Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్త చత్వారింశ దధిక ద్విశతతమో ధ్యాయః

అథ వాస్తులక్షణమ్‌

అగ్ని రువాచ :

వాస్తులక్ష్మ ప్రవక్ష్యామి విప్రాదీనాం చ భూరిహ | శ్వేతా రక్తా తథా పీతా కృష్ణా చైవ యథాక్రమమ్‌.1

ఘృత రక్తాన్న మద్యానాం గందాడ్యా వసతశ్చ భూః | మధురాచ కషాయాచ అవ్లూ

ద్యుపరసాక్రమాత్‌.2

కుశైః శ##రైస్తథా కాశైర్దూగ్వాభిర్యాచ సంశ్రితా|

ప్రార్చ్య విప్రాంశ్చ నిఃశల్యాం ఖాతపూర్వంతు కల్పయేత్‌.3

చతుష్షష్టిపదం కృత్వామధ్యే బ్రహ్మా చతుష్పదః | ప్రాక్తేషాం వై గృహస్వామీ కథితస్తు

తథార్యమా.4

దక్షిణన వివస్వాంశ్చ మిత్రః పశ్చిమతస్తథా | ఉదజ్‌ మహీధరశ్చైవ అపవత్సౌచ వహ్నిగే.5

సావిత్రశ్చైవ సవితా జయేన్ద్రౌ నైరృతే7ంబుధౌ| రుద్రవ్యాధీచ వాయవ్యే పూర్వాదౌ కోణగాద్బహిః. 6

మహేన్ద్రశ్చ రవిః సత్యో భృశఃపూర్వే7థ దక్షిణ | గృహోక్షతో7ర్యమధృతీ గంధర్వాశ్చాథ వారుణ.7

పుష్పదంతో7సురాశ్చైవ వరుణో యక్ష్మ ఏవచ | సౌమ్యే భల్లాట సోమౌ చాప్యదితిర్దనదస్తథా.8

నాగః కరగృహశ్చైశ్యాం హ్యష్టౌ దిశిదిశిస్మృతాః | అద్యన్తౌతు తయోర్దేవౌ ప్రోక్తావత్ర గుహేశ్వరౌ.9

పర్జన్యః ప్రథమో దేవో ద్వితీయశ్చ కరగ్రహః | మహేంద్ర రవిసత్యాశ్చ భృశో7థ గగనం తథా.10

పవనః పూర్వతశ్చైవ అంతరిక్ష ధనేశ్వరౌ | అగ్నేయే చాథ నైరృత్యే మృగసుగ్రీవకౌ సురౌ.11

రోగో ముఖ్యశ్చ వాయవ్యే దక్షిణ పుష్ప విత్తదౌ | గృహక్షతో యమభృశో గంధర్వో నాగవైతృకః.12

ఆప్యే దౌవారిక సుగ్రీవౌ పుష్పదన్తో7సురో జలమ్‌ | యక్ష్మా రోగశ్చ శోషశ్చ హ్యుత్తరే నాగరాజకః.13

ముఖ్యో భల్లాట శశినౌ హ్యదితిశ్చ కుబేరకః | నాగో హుతాశః శ్రేష్ఠో వై శక్రసూర్యౌచ వూర్వతః.14

దక్షే గృహక్షతః పుష్ప ఆప్యే సుగ్రీవ ఉత్తమః | పుష్పదంతో హ్యుదగ్ద్వారి భల్లాటః పుష్పదంతకః. 15

