Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్‌ చత్వారింశ దధిక ద్విశతతమోధ్యాయః.

అథ రత్న పరీక్షా

అగ్నిరువాచ :

రత్నానాం లక్షణం వక్ష్యే రత్నం ధార్యమిదం నృపైః |

వజ్రం మరకతం రత్నం పద్మరాగంచ మౌక్తికమ్‌.1

ఇంద్రనీలం మహానీలం వైదూర్యం గంధశస్యకమ్‌ | చంద్రాకాన్తం సూర్యకాంతం స్ఫటికం పులకం తథా. 2

కర్కేతనం పుష్యరాగం తథా జ్యోతీరసం ద్విజ | స్ఫటికం రాజపట్టంచ తథా రాజమయం శుభమ్‌. 3

సౌగంధికం తథా గఞ్జం శంఖ బ్రహ్మమయం తథా | గోమేదం రుధిరాక్షంచ తథా భల్లాతకం ద్విజ. 4

ధూలీం మరకతం చైవ తుత్థకం సీసమేవచ | పీలుం ప్రవాలకం చైవ గిరివజ్రం ద్విజోత్తమ. 5

భుజంగమమణిం చైవ తథా వజ్రమణిం శుభమ్‌ | టిట్టిభంచ తథా పిండం భ్రామరంచ తథోత్పలమ్‌. 6

సువర్ణ ప్రతిబద్ధాని రత్నాని శ్రీజయాదికే | అంతః ప్రభత్వం వైమ(పు)ల్యం సుసంస్థానత్వ మేవచ. 7

సుధార్యానైవ ధార్యాస్తు నిష్ప్రభా మలినాస్తథా | ఖండాఃసశర్కరాయేచ ప్రశస్తం వజ్రధారణమ్‌.8

అమ్భస్తరతి యద్వజ్ర మభేద్యం విలంచయత్‌ | షట్‌కోణం శక్ర చాపాభం లఘుచార్కనిభం శుభమ్‌.

శుకపక్షనిభః స్నిగ్దః కాంతిమాన్విమల స్తథా | స్వర్ణచూర్ణనిభైః సూక్ష్మైర్మరకతశ్చబిందుభిః. 10

స్ఫటికః పద్మరాగాః సూర్యరాగవన్తో7తి నిర్మలాః | జాతవంగా భవన్తీహ కురువింద సముద్భవాః. 11

సౌగంధిక కోత్థాః కాషాయా ముక్తఫలాస్తు శుక్తిజాః | విమలాస్తేభ్య ఉత్కృష్టాయేచ శంఖోద్భవామునే. 12

నాగదంత భవాశ్చగ్ర్యాః కుంభసూకర మత్స్యజాః | వేణునాగభవాః శ్రేష్ఠా మౌక్తికం మేఘజం వరమ్‌.

వృత్తత్వం శుక్లతా స్వాచ్ఛ్యం మహత్త్వం మౌక్తికేగుణాః |

ఇంద్రనీలం శుభంక్షీరే (రాజతే) భ్రాజతే7ధికమ్‌.14

రంజయేత్స్వ ప్రభావేణ తమమూల్యం వినిర్దిశేత్‌ | నీలరక్తంతు వైదూర్యం శ్రేష్ఠం హారాదికం భ##జేతే. 15

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రత్న పరీక్షానామ షట్‌ చత్వారింశ దధిక ద్విశతతమో 7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను : ద్విజశ్రేష్ఠా! ఇపుడు రత్నముల లక్షణములు చెప్పెదను. రాజు-వజ్ర-మరకత-పద్మరాగ-ముక్తా-మహానీల-ఇంద్రనీల- వైదూర్య-గంధసస్య- చంద్రకాంత- సూర్యకాంత-స్ఫటిక-పులక-కర్కేతన-పుష్పరాగ-జ్యోతీరస-రాజపట్ట-రాజమయ-శుభసౌగంధిక-గంజ-శంఖ-బ్రహ్మమయ-గోమేద-రుధిరాక్ష-భల్లాతక-ధూలీ-మరకత-తుష్యక-సీస-పీలు-ప్రవాళ-గిరివజ్ర-భుజంగమణి-వజ్రమణి-టిట్టిభ- భ్రామర-ఉత్పలములను రత్నములను ధరించవలెను. మధ్యకాంతిగలవి, నిర్మలములు, మంచి ఆకారములుగలవి అగు రత్నములను మాత్రమే ధరించవలెను. ప్రభావిహీనములు, మలినములు, ఖండితములు, బీటలు తీసినవి అగు వాటిని ధరింపరాదు. అన్ని రత్నములందును హీరమును ధరించుట ఉత్తమము నీటిలో తేలునది, అభేద్యము, షట్కోణము, ఇంద్రధనస్సువలె నిర్మల ప్రభాయుక్తము, తేలికయైనది, సూర్యసమానతేజము, లేదా చిలక రెక్కల రంగు గలదియగు వజ్రము శుభకరము. సువర్ణచూర్ణసమానమైన సూక్ష్మబిందువులు గల మరకతమణి శ్రేష్ఠము. స్ఫటికము అత్యంత నిర్మలముగనున్నచో శ్రేష్ఠము. అరుణమగు పద్మరాగము శ్రేష్ఠము. ముత్యములు ముత్యపు చిప్పలలో పుట్టును. వాటికంటె శంఖమునుండి పుట్టినవి నిర్మలములు, ఉత్కృష్టములు అని చెప్పబడినవి. ఋషిప్రవరా! గజదంతములనుండియు, గజకుంభములనుండియు, సూకర-మత్స్య-వేణునాగములనుండియు, మేఘమునుంచియు ఉత్పన్నములైనవి అత్యంత శ్రేష్ఠములు. ముత్యములలో వృత్తత్వము, తెలుపు, స్వచ్ఛత్వము, మహత్త్వము అను గుణములుండును. ఉత్తమమైన ఇంద్రనీలమణిని పాలలో ఉంచగా అది చాల ప్రకాశవంతముగా నుండును. తమ కాంతిచే అంతను రంజింపజేయు రత్నములు అమూల్యములు. నీల - రక్తకాంతిగల వైదూర్యము శ్రేష్ఠము. ఇట్టి దానిని హారములో కూర్చుకొనవచ్చును.

అగ్ని మహాపురాణమునందు రత్నపరీక్షా కథనమను రెండువందల నలుబది ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page