Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రిచత్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః

అథ పురుషలక్షణమ్‌

అగ్నిరువాచ :

రామాయోక్తా మయానీతిః స్త్రీణాం రాజన్నృణాం వదే | లక్షణం యత్సముద్రేణ గర్గాయోక్తం యథా పురా.

సముద్ర ఉవాచ :

పుంసాంచ లక్షణంవక్ష్యే స్త్రీణాంచైవ శుభాశుభమ్‌ | ఏకాధికో ద్విశుక్లశ్చ త్రిగంభీరస్తథైవ చ. 2

త్రిత్రికస్త్రి ప్రలంబశ్చ త్రిభిర్వ్యాప్నోతి యస్తథా | త్రివలీమాంస్త్రివినతస్త్రికాలజ్ఞశ్చ సువ్రత.

3

పురుషః స్యాత్సు లక్షణ్యో విపులశ్చ తథా త్రిషు | చతుర్లేఖస్తథా యశ్చ తథైవచ చతుః సమః. 4

చతుష్కిష్కుశ్చతుర్దంష్ట్రః శుక్ల కృష్ణ స్తథైవ చ | చతుర్గంధ శ్చతుర్హ్రస్వః సూక్ష్మదీర్ఘశ్చ పంచసు. 5

షడున్నతో7ష్ట వంశశ్చ సప్తస్నేహో నవామలః | దశపద్మో దశవ్యూహోస్యగ్రోధపరి మండలః. 6

చతుర్దశ సమద్వంద్వః షోడశాక్షశ్చ శస్యతే | ధర్మార్థ కామ సంయుక్తో ధర్మోహ్యే కాధికోమతః. 7

తారకాభ్యాం వినానేత్రే శుక్లదంతీ ద్విశుక్లకః | గంభీరస్త్రిశ్రవో నాభిః సత్త్వం చైకం త్రికం స్మృతమ్‌. 8

అనసూయా దయా క్షాన్తిర్మంగలాచారయుక్తతా | శౌచం స్పృహాత్వకార్పణ్యమనాయాసశ్చశూరతా. 9

త్రిత్రికస్త్రి ప్రలంబః స్యాద్వృషణ భుజయోర్నరః | దిగ్దేశజాతి వర్గాంశ్చ తేజసా యశసా శ్రియా. 10

వ్యాప్నోతి యస్త్రికవ్యాపీ త్రివలీమాన్నరస్త్వసౌ | ఉదరేవలయస్తి స్రోనరం త్రివినతం శృణు.

11

దేవతానాం ద్విజానాంచ గురూణాం ప్రణతస్తుయః | ధర్మార్థ కామ కాలజ్ఞ స్త్రికాలజ్ఞో7భి ధీయతే. 12

ఉరో లలాటం వక్త్రంచ త్రివిస్తీర్ణో విలేఖవాన్‌ | ద్వౌపాణీ ద్వౌతథా పాదౌ ధ్వజచ్ఛత్రాదిభిర్యుతౌ. 13

అంగుల్యో హృదయం పృష్ఠం కటిః శస్తం చతుఃసమమ్‌ | షణ్ణవత్యఙ్గులోత్సేదశ్చతుష్కిష్కుప్రమాణతః.

దంష్ట్రాశ్చతస్రశ్చంద్రాభాశ్చతుష్కృష్ణం వదామితే | నేత్రతారౌ భ్రువౌశ్మశ్రుః కృష్ణాః కేశాస్తథైవచ. 15

నాసాయాం వదనేస్వేదేకక్షయోర్విడ గంధకః | హ్రస్వం లింగం తథా గ్రీవా జంఘేస్యాద్వేదహ్రస్వకమ్‌.

సూక్ష్మాణ్యంగులిపర్వాణి నఖకేశద్విజత్వచః | హనూనేత్రే లలాటంచ నాసా దీర్ఘాస్త నాన్తరమ్‌. 17

వక్షః కక్షా నఖా నాసోన్నతం వక్రం కృకాటికా | స్నిగ్ధా స్త్వక్కేశదన్తాశ్చ లోమ దృష్టిర్నఖాశ్చవాక్‌. 18

జాన్వోరూ ర్వోశ్చ పృష్ఠస్థ వంశోద్వౌ కరనాసయోః |

నేత్రే నాసాపుటౌ కర్ణౌ మేఢ్రం పాయముఖే7మలమ్‌. 19

జిహ్వోష్ఠే తాలునేత్రేతు హస్తపాదౌ నఖాస్తథా | శిశ్నాగ్ర వక్త్రంశస్యన్తే పద్మాభా దశ దేహినామ్‌. 20

