Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏక త్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః
పునః శకునాని
పుష్కర ఉవాచ :
తిష్ఠతో గమనే ప్రశ్నే పురుషస్య శుభాశుభమ్ | నివేదయంతి శకునా దేశస్య నగరస్యచ. 1
సర్వః పాపఫలోదీప్తో నిర్దిష్టో దైవచింతకైః | శాంతః శుభ ఫలశ్చైవ దైవజ్ఞైః సముదాహృతః. 2
షట్ర్పకారా వినిర్దిష్టా శకునానాం చదీప్తయః | వేలాదిగ్దేశ కరణరుత జాతివిభేదతః. 3
పూర్వాపూర్వా చ విజ్ఞేయా సాతేషాం బలవత్తరా | దివాచరో రాత్రి చరస్తథారాత్రౌ దివాచరః. 4
క్రూరేషు దీప్తా విజ్ఞేయా హ్యృక్షలగ్నగ్రహాదిషు | ధూమితాసాతు విజ్ఞేయాయాంగమిష్యతి భాస్కరః. 5
యస్యాం స్థితః సాజ్వలితా ముక్తా చాంగారిణీమతా | ఏతాస్తిస్రః స్మృతాదీప్తాః పంచశాంతాస్తథాపరాః. 6
దీప్తాయాం దిశి దిగ్దీప్తం శకునం పరికీర్తితమ్ | గ్రామేరణ్యావనే గ్రామాస్తథా నిందితపాదపః. 7
పుష్కరుడు పలికెను : రాజు ఒకచోట నివాసము ఏర్పరచుకొన్నపుడుగాని, వెళ్ళునపుడు గాని, ప్రశ్న సమయమునందు గాని కనబడు శకునములు ఆ దేశము నందును, నగరమందును కలుగు శుభాశుభములను సూచించును ''దీప్తములు,'' ''శాంతములు'' అని శకునములు రెండు విధములు. అన్ని దీప్త శకునముల ఫలితములు అశుభములగు ననియు, శాంత శకునముల ఫలితములు శుభములగుననియు జ్యోతిః శాస్త్రజ్ఞులు చెప్పివారు. దీప్తశకునములు వేలాదీప్త - దిగ్దీప్త - దేశదీప్త - క్రియాదీప్త - రుతదీప్త - జాతిదీప్తములని ఆరువిధములు. వీటిలో పూర్వపూర్వములు ప్రబలతరములు. పగలు సంచరించవలసిన ప్రాణులు రాత్రి, రాత్రి సంచరించవలసినవి పగలు సంచరించినచో అది ''వేలాదీప్తము'' నక్షత్ర-లగ్న - గ్రహాదులు క్రూరావస్థను పొందిన సమయము కూడ ''వేలాదీప్తము'' సూర్యుడు ప్రయాణించు దిక్కు ''ధూమిత'', ఉన్న దిక్కు ''జ్వలిత'', విడవబడినదిక్కు ''అంగారిణి'', ఈ మూడు దిక్కులును దీప్తములు. మిగిలిన ఐదును శాంతములు. దీప్త దిక్కులందు కలుగు శకునములు దిగ్దీప్తములు. గ్రామములో అరణ్య జంతువులును, అరణ్యములో గ్రామ్య జంతువులును ఉన్నచో ఆదినిందిత దేశము నిందితములగు వృక్షములున్న దేశము గూడ నింద్యము-అశుభము.
దేశే చైవాశుభేజ్ఞేయో దేశదీప్తో ద్విజోత్తమః | క్రియాదీప్తో వినిర్దిష్టః స్వజాత్యనుచితక్రియః. 8
రుతదీప్తశ్చకథితో భిన్నభైరవనిః స్వనః | జాతిదీప్తస్తథాజ్ఞేయః కేవలం మాంసభోజనః. 9
దీప్తాచ్ఛాన్తో వినిర్దిష్టః నర్వైర్భేదైః ప్రయత్నతః | మిశ్రైర్మిశ్రో వినిర్దష్టస్తస్యవాచ్యం ఫలాఫలమ్. 10
విప్రవరా! అశుభ దేశమునందు కనబడు శకునములు ''దేశదీప్తములు''; తన వర్ణ ధర్మమునకు విపరీతముగ ప్రవర్తించువాడు ''క్రియాదీప్తుడు'', భయంకర ధ్వని వినబడుట ''రుతదీప్తము'' మాంసభోజనము మాత్రము చేయు ప్రాణి ''జాతిదీప్తము''; దీప్తావస్థకు విపరీతమైన శకునములు శాంతములు; వాటిలో కూడపైన చెప్పిన భేదములన్నియు గ్రహించవలెను. దీప్తశాంతములు కలసినచో అవి మిశ్ర శకునములు. ఈ విధముగ పరిశీలించి వాటి ఫలాఫలములను చెప్పవలెను.
