Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకచత్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః.

అథ పునః సామాదికమ్‌

రామ ఉవాచ :

ప్రభావోత్సాహ శక్తిభ్యాం మంత్రశక్తిః ప్రశస్యతే | ప్రభావోత్సాహవాన్కావ్యోజితోదేవ పురోధసా. 1

మంత్రయేతేహ కార్యాణి నానాపై#్తర్నా7విపశ్చితా | అశక్యారంభవృత్తీనాం కుతఃక్లేశాదృతే ఫలమ్‌. 2

అవిజ్ఞాతస్య విజ్ఞానం విజ్ఞాతస్యచ నిశ్చయః | అర్థద్వైధస్య సందేహచ్ఛేదనం శేషదర్శనమ్‌. 3

సహాయాః సాధనోపాయాః విభాగో దేశకాలయోః | విపత్తేశ్చ ప్రతీకారః పంచాంగో మంత్ర ఇష్యతే. 4

మనఃప్రసాదః శ్రద్దాచ తథాకరణ పాటవమ్‌ | సహాయోత్థాస సంపచ్చ కర్మణాం సిద్దిలక్షణమ్‌. 5

మదః ప్రసాదః కామశ్చసుప్తప్రలపితానిచ | భిన్దంతిమంత్రం ప్రచ్ఛన్నాః కామిన్యోరమతాంతథా. 6

ప్రగల్భఃస్మతిమాన్వాగ్మీశ##స్త్రే శాస్త్రే చనిష్ఠితః | అభ్యస్తకర్మా నృపతేర్దూతో భవితుమర్హతి. 7

నినృష్టార్థో మితార్థశ్చ తథా శాసన హారకః | సామర్థ్యాత్పాదతో హీనో దూతస్తు ద్వివిధః స్మృతః. 8

శ్రీ రాముడు చెప్పెను : ప్రభుశక్త్యుత్సాహశక్తుల కంటె మంత్రశక్తి గొప్పది. ప్రభుశక్తి - ఉత్సాహశక్తులున్న శుక్యాచార్యుని దేవపురోహితుడైన బృహస్పతి మంత్రశక్తిచే ఓడించెను. విశ్వాసపాత్రుడే కాక నీతిశాస్త్రకోవిదుడు కూడ అయిన వానితో రాజు మంత్రణము చేయవలెను. అశక్యమైన కార్యము నారంభించు వారికి క్లేశములననుభవించుట తప్ప ఫలమేదియు లభింపదు. తెలియని విషయములు తెలిసికొనుట, తెలిసిన దానిని నిశ్చయించుట, కర్తవ్యమునందు సందేహమేర్పడినపుడు దానిని తొలగించుకొనుట, శేషము లభించుట - ఇవి మంత్రులపై ఆధారపడి యున్నది. సహాయకులు, కార్యసాధనోపాయములు, దేశకాల ప్రవిభాగము, విపత్తినివారణము, కర్తవ్యసిద్ధి - ఇవి మంత్రా ఆలోచనలకు సంబంధించిన ఐదు అంగములు. మనస్సు యొక్క ప్రసన్నత్వము, శ్రద్ధ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు తమతమ పనులు చేయుటయందు సమర్థములుగా నుండుట, సహాయసంపత్తి, ఉత్థానసంపత్తి (వెంటనే లేచి పనులు చేయుట) ఇవి మంత్రము ద్వారా నిశ్చయించి ప్రారంభింపబడు కర్మలసిద్ధికి లక్షణములు. మదము, ప్రమాదము (పొరబడుట) కామము, సప్నములో పలవరించుట, స్తంభాదుల వెనుక పొంచియుండు జనులు, స్త్రీసాంనిధ్యము, ఉపేక్షిత ప్రాణులు (చిలకలు, బధిరులు మొ) భేదము కలుగుటకు (ఇతరులకు వెల్లడియగుట) కారణములు, సభలో నిర్భయముగా మాటలాడుట, మంచి జ్ఞాపకశక్తి, ప్రవచనకౌశలము, శస్త్ర శాస్త్రముల పరినిష్ఠిత జ్ఞానము, దూతలకు తగిన కార్యములందు నేర్పుకలవాడు రాజదూత అగుటకు యోగ్యుడు, నిసృష్టార్థుడు (బాధ్యతలన్నీ తీసికొన్నవాడు), పరిమితార్థుడు (కొన్ని బాధ్యతలు మాత్రమే ఉన్నవాడు). శాసనహారకుడు (వార్తలు మాత్రము తీసికొను పోవువాడు) అని దూతలు మూడు విధములు.

