Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచత్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః

అథ రాజ్ఞో దినచర్యా

పుష్కర ఉవాచ :

అజస్రకర్మ వక్ష్యామి దినం ప్రతియదాచరేత్‌ | ద్విముహూర్తావశేషాయాం రాత్రౌనిద్రాం త్యజేన్నృపః. 1

వాద్యవన్ధిస్వనైర్గీతైః పశ్యేద్గుడాంస్తతోనరాన్‌ | విజ్ఞాయతే న యే లోకాస్తదీయా ఇతికేనచిత్‌. 2

అయవ్యయస్య శ్రవణం తతః కార్యం యథావిధి | వేగోత్సర్గం తతః కృత్వా రాజాస్నానగృహం వ్రజేత్‌. 3

స్నానం కుర్యాన్నృపః పశ్చాద్దన్త ధావనపూర్వకమ్‌ | కృత్వాసంధ్యాం తతో జప్యం వాసుదేవంప్రపూజయేత్‌. 4

వహ్నౌపవిత్రాఞ్జహు యాత్తర్పయేదుదకైః పితౄన్‌ | దద్యాత్పకాంచనీం ధేనుం ద్విజాశీర్వాద సంయుతః. 5

అనులిప్తో7లంకృతశ్చ ముఖం పశ్యేచ్చదర్పణ | ససువర్ణే ధృతేరాజా శృణుయాద్దివసాదికమ్‌. 6

ఔషధం భిష జోక్తంచ మంగలాలంభనం చరేత్‌ | పశ్యేద్గురుం తేన దత్తాశీర్వాదో7థ వ్రజేత్సభామ్‌. 7

పుష్కరుడు చెప్పెను : పరశురామా! రాజు ప్రతిదినము చేయవలసిన పనులు చెప్పెదను. ఇంకను ఘడియరాత్రి ఉన్నదనగా రాజు వివిధ మంగళ వాద్యధ్వనులు, వందిమాగధుల స్తుతులు, మంగళ గీతములు వినుచు మేల్కొనవలెను. పిదప గూఢచారులను చూడవలెను. వీరు రాజుసేవకులు అని గూఢచారులను గూర్చి ఎవ్వరికిని తెలియకూడదు. పిదప యథావిధిగ అయవ్యయముల లెక్కలు వినవలెను. శౌచాద్యనంతరము స్నాన గృహము ప్రవేశించి, ముందుగ దంత ధావనము చేసి పిదప స్నానము చేయవలెను. సంధ్యోపాసనాననంతరము శ్రీ మహావిష్ణువును పూజించవలెను. పిదప పవిత్రుడై అగ్నిహోత్రముచేసి పితృతర్పణములు చేయవలెను. పిదప బ్రాహ్మణాశీర్వాదములు గ్రహించి వారికి సువర్ణసహితముగా పాలుఇచ్చుగోవును దానము చేయవలెను. చందనము, అలంకారము ధరించి అద్దమునందును, సువర్ణయుక్తమగు ఘృతము నందును తన ముఖము చూచుకొనవలెను. దైవిక కథాదులువిని, వైద్యుడు చెప్పిన ఔషధము సేవించి, మంగళవస్తువులు స్పృశించి, గురుదర్శనము చేసి, ఆతని ఆశీర్వాదములుపొంది రాజసభలో ప్రవేశించవలెను.

తత్రస్థో బ్రాహ్మణాన్పశ్యేదమాత్యాన్మంత్రిణస్తథా | ప్రకృతీశ్చ మహాభాగ ప్రతీహార నివేదితాః. 8

శ్రుత్వేతిహాసం కార్యాణి కార్యాణాం కార్యనిర్ణయమ్‌ | వ్యవహారం తతఃపశ్యేన్మంత్రం కుర్యాత్తుమంత్రిభిః. 9

నై కేన సహితః కుర్యాన్న కుర్యాద్బహుభిః సహ | నచ మూర్ఖైర్న చానాపై#్తర్గుప్తం నప్రకటంచరేత్‌. 10

మంత్రం స్వాధిష్ఠితం కుర్యాద్యేన రాష్ట్రం న బాధతే | ఆకార గ్రహణ రాజ్ఞో మంత్రరక్షాపరామతా. 11

ఆకారై రింగితైః ప్రాజ్ఞా మంత్రం గృహ్ణంతి పండితాః |

సాంవత్సరాణాం వైద్యానాం మంత్రిణాం వచనే రతః. 12

రాజా విభూతి మాప్నోతి ధారయంతి నృపంహితే | మంత్రం కృత్వాథ వ్యాయామం చక్రేయానేచశస్త్రకే.

