Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ చతుర్వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ స్త్రీరక్షాది - కామశాస్త్రమ్.
పుష్కర ఉవాచ :
వక్ష్యే7ంతః పురచిన్తాం చ ధర్మాద్యాః పురుషార్థకాః |
అన్యో7న్య రక్షయా తేషాం సేబాకార్యాస్త్రియానృపైః. 1
ధర్మమూలో7ర్థవిటపస్తథా కర్మఫలోమహాన్ | త్రివర్గపాదపస్తత్రరక్షయాఫలభాగ్భవేత్. 2
కామాధీనాఃస్త్రియో రామ తదర్థంరత్నసంగ్రహః | సేవ్యాస్తా నాతిసేవ్యాశ్చ భూభుజావిషయైషిణా. 3
ఆహారోమైథునం నిద్రా సేవ్యానాతి హి రుగ్భవేత్ | మంచాధికారే కర్తవ్యాః స్త్రియః సేవ్యాః స్వరామికాః. 4
దుష్టాన్యాచరతేయాతు నాభినన్ధతి తత్కథామ్ | ఐక్యం ద్విషద్భిర్వ్రజతే గర్వం వహతి చోద్ధతా. 5
చుంబితా మార్‌ష్టివదనం దత్తం నబహు మన్యతే | స్వపిత్యాదౌ ప్రసుప్తాపి తథా పశ్చాద్వి బుధ్యతే, 6
స్పృష్టాధునోతిగాత్రాణి గాత్రం చ విరుణద్ధియా | ఈషచ్ఛృణోతి వాక్యాని ప్రియాణ్యపిపరాఙ్ముఖీ. 7
నపశ్యత్యగ్రదత్తం తు జఘనం చ నిగూహతి | దృష్టేవివర్ణవదనా మితేష్వథ పరాఙ్ముఖీ. 8
తత్కామితాసు చస్త్రీషు మధ్యస్థేవ చ లక్ష్యతే | జ్ఞాతమండన కాలాపి నకరోతి చ మండనమ్. 9
యాసా విరక్తాతాం త్యక్త్వా సానురాగాం స్త్రియం భ##జేత్ | దృష్టైవ హృష్టాభవతి వీక్షితేచ పరాఙ్ముఖీ. 10
దృశ్యమానా తథాన్యత్ర దృష్టిం క్షిపతి చఞ్చాలమ్ | తథాప్యుపావర్తయితుం నైవ శక్నోత్యశేషతః. 11
వివృణోతి తథా7ఙ్గాని స్వస్యా గుహ్యాని భార్గవ | గర్హితంచ తథైవాఙ్గం ప్రయత్నేన నిగూహతి. 12
తద్దర్శనే చ కురుతే బాలాలిఙ్గన చుమ్బనమ్ | ఆభాష్యమాణాభవతి సత్యవాక్యా తథైవ చ. 13
స్పృష్టాపులకితైరఙ్గైః స్వేదేనైవ చ భజ్యతే | కరోతి చ తథారామః సులభ ద్రవ్యయాచనమ్. 14
తతః స్వల్పమపి ప్రాప్య కరోతి పరమాంముదమ్ | నామసంకీర్తనాదేవ ముదితా బహు మన్యతే. 15
కరజాఙ్కాఙ్కితాన్యస్య ఫలాని ప్రేషయత్యపి | తత్ర్పేషితం చ హృదయే విన్యసత్యపి చాదరాత్. 16
ఆలిఙ్గనైశ్చ గాత్రాణి లింపతీవామృతేన యా | సుప్తే న్వపిత్యథాదౌ చ తథా తస్య విబుధ్యతే. 17
ఊరూస్సృశతి చాత్యర్థంసుప్తం చైనం విబుధ్యతే |
పుష్కరుడు చెప్పెను : ఇపుడు అంతఃపురమును గూర్చి చెప్పెదను. ధర్మార్థకామము లను మూడు పురుషార్థములకు 'త్రివర్గ'మని పేరు. వీటిలో ఒకదానిని మరొక దానితో రక్షించుచు రాజు స్త్రీలతో ఈ త్రివర్గమును సేవించవలెను. త్రివర్గము ఒక మహావృక్షము వంటిది. ధర్మము దాని వేళ్ళు, అర్థము శాఖలు, కామము ఫలము. ఆ వృక్షమును మూల సహితముగా రక్షించిన యడలనే రాజు ఫలమును పొందగలుగును. పరశురామా! స్త్రీలు కామమునకు వశవర్తినులై యుందురు. వారికొరకై