నావిజ్ఞాతం పురంశత్రోః ప్రవిశేచ్చన సంసదమ్‌ | కాలమీక్షేత కార్యార్థమనుజ్ఞాతశ్చ నిష్పతేత్‌. 9

ఛిద్రంచ శత్రోర్జానీయా త్కోశమిత్ర బలానిచ | రాగాపరాగౌ జానీయాద్‌దృష్టి గాత్రవిచేష్టితైః. 10

కుర్యాచ్చతుర్విధం స్తోత్రం పక్షయో రుభయోరపి | తపస్వి వ్యంజనో పేతైః సుచరైః సహసంవసేత్‌. 11

చరః ప్రకాశో దూతః స్యాదప్రకాశశ్చరోద్విధా | వణిక్‌ కృషీవలో లింగీ భిక్షుకాద్యాత్మకాశ్చరాః. 12

యాయాదరిం వ్యసనినం నిష్ఫలే దూతచేష్టితే | ప్రకృతి వ్యసనం యత్స్యాత్తత్సమీక్ష్యసముత్పతేత్‌. 13

అనయాద్వ్యస్యతి శ్రేయస్తస్మాత్తద్వ్యసనం స్మృతమ్‌ | హుతాశనో జలం వ్యాధిర్దుర్భిక్షం నరకం తథా. 14

ఇతి పంచవిధం దైవం వ్యసనంమానుషం పరమ్‌ | దైవం పురుష కారేణ శాన్త్యాచ ప్రశమం నయేత్‌. 15

ఉత్థాపితేన నీత్యాచ మానుషం వ్యసనం హరేత్‌ | మంత్రో మంత్రఫలావాప్తిః కార్యానుష్ఠానమాయతిః. 16

ఆయవ్య¸° దండనీతి రమిత్ర ప్రతిషేధనమ్‌ | వ్యసనస్య ప్రతీకారో రాజ్యరాజాభిరక్షణమ్‌. 17

ఇత్యమాత్యస్య కర్మేదం హన్తిసవ్యసనాన్వితః | హిరణ్య ధాన్య వస్త్రాణి వాహనం ప్రజయాభ##వేత్‌. 18

తథాన్యే ద్రవ్యనిచయా హన్తిసవ్యసనా ప్రజా | ప్రజానామాపదిస్థానాం రక్షణం కోశదండయోః. 19

పౌరాద్యా శ్చోపకుర్వన్తి సంశ్రయాదిహ దుర్దినమ్‌ | తూష్ణీం యుద్ధం జనత్రాణం మిత్రామిత్రపరిగ్రహః. 20

సామంతాది కృతేదోషే నశ్యేత్తద్వ్యసనాచ్చతత్‌ | భృత్యానాం భరణం దానం ప్రజామిత్రపరిగ్రహః. 21

ధర్మకామాది భేదశ్చ దుర్గసంస్కారభూషణమ్‌ | కోశాత్తద్వ్యసనాద్ధన్తి కోశమూలోహి భూపతిః. 22

