Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రయస్త్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః

అథ యాత్రామండల చింతాదిః

పుష్కర ఉవాచ :

సర్వయాత్రాం ప్రవక్ష్యామి రాజధర్మ సమాశ్రయాత్‌ | అస్తఙ్గతే నీచగతే వికలే రిపురాశిగే. 1

ప్రతిలోమే చ విధ్వస్తే శుక్రేయాత్రాం విసర్జయేత్‌ | ప్రతిలోమే బుధేయాత్రాం దిక్పతౌచ తథాగృహే. 2

వైధృతౌ చ వ్యతీపాతే నాగేచ శకునో తథా | చతుష్పాదేచ కింస్తు ఘ్నే తథా యాత్రాం వివర్జయేత్‌. 3

విపత్తారేనైధనే చ ప్రత్యరౌ చాథ జన్మని | గండే, వివర్జయేద్యాత్రాం రిక్తాయాంచ తిథావపి. 4

పుష్కరుడు పలికెను : ఇపుడు రాజ ధర్మానుసారము అందరి యాత్రను గూర్చి చెప్పెదను. శుక్రుడు అస్తంగతుడైనపుడును, నీచస్థానములో నున్నపుడును, వికలాంగుడైనపుడును, శత్రురాశిలో నున్నపుడును, ప్రతికూల స్థానమునందున్నపుడును, యాత్రచేయకూడదు. బుధుడు ప్రతికూల స్థానమునందున్నపుడును, దిక్కు అధిపతి గూడ ప్రతికూల స్థానమునందున్నపుడును యాత్ర చేయగూడదు. వైధృతి - వ్యతీపాత - నాగ - శకుని - చతుష్పాద - కింస్తుఘ్నయోగము లందును, విపత్‌ - మృత్యు - ప్రత్యరి - జన్మతారలందుచు, గండయోగమునందును, రిక్తతిథులందును యాత్ర చేయగూడదు.

ఉదీచీ ర తథాప్రాచీ తయోరైక్యం ప్రకీర్తితమ్‌ | పశ్చిమా దక్షిణాయా దిక్తయోరైక్యం తథైవచ. 5

వాయ్వగ్ని దిక్సముద్భూతం పరిమంనతులంఘయేత్‌ | ఆదిత్యచంద్రసౌరాస్తు దివసాశ్చ నశోభనాః. 6

కృత్తికాద్యాని పూర్వేణ మఘాద్యానిచ యామ్యతః | మైత్రాద్యాన్యపరే చాథ వాసవాద్యాని వాప్యుదక్‌. 7

సర్వద్వారాణి శస్తానిచ్ఛాయామానం వదామితే |

ఉత్తర - పూర్వదిక్కులును, పశ్చిమ - దక్షిణ దిక్కులును ఒక్కటేనని చెప్పబడినది. వాయవ్యము నుండి ఆగ్నేయము వరకును ఉండు పరిధి దండమును దాటి యాత్ర చేయగూడదు. భాను - సోమ - శనివారములందు యాత్ర చేయగూడదు. కృత్తిక మొదలు ఏడు నక్షత్ర సమూహములు తూర్పునందును మఘ మొదలు ఏడు నక్షత్రములు దక్షిణము నందును, అనూరాధ మొదలగు ఏడు నక్షత్రములు పశ్చిమమునందును ఉండును. ధనిష్ఠాదులగు ఏడు నక్షత్రములు ఉత్తరము నందుండును. పైన చెప్పిన నక్షత్రములు ఆయా దిక్కులకు ద్వారములు. ఆయా దిక్కులకు ఆద్వారము లన్నియు ఉత్తమములు. ఇపుడు ఛాయామానమును గూర్చి చెప్పెదను.