రత్నములను సంగ్రహించవలెను. విషయసుఖములు కోరు రాజు స్త్రీలను సేవించవచ్చును గాని అతిగా చేయగూడదు. ఆహార-నిద్రా-మైథుషములు మూడింటి యందున అతిగా ప్రవర్తింపరాదు. అట్లు చేసినచో రోగము లుత్పన్నము లగును. తనపై అనురాగముగల స్త్రీలను మాత్రమే తన మంచము మీదకి రానియ్యవలెను. దురాచార వంతురాలు తన భర్తను గూర్చి సంభాషణమును గూడ రుచింపనిదియు, ఆతని శత్రువులతో కలియునదియు, అతిగర్వవంతు రాలును, ముద్దుపెట్టుకొన్నప్పడు ముఖమును తుడిచి వేయునదియు లేదా కడుగుకొను నదియు, భర్త ఇచ్చిన వస్తువులపై ఆదరము చూపనిదియు, భర్త కంటే ముందుగనే నిద్రించి ఆతడు లేచిన తరువాత లేచినదియు, స్పృశించగా శరీరమును కంపింపచేయునదియు, ప్రతి అవయవము నందును అవరోధము కల్పించునదియు, భర్త పలుకు ప్రియవాక్యములను సరిగా వినక పరాఙ్ముఖురాలుగా ఉండునదియు, ఎదుటకు వచ్చి, ఏదైన వస్తువు ఇచ్చినపుడు దానిని చూడనిదియు, తన జఘనమును పూర్తిగా ఆచ్ఛాదించుటకును, భర్త స్పృశించుటకు వీలుకాకుండునట్లు చేయుటకును ప్రయత్నించునదియు, భర్తను చూడగానే ముఖము ముణుచుకొనునదియు, ఆతని మిత్రుల విషయమున వైముఖ్యము చూపునదియు, ఆతడేయే స్త్రీలను ప్రేమించునో వారి విషయము ఔదాసీన్యము చూపునదియు, శృంగారించుకొను సమయమునందు కూడ శృంగారించుకొననిదియు అగు స్త్రీ విరక్తురాలని అర్థము. అట్టి స్త్రీని పరిత్యజించి అనురక్తురాలిని సేవించవలెను. అనుగారవతియైన స్త్రీ భర్తను చూడగనే సంతోషముతో వికసితముఖి యగును. మరొకవైపు ముఖమున్నను నేత్రాంతములతో ఆతనిని చూచుచుండును. భర్త తనను చూచుచున్నపుడు తన చంచలదృష్టిని కొంచెము మరొకవైపు త్రిప్పుకొనును, కాని పూర్తిగా త్రిప్పుకొనదు. అప్పుడప్పుడు తన గుప్తాంగములను కూడ చూపుచుండును. తన శరీరములో అసుందరమైన అంశ##మేదైన ఉన్నచో దానిని ప్రయత్నపూర్వకముగా కప్పికొనును. భర్తను చూచుచు చంటిపిల్లవాని ఆలింగనము చేసికొని ముద్దుపెట్టుకొనును. సంభాషణలో పాల్గొనుచు సత్యమునే పలుకును. భర్త స్పర్శ, కలుగగనే ఆమె అవయవములపై రోమాంచము, స్వేదము కలుగుచుండును. అతి సులభములైన వస్తువులను మాత్రమే అడుగును. ఆతడెంత చిన్న వస్తువులనిచ్చినను చాల సంతసించును. ఆతని పేరు వినగనే ఆనందపరవశురాలై చాల ఆదరించును. భర్తకు తన వ్రేళ్ళ ఆనవాలు పడిన పండ్లు పంపు చుండును. ఆతని నుండి వచ్చిన వస్తువు ఆదరముతో గ్రహించి దానిని వక్షఃస్థలము నందుంచుకొనును. తన ఆలింగనముచే భర్త శరీరమునందు అమృతలేపము చేయుచున్నట్లుండును. భర్తనిద్రించిన పిమ్మట నిద్రించును. ఆతని కంటే ముందుగనే మేల్కోనును. ఆతని ఊరువులను స్పృశించి నిద్ర నుండి మేల్కొల్పును.