తనరాకను గూర్చి ముందుగ సూచించకుండ దూత శత్రుదుర్గమును దాని, సభను గాని ప్రవేశించరాదు. కార్యసిద్ధికై సమయమును నిరీక్షించవలెను. శత్రువు అనుమతిపొంది తిరిగి వెళ్ళవలెను. శత్రువునలోపమును తెలిసికొనవలెను. వారి కోశము, మిత్రులు మొదలగువాటిని తెలుసుకొని, శత్రువులయొక్క చూపులు, చేష్టలు మొదలగువాటిచే తన విషయమున అతనికి ఎట్టిఅభిప్రాయమున్నదో తెలిసికొనవలెను. అతడు రెండు పక్షములవారి కుల-నామ-ద్రవ్య-శ్రేష్ఠకర్మలను ప్రశంసించవలెను. తపస్వివేషములో నున్న తమపక్షీయులగు గూఢచారులతో సంప్రదించవలెను ప్రకటులు, అప్రకటులు అని చారులు రెండువిధములు. ప్రకటముగా నున్నవారు దూతలు, అప్రకాశముగా నున్నవారు గూఢచారులు. చారులస్థితికి, వర్తకులు, వ్యవసాయదారులు, సన్యాసులు, భిక్షువులు, అధ్యాపకులు-- వీరు ఉపయోగింతురు. అందుచే వీరి వృత్తికై (సుఖజీవనమునకై)ఏర్పాట్లు చేయవలెను. దూత ప్రయత్నములు విఫలమైనపుడు, శత్రువు దుర్బలుడుగానున్నపుడు అతనిపై దండెత్తవలెను. విజిగీషువు తన ప్రకృతులలో నున్న వ్యసనములన్నియు తొలగించుకొని పిమ్మట శత్రువుపై దాడి చేయవలెను. మానుషము, దైవము అని వ్యసనములు రెండు విధములు. అనయము (నీతిని అనుసరించకుండుట) అపనయము (చెడునీతిని అవలంబించుట) అనువాటిచే ప్రకృతివ్యసనమేర్పడును. కేవలము దైవవశము చేతగూడ అది రావచ్చును. శ్రేయస్సును వ్యస్తముచేయునుగాన 'వ్యసనము'. అగ్ని, జలము, రోగములు, దుర్భిక్షము, మహామారి ఇవి ఐదు దైవవ్యసనములు. మిగిలినవి మానుషవ్యసనములు. పురుషప్రయత్నము చేతగాని, అథర్వోక్త శాంతికర్మలచేగాని దైవ వ్యసనమును తొలగించవలెను. ఉత్థానశీలత్వము (పనులలో జాప్యము లేకుండుట). నీతి, సంధి, సామము మొదలగువాటిచే మునుషవ్యసనము శాంతింపచేయవలెను. మంత్రము, మంత్రఫలప్రాప్తి, కార్యానుష్ఠానము భవిష్యదున్నతి సంపాదనము, అయవ్యయములు, దండనీతి, శత్రునివారణము, వ్యసనములను తొలగించు ఉపాయము, రాజును రాజ్యమును రక్షించుట- ఇవి అమాత్యుల కర్తవ్యములు. అమాత్యుడు వ్యసనగ్రస్తుడైనచో ఈ పనులన్నింటిని పాడుచేయును. సువర్ణ - ధాన్య - వస్త్ర-వాహనాది సంగ్రహము జనపదవాసులగు ప్రజల కర్తవ్యము. ప్రజలు వ్యసనగ్రస్తులైనచో ఇవన్నియు నష్టమగును. ఆపత్సమయమున జనులను రక్షించుట, కోశ -సేనారక్షణము, రహస్యముగా గాని, ఆకస్మికముగా గాని వచ్చిన యుద్ధము నుండి కాపాడుకొనుట, కష్టాలలో చిక్కుకొనియున్న మిత్ర - అపమిత్రులను సంగ్రహించుట, సామంతులనుండియు, వనవాసులనుండియు వచ్చు ఉపద్రవములను తొలగించుకొనుట- ఇవన్నియు దుర్గాశ్రయణ ప్రయోజనములు. నగరమునందలి నాగరికులు గూడ అవసరమైనపుడు రక్షణపొందుట కొరకై, కోశాదుల నిచ్చుచు దుర్గపతికి ఉపకరింతురు. భృత్యుల భరణపోషణము, దానము, హస్తి-అశ్వ-ఆభరణాదులను కొనుట, స్థిరత్వము, శత్రుపక్షమునందున్న లుబ్ధులగు ప్రకృతులలో ధనాదులిచ్చి, విరోధముత్పన్నము చేయుట, దుర్గసంస్కారము, సేతుబంధము, వాణిజ్యము, ప్రజా-మిత్రసంగ్రహము, ధర్మార్థకామసిద్ధి- ఇవన్ని కోశమువలన సిద్థించును. రాజునకు మూలము కోశముగాన కోశవ్యసనము రాజునకుసంబంధించిన సర్వమును నశింపచేయును.

మిత్రామిత్రావనీ హేమసాధనం రిపుమర్దనమ్‌ | దూరకార్యాశు కారిత్వం దండాత్తద్వ్యసనాద్ధరేత్‌. 23

సంస్తమ్భయతి మిత్రాణి హ్యమిత్రం నాశయత్యపి | ధనాద్యైరుపకారిత్వం మిత్రాత్తద్వ్యసనాద్ధరేత్‌. 24

రాజాసవ్యసనీ హన్యాద్రాజ కార్యాణి యానిచ | వాగ్దండయోశ్చ పారుష్యమర్థ దూషణమేవచ. 25

పానం స్త్రీ మృగయా ద్యూతవ్యసనాని మహీపతేః | ఆలస్యం స్తబ్ధతా దర్పః ప్రమాదో ద్వైధకారితా. 26

ఇతిపూర్వోపదిష్టంచ సచివ వ్యసనం స్మృతమ్‌ | అనావృష్టిశ్చ పీడాదీ రాష్ట్ర వ్యసన ముచ్యతే. 27

విశీర్ణ యంత్ర ప్రాకార పరిఖాత్వ మశస్త్రతా | క్షీణయా సేనయా నద్ధం దుర్గవ్యసన ముచ్యతే. 28