గోశ్వోష్ట్ర గర్ధభశ్వాసః సారికా గృహగోధికా | చటకా భాస కూర్మాద్యాః కథితా గ్రామవాసినః. 11
అజావిశుకనాగేన్ద్రాః కోలో మహిష వాయసౌ | గ్రామ్యారణ్యా వినిర్దిష్టాః సర్వే7న్యేవనగోచరాః. 12
మార్జార కుక్కుటౌ గ్రామ్యౌ తౌచైవ వనగోచరౌ | తయోర్భవతి విజ్ఞానం నిత్యం వై రూప భేదతః. 13
గోకర్ణశిఖి చక్రాహ్వ ఖర హారీత వాయసాః | కులాహ కుక్కుభ##శ్యే నఫేరుఖంజన వానరాః. 14
శతఘ్న చటకశ్యామచాషశ్యేన కపింజలాః | తిత్తిరిః శతపత్రశ్చ కపోతశ్చ తథాత్రయః. 15
ఖంజరీటకదాత్యూహ శుకరాజీవకుక్కుటాః | భారద్వాజశ్చ సారఙ్గ ఇతి జ్ఞేయాదివాచరాః. 16
వాగుర్యులూకశరభ క్రౌంచాః శశకకచ్ఛపాః | లోమాసికాః పిఙ్గలికాః కథితా రాత్రి గోచరాః. 17
హంసాశ్చ మృగమార్జార నకులర్ష భుజఙ్గమాః | వృకారిసింహ వ్యాఘ్రోష్ట్ర గ్రామసూకరమానుషాః. 18
శ్వావిద్వృషభగోమాయువృక కోకిల సారసాః | తురంగ కౌపీన నరా గోధాహ్యు భయచారిణః. 19
గోవు, గుఱ్ఱము, గాడిద, కుక్క, సారిక, బల్లి, చటకము, భాసము, తాబేలు - ఇవి గ్రామవాసి ప్రాణులు. మేక, తోడేలు, చిలుక, గజరాజము, సూకరము, గేదే, కాకి - ఇవి గ్రామారణ్య ఉభయవాసి ప్రాణులు. మిగిలిన ప్రాణులన్నియు అటవికములు. పిల్లి, కోడికూడ ఉభయవాసులు, వీటి ఆకారములో భేదముండును గాన వీటిని గుర్తించవచ్చును. గోకర్ణము, నెమలి, చక్రవాకము, రాసభము, హారీతము. కాకి, కులాహము (ఒకవిధమగు గుఱ్ఱము) కుక్కుభము, నక్క, ఖంజరీటము, వానరము, శతఘ్నము, చటకము, కోకిల, శ్యేనము, కపింజలము, తీతువు, శతపత్రము, పావురము, ఖంజనము దాత్యూహము, శుకము, రాజీవము, కోడి, భరద్వాజము, సారంగము పగలు సంచరించు ప్రాణులు వాగురి, గుడ్లగూబ, శరభము, క్రౌంచము, చెవులపిల్లి, తాబేలు, లోమాసిక, పింగలిక రాత్రి సంచరించు ప్రాణులు. హంస, లేడి, పిల్లి, ముంగిస, భల్లూకము, సర్వము, వృకారి, సింహము, వ్యాఘ్రము, ఒంటె, గ్రామసూకరము, మనుష్యులు, శ్వావిదము, వృషభము, నక్క, తోడేలు, కోకిల, సారసము, గుఱ్ఱము, ముంగిస, కౌపీనధారి పురుషులు రాత్రి, పగలు కూడ సంచరించు ప్రాణులు.