కపిత్థ చూర్ణయోగేన తథాదధ్నః న్రజామునే. 18
ఘృతం సుగంధి భవతి దుగ్ధైః క్షిపై#్తస్థథాయవైః | భోజ్యస్య కల్పనైవం స్యాద్గంధయుక్తిః ప్రదర్శ్యతే. 19
శౌచమాచమనం రామ తథైవ చ విరేచనమ్ | భావనా చైవ పాకశ్చ బోధనం ధూపనం తథా. 20
వాసనం చైవ నిర్ధిష్టం కర్మాష్టక మిదం స్మృతమ్ | కపిత్థ బిల్వజంబ్వామ్ర కరవీరకపల్లవైః. 21
కృత్వోదకంతు యద్ధ్రవ్యం శోధితం శోధనం తుతత్ | తేషామభావే శౌచంతు మృగదర్భామ్బసాభ##వేత్. 22
నఖం కుష్ఠం ఘనం మాంసీ స్పృక్కశైలేయజంజలమ్ | తథైవ కుఙ్కుమంలాక్షా చందనాగురునీరదమ్. 23
సరలం దేవకాష్ఠంచ కర్పూరం కాన్తయా సహ | వాలః కుందురుకశ్చైవ గుగ్గులుః శ్రీనివాసకః. 24
సహసర్జరసేనైవం ధూప ద్రవ్యైకవింశతిః | ధూపద్రవ్యగణాదస్మాదేక వింశాద్యథేచ్ఛయా. 25
ద్వేద్వేద్రవ్యేసమాదాయ సర్జభాగైర్నియోజయేత్ | నఖపిణ్యాకమలయైః సంయోజ్యమధునాతథా. 26
ధూపయోగాభవన్తీహ యథావత్స్వేచ్ఛయాకృతాః |
త్వచం నాడీం ఫలం తైలం కుంకుమం గ్రంథిపర్వకమ్. 27
శైలేయం తగరం క్రాన్తాం చోలం కర్పూరం మేవచ | మాంసీం సురాంచ కుష్ఠంచ స్నానద్రవ్యాణి నిర్దిశేత్. 28
ఏతభ్యస్తు సమాదాయ ద్రవ్యత్రయమథేచ్ఛయా | మృగ దర్పయితం స్నానం కార్యం కందర్ప వర్ధనమ్. 29
త్వఙ్మురానలదైస్తుల్యైర్వాలకార్ధసమాయుతైః | స్నానముత్పల గంధిస్యాత్సతైలం కుంకుమాయతే. 30
జాతీపుష్ప సుగంధి స్యాత్తగరార్ధేన యోజితమ్ | సద్వ్యామకం స్యాద్వకులైస్తుల్య గంధిమనోహరమ్. 31
మంజిష్ఠా తగరం చోలం త్వచం వ్యాఘ్ననఖం నఖమ్ |
గంధపత్రం చ విన్యస్య గంధతైలం భ##వేచ్ఛుభమ్. 32
తైలం నిపీడితం రామ తిలైః పుష్పాది వాసితైః | వాసనాత్పుష్పనదృశం గంధేనతు భ##వేద్ధ్రువమ్. 33
ఏలాలవంగ కంకోలజాతీ ఫలనిశాకరాః | జాతీ పత్రికయా సార్థం స్వతంత్రా ముఖవాసకాః. 34
కర్పూరం కుంకుమంకాన్తా మృగదర్పం హరేణుకమ్ | కంకోలైలా లవంగం చ జాతీ కోశకమేవ చ. 35
త్వక్పత్రం త్రుటిముస్తౌ చలతాం కస్తూరికాంతథా | కంటకాని లవంగస్య ఫలపత్రేచ జాతితః. 36
కటకం చ ఫలం రామ కార్షికాణ్యుపకల్పయేత్ | తచ్చూర్ణేఖదిరం సారం దద్యాత్తుర్యంతు వాసితమ్. 37
సహకారరసేనాస్మాత్కర్తవ్యా గుటికాః శుభాః | ముఖన్యస్తాః సుగంధాస్తాముఖరోగ వినాశనాః. 38
