Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ అష్ట చత్వారింశ దధిక ద్విశతతమో೭ధ్యాయః
అథ పుష్పాదిపూజాఫలమ్
అగ్నిరువాచ :
పుషై#్పస్తు పూజనాద్విష్ణుః సర్వకార్యేషు సిద్ధిదః| మాలతీ మల్లికా యూథీ పాటలా కరవీరకమ్. 1
యావన్తి రతిముక్తశ్చ కర్ణికారః కురంటకః | కుబ్జకస్తగరో నీపో బాణో బర్బరమల్లికా.2
అశోకస్తిలకః కుందః పూజయైస్యాత్తమాలజమ్ | బిల్వపత్రం శమీపత్రం పత్రం భృంగరజస్యతు. 3
తులసీ కాల తులసీ పత్రం వాసక మర్చనే | కేతకీపత్ర పుష్పంచ పద్మం రక్తోత్పలాదికమ్.4
నార్కం నోన్మత్తకం కాంచీ పూజనే గిరిమల్లికా | కుటజం శాల్మలీ పుష్పం కంటకారీభవం నహి.5
ఘృత ప్రస్థేన విష్ణోశ్చ స్నానం గోకోటి సత్ఫలమ్ | ఆఢకేన తు రాజాస్యాద్ ఘృత క్షీరైర్దివం వ్రజేత్. 6
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పుష్పాది పూజాఫలం నామాష్ట చత్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః.
అగ్నిదేవుడు పలికెను : వసిష్టా! పుష్పములతో పూజించినచో శ్రీమహావిష్ణవు అన్ని కార్యములను సిద్ధింప చేయును. మాలతీ, మల్లిక, గిలిమల్లిక, గులాబి, కనేగము, పావంతి,
అతిముక్తకము, కర్ణికారము, కురంటకము, తగరము, నీపము, బాణము, యూథిక, అశోకము, తిలకము, కుందము, తమాలము- ఈ పూవులతో పూజ శ్రేష్టము బిల్వపత్రము, శమీపత్రము, భృంగరాజ పత్రము, తులసి, కృష్ణతులసి, వాసక పత్రము, ఇవి కూడ పూజకు తగినవి. కేతకీపత్ర-పుష్పములు, పద్మములు, రక్తకమలములుకూడ పూజలో గ్రాహ్యములు. జిల్లేడు, ధత్తూరము, గులివెంత, పర్వత మల్లిక, కుటజము, శాల్మలి, కటోరపుష్పము, ఇవి పూజానర్హములు. ప్రస్థము (నాలుగుసేర్లు) నెయ్యితో శ్రీమహావిష్ణువునకు అభిషేకము చేసినచో కోటి గోవుల దానముచేసిన ఫలము లభించును. ఒక అఢకము ఘృతముతో అభిషేకము చేసినవాడు రాజ్యమును పొందును. ఘృతమిశ్రదుగ్ధముతో అభిషేకము చేసినవాడు స్వర్గమును పొందును.
అగ్ని మహాపురాణమునందు పుష్పాదిపూజాఫల కథనమను రెండువందల నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.