బలప్రస్థానయోః సర్వే పురస్తాత్సంఘ చారిణః | జయావహా వినిర్దిష్టాః పశ్చాన్నిధనకారిణః. 20
గృహాద్గమ్య యదా చాషో వ్యాహరేత్పురతః స్థితః | నృపావమానం వదతి వామః కలహభోజనే. 21
యానేతద్దర్శనం శస్తం సవ్యమంగస్య వాప్యథ | చౌరైర్మోషమథాఖ్యాతి మయూరో భిన్ననిఃస్వనః . 22
యుద్ధమునందు గాని, యుద్ధమునకై యాత్ర చేయునపుడు గాని ఈ ప్రాణులన్నియు గుంపుగా ఎదుటకు వచ్చినచో విజయప్రదములు. వెనుక నుంచి వచ్చినచో మృత్యు కారకములు. నీలకంఠము తన గూడు నుండి బైటకు వచ్చి ధ్వని చేయుచు ఎదురైనచో అది రాజుకు అవమాన సూచకము. అది వామభాగమునందు వచ్చినచో కలహకారకము; భోజనమున బాధ కలిగించును. యాత్రా సమయమున దాని దర్శనము ఉత్తమము. దాని ఎడమభాగము కనబడుట కూడ మంచిది. యాత్రా సమయమున నెమలి ఎక్కువ ధ్వని చేసినచో అది దొంగల ద్వారా ధనము కోల్పోవుటను సూచించును.
ప్రయాతవ్యాగ్రతో రామ మృగః ప్రాణహరో భ##వేత్ | ఋక్షాఖుజంబుక వ్యాఘ్ర సింహ మార్జాన గర్దబాః.
ప్రతిలోమాస్తథా రామ స్వరశ్చ వికృతస్వనః | వామః కపిఞ్జలః శ్రేష్ఠస్తథా దక్షిణ సంస్థితః. 24
పృష్ఠతో నిన్దిత ఫలస్తిత్తిరిస్తునశస్యతే | ఏణా వరాహాః పృషతా వామా భూత్వాతు దక్షిణాః. 25
భవన్త్యర్థకరా నిత్యం విపరీతం విగర్హితాః | వృషాశ్వ జంబుకవ్యాఘ్రాః సింహమార్జార గర్దభాః. 26
వాంఛితార్థకరా జ్ఞేయా దక్షిణా ద్వామతోగతాః | శివాశ్యామాననాచ్ఛుచ్ఛూః పింగలా గృహగోధికా. 27
సూకరీపరపుష్టాచ పున్నామానశ్చ వామతః | స్త్రీ సంజ్ఞా భాసకారూష కపిశ్రీ కర్ణచ్ఛిత్కరాః. 28
కపిశ్రీకర్ణపిప్పీకారురుశ్యేనాశ్చ దక్షిణాః | జాతోక్షా (తికా) హిశశక్రోడగోధానాం కీర్తనం శుభమ్. 29
పరశురామా! ప్రస్థాన సమయమునందు లేడి ముందు ముందు నడచినచో అది మృత్యుప్రదము. భల్లూకము, ఎలుక, నక్క, పులి, సింహము, పిల్లి, గాడిద - ఇవి ప్రతికూలమగు దిక్కున వెల్లినను. గాడిద గట్టిగా ఓండ్ర పెట్టినను, కపింజలపక్షి ఎడమ ప్రక్కగాని, కుడిప్రక్క గాని ఉన్నను ఇవన్నియు ఉత్తమ శకునములు. కాని కపింజల పక్షి వెనుక ప్రక్కన ఉన్నచో చెడ్డఫలము నిచ్చును. యాత్రాసమయమున తీతుకనబడ కూడదు. లేడి. సూకరము, చిత్రవర్ణహరిణము, ఎడమ నుండి కుడివైపు వచ్చినచో సర్వదా కార్యసాధకము. కుడినుండి ఎడమ వైపు వెళ్లినచో మంచిది కాదు. ఎద్దు, గుఱ్ఱము, గ్రద్ద, పులి, సింహము, పిల్లి, గాడిద, పిల్లి, గాడిద మొదలైన కుడినుంచి ఎడమకు వెళ్ళినచో మనోవాంఛితసిద్ధి ప్రదములు. శృగాలము, శ్యామముఖము, చుంచు, పింగల, బల్లి, సూకరి, కోకిల, పుంలింగనామములు గల ప్రాణులు, భాసము, కారుషము, కోతి, శ్రీకర్ణము, ఛిత్వరము, కపి, పిప్పీకము, రురువు, శ్యేనము ఇవి కుడి ప్రక్క నున్నను శుభము. యాత్రాకాలమున జాతీకము, సర్పము, చెవులపిల్లి, సూకరము, ఉడుము -- వీటి పేరు చెప్పుట గూడ శుభమని చెప్పబడినది.