వ్యయీకృతః పరిక్షిప్తో7ప్రజితో7సంచితస్తథా | దూషితో దూరసంస్థశ్చ కోశవ్యసన ముచ్యతే. 29

ఉపరుద్ధం పరిక్షిప్తమమానితవిమానితమ్‌ | అభూతం వ్యాధితం శ్రాంతం దూరాయాతం నవాగతమ్‌. 30

పరిక్షీణం ప్రతిహతం ప్రహతాగ్రతరం తథా | ఆశానిర్వేద భూయిష్ఠమనృతప్రాప్త మేవచ. 31

కలత్ర గర్భం నిక్షిప్తమన్తః శల్యం తథైవచ | విచ్ఛిన్నవివిధాసారం శూన్యమూలం తథైవచ. 32

అస్వామ్య సంహతం వాపి భిన్నకూటం తథైవచ | దుష్పార్‌ష్ణ గ్రాహమర్థంచ బలవ్యసన ముచ్యతే. 33

మిత్ర-అమిత్ర-సువర్ణ-భూములను తనవశములో నుంచుకొనుట, శత్రువులను అణచివేయుట, ఇతరకార్యములను శీఘ్రముగ సాధించుట-ఇవన్నియు సేనాబలముచే సాధించదగినవి. దానికి కష్టము వచ్చినచో ఈ పనులన్నియుపాడగును. మిత్రుడు విజిగీషువుయొక్క మిత్రులు స్థిరముగా ఉండునట్లు చేయును. శత్రువులను నశింపచేయును. మిత్రుడు వ్యసనగ్రస్తుడైనచో ఈ కార్యములన్నియు చెడిపోవును. రాజువ్యసనియైనచో సమస్తకార్యములు చెడిపోవును. కఠినముగా మాటలాడి ఇతరుల మనస్సునొప్పించుట, కఠినముగా శిక్షించుట, అర్థదూషణము, మద్యపానము, స్త్రీలంపటత్వము, వేట, జూదము ఇవి రాజవ్యసనములు. సోమరితనము, మొండితనము, దర్పము, ఏమరుపాలు, అకారణవైరము, పైనచెప్పిన రాజవ్యసనములును, సచివునకు దుర్వ్యసనములు, అనావృష్టి, రోగాదిపీడలు రాష్ట్రవ్యసనములు. యంత్ర - ప్రాకార - పదిఖాదులు పాడగుట, అస్త్రశస్త్రముల కొరత, గడ్డి, కట్టెలు, అన్నము క్షీణించుట- ఇవి దుర్గవ్యసనములు. చెడ్డవ్యయము మండలమునందు అనేకస్థానములందు కొంచెము కొంచెము ఉండుట, రక్షకులు మొదలగువారు భక్షించివేయుట, ప్రోగుచేయకుండుట, చోరులచే అపహరింపబడుట, దూరప్రదేశమునందు ఉంచబడుట-- ఇవి కోశవ్యసనములు. నాలుగుమూలల నుండి ముట్టడించబడుట, సరియైన సంమానము లభింపకపోవుట, భరణపోషణములు సరిగా లేకుండుట, చాలమందిరోగగ్రస్తులు గాని అలసిపోయినవారుగాని, క్రొత్తగా వచ్చినవారుగాని ఉండుట, పూర్తిగా ఓడిపోవుట, ముందుకువెళ్లువేగము కుంఠితమగుట, చాలమంది నిరాశాపీడితులగుట, అయోగ్యప్రదేశములలోనుండుట, విశ్వాసహీనులగుట, స్త్రీలు, స్త్రీప్రియులు కలిసి ఉండుట, హృదయములో ఏవియోబాధలుండుట, దుష్టుడగు పార్‌ష్ణిగ్రాహుని సైన్యము వెన్నంటి వచ్చుట, ఇట్టిదురవస్థ బల (సేనా) వ్యసనము.

దైవోపపీడితం మిత్రం గ్రన్తం శత్రుబలేన చ | కామక్రోధాది సంయుక్త ముత్సాహా దరిభిర్భవేత్‌. 34

అర్థస్య దూషణం క్రోధాత్పారుష్యం బాక్యదండయోః |

కామజం మృగయా ద్యూతం వ్యసనం పానకం స్త్రియః. 35

వాక్పారుష్యం పరంలోకే ఉద్వేజన మనర్థకమ్‌ | అసిద్ధసాధనం దండస్తం యుక్త్యాపనయేన్నృపః. 36

ఉద్వేజయతి భూతాని దండపారుష్య వా న్నృపః | భూతాన్యుద్వేజ్యమానాని ద్విషతాం యాన్తి సంశ్రయమ్‌.

