Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్విపంచాశదధిక ద్విశతతమోధ్యాయః

పునః ధనుర్వేదః

అగ్నిరువాచ :

భ్రాన్తముద్ర్భాన్త మావిద్ధ విప్లుతం స్మృతమ్‌ |1

సంపాతం సముదీర్ణం చ శ్యేన పాతముథా కులమ్‌.

ఉద్ధూతమవ ధూతం చ సవ్యం దక్షిణ మేవచ | అనాలక్షిత విస్పోటౌ కరాలేంద్ర మహాసఖౌ.2

వికరాల నిపాతౌచ విభీషణ భయానకౌ| సమగ్రార్ధతృతీయాంశ పాదపాదార్ధ వారాజాః.3

ప్రత్యాలీఢ మథాలీఢం వరాహం లులితం తథా| ఇతి ద్వాత్రింశతో జ్ఞేయ ఖడ్గచర్మ విధీరణ.4

పరావృత్తమపా వృత్తం గృహీతం లఘుసంజ్ఞితమ్‌ | ఊర్థ్వం క్షిప్తమధః క్షిప్తం సధారిత విధారితమ్‌.5

శ్యేనపాతం గజ(జా) పాతం గ్రాహగ్రాహ్యంత థైవచ| ఏవమేకా దశవిధా జ్ఞేయాః పాశ విధారణాః .6

ఋజ్వాయతం విశాలంచ తిర్యగ్ర్భామిత మేవచ| పంచకర్మ వినిర్దిష్టం వ్యస్తేపాశే మహాత్మభిః.7

ఛేదనం భేదనం పాతో భ్రమణం శయనం తథా| వికర్తనం కర్తనం చ చక్ర కర్మేద మేవచ.8

అస్ఫోటః క్షేడనం భేదస్త్రాసాన్దోలితకౌ తథా| శూల కర్మాణి జానీహి షష్ఠమాఘాత సంజ్ఞితమ్‌.9

దృష్టిఘాతం భుజాఘాతం పార్శ్వఘాతం ద్విజోత్తమ| ఋజుపక్షేషుణాప్రాప్తం తోమరస్య ప్రకీర్తితమ్‌.10

అగ్నిదేవుడు చెప్పెను : వసిష్ఠా! భ్రాంత-ఉద్ర్భాంత-ఆవిద్ధ-ఆప్లుత-విప్లుత-సంపాత-సముదీర్ణే-శ్యేనపాత-ఆకుల-ఉద్ధూత-అవధూత-సవ్య-దక్షిణ-అనాలక్షిత-విస్ఫోట-కరాలేంద్ర-మహాసభ-వికరాల-నిపాత-విభీషణ-భయానకసమగ్ర-అర్ధ-తృతీయాంశ-పాద-పాదార్ధ-వారిజ-ప్రత్యాలీఢ-ఆలీఢ-వరాహ-లులితములు అనునవి యుద్ధరంగమున చూపు కత్తిడాలుతో యుద్ధము చేయునపుడు చూపు ఇరువదిరెండు చలనక్రమములు. వీటిని తెలుసుకొనవలెను. పాశమును విసరుటలో పరావృత్త -అపావృత్త - గృహీత - లఘు - ఊర్ధ్వక్షిప్త- అధఃక్షిప్త - విధారిత - శ్యేనపాత - గజపాత - గ్రాహ్యగ్రాహ్యములు అను పదునొకండు ప్రకారములున్నవి. వ్యస్తపాశమున మహాత్ములు, ఋజు ఆయత - విశాల - తిర్యక్‌ భ్రామితములను ఐదుకర్మలు చెప్పిరి. ఛేదన- భేదన- పాత - భ్రమణ - శమన - వికర్తన - కర్తనములను ఏడును చక్రకర్మలు. ఆస్ఫోట - క్ష్వడన - భేద - త్రాస - అందోలితక - అఘాతములను అరును శూల కర్మలు. ద్విజోత్తమా! దృష్టిఘాత - భుజఘాత - పార్శ్వఘాత - ఋజుపాత - పక్షపాత - ఇషుపాతములనునవి తోమరకార్యములు.