అగ్నిదేవుడు పలికెను : ఇపుడు వాస్తులక్షణములు చెప్పెదను. వాస్తుశాస్త్రము ప్రకారము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులకు, వరుసగా శ్వేత-రక్త - పీత - కృష్ణ వర్ణములుగల భూమి నివాసయోగ్యము, ఘృతగంధముగల భూమి విప్రులకును, రక్తగంధముకలది క్షత్రియులకును అన్నగంధముగలది వైశ్యులకును, మధ్యగంధముగలది శూద్రులకును నివాసయోగ్యము. ఇట్లే బ్రాహ్మణాదులకు వరుసగా మధుర- కషాయ- అవ్లూదిరసములు గల భూమి మంచిది. నాలుగువర్ణముల వారికిని వరుసగా కుశ- సర్పట- కాశ- దూర్వాయుక్తమగు భూమిమంచిది. ముందుగా బ్రాహ్మణ పూజ చేసి శల్యరహితమగు భూమిపై కుండమేర్పరుపవలెను. పిదప ఆరువది పదములు గల వాస్తు మండపము నిర్మించి వాని మధ్యనున్న నాలుగు పదములపై బ్రహ్మను స్థాపించవలెను. ఈ నాలుగు పదములుకు తూర్పున నున్న గృహస్వామి అర్యమ. దక్షిణమున వివస్వంతుని, పశ్చిమమున మిత్రుని, ఉత్తరమున మహీధరుని చిహ్నితము చేయవలెను. ఈశాన్యమున ఆప-ఆపవత్సులను, ఆగ్నేయమున సావిత్ర-సవితలను, పశ్చిమమునకు దగ్గరగా ఉన్న నైరృతియందు జయ - ఇంద్రులను, వాయవ్యమున రుద్రవ్యాధులను వ్రాయవలెను. పూర్వది దిశలందు, విదిక్కు లందున్న దేవతలు కాక, ఈ క్రింది దేవతలను వ్రాయవలెను. - పూర్వమున మహేంద్ర - రవి - సత్య- భృశాదులను, దక్షిణమున గృహక్షత- యమ- భృంగ - గంధర్వాదులను పశ్చిమమున పుష్పదంత -అసుర - వరుణ-పాపయక్ష్మాదులను, ఉత్తరమున భల్లాట- సోమ- అదితి - ధనదులను, ఈశాన్యమున నాగ - కరగ్రహములను చిత్రించవలెను. ఒక్కొక్క దిక్కునకు ఎనమండుగురు దేవతలుందురు. వారిలో ప్రథమ- అష్టమదేవతలు వాస్తు మండల గృహస్వాములు. పూర్వదిక్కునకు ప్రథమదేవత పర్జన్యుడు, రెండవవాడు కరగ్రహుడు, మహేంద్ర - రవి- సత్య -భృశాదులను-గగన-పవనులు ఇతరదేవతలు. కొందరు ఆగ్నేయమునందు గగన-పవనులకు బదులు అంతరిక్ష - అగ్నులను చెప్పుదురు. నైరృతియందు మృగ-సుగ్రీవులను, వాయువ్యమున రోగ - ముఖ్యులను, దక్షిణమున పూషణ్‌-వితథ-గృహక్షత-యమ-భృంగ-గంధర్వ-మృగ - పితరులను స్థాపించవలెను. వాస్తుమండలము పశ్చిమమున దౌవారిక-సుగ్రీవ-పుష్పదంత-అసుర-వరుణ-పాపాయక్ష్మన్‌-శేషులు ఉందురు. ఉత్తరమున నాగరాజు- ముఖ్య-భల్లాట-సోమ-అదితి-కుబేర-నాగ- అగ్నులు ఉందురు. తూర్పున సూర్య-ఇంద్రులు శ్రేష్ఠులు. దక్షిణమున గృహక్షత -పుష్పమయులుత్తములు.పశ్చిమమున సుగ్రీవుడు ఉత్తముడు. ఉత్తరద్వారమున పుష్పదంతుడు కళ్యాణ ప్రదుడు. భల్లాటకునే పుష్పదంతుడందురు.

శిలేష్టకాది విన్యాసం మంత్రైః ప్రార్చ్య సురాంశ్చరేత్‌ | నన్దేనందయ వాసిష్ఠే వసుభిః ప్రజయాసహ.16

జయే భార్గవ దాయాదే ప్రజానాం జయమావహ | పూర్ణే7ంగిరస దాయాదే పూర్ణకామం కురష్వమామ్‌.17

భ##ద్రే కాశ్యప దాయాదే కురు భద్రాం మతిం మమ | సర్వబీజ సమాయుక్తే సర్వరత్నౌష ధైర్యృతే. 18

రుచిరేనన్దనే నన్దే వాసిష్ఠే రమ్యతామిహ | ప్రజాపతిసుతే దేవి చతురస్రే మహీమయే. 19

సుభ##గే సువత్రే భ##ద్రే గృహే కాశ్యాపి రమ్యతామ్‌ | పూజితే పరమా చార్యైర్గంధమాల్యైరలంకృతే.20

భవభూతికరే దేవి గృహే భార్గవి రమ్యతామ్‌ | అవ్యంగే చాక్షతే పూర్ణేమునే రంగిరసఃసుతే.21

ఇష్టకేత్వం ప్రయచ్ఛేష్టం ప్రతిష్ఠాంకారయామ్యహమ్‌ | దేశస్వామి పురస్వామి గృహస్వామి పరిగ్రహే.22

మనుష్యధన హస్త్వశ్వపశు వృద్ధి కరీభవ|

ఈ వాస్తు దేవతలందరిని మంత్రములతో పూజించి పునాదిరాయి వేయవలెను. పిదప ఈ క్రింది మంత్రములతో నందాది దేవులను పూజించవలెను. ''వసిష్ఠనందినియైన ఓ నందా ! నన్ను ధన-పుత్ర-పౌత్రాదిమంతుని చేసి ఆనందింపచేయును. భార్గవపుత్రియైన జయా! నీ సంతానమైన మాకు విజయము నిమ్ము. అంగీరస తనయమైన ఓ పూర్ణా| నీకోరికలను పూర్ణము చేయుము. కశ్యపాత్మజయైన ఓ భద్రా! నాకు మంగళప్రదమగు బుద్ధినిమ్ము. వశిష్ఠపుత్రియైన నందా! వివిధ బీజయుక్తము, సకలరత్న సంపన్నము అగు ఈ మనోహరనందనవనమున విహరింపుము. ప్రజాపతిపుత్రీ! భద్రా! నీవు ఉత్తమమైన లక్షణములు, శ్రీకృష్ణవ్రతము కలదానవు. ఓ కశ్యపనందినీ! నీవీ భూరూపమగు చతుష్కోణము నందు నివసింపుము. బార్గవతనయా! దేవీ! నీవు సకల ప్రపంచమునకును ఐశ్వర్యమిచ్చు దానవు. శ్రేష్ఠులైన ఆచార్యులచే పూజితురాలవై, గంధమాల్యాంలంకృతురాలవై నా గృహమునందు నివసింపుము. అంగిరఃపుత్రియైన ఓ పూర్ణా!నీవు కూడ సర్వాం సంపన్నురాలవై, క్షతిరహితవై నా యింట విహరింపుము. ఓ ఇష్టకా! నేను గృహప్రతిష్ఠ చేయుచున్నాను. నాకు అభిలషిత భోగముల నిమ్ము. దేశస్వామి-నగరస్వామి-గృహస్వాములకు మనుష్య-ధన-గజ-అశ్వపశ్వాదులను వృద్ధి పొందింపుము''.