తతః సందర్శనం నేష్టం ప్రతీపం వానర ర్షయోః | కార్యకృద్బలీ శకునః ప్రస్థితస్యహి యో7న్వహమ్. 30
భ##వేత్తస్య ఫలం వాచ్యం తదేవ దివసం బుధైః | మత్తాభక్ష్యార్థినో బాలా వైరసక్తాస్తథైవచ. 31
సీమాన్త మభ్యన్తరితా విజ్ఞేయానిష్పలాద్విజ | ఏకద్విత్రి చతుర్భిస్తు శివాధన్యారుతైర్భవేత్. 32
పంచభిశ్చతథా షడ్బిరధన్యా పరికీర్తితా | సప్తభిశ్చతథాధన్యా నిష్పలాపరతో భ##వేత్. 33
నృణాం రోమాంచ జననీ వాహనానాం భయప్రదా | జ్వాలానలా సూర్యముఖీ విజ్ఞేయాభయవర్ధినీ. 34
ప్రథమం సారఙ్గే దృష్టే శుభే దేశే శుభం భ##వేత్ | సంవత్సరం మనుష్యస్యహ్య శుభే చ శుభం తథా. 35
తథావిధం నరః పశ్యేత్సారఙ్గం ప్రథమేహని | ఆత్మనశ్చ తథాత్వేన జ్ఞాతవ్యం వత్సరం ఫలమ్. 36
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శకుననిరూపణం నామైక త్రింశ దధిక శతతమో7ధ్యాయః.
భల్లూక - వానరములు విపరీత దిక్కునందు కనబడుట అనిష్టకారకము, ప్రస్థానము చేసిన తరువాత ఏదినమున బలవత్తరమగు ఏశకునము కనబడునో అది ఆదినము నకు మాత్రమే ఫలమునిచ్చును. పరశురామా ! పిచ్చివాడు, భోజనార్థి, బాలుడు, శత్రువు మొదలగు వారు గ్రామసీమయందు గాని, నగరసీమయందు గాని కనబడినచో దానికి ఫలమేమియు ఉండదని తెలుసుకొనవలెను. ఆడనక్క ఒకసారిగాని, రెండుసార్లుగాని, మూడుసార్లుగాని, నాలుగుసార్లుగాని కూసినచో శుభము. ఐదు లేదా ఆరుసార్లు కూసినచో అశుభము. ఏడుసార్లు కూసినచో శుభము. అంతకు మించికూసినచో ఫలమేమియు ఉండదు. మార్గ మధ్యమునందు సూర్యుని వైపు పైకి ఎగిసే జ్వాల కనబడి, అది చూడగానే రోమాంచకారి గాను, వాహనములు భయపడునట్లు గాను ఉన్నచో అది మహా భయ సూచకము. ముందుగనే ఏదైన ఒక ఉత్తమ ప్రదేశము నందు సారంగము కనబడినచో అది సంవత్సరము వరకును శుభ సూచకము. దానిని చూచుటచే అశుభమునందు గూడ శుభమగును. అందుచే యాత్రా ప్రారంభ దినమున అట్టి సారంగమును జూచి ఒక సంవత్సరము పాటు శుభ ఫలప్రాప్తి కలుగునని గ్రహించవలెను.
అగ్ని మహాపురాణమునందు శకున వర్ణనమను రెండు వందల యొకటవ అధ్యాయము సమాప్తము.