పాణిపాదం ముఖంగ్రీవా శ్రవణ హృదయం శిరః | లలాటముదరం పృష్ఠం బృహన్తః పూజితాదశ. 21

ప్రసారిత భుజస్యేహ మధ్యమాగ్రద్వయాన్తరమ్‌ | ఉచ్ఛ్రాయేణ సమం యస్యన్యగ్రోధపరి మండలః. 22

పాదౌగుల్ఫౌ స్ఫిచౌ పార్శ్వౌ వఙ్‌క్షణౌ వృషణౌ కుచౌ | కర్ణౌష్ఠే సక్థినీ జంఘే హస్తౌ బాహూ తథా7క్షిణీ.

చతుర్దశ సమద్వన్ద్వ ఏతత్సామాన్యతోనరః | విద్యాశ్చతుర్దశ ద్వ్యక్షైః పశ్యేద్యః షోడశాక్షకః. 24

రూక్షం శిరాతతం గాత్రమశుభం మాంసవర్జితమ్‌ | దుర్గంధి విపరీతం యచ్ఛస్తం దృష్ట్యా ప్రసన్నయా. 25

ధన్యస్య మధురా వాణీ గతిర్మత్తేభ సన్నిభా | ఏకకూప భవం రోమభ##యే రక్షానకృత్సకృత్‌. 26

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పురుష లక్షణం నామ త్రిచత్వారింశ దధిక శతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను : వశిష్ఠా! శ్రీరాముడు చెప్పిన రాజనీతిని చెప్పితిని. ఇపుడు స్త్రీపురుష లక్షణములను చెప్పెదను. దీనిని పూర్వము సముద్రుడు గర్గమునికి చెప్పెను సముద్రుడు చెప్పెను : ఉత్తమవ్రతాచరణ శీలుడవగు గర్గా! స్త్రీపురుషలక్షణములను, వాటి శుభాశుభఫలములను చెప్పెదను. ఏకాధికుడు, ద్విశుక్లుడు, త్రిగంభీరుడు, త్రిత్రికుడు, త్రిప్రలంబుడు, త్రికవ్యాపి, త్రివళీయుక్తుడు, త్రికాలజ్ఞుడు, త్రివిపులుడు అగు పురుషుడు శుభలక్షణసంపన్నుడు. ఇట్లే చతుర్లేఖుడు, చతుఃసముడు, చతుష్కిష్కుడు, చతుర్దంష్ట్రుడు, చతుఃకృష్ణుడు, చతుర్గంధుడు, చతుర్హ్రస్వుడు, పంచసూక్ష్ముడు, పంచదీర్ఘుడు, షడున్నతుడు, అష్టవంశుడు, సప్తస్నేహుడు, నవామలుడు, దిశపద్ముడు, దశవ్యూహుడు, న్యగ్రోధపరిమండలుడు, చతుర్దశసమద్వంద్వుడు షోడశాక్షుడు అగు పురుషుడు ప్రశస్తుడు. ధర్మ - అర్థ - కామము తో కూడిన ధర్మము ''ఏకాధికము''. నల్ల గ్రుడ్లు తప్ప మిగిలిన నేత్రములు, దంతములు తెల్లగా ఉన్నవాడు ''ద్విశుక్లుడు''. స్వర - నాభి - సత్త్వములు, గంభీరములుగా ఉన్న వాడు త్రిగంభీరుడు. నిర్మాత్సర్యము, దయ, క్షమ, సదాచరణము, శౌచము, అస్పృహ, ఔదార్యము అనాయాసము శూరత్వము అను (తొమ్మిది) గుణములుకలవాడు ''త్రిత్రికుడు''. వ్రేలాడు వృషణములు, భుజద్వయము కలవాడు త్రిప్రలంబుడు. తేజో - యశః -కాంతులచే దేశజాతి - దశదిశలను వ్యాపించువాడు ''త్రికవ్యాపి''. ఉదరమునందు మూడు ముడతలు ఉన్నవాడు ''త్రివళిమంతుడు'' దేవతా - బ్రాహ్మణ - గురుజనుల విషయమున వినతుడు ''త్రివినతుడు'', ధర్మ-అర్థ - కామముల సమయము నెరిగినవాడు త్రికాలజ్ఞుడు. వక్షః స్థల-లలాట-ముఖములు విపులముగా నున్నవాడు ''త్రివిపులుడు'', హస్తద్వయ పాదద్వయములు ధ్వజచ్ఛత్రాది లేఖా చిహ్నితములై