వివృద్ధాః శత్రవశ్చైవ వినాశాయ భవన్తితే | దూష్యస్య దూషణార్థం చ పరిత్యాగో మహీయనః. 38

అర్థస్య నీతితత్త్వజ్ఞైరర్ద దూషణ ముచ్యతే | పానాత్కార్యాదితో7జ్ఞానం మృగయాతో7రితఃక్షయాః. 39

జితశ్రమార్థం మృగయాం విచరేద్రక్షితేవనే | ధర్మార్థ ప్రాణనాశాది ద్యూతేస్యాత్కలహాదికమ్‌. 40

కాలాతిపాతో ధర్మార్థ పీడాస్త్రివ్యసనాద్భవేత్‌ | పానదోషాత్ర్పాణనాశః కార్యాకార్యావినిశ్చయః. 41

స్కంధా వారనివేశజ్ఞో నిమిత్తజ్ఞో రిపుంజయేత్‌ | స్కంధావారస్య మధ్యే తు సకోశం నృపతేర్గృహమ్‌. 42

మౌళీభూతం శ్రేణి సుహృద్థ్విషదాటవికంబలమ్‌ | రాజహర్మ్యం సమావృత్యం క్రమేణ వినివేశ##యేత్‌. 43

సైన్యైక దేశః సన్నద్ధః సేనాపతిపురస్సరః | పరిభ్రమేచ్చత్వరాంశ్చ మండలేన బహిర్నిశి. 44

వార్తాఃస్వకా విజానీయా ద్దూరసీమాన్త చారిణః | నిర్గచ్ఛేత్ర్ప విశేచ్చైవ సర్వ వివోప లక్షితః. 45

దైవపీడితుడును, శత్రుసేనాక్రాంతుడును, కామ-క్రోధాదియుక్తుడును అగు వ్యసనగ్రస్తుడైన మిత్రునకు, తగు ఉత్సాహము, సాహాయ్యము ఇచ్చినచో అతడు యుద్ధోద్యుతుడై, శత్రువులపై విజయముసాధించగలడు. అర్థదూషణము, వాక్పారుష్యము, కఠినదండము, ఈ మూడును క్రోధజవ్యసనము, వేట, జూదము, మద్యపానము, స్త్రీ సంగము - ఈ నాల్గును కామజవ్యసనములు. వాక్పారుష్యము ఇతరులకు ఉద్వేగము కలిగించి అనర్థహేతువగును. ధనహరణము, తాడనము, వధ అని మూడువిధములగు దండము సిద్ధించని కార్యమును సిద్ధింపజేయునుగాన, సత్పురుషులచే ''శాసన''మని చెప్పబడుచున్నది. దానిని యుక్తిపూర్వకముగా ప్రయోగించవలెను. యుక్తమగు దండమును విధించు రాజును ప్రశంసింతురు. క్రోధవశుడై కఠినశిక్ష ఇచ్చువానిపై ప్రజలలో ఉద్వేగము కలుగును. ఆ విధముగ ఉద్విగ్నులైన వారు శత్రువును శరణువేడుదురు. దానిచే వృద్ధిపొందిన శత్రువు రాజును నశింపచేయును. దూషణీయుడగు ఒక వ్యక్తికి అపకారము చేయుటకై అతనివలన లభింపవలసిన గొప్ప ప్రయోజనమునకు విఘాతము కలిగించుటకు ''అర్థదూషణము'' అని పేరు. వేటవలన, పరుగెత్తుచున్న వాహనమునుండి పడుట, ఆకలిదప్పులవలన శ్రమపడుట మొదలగు దోషములు కలుగును. దాగిఉన్న శత్రువెవ్వడైనను చంపివేయుటకు కూడ అవకాశ##మేర్పడును. అలసటను జయించుటకై రాజు ఏదైన సురక్షితమగు అరణ్యమునందే వేటాడవలెను. జూదముతో ధర్మార్థముల నాశము, ప్రాణములు పోవుట, మొదలగు దోషములు కలుగును. కలహము వచ్చును. స్త్రీవ్యసనము కలవారి పనులన్నియు చాలవిలంబమున జరుగును. ధర్మార్థములకు గూడ హాని కలుగును. మద్యపానవ్యసనమువలన ప్రాణపాయముకూడ కలుగవచ్చును. మత్తులోనున్నవాడు కర్తవ్యాకర్తములను తెలిసికొనజాలడు. సేనానివేశము ఎచట నెలకొల్పవలెనో తెలిసినవాడును, శుభాశుభశకునముల జ్ఞానము కలవాడును శత్రువుపై విజయము సాధించగలడు. సేనానివేశముమధ్యయందు రాజు కోశముతో ఉండవలెను. రాజభవనమునకు నలువైపులచుట్టి మౌల (పితృపితాదిమహాదిక్రమమున వచ్చుచున్న) సైన్యము, భృత (జీతమిచ్చి ఏర్పరచుకొన్న) సైన్యము, శ్రేణి (జానపదుల లేదా సాలెవారు మొదలగు శిల్పుల) సేన, మిత్రసేన, శత్రుసేన (రాజుకు లొంగిన శత్రువులసేన), ఆటవికులు-వీరి నివేశము లేర్పరుపవలెను. నాల్గవవంతు సేన యుద్ధసన్నద్ధులై, సేనాపతిని ఎదుటనుంచుకొని, నివేశమునకు బైట, రాత్రియంతయు తిరగవలెను. వాయుతుల్యవేగముగల అశ్వములనధిరోహించి అశ్వికులు సరిహద్దులవరకునువెళ్ళి, శత్రువుల పరిస్థితులను కనిపెట్టవలెను. రాజాజ్ఞానుసారమే ఎవ్వరైనను నివేశములోనికి వచ్చుట, బైటకువెళ్ళుట జరుగవలెను.