ఆహతం విప్రః గొమూత్ర ప్రభూతం కమలాసనమ్‌ | నతోర్ధ్వగాత్రం నమితం వామ దక్షిణ మేవచ. 11

ఆవృత్తంచ పరావృత్తం పాదోద్ధూత మవప్లుతమ్‌ | హంసమర్దం విమర్దంచ గదా కర్మ ప్రకీర్తితమ్‌. 12

కరాలమవఘాతంచ దంశోపప్లుత మేవచ | క్షిప్తహస్తం స్థితం శూన్యం పరశోస్తు వినిర్దిశేత్‌. 13

తాడనం ఛేదనం విప్ర తథా చూర్ణన మేవ చ | ముద్గరస్య తు కర్మాణి తథా ప్లవన ఘాతనమ్‌. 14

సంశ్రాన్తమథ విశ్రాంతం గోవిసర్గం సుదుర్ధరమ్‌ | భిందిపాలస్య కర్మాణి లగుడస్య చ తాన్యపి. 15

అంత్యం మధ్యం పరావృత్తం నిదేశాంతం ద్విజోత్తమ | వజ్రసై#్యతాని కర్మాణి పట్టిశస్య చ తాన్యపి. 16

హరణం ఛేదనం ఘాతో భేదనం మ్రక్షణం తథా | కృపాణకర్మ నిర్దిష్టం పాతనం స్ఫోటనం తథా. 17

త్రాసనం రక్షణం ఘాతో బలోద్ధరణమాయతమ్‌ | క్షేపణి కర్మనిర్దిష్టం యంత్రకర్మైతదేవతు. 18

సంత్యాగమవదంశశ్చవరాహోద్ధూతకం తథా | హస్తావహస్తమాలీన మేకహస్తావహస్తకే. 19

ద్విహస్తబాహుపాశేచ కటిరోచిత కోద్గతే | ఉరోలలాట ఘాతే చ భుజా విధమనం తథా. 20

కరోద్ధూతం విమానంచ పాదాహతి విపాదికమ్‌ | గాత్ర సంశ్లేషణం శాంతం తథా గాత్ర విపర్యయః. 21

ఊర్ధ్వప్రహారం ఘాతంచ గోమూత్రం సవ్యదక్షిణ | పారకం తారకం దండం కబరీబంధమాకులమ్‌. 22

తిర్యగ్బంధమపామార్గం భీమవేగం సుదర్శనమ్‌ | సింహాక్రాంతం గజాక్రాంతం గర్ధభాక్రాంతం మేవచ. 23

గదా కర్మాణి జానీయాన్ని యుద్ధస్యాథ కర్మ చ |

విప్రశ్రేష్ఠా! ఆహత - విహృత - ప్రభూత - కమలాసన - నతోర్ధ్వగాత్ర - నమిత - వామదక్షిణ - ఆవృత్త -పరావృత్త - పాదోద్ధూత - ఆవప్లుత - హంసమర్ద - విమర్దములు గదా కర్మలు. కరాల.అవఘాత -దంశోపప్లుత-క్షిప్తహస్తస్థితి-శూన్యములు పరశుకర్మలు. తాడన-భేదన-చూర్ణన-ప్లవన -ఘాతనములు ముద్గర కర్మలు. సంశ్రాంత - విశ్రాంత గోవిసర్గ -సుదుర్ధరములు భిందిపాల-లగుడముల కర్మలు. అంత్య-మధ్య-పరావృత్త. నిదేశాంతములు వజ్ర పట్టిశముల కర్మలు. హరణ-ఛేదన. ఘాత- భేదన- రక్షణ-పాతన-స్ఫోటనములు కృపాణకర్మలు. త్రాసన-రక్షణ-ఘాత-బలోద్ధరణ ఆయతములు క్షేపణీకర్మలు; యంత్రకర్మలు కూడ ఇవియే సత్యాంగ - అపదంశ - వరాహోద్ధూతక - హస్తావహస్త - అలీనఏకహస్త - అపహస్తక - ద్విహస్త - బాహుపాశ - కటిరేచితక - ఉద్గత - ఉరోఘాత - లలాటఘాత - భుజావిధమన - కరోద్ధూత - విమాన - పాదాహతి - విపాదిక- గాత్రసంశ్లేషణ - శాంత - గాత్రవిపర్యయ - ఊర్ద్వప్రహార - ఘాత - గోమూత్ర -సవ్య -

(అ) 2 /14

దక్షిణ-పారక -తారక-దండ - కబరీబంధ - ఆకుల - తిర్యగ్బంధ-అపామార్గ- భీమవేగ - సుదర్శన - సింహాక్రాంత - గజాక్రాంత - గర్దభాక్రాంతములు గదాయుద్ధ చలనములని తెలియవలెను. ఇపుడు మల్లయుద్ద గతులను చెప్పెదను.