పూగం ప్రక్షాళితం నమ్యక్పంచ పల్లవ వారిణా | శక్త్యాతు గుటికా ద్రవ్యైర్వాసితం ముఖవాసకమ్. 39
కటుకం దన్తకాష్ఠంచ గోమూత్రే వాసితం త్ర్యహమ్ | కృతంచ పూగవద్రామ ముఖసౌగంధికారకమ్. 40
త్వక్పథ్యయోః సమావంశౌ శశిభాగార్ధసంయుతౌ | నాగవల్లీ సమోభాతి ముఖవాసో మనోహరః. 41
ఏవం కుర్యాత్సదా స్త్రీణాం రక్షణం పృథివీపతిః |
న చాసాం విశ్వసేజ్జాతు పుత్రమాతుర్విశేషతః |
స స్వ పే త్త్స్రీ గృహే రాత్రౌ విశ్వాసః కృత్రియోభ##వేత్. 42
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్త్రీరక్షాదికామశాస్త్రం నామ చతుర్వింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
పరశురామా! పెరుగుమీగడలో కొంచెము కపిత్థచూర్ణము కలపగా నేతివాసన చాల ఉత్తమమైనది. నెయ్యి, పెరుగు మొదలైనవాటితో యవలు, గోధుమలు మొదలైనవాటి పిండి కలుపగా ఉత్తమములైన ఖాద్యపదార్థములు తయారగును. ఇపుడు వివిధద్రవ్యములు గంధమును కలిగించు విధానము చెప్పెదను. శౌచము, ఆచమనము, విరేచనము, భావన, పాకము, బోధనము, ధూపనము, వాసనము అని ఎనిమిది విధములగు కర్మలు చెప్పబడినవి. కపిత్థము, బిల్వము, నేరేడు, మామిడి, కరవీరము-వీటి పల్లవములచేత శుద్ధముచేసిన నీటితో ఏ వస్తువులైనను కడిగి, పవిత్రమగునట్లు చేసినచో దానికి 'శౌచనము'అని పేరు. ఈపల్లవములు లభించినచో నీళ్ళలో కస్తూరి కలిపి వాటితో కడిగినచో శుద్ధియగును. నఖ-కూట - ఘన - జటామాంసీ - స్పృక్క - శైలేయజ - జల - కుంకుమ - లాక్షా - చందన - అగరు - నీరద - సరల దేవదారు - కర్పూర - కాంతా - వాల - కుందురుక - గగ్గులు - శ్రీనివాస - కరాయలములను ఇరువదియొక్క ద్రవ్యములు ధూపద్రవ్యములు. ఈ ఇరువది పదార్థములలో ఏవైనరెండు తీసికొని, వాటిలో నఖము, తెలకపిండి, మలయచందన చూర్ణము చేర్చి తేనెకలుపవలెను. ఈ విధముగా ఇష్టానుసారముగా యథాశాస్త్రముగా కలిపిన ద్రవ్యములతో ధూపయోగములు తయారగును. త్వచా - నాడీ - ఫల - తైం - కేసర - గ్రంథిపర్వ - శైలేయ - తగర విష్ణుక్రాంతాబోల - కర్పూర - జటామాంసీ - మురా - కూటకములు స్నానోపయుక్త ద్రవ్యములు వీటిలో ఇష్టమువచ్చిన మూడు ద్రవ్యములు తీసికొని కస్తూరికలిపి, ఇవన్నియు కలిపిన జలముతో స్నానముచేసినచో కామవృద్ధికలుగును. త్వచా - మురా - నలదములను సమానమైనపాళ్ళలో తీసికొని, వీటిలో సగము సుగంధబాల కలిపి, వీటితో స్నానము చేసినచో శరీరమునుండి కమలగంధమువంటి గంధము వచ్చును వీటితో తైలముకూడ పూసికొని స్నానముచేసినచో శరీరమురంగు కుంకుమవర్ణ సదృశముగ నుండును. పైనచెప్పిన ద్రవ్యములకు సగముపాలు తగరముకూడ కలిపినచో శరీరమునుండి చమేలిపువ్వువాసన వంటివాసనవచ్చును. వాటిలో ద్వ్యామకమను ఓషధికూడ కలిపినచో మౌలసిరి పువ్వువాసనవచ్చును. నువ్వులనూనెలో మంజిష్ఠ తగర - చోల - త్వచా - వ్యాఘ్రనఖ - నఖ - గంధపత్రములను ఓషధులు కలపగా మంచిసువాసనగల తైలము తయారగును. తిలలను సుందరపుష్పములతోవాసితము చేసి వాటిని ఆడించిచేసిననూనె ఆ పుష్పమువలె సుగంధముగలదగును. ఏలకులు, లవంగాలు, కాకోలము, జాజికాయ, కర్పూరము, - వీటిలోఏదైన ఒకటి జాజిపత్రితో కలిపి నమలినచో ముఖము సుగంధమగును. కర్పూర - కేసర - కాంతా - కస్తూరీ - మేఉడఫల - కబాబచీనీ - ఏలా - లవంగ - జాయఫల - పూగ - త్వక్పత్ర - త్రుటి - మోథా - లతా - కస్తూరీ - లవంగకంటక - జాయఫల - జాయపత్ర - కటుకఫలములను ఒక్కొక్క డబ్బెత్తు చొప్పున కలిపి, చూర్ణముచేసి, దానిలో నాల్గవవంతు వాసితమైన ఖైరసారము కలిపి మామిడిరసముతో అందముగా మాత్రలు చేసి ముఖమునందుంచుకున్నచో ముఖరోగములన్నియు తొలగిపోవును. వెనుకచెప్పిన ఐదుపల్లవముల జలముతో పోక చెక్కను కడిగి, యథాశక్తిగా పైనచెప్పిన మాత్రలకుపయోగించు ద్రవ్యములతో వాసితము చేసినచో అది ముఖమును సుగంధయుక్తము చేయును. కటకమును దాంతనకమును మూడు దినములు గోమూత్రమునందు తడిపి ఉంచినచో అది పోకచెక్కవలెనే ముఖమును సుగంధితము చేయును. త్వచాఅరణ్యహర్రే లను సమానమైన పాళ్ళలో గ్రహించి, దానిలో సగము కర్పూరము కలిపి నోటిలో ఉంచుకొనినచో తాంబూలగంధము వచ్చును. ఈ విధముగా రాజు తన సుగంధాది గుణములచే స్త్రీలను వశము చేసుకొని సర్వదావారిని రక్షించవలెను. వారినెన్నడును విశ్వసింపరాదు ప్రధానము పుత్రుని తల్లిని ఎన్నడును విశ్వసింపరాదు. రాత్రిఅంతయు స్త్రీ గృహమున నిద్రింపరాడు. ఆమెచూపిన విశ్వాసము కృత్రిమము కావచ్చును.
అగ్ని మహాపురాణమునందు రాజధర్మకథనమును రెండువందల ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.