రమ - గంగాద్వార - కుశావర్త - వింధ్య - నీలగిరి - వరాహపర్వత - కనఖలతీర్థ - కాలజర - కేదార - రుద్రకోటి - వారాణసీమహాతీర్థ - బదరీకా - శ్రమ - ద్వారకా - శ్రీశైల - పురుషోత్తమతీర్థ - శాలగ్రామ - వారాహ - సింధు సముద్రసంగమ తీర్థ - ఫల్గుతీర్థ - బిందుసర - కరవీరాశ్రమములును, గంగా - సరస్వతీ - శతద్రు - గండకీ అచ్చోదా - విపాశా - విరస్తా - దేవికా- కావేరీ - వరుణా - నిశ్చిరా - గోమతీ - పారా - చర్మణ్వతీ - రూపా - మహానదీ - మందాకినీ - తాపీ - పయోష్ణీ - వేణా - వైతరణీ - గోదావరీ - భీమరథీ - తుంగభద్రా - అరణీ - చంద్రభాగా - శివా - గౌరీ మొదలగు పవిత్ర నదులును నీకు అభిషేకము చేసి నిన్ను పాలించుగాక.
అగ్ని మహాపురాణమునందు అభిషేకమంత్ర వర్ణనమను రెండువందల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.