అకర్షణం వికర్షంచ బాహూనాం మూలమేవచ. 24

గ్రీవా విపరి వర్తంచ పృష్ఠంభంగం సుదారుణమ్‌ | పర్యాసన విపర్యాసౌ పశుమార మజావికమ్‌. 25

పాద ప్రహారమాస్ఫోటం కటిరేచితకం తథా | గాత్రాశ్లేషం స్కంధగతం మహీవ్యాజన మేవచ. 26

ఉరోలలాటఖాతంచ విస్పష్టకరణం తథా | ఉద్ధూత మవధూతంచ తిర్యఙ్‌ మార్గగతం తథా. 27

గజస్కంధ మవక్షేపమపరాజ్‌ముఖమేవచ | దేవమార్గం మధోమార్గమమార్గ గమనాకులమ్‌. 28

యష్టిఘాతమవక్షేపో వసుధాదారణం తథా | జానుబంధం భుజాబంధం గాత్రబంధం సుదారుణమ్‌. 29

విపృష్ఠం సోదకం శుభ్రం భుజావేష్టిత మేవచ | సన్నద్ధైః సంయుగేభావ్యం సశ##సై#్త్రసై#్తర్గజాదిభిః. 30

వరాంకుశధరౌ చోభౌఏకోగ్రీవాగతోపరః | స్కంధగౌ ద్వౌచ ధానుష్కౌ ద్వౌచఖడ్గ ధరౌగజే. 31

రథేరణ గజేచైవ తురంగాణాం త్రయం భ##వేత్‌ | ధనుష్కాణాం త్రయంప్రోక్తం రక్షార్థే తురగస్యచ. 32

ధన్వినో రక్షణార్థాయ చర్మిణంతు నియోజయేత్‌ |

స్వమంత్రైః శస్త్రమభ్యర్చ్య శాస్త్రం త్రైలోక్య మోహనమ్‌. 33

యోయుద్ధేయాతి స జయేదరీన్సమ్పాలయేద్‌ధ్రువమ్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ద్విపంచాశదధిక ద్విశతతమోధ్యాయః.

ఆకర్షణ - వికర్షణ - బాహుమూల - గ్రీవా పరివర్తన - సుదారుణ పృష్ఠ - భంగ - పర్యాసన - విపర్యాసన - పశుమార - అజావిక - పాదప్రహార - ఆస్ఫోట - కటిరేచితక - గాత్రాశ్లేష - స్కంధగత - మహీవ్యాజన - ఉరోలలాట ఘాత - విస్పష్టకరణ - ఉద్ధూత - అవధూత - తిర్య జ్మార్గగత - గజస్కంధ - అవక్షేప - అపరాఙ్ముఖ -దేవమార్గ అధోమార్గ - అమార్గ గమనాకుల - యష్టిఘాత - అవక్షేప - వసుధారణ - జానుబంధ - భుజాబంధ - సుదారుణగాత్ర బంధ - విపృష్ట - సోదక - శ్వభ్ర - భుజావేష్టితములు (మల్లయుద్ధగతులు) కవచము ధరించి, అస్త్రశస్త్ర సంపన్నుడైన, గజాది వాహనారూఢుడై యుద్ధరంగమున ప్రవేశించవలెను. ఏనుగు మీద, ఇద్దరు మావంటి వాండ్రు ఉత్తమమైన అంకుశములు ధరించి ఉండవలెను. వారిలో ఒకడు మెడమీదను రెండవ వాడు భుజముమీదను కూర్చుండవలెను. వీరుకాక ఇద్ధరు ధనుర్ధనుర్ధరులు, ఇద్దరు ఖడ్గధారులు కూడ ఏనుగుపై కూర్చుండవలెను. ఒక్కొక్క రథమును, గజమును రక్షించుటకు ముగ్గువేసి ఆశ్వికులుండవలెను. అశ్వమును రక్షించుటకై ధనుర్ధరులైన ముగ్గురేసి కాలి బంటులు ఉండవలెను. ధనుర్ధరుల రక్షణము నిమిత్తము కత్తి. డాలు ధరించిన యోధులను నియమించవలెను. ఒక్కొక్క ఆయుధమును దానికి సంబంధించిన మంత్రముతో పూజించి, ''త్రైలోక్యమోహన కవచము'' పఠించి, యుద్ధరంగమునందు ప్రవేశించువాడు శత్రువులపై విజయము పొంది, భూతలమును రక్షించును.

అగ్ని మహాపురాణమునందు ధనుర్వేదకథనమను రెండు వందల ఏబదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page