ఆదిత్యే వింశతిర్‌జ్ఞేయా చంధ్రేషోడశకీర్తితాః. 8

భౌమేపంచదశైవోక్తాశ్చతుర్ధశ తథాబుధే | త్రయోదశ తథా జీవే శుక్రే ద్వాదశకీర్తితాః. 9

ఏకాదశ తథాసౌరే సర్వకర్మసుకీర్తితాః | జన్మలగ్నే శక్రచాపే సమ్ముఖేన వ్రజేన్నరః. 10

శకునాదౌ శుభేయాయాజ్జయామ హరిమాస్మరన్‌ |

రవి వారమున ఇరువది, సోమవారమున పదునారు, మంగళవారమున పదునైనను, బుధవారమున పదమూడు, శుక్రవారమున పండ్రెండు, శనివారమున పదకొండు అంగుళముల ఛాయామానము చెప్పబడినది. ఇవి అన్ని కర్మలకును విహితములు. జన్మలగ్నమునందును ఎదుట ఇంద్రధనుస్సు ఆవిర్భవించినపుడును యాత్రచేయగూడదు. శుభశకునాదులు కనబడిన పిమ్మట శ్రీమహావిష్ణువును స్మరించుచు యాత్రచేయవలెను.

వక్ష్యే మండల చిన్తాంతే కర్తవ్యం రాజరక్షణమ్‌. 11

స్వామ్యమాత్యం తథాదుర్గం కోశోదండస్తథైవచ | మిత్రం జన పదశ్చైవ రాజ్యంసప్తాఙ్గముచ్యతే. 12

సప్తాఙ్గస్యతురాజ్యస్య విఘ్నకర్తౄన్వినాశ##యేత్‌ | మండలేషు చ సర్వేషు వృద్ధిః కార్యామహీక్షితా. 13

ఆత్మమండలమేవాత్ర ప్రథమం మండలంభ##వేత్‌ | సామంతాస్తస్య విజ్ఞేయారిపవోమండలస్యతు. 14

ఉపేతస్తు సుహృజ్‌ఞ్జేయః శత్రుమిత్రమతః పరమ్‌ | మిత్రమిత్రం తతోజ్ఞేయం మిత్రమిత్రరిపుస్తతః. 15

ఏతత్పురస్తాత్కథితం పశ్చాదపినిబోధమే | పార్‌జ్ష గ్రాహస్తతః పశ్చాతత్తస్త్వాక్రన్ద ఉచ్యతే. 16

ఆసారస్తు తతో7న్యః స్యాదాక్రన్దాసార ఉచ్యతే | జిగీషోః శత్రుయుక్తస్య విముక్తస్య తథాద్విజ. 17

నాత్రాపి నిశ్చయః శక్యోవక్తుం మనుజపుఙ్గవ | నిగ్రహాను గ్రహే శక్తో మధ్యస్థః పరికీర్తితః. 18

నిగ్రహాను గ్రహే శక్తః సర్వేషామపి యో భ##వేత్‌ | ఉదాసీనః సకథితో బలవాన్పృథివీపతిః. 19

న కస్య చిద్రిపుర్మిత్రం కారణాచ్ఛత్రుమితకే | మండలం తవ సంప్రోక్తమేతద్ద్వాదశ రాజకమ్‌. 20

పరశురామా! ఇపుడు మండల విచారమును గూర్చి చెప్పెదను. సర్వవిధముల రాజును రక్షించవలెను. రాజు, మంత్రి, దుర్గము, కోశము, దండము, మిత్రులు, జనపదము - ఇవి రాజ్యము యొక్క సప్తాంగములు. ఈ సప్తాంగరాజ్యమునకు విఘాతము కలిగించు వారిని సంహరించవలెను. రాజు తన మండలములనన్నింటిని వృద్ధిపొందించుకొనవలెను. అన్నింటికంటే తన మండలము మొదటిది. ఆ మండలమునకు సామంతరాజులే శత్రువులు. 'విజిగీషు' వగు రాజునకు తన మండలమునకు ఎచటి సీమ (సరిహద్దు) యందున్నసామంతుడు శత్రువు. ఆ శత్రువు రాజ్యముతో ఎవనికి సరిహద్దు ఉన్నదో ఆతడు ఆశత్రువునకు శత్రువగుటచే విజిగీషువునకు మిత్రుడు. ఈ విధమున విజిగీషుని మండలమునకు ఎదుట శత్రువు, మిత్రుడు, అరిమిత్రుడు, అరిమిత్రమిత్రుడు అని అయిదుగురు ఉందురు. ఇపుడు వెనుకనున్న వారినిగూర్చి వినుము. వెనుకనున్న వారిలో మొదటివాడు ''పార్‌ష్ణిగ్రాహుడు''. వాని వెనుకనున్న వాడు ''ఆక్రందుడు''. ఆ ఇద్దరి వెనుకనున్నవాడు ''ఆసారులు'' వారిని వరుసగా ''పార్‌ష్ణిగ్రహాసారుడు'' ''ఆక్రందాసారుడు''అని చెప్పుదురు. విజిగీషువైన రాజు శత్రువుయొక్క ఆక్రమణము ఉన్నను, లేకపోయినను ఆతని విజయమును గూర్చి నిశ్చితముగా ఏమియు చెప్పవీలుపడదు. విజిగీషువు, శత్రువు వీరిరువురును అసంఘటితులై యున్నపుడు వారి నిగ్రహానుగ్రహములందు సమర్థుడగు తటస్థుడైన రాజు ''మధ్యస్థుడు''. ఈ ముగ్గురి విషయమున నిగ్రహానుగ్రహసమర్థుడగు రాజు ఉదాసీనుడు. ఎవ్వడును ఎవ్వనికిని శత్రువుకాదు; మిత్రుడు కాదు. అందరును కారణవశముచే పరస్పరము శత్రువులగుదురు, మిత్రులగుదురు. ఈవిధముగ పండ్రెండు రాజమండలములను గూర్చి చెప్పితిని.

