Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ అష్టావింశత్యధిక ద్విశతతమోధ్యాయః
అథ యుద్ధయాత్రా
పుష్కర ఉవాచ :
యదామన్యేతనృపతిరాక్రన్దేన బలీయసా | పార్ష్ణిగ్రాహోభిభూతో మే తదాయాత్రాం ప్రయోజయేత్. 1
పుష్టాయోధాభృతా భృత్యాః ప్రభూతంచ బలం మమ | మూలరక్షాసమర్థో7స్మి తైర్గత్వా శిబిరే వ్రజేత్. 2
శత్రోర్వావ్యసనే యాయాద్దైవాద్యైః పీడితం పరమ్ |
భూకంపోయాందిశంయాతి యాంచకేతుర్వ్యదూషయత్. 3
విద్విష్టనాశకం సైన్యం సంభూతాన్తఃప్రకోపనమ్ | శరీర స్ఫురణధన్యే తథా సుస్వప్నదర్శనే. 4
నిమిత్తేశకునే ధన్యే జాతే శత్రుపురం వ్రజేత్ | పదాతినాగ బహులాం సేనాం ప్రావృషియోజయేత్. 5
హేమన్తే శిశిరేచైవ రథవాజి సమాకులమ్ | చతురంగబలోపేతాం వనంతేవా శరన్ముఖే. 6
సేనాపదాతి బహులా శత్రుఞ్జయతిసర్వదా | అంగ దక్షిణభాగేతు శస్తం ప్రస్పురణం భ##వేత్. 7
న శస్తంతు తథావామే పృష్ఠస్య హృదయస్యచ | లాంఛనం పిటకం చైవ విజ్ఞేయం స్ఫురణం తథా.
విపర్యయేణాభిహితం సవ్యేస్త్రీణాం శుభం భ##వేత్. 8
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్ధయాత్రా నామాష్టావింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః
పుష్కరుడు పలికెను : ఆక్రందరాజునా పార్ష్ణి గ్రాహరాజును జయించెను. అని గ్రహించిన రాజు సైన్యమును యుద్ధమునకై తరలించవలెను [ఆక్రంద - పార్ష్ణిగ్రాహాదులను గూర్చి 233 అధ్యాయమున చెప్పబడును.) ముందుగా సేన బాగుగా బలంగా ఉత్సాహంతో ఉన్నది. భృత్యులందరును చక్కగా పోషింపబడిఉన్నారు. నావద్ద అధికమైనసేన ఉన్నది; నేను మూలరక్షణవిషయమున అన్ని విధములచే సమర్థుడను'' అను విషయమును నిర్ధారణ చేసికొనవలెను పిదప సైనిక పరివృతుడై శిబిరములోనికి వెళ్ళవలెను. శత్రువు కష్టములలోనున్నపుడును. దైవ - మానుషబాధలలోచిక్కుకొని యున్నపుడును, అతని నగరము పీడితమైయున్నపుడును యుద్ధయాత్ర చేయవలెను. భూకంపము ఏవైపున వచ్చినదో, కేతువు తన ప్రభావముచే ఏ ప్రక్కదూషితముచేసెనో ఆ వైపునుండి ఆ క్రమణము చేయవలెను. శత్రువునునశింపచేయవలెనని సేన ఉత్సాహముతో ఉన్నపుడును, శత్రువులపై యోధులకు కోపమున్నపుడును, శుభసూచకముగా అవయవములు అదరుచున్నపుడును మంచి చిహ్నములు ఉత్తమమైన నిమిత్తములు, శకునములు కనబడుచున్నపుడును, శత్రునరగముపై ఆక్రమణము చేయవలెను. వర్షాకాలమునందు యుద్ధయాత్ర చేయవలసివచ్చినపుడు కాలిబంటులు, ఏనుగులు అధికముగా ఉన్న సైన్యమును ముందుకు దుమకమని ఆజ్ఞాపించవలెను. హేమంత శిశిరర్తువులందు రథములు, అశ్వములు అధికముగా ఉన్న సైన్యమును తీసికొని వెళ్ళవలెను. వసంత - శరదారంభములందు చతురంగ సేనను తీసికొనివెళ్లవలెను. కాలిబంటులు ఎక్కువగానున్న సైన్యమే శత్రువులపై విజయము సాధించును. శరీరమునందు కుడిభాగమున ఏ అవయవమైన అదురుచున్నచో అది ఉత్తమము. ఎడమ అవయవము వీపు హృదయము అదురుట మంచిదికాదు. ఈ విధముగ శరీరచిహ్నములు. కురుపులు బొబ్బలు, అవయవములు అదురుట మొదలగు వాటిచే శుభాశుభఫలములను బాగుగా తెలిసికొనవలెను. స్త్రీలకు ఫలముదీనికి విపరీతముగా ఉండును. వాళ్లకు శరీరము ఎడమ భాగము అదురుట మంచిది.
అగ్ని మహాపురాణమునందు యుద్ధయాత్రావర్ణనమను రెండువందల ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.