Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుశ్చత్వారింశ దధిక ద్విశతతమో7ధ్యాయః

అథ స్త్రీ లక్షణమ్‌

సముద్ర ఉవాచ :

శస్తాస్త్రీ చారుసర్వాఙ్గీ మత్తమాతంగ గామినీ | గురూరుజఘనాయాచ మత్తపారావతేక్షణా. 1

సునీలకేశీ తన్వఙ్గీ విలోమాఙ్గీ మనోహరా | సమభూమి స్పృశౌ పాదౌ సంహతౌచ తథాస్తనౌ. 2

నాభిః ప్రదక్షిణావర్తాగుహ్యమశ్వత్థపత్రవత్‌ | గుల్ఫౌనిగూఢౌ మధ్యేన నాభిరంగుష్ఠమానికాః. 3

జఠరం న ప్రలంబం చ రోమరూక్షా నశోభనా | నర్ష వృక్షనదీనామ్నీ న సదాకలహప్రియా. 4

నలోలుపానదుర్భాషా శుభా దేవాది పూజితా | గండైర్మధూక పుష్పాభైర్నశిరాలా నశోభనా. 5

నసంహత భ్రకుటిలా పతిప్రాణాపతిప్రియా | అలక్షణాపి లక్షణ్యా యత్రాకారస్తతో గుణాః. 6

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్త్రీలక్షణం నామ చతుశ్చత్వారింశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

సముద్రుడు చెప్పెను : గర్గాచార్యా! ఉత్తమశ్రేణికి చెందిని శరీరముగల స్త్రీయొక్క సర్వాంగములును మనోహరముగా నుండున. ఆమె మత్తగజమువలె మందముగా నడుచును. ఊరు - జఘనదేశములు విశాలములుగా నుండును. నేత్రములు ఉన్మత్తపారావతము నేత్రములవలె మదభరితములై కేశములు నీలవర్ణములై యుండును. శరీరము పల్చగాను, రోమరహితముగానుఉండును. చూడగనే ఆమె మనస్సును మోహింపచేయును. పాదములు పూర్తిగానేలపై ఆనును. స్తనములు ఒకదానితో ఒకటి కలిసి ఉండును. నాభిదక్షిణా వర్తమై ఉండును. యోని రావి ఆకు ఆకారములో నుండును. మణమలు అణగి యుండును. నాభి అంగుష్ఠ ప్రమాణముగ నుండును. పొట్ట వ్రేలాడదు. రోమావళిచే రూక్షముగా నున్న స్త్రీ మంచిది కాదు. నక్షత్ర-వృక్ష-నదీనామములు కలది, కలహప్రియ, అగు స్త్రీ మంచిదికాదు. చాపల్యము లేనిది-కటువచనములు పలుకనిది యుగు స్త్రీ దేవతాదుల చేతగూడ పూజింపబడిన శుభలక్షణములు కలది. మధుక పుష్పములవలె తెల్లని కపోలములు గల స్త్రీ శుభరాలు. రోమావళితో నిండిన అవయవములు, నాడులు కనబడుచున్న శరీరము కల స్త్రీ ఉత్తమురాలు కాదు. వంకరగానుండి ఒకదానితో ఒకటి కలిసి పోయిన కనుబొమ్మలు కలది కూడ మండచిది కాదు. తన ప్రాణములను పతిపై ఉంచిన, పతికి ప్రియురాలును అగు స్త్రీ లక్షణరహితమైనను శుభలక్షణ సంపన్నగా చెప్ప బడినది. సుందరమైన ఆకారమెచటనుండునో అచట శుభగుణములు కూడ ఉండును. పాదము కనిష్ఠిక (చిన్నవ్రేలు) భూమికి తగలని స్త్రీ మృత్యుస్వరూపురాలే.

ఆగ్నేయమహాపురాణమునందు స్త్రీలక్షణవర్ణనమను రెండువందల నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page