సామదానం చ భేదశ్చ దండోపేక్షేన్ద్ర జాలకమ్‌ | మాయోపాయాః సప్తపరే నిక్షిపేత్సాధనాయతాన్‌. 46

చతుర్విధం స్మృతం సామ ఉపకారానుకీర్తనమ్‌ | మిథఃసంబన్ధ కథనం మృదుపూర్వం చ భాషణమ్‌. 47

ఆయాతే దర్శనం వాచా తవా హమితి చార్పణమ్‌ | యఃసం ప్రాప్త ధనోత్సర్గ ఉత్తమాధమ మధ్యమః. 48

ప్రతిదానం తదా తస్య గృహీతస్యానుమోదనమ్‌ | ద్రవ్య దానమపూర్వం చ స్వయంగాహ ప్రవర్తనమ్‌.

దేయశ్చ ప్రతిమోక్షశ్చ దానం పంచవిధం స్మృతమ్‌ | స్నేహరాగాపనయనం సంహర్షోత్పాదనం తథా. 50

మిథో భేదశ్చ భేదజ్ఞైర్భేదశ్చ త్రివిధః స్మృతః | వధో7ర్థహరణం చైవ పరిక్లేశస్త్రిధా దమః. 51

ప్రకాశశ్చా ప్రకాశశ్చ లోక ద్విష్టాన్ప్ర కాశతః | ఉద్విజేత హతైర్లోకస్తేషు పిండః ప్రశస్యతే. 52

విశేషేణోపనిషద్యో గైర్హన్యాచ్ఛస్త్రాదినాద్విషః | జాతిమాత్రం ద్విజంనైవ హన్యాత్పామోత్తరం వశే. 53

సామ-దాన-దండ-భేద-ఉపేక్షా-ఇంద్రజాల-మాయలను ఏడు ఉపాయముల ప్రయోగముచే శత్రువు వశమగును. ఎదుటివాని ఉపకారమును వర్ణించుట, తమ పరస్పర సంబంధ బాంధవ్యాదులను ప్రకటించుట, గుణములు కీర్తించుచు మధురముగా మాటలాడుట, భవిష్యల్లాభమును ఉద్ఘాటించుట, నేను నీవాడను అని చెప్పుచు ఆత్మ సమర్పణము చేయుట అని సామము ఐదు విధములు. ఎవని వద్దనుండియైన లభించిన, అసారము, సారాసారము అగు పదార్థమును అతనికి ఆ విధముగనే తిరిగి ఇచ్చివేయుట దానములోని మొదటి భేదము తానివ్వకుండగనే ఎదుటివాడు ఏదైనధనమును తీసికొన్నచో దానిని అనుమోదించుట రెండవభేదము. అపూర్వద్రవ్యదానము మూడవే భేదము. ఒకనిని మరొకని నుండి ధనము తీసికొనుమని ప్రేరేపించుట (స్నయంగ్రాహప్రవర్తనము) నాల్గవ భేదము. ఇవ్వవలసిన ధనమును తీసికొనకుండుట ఐదవభేదము. స్నేహమును నశింపచేయుట, పరస్పరకలహముసృజించుట, బెదిరించుట-ఇవి భేదములోని మూడు విధములని భేతజ్ఞులు చెప్పుదురు. చంపుట, ధనములను అపహరించుట, బంధనతాడనాదులద్వారా పీడించుట అని దండ భేదములు మూడు. ప్రకాశవధ, అప్రకాశవధ అని వధ రెండు విధములు. అందరికిని ద్వేషపాత్రుడైన వానిని ప్రకాశముగ వధించవలెను. ఎవనిని చంపుటచే ప్రజలు ఉద్వేగము చెందుదురో, ఎవడు రాజప్రియుడో, అధిక బలశాలియో, ఎవడు రాజహితమునకు భంగము కలిగించునో వానిని రహస్యముగ చంపవలెను. విషప్రయోగము చేతగాని, అగ్నిప్రయోగము చేతగాని, రహస్యముగ ఇతరులచే అస్త్రప్రయోగము చేయించిగాని, స్ఫోటలను పుట్టించు పదార్థములను శరీరమునకు లేపము చేయించుటచేగాని రాజ్యశత్రువులను రహస్యముగ నశింపచేయవలెను. జాతిమాత్రముచే బ్రాహ్మణుడైనవానిని కూడ, ప్రాణదండమీయక, సామముచే వశము చేసికొన ప్రయత్నించవలెను.