త్రివిధా రిపవో జ్ఞేయాః కుల్యానన్తర కృత్రిమో మతః | పూర్వాపూర్వాగురుస్తేషాం దుశ్చికిత్స్య తమోమతః. 21

ఆనంతరో7పి యః శత్రుః సోపిమే కృత్రిమో మతః | పార్‌ష్ణిగ్రాహో భ##వేచ్ఛత్రోర్మిత్రాణి రిపవస్తథా. 22

పార్‌ష్ణిగ్రాహముపాయైశ్చ శమయేచ్ఛ తథాస్వకమ్‌ | మిత్రేణ శత్రో రుచ్ఛేదం ప్రశంసన్తి పురాతనాః. 23

మిత్రం చ శత్రుతామేతి సామన్త్యత్వాదనంతరమ్‌ | శత్రుం జిగీషు రుచ్ఛిన్ద్యాత్స్వయం శక్నోతి చేద్యది 24

ప్రతాప వృద్ధౌ లేనాపి నామిత్రాజ్జాయతే భయమ్‌ | యథాస్య నోద్ద్విజేల్లోకో విశ్వాసశ్చయథాభ##వేత్‌. 25

జిగీషుర్ధర్మవిజయీ తథాలోకం వశం నయేత్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యాత్రామండల చిన్తాదికం నామ

త్రయస్‌ త్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః.

కుల్యుడు, అనంతరుడు కృత్రిముడు అని శత్రువులు మూడు విధములు. వీరిలో పూర్వపూర్వుడు అధిక శత్రువు అనగా కృత్రిముని కంటె అనంతరుడు, అతని కంటే కుల్యుడు ప్రబలులు. కుల్యుని అణచుట చాల కష్టము. నా అభిప్రాయమున అనంతర శత్రువు కూడ కృత్రిముడే. పార్‌ష్ణిగ్రాహుడు శత్రువును మిత్రుడు. అయినను ప్రయత్నించినచో అతడు శత్రువునకు శత్రువు కూడకావచ్చును. అందుచే వివిధోపాయములచే పార్‌ష్ణిగ్రాహుని తన వశములో నుంచుకొన వలెను. మిత్రునిచే శత్రువును నశింపచేయుట మంచిదని ప్రాచీన నీతిశాస్త్ర వేత్తలయభిప్రాయము. సామంతుడు(సీమానివాసి) అగుటచే మిత్రుడు కూడ మున్ముందు శత్రువు కావచ్చును. అందుచే విజయము కోరు రాజు, శక్తి ఉన్నచో స్వయముగానే శత్రువును నశింపచేయవలెను. ఎందువలన అనగా మిత్రుని ప్రతాపము పెరిగిపోయినచో ఆతని నుండి కూడ భయము కలుగవచ్చును. ప్రతాపహీనుడైన శత్రువు నుంచి కూడ భయముండదు. విజిగీషువైన రాజు ధర్మవిజయి కావలెను. ప్రజలలో ఎవ్వరికిని ఉద్వేగము కలుగ కుండునట్లు చూచుకొనుచు విశ్వాసము కలిగించి, తనవశములో నుంచుకొనవలెను. అగ్ని మహాపురాణమునందు యాత్రా మండల చింతా కథనమను రెండెవందల ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page