నిఃసత్త్వా (యుద్ధా) దౌనృపః స్నాతః పశ్యేద్విష్ణుం సుపూజితమ్‌ |

హుతం చ పావకం పశ్యే ద్విప్రాన్పశ్యేత్సు పూజితాన్‌. 14

భూషితో భోజనం కుర్యాద్దానాద్యైః సుపరీక్షితమ్‌ | భుక్త్వా గృహీత తాంబూలో వామ పార్శ్వే సంస్థితః. 15

(అ) 2/8

శాస్త్రాణి చింతయేద్దృష్ట్వా యోధాన్కోష్ఠాయుధం గృహమ్‌ |

అన్వాస్య పశ్చిమాం సంధ్యాం కార్యాణి చ విచిన్త్య తు. 16

చరాన్సంప్రేష్య భుక్త్వాన్నమన్తః పురచరో భ##వేత్‌ | వాద్యగీతైరక్షితో7న్యైరేవం నిత్యం చరేన్నృపః. 17

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రాజ్ఞో దినచర్యా నామ పంచత్రింశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

రాజసభలో బ్రాహ్మణులను, అమాత్యులను కలిసి తన దర్శనము నిమిత్తమై వచ్చియున్నట్లు ద్వారపాలకుడు చెప్పిన ప్రజలకు దర్శనమీయవలెను. ఇతిహాస శ్రవణానంతరము రాజ్యకార్యములను పర్యవేక్షించవలెను. వాటిలో చాల ఆవశ్యకములగు వాటిని గూర్చి నిర్ణయములు తీసికొని, ప్రజల వ్యవహారములు చూచి, మంత్రులతో గుప్త విషయములను చర్చించవలెను. ఒక్కనితో మాత్రముగాని, చాలమందితోగాని, మూర్ఖులతోగాని, విశ్వాసయోగ్యులు కానివారితో గాని మంత్రణము చేయగూడదు. సర్వదా గుప్తరూపముననే చేయవలెను. ప్రకటముగ చేయరాదు. రాజ్యమునందు ఎట్టిబాధలును రాని విధమున, మంత్రణములను రహస్యముగా ఉంచవలెను. మంత్రణము రహస్యముగా ఉంచుటకు ఉపాయము తన ఆకార చేష్టాదులందు ఎన్నడును, ఎట్టిమార్పులను లేకుండ చూచుకొనుటయే. ఏలనన బుద్ధిమంతులు ఆకారచేష్టాదుల ద్వారా గుప్తములగు మంత్రణములను కూడ కనిపెట్టవేయుదురు. జ్యోతిష్కులు, మంత్రులు, వైద్యులు చెప్పిన మాటలను రాజు వినవలెను. అట్లుచేయుటచే ఐశ్వర్యమును పొందును. ఏలనన వీరు రాజును అనుచిత కార్యములనుండి మరల్చి హితకార్యములందు ప్రవర్తింప చేయుదురు. మంత్రణలు ముగిసిన పిదప రథాదులను నడపుట, శస్త్రప్రయోగము మొదలగు వాటితో కొంతసమయము వ్యాయామము చేయవలెను. యుద్ధాది సమయములందు రాజు స్నానమొనరించి, బాగుగా పూజచేసిన శ్రీమహావిష్ణువును, హోమానంతరము ప్రజ్వలించుచున్న అగ్నిని, దానమానాదులచే సత్కృతులగు బ్రాహ్మణులను చూడవలెను. దానాద్యనంతరము వస్త్రాలంకారాదులతో అలంకరించుకొని పరీక్షించిన అన్నము భుజించవలెను. తాంబూల సేవనము చేసి ఎడమప్రక్కగా కొంతసేపు శయనించవలెను. ప్రతిదినము శాస్త్రచింతనము, యోధ - అన్నభాండార - శస్త్రాగారముల పర్యవేక్షణము చేయవలెను. దినాంతమున సాయంసంధ్యను ఉపాసించి, ఇతర కార్యములను గూర్చి విచారించి, అవశ్యకములగు పనులపై గూఢచారులను పంపి, రాత్రి భోజనానంతరము అంతఃపురములోనికి వెళ్లవలెను. అచట సంగీతవాద్యాదులతో మనోరంజనము చేసుకొని ఆత్మరక్షణోపాయములను చక్కగా చేసికొని నిద్రించవలెను. రాజు ప్రతిదినము ఇట్లే చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు ప్రాత్యహికరాజకర్మ కథన మను రెండువందల ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page