ప్రలిమ్పన్నివ చేతాంసి దృష్ట్వా సాధుపిబన్నివ | గ్రసన్నివామృతం సామ ప్రయుంజీత ప్రియం వచః. 54

మిథ్యాభిశస్తః శ్రీకామ ఆహూయాత్ర్పతి మానితః | రాజద్వేషీ చాతికర ఆత్మ సంభావితస్తథా. 55

విచ్ఛిన్న ధర్మకామార్థః క్రుద్దో మానీ విమానితః | అకారణాత్పరిత్యక్తః కృతవైరో7పి సాంత్వితః. 56

హృతద్రవ్యకలత్రశ్చ పూజార్హో7ప్రతిపూజితః | ఏతాంస్తు భేదయేచ్ఛత్రౌస్థితాన్నిత్యాన్సుశంకితాన్‌. 57

ఆగతాన్పూజయేత్‌ కామైర్నిజాంశ్చప్రశమం నయేత్‌ | సామదృష్టానుసంధాన మత్యుగ్రభయదర్శనమ్‌. 58

ప్రధాన దానమానంచ భేదోపాయాః ప్రకీర్తితాః | మిత్రం హతం కాష్ఠమివఘుణ జగ్ధం విశీర్యతే. 59

త్రిశక్తిర్దేశకాలజ్ఞో దండేనాస్తంనయేదరీన్‌ | మైత్రీ ప్రదానం కల్యాణం బుద్ధిం సాంత్వేన సాధయేత్‌. 60

లుబ్ధం క్షీణం చదానేన మిత్రానన్యో7న్య శంకయా | దండస్య దర్శనాద్దృష్టాన్పుత్ర భ్రాత్రాది సామతః. 61

దానభేదైశ్చ మూముఖ్యాన్యో ధాంజన పదాదికాన్‌ | సామంతాట వికాన్భేద దండాభ్యా మపరాద్ధకాన్‌. 62

ప్రియముగా మాటలాడుట సామము. చిత్తమునందు అమృతసేకము చేసినట్లు సామప్రయోగము చేయవలెను. ఎదుటనున్న వానిని ప్రేమతో త్రాగివేయుచున్నట్లు చూచును. అమృతము వర్షించుచున్నట్లు మాటలాడవలెను. అసత్యమైన దోషారోపణకు గురియైనవారును, ధనలుబ్ధులును. పిలిచి అవమానింపబడినవారును, రాజద్వేషులును, ఎక్కువపన్ను వేయబడినవారును, విద్యాకులాదులచే అందరికంటే గొప్పవారమని భావించువారును, ఛిన్నభిన్నమైన ధర్మార్థకామములు కలవారును, కుపితులు, దురభిమానము కలవారును, అనాదపాత్రులును, అకారణముగ రాజ్యము నుండి బహిష్కరింపబడిన వారును, పూజాసత్కారయోగ్యులైనను అవి పొందనివారును, హరింపబడిన ధనము స్త్రీలు కలవారును, మనస్సులో వైరమున్నను సామనీతి ప్రయోగముచే పైకి శాంతముగ నుండువాడును, నిత్యశంకితులును- ఇట్టివారు శత్రుపక్షమునకు చెందినవారైనచో వారిలో వారికి వైరము కలిగించవలెను. తనపక్షము వారైనచో ప్రయత్నపూర్వకముగ వారిని శాంతులను చేయవలెను. ఇట్టివారు శత్రుపక్షమునుండి విడిపోయి తనపక్షమునకు వచ్చినచో వారిని సత్కరించవలెను. రెండు పక్షముల వారికిని సమానమగు లాభమును చూపుట, ఉగ్రభయమును చూపుట, అత్యధిక దానమానములు- ఇవి భేదోపాయాంతర్గతములు. భేదోపాయ ప్రయోగముచే శత్రుసేనలో వైషమ్యమును జనించినపుడు అది పురుగు తొలచిన కఱ్ఱవలె విరిగిపోవును. ప్రభు-మంత్రోత్సాహసంపన్నుడు, దేశకాలాభిజ్ఞుడును అగు రాజు దండముచే శత్రువులను అంతమొందించవలెను. మైత్రీగుణసంపన్నుడు, ఉత్తమ విచారశీలుడు, అగు వానిని సామప్రయోగముచే వశము చేసుకొనవలెను. ఆర్థికముగా క్షీణించిన లుబ్ధుని దానముచే వశము చేసుకొనవలెను. ఒకరినొకరు శంకించుకొను దుష్టులను దండముచే వశము నందుంచుకొనవలెను. పుత్ర - సోదరాదులను, బంధువులను, జానపదులను దానభేదములచే వశము చేసుకొనవలెను. సామంతులను, అటవికులను, ఇతరులను గూడ ఆవశ్యకతానుసారముగ భేదదండముల ప్రయోగించుచు వశము నందుంచుకొనవలెను.