ఉన్న వాడు ''చతుర్లేఖుడు''. వ్రేళ్ళు, హృదయము, కటి, పృష్ఠము - ఈనాలుగు సమములుగా ఉన్నవాడు ''చతుస్సముడు. తొంబదియారు అంగుళముల ఎత్తుగలవాడు ''చతుష్కిష్కువు'' చంద్రునివలె ప్రకాశించు నాలుగు కోరల గలవాడు చతుర్దంష్ట్రుడు. నేత్రతారలు, కనుబొమ్మలు మీసము, కేశములు నల్లగా ఉండువాడు ''చతుష్కృష్ణుడు''. నాసిక, ముఖము, రెండు చంకలు -వీటియందు మంచి గంధమున్నవాడు చతుర్గంధుడు, లింగము, కంఠము, రెండు పిక్కలు హ్రస్వముగానున్నవాడు చతుర్హ్రస్వుడు వ్రేళ్ళకణుపులు, గోళ్ళు, కేశములు, దంతములు, చర్మము - ఇవి సూక్ష్మముగానున్నవాడు ''పంచసూక్ష్ముడు'. చెక్కిలి. నేత్రములు, లలాటము, నాసిక, వక్షఃస్థలము విశాలముగా నున్న వాడు ''పంచదీర్ఘుడు'' . వక్షఃస్థలము, చంకలు, గోళ్ళు, ముక్కు, ముఖము, మెడ వెనుకభాగము ఉన్నతముగా నున్న వాడు ''షడున్నతుడు'', చర్మము, కేశములు, దంతములు, రోమములు, చూపు, నఖములు, మాట -ఇవిస్నిగ్ధముగా నున్నవారు ''సప్తస్నేహుడు''. రెండు మోకాళ్ళు, రెండుతొéడలు, పృష్ఠభాగము, హస్తద్వయము, నాసిక అనునవి చక్కగా నున్నవాడు ''అష్టవంశుడు''. నేత్రద్వయము, నాసికాద్వయము కర్ణద్వయము, శిశ్నము, గుదము, ముఖము ఈ తొమ్మిది నిర్మలముగానున్నవాడు ''నవామలుడు''. పద్మసమాన కాంతిగల జిహ్వ - ఓష్ఠ - తాలు - నేత్ర - హస్త -పాద - నఖ - శిశ్నాగ్ర - ముఖములు కలవాడు ''దశపద్ముడు'', హస్త-పాద-ముఖ-కంఠ-కర్ణ - హృదయ-శిరోలలాట - ఉదర - పృష్ఠములు పెద్దవిగా ఉన్నవాడు ''దశవ్యూహుడు''. ఇతడు లోకసంమానితుడగును. రెండుచేతులు చాపగా ఒకచేతి మధ్యమాంగుళినుండి రెండవ చేతిమధ్య మాంగుళి వరకు ఎంతపొడవుండునో అంత ఎత్తు ఉన్నవాడు ''న్యగ్రోధపరిమండలుడు''. చరణములు, గుఱ్ఱములు, నితంబములు, పార్శ్వములు, వంక్షణములు, వృషణములు, స్తనములు, కర్ణములు, ఓష్ఠములు, ఓష్ఠాంతములు, పిక్కలు, హస్తములు. బాహువులు, నేత్రములు అను యుగ్మాంగములు సమముగా నుండువాడు ''చతుర్దశ సమద్వంద్వుడు''. రెండు నేత్రములతో పాటు పదునాలుగు విద్యలు కూడ ఉన్నవాడు ''షోడశాక్షుడు'', దుర్గంధ యుక్తము, మాంసహీనము, ఎండిపోయి నాడులు కనబడుచున్నది అయిన శరీరము అశుభము. ఇందుకు భిన్నమైన గుణములు కలది వికసించిన నేత్రములు కలదియగు శరీరము ప్రశస్తము ఉత్తమ పురుషునిమాటమధురముగా నుండును. నడక మత్తగజగమన సమానమై యుండును. ఒక్కొక్క రోమ కూపమునుండి ఒక్కొక్క రోమ కూపమునుండి ఒక్కొక్క రోమమే వచ్చును. ఇట్టి పురుషుడు సర్వదా సకల భయములనుండి రక్ష పొందును.

అగ్ని మహాపురాణమునందు పురుషలక్షణవర్ణనమను రెండువందల నలుబదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page