గృహప్రవేశే 7పి తథా శిలాన్యాసం సమాచరేత్‌.23

ఉత్తరేణ శుభః ప్లక్షో వటః ప్రాక్స్యాద్గృహాదితః | ఉదుమ్భరశ్చ యామ్యేన పశ్చిమే7శ్వత్థ ఉత్తమః. 24

వామభాగే తథోద్యానం కుర్యాద్యాసం గృహే శుభమ్‌ | సాయంప్రాతస్తు ఘర్మాప్తౌ శీతాకాలే దినాంతరే. 25

వర్షారాత్రే భువః శోషే సేక్తవ్యా రోఫిత ద్రుమాః | విడంగఘృత సంయుక్తాన్సేచ యేచ్ఛీతవారిణా. 26

ఫలనాశేకుత్థైశ్చ మాషైర్ముద్గైస్తిలైర్యవైః | ఘృతశీతపయః సేకః ఫల పుష్పాయ సర్వదా. 27

మత్స్యామ్బసా తుసేకేన వృద్దిర్భవతి శాఖినః | అవికాజశకృచ్చూర్ణం యవచూర్ణం తిలానిచ. 28

గోమాంస ముదకం చేతి సప్తరాత్రం నిధాపయేత్‌ | ఉత్సేకం సర్వవృక్షాణాం ఫలపుష్పా ది వృద్ధిదమ్‌.29

మత్స్యోదకేన శీతేన హ్యామ్రాణాం సేక ఇష్యతే | ప్రశస్తం చాప్యశోకానాం కామినీ పాదతాడనమ్‌. 30

ఖర్జూర నారికేలాదెర్లవణాద్భర్వివర్ధనమ్‌ | విడంగ మత్స్యమాంసాద్భిః సర్వేషాం దోహదం శుభమ్‌.31

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వాస్త్వాది లక్షణం నామ సప్త చత్వారింశ దధిక ద్విశతతమో 7ధ్యాయః.

గృహప్రవేశ సమయుమనందుగూడ ఈ విధముగనే శిలాన్యాసము చేయవలెను. ఇంటికి ఉత్తరమున రావిచెట్టు, దక్షిణమున ఉదుంబరము, పశ్చిమమున మఱ్ఱిచెట్టు మంచిది. ఇంటికి ఎడమప్రక్కన ఉద్యానము నిర్మింపవలెను. ఇట్టి ఇంటిలో నివాసము శుభకరము. పాతిన చెట్లకు, గ్రీష్మమునందు ప్రాతః సాయంకాలములందును, శీతాకాలమున మధ్యాహ్నమునందును, వర్షాకాలమున నేల ఎండిపోయినపుడును నీళ్ళు పోయవలెను. చెట్లకు వాయువిడంగము, నెయ్యి కలిపిన చల్లని నీళ్ళు పోయవలెను. కాయుట మానివేసిన చెట్లకు ఉలవలు, మినుములు, పెసలు, తిలలు, యవలు కలిపిన నీళ్లు పోయవలెను. ఘృతముకలిపిన శీతలజలము పోసినచో వృక్షము సర్వదా పుష్పఫలముతో నిండియుండును. మత్య్సములు కలిపిన నీళ్ళపోసిన చెట్లు బాగుగా పెరుగును. మేకల గొర్రెల లద్దెల చూర్ణము, యవలపిండి, తిలలు, ఇతరమైన గోమయము మొదలగు ఎరువులు, నీరు వీటినన్నింటిని కలిపి ఐదురోజులు కప్పి ఉంచవలెను. ఇది పోసినచో అన్ని వృక్షములు వికసించుటకు కామినీ పాదప్రహారము మంచిది. ఖర్జూరము, కొబ్బరి మొదలగునవి ఉప్పుకలిపిన నీటిలో బాగుగా పెరుగును. వాయువిడంగము కలిపిన నీళ్లుఅన్ని చెట్లకును మంచి దోహదము.

అగ్ని మహాపురాణమునందు వాస్తులక్షణకథనమును రెండువందల నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page