దేవతాప్రతిమానాంతు పూజయాంతర్గతైర్నరైః | పుమాన్త్ర్సీవస్త్రసంవీతో నిశిచాద్భుతదర్శనః. 63

వేతాలోల్కాపిశాచానం శివానాంచ స్వరూపికీ | కామాతో రూపధారిత్వం శస్త్రాగ్న్యశ్మాంబువర్షనమ్‌. 64

తమో7నిలో7నలోమేఘ ఇతి మాయాహ్యమానుషీ | జఘాన కీచకం భీమ అస్థితః స్త్రీస్వరూపతామ్‌. 65

అన్యాయే వ్యసనే యుద్ధే ప్రవృత్తస్యానివారణమ్‌ | ఉపేక్షేయం స్మృతా భ్రాతోపేక్షితశ్చహిడిమ్బయా. 66

మేఘాన్ధకార వృష్ట్యగ్ని పర్వతాద్భుత దర్శనమ్‌ | దూరస్థానాం చ సైన్యానాం దర్శనం ధ్వజశాలినామ్‌. 67

ఛిన్నపాటిత భిన్నానాం సంసృతానాంచ దర్శనమ్‌ | ఇతీంద్రజాలం ద్విషతాం భీత్యర్థముపకల్పయేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సామాదికం నామైక చత్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః.

దేవతాప్రతిమలు చెక్కిన స్తంభముల పెద్దపెద్ద రంధ్రములందు దాగియున్నవారు, స్త్రీ వేషము ధరించినవారు, రాత్రియందు అద్భుతరూపములు ప్రదర్శించువారు, వేతాళులవలెను, ముఖము నుండి అగ్నిని కక్కుచున్న పిశాచములవలెను, దేవతలవలెను, రూపములు ధరించు వారును చేయునది ''మానుషమాయ'', ఇచ్ఛానుసారముగ రూపముధరించుట. శస్త్ర - అగ్ని - శిలా - జలములు వర్షించుట, అంధకారము, ఝంఝూమారుతము, పర్వతములు, మేఘములు సృజించుట ఇది అమానుషమాయ. గడచిన ద్వాపరమునందు పాండవవంశీయుడగు భీమసేనుడు స్త్రీ వేషము ధరించి శత్రువైన కీచకుని చంపెను. అన్యాయమునందును, వ్యసనములందును, అధిక బలవంతునితో యుద్ధమునందును ప్రవర్తించిన తన వారిని మరల్చకుండుట 'ఉపేక్ష'. భీమసేనునితో యుద్ధమున కుపక్రమించిన సోదరుడైన హిడింబుని హిడింబ నిషేధింప లేదు. స్వలాభమునకై ఉపేక్షించినది. మేఘములను, అంధకారమును, వర్షమును, అగ్నిని, పర్వతములను. ఇట్టి ఇతరాద్భుతములను, దూరముగా నిలచియున్న ధ్వజశాలులగు మహాసైన్యములను చూపుట, భిన్నములైన శత్రుసైనికుల అవయవములనుండి రక్తధారణ ప్రవహించుచున్నట్లు చూపుట- ఇదియంతయు 'ఇంద్రజాలము''. ఈ ఇంద్రజాలమును ప్రయోగించి శత్రువులను భయపెట్టవలెను.

అగ్ని మహాపురాణమునందు సామాద్యుపాయ కథనమను రెండువందల నలుబదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page