Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ చతుష్పంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః
పునర్వ్యవహార నిరూపణమ్
అగ్నిరువాచ :
గృహీతార్థః క్రమాద్దాప్యో ధనినామధమర్ణికః | దత్త్వాతు బ్రాహ్మణా యాదౌ నృపతేస్త దనంతరమ్. 1
రాజ్ఞాధమర్ణికో దాప్యః సాధితాద్దశకం స్మృతమ్ | పంచకంతు శతం దాప్యః ప్రాప్తార్థోహ్యుత్తమర్ణికః. 2
హీనజాతిం పరిక్షీణమృణార్థం కర్మకారయేత్ | బ్రాహ్మణస్తు పరిక్షీణః శ##నైర్ధాప్యో యథోదయమ్. 3
దీయమానం న గృహ్ణాతి ప్రయుక్తం యః స్వకం ధనమ్ |
మధ్యస్థ స్థాపితం తత్‌స్యాద్వర్ధతే న తతః పరమ్. 4
ఋక్థమాహ ఋణం దాప్యోయోషిద్గ్రాహస్తథైవచ | పుత్రో7నన్యాశ్రిత ద్రవ్యః పుత్ర హీనస్య ఋక్థిణః. 5
అవిభ##క్తైః కుటుంబార్థం యదృణం తు కృతం భ##వేత్ | దద్యుస్తదృక్థినః ప్రేతే ప్రోషితేవా కుటుంబిని. 6
నయోషిత్పతిపుత్రాభ్యాం నపుత్రేణ కృతం పితా | దద్యాదృతే కుటుంబార్థాన్నపతిః స్త్రీకృతం తథా. 7
గోపశౌండిక శైలూష రజక వ్యాధయోషితామ్ | ఋణం దద్యాత్పతిస్త్వాసాం యస్మాద్వృత్తిస్తదాశ్రయా.
ప్రతిపన్నం స్త్రియా దేయం పత్యా వానహయత్కృతమ్ |
స్వయం కృతం వా యదృణం నాన్యత్త్స్రీదాతుమర్హతి. 9
పితరిప్రోషితే ప్రేతే వ్యసనాభి ప్లుతే7థవా | పుత్రపౌత్రై రృణం దేయం నిహ్నవే సాక్షిభావితమ్. 10
సురాకామ ద్యూతకృతం దండశుల్కావశిష్టకమ్ | వృథాదానం తథైవేహపుత్రో దద్యాన్నపైతృకమ్. 11
భ్రాతౄణామథదమ్పత్యోః పితుః పుత్రస్యచైవహి | ప్రతిభావ్యమృణం గ్రాహ్యమవిభ##క్తేన చ స్మృతమ్. 12
అగ్నిదేవుడు పలికెను. వసిష్ఠా ! చాలమంది ధనికులనుండి ఋణము తీసికొనిన అధమర్ణునిచే ముందుగాబ్రాహ్మణునకు, తరువాత క్షత్రియునకు ఈవిధముగ క్రమమున ఋణము తీర్పించవలెను. నిర్ణయించిన దానిలో నూటికి పదిచొప్పున వడ్డీతో ఇప్పించవలెను. ధనము లభించిన ఉత్తమర్ణుడు నూటికి ఐదుచొప్పున రాజుకు ఇవ్వవలెను. క్షీణదశలో ఉన్న నీచజాతివానిచే, ఋణమునకు బదులు పనిచేయించవలెను. బ్రాహ్మణునిచేత మాత్రము మెల్లమెల్లగా, ఆతనికి అభివృద్ధి కలుగుటను బట్టి తీసికొన్న ధనమును ఇప్పించవలెను. తిరిగి ఇచ్చిన ధనమును ఋణదాత తీసికొనకున్నచో దానిని ఒక మధ్యస్థుని వద్ద ఉంచవలెను. ఆనాటినుండి దానిపై వృద్ధి ఉండదు. కాని దానిని ఋణదాత అడిగినపుడు ఇచ్చి వేయవలెను. అట్లు ఇవ్వకున్నచో వృద్ధి ఇవ్వవలసి యుండును. ఋక్థమును (ఒకరు మరణించగా సంక్రమించిన ఆస్థిని) ఎవడు గ్రహించునో ఆతడై ఋక్థదాత (తండ్రి మొ.) యొక్క ఋణము కూడ చెల్లించవలెను. ఋక్థము తీసికొనిన వాడు పుత్రహీనుడైనచో, ఆ ఋక్థమును మాత్రమే అనుభవించు కృత్రిమ పుత్రుడు చెల్లించవలెను. ఒకని స్త్రీని గ్రహించిన వాడు ఆతని ఋణము కూడ తీర్చవలెను. అవిభక్త కుటుంబములోని ఒకవ్యక్తి ఋణము చేసినచో ఆకుటుంబాధిపతి ఆ ఋణమును తీర్చవలెను. భర్త చేసిన ఋణము భార్య తీర్చనవసరములేదు. పుత్రుడు చేసిన ఋణము తల్లిగాని తండ్రి గాని తీర్చనవసరములేదు. స్త్రీ చేసిన ఋణము భర్త తీర్చనవసరములేదు. కాని మొత్తము కుటుంబమునంతను పోషించుటకై చేసిన ఋణము విషయమున ఈనియమము వర్తించదు. గొల్లలు, మద్యవిక్రేతలు, నటులు, చాకళ్ళు, వేటగాళ్ళు-వీరిస్త్రీలు చేసిన ఋణమును తప్పక వారి భర్తలు తీర్చవలెను. ఏలనన వారివృత్తి ఆ స్త్రీలపై ఆధారపడి యున్నది. మరణించుటకు సిద్ధముగానున్న లేదా పరదేశమునకు పోవనున్న ప్రేరేపింపగా స్త్రీ చేసిన ఋణము. పతి చేసినదేయైనను, భార్య తీర్చవలెను. భర్తతో కలిసియున్న స్త్రీ చేసిన ఋణము కూడ, పతిపుత్రులు లేనిచో స్త్రీయే చెల్లించవలెను. స్త్రీ తానే చేసిన ఋణమును ఆమెయే తీర్చవలెను. మిగిలిన ఋణము లేవియు స్త్రీ తీర్చపనిలేదు. తండ్రివిదేశమునకు వెళ్ళి పోయినపుడు, మరణించినను, చాల కష్టములలో చిక్కుకొని యున్నపుడును, ఆతని ఋణమును పుత్రపౌత్రులు చెల్లించవలెను. వారు అంగీకరించినచో సాక్ష్యాదుల ద్వారా నిరూపించి అర్థి వసూలు చేసికొనవలెను. మద్యపానము, స్త్రీలంపటత్వము, ద్యూతము, దండము శుల్కము చెల్లించగా మిగిలినది, వృథాదానము - వీటికొరకై తండ్రి చేసిన ఋణమును పుత్రుడు తీర్చపనిలేదు. సోదరులయొక్క, పితృపుత్రులయొక్క అవిభక్తధనములో ప్రాతిభావ్యఋణము గ్రహింపదగినది కాదు.
దర్శనే ప్రత్యయే దానే ప్రాతిభావ్యం విధీయతే | ఆధౌతువితథే దాప్యా వితథస్యసుతా అపి. 13
దర్శన ప్రతి భూర్యత్ర మృతః ప్రాత్యయికో7పివా | నతత్పుత్రా ధనం దద్యుర్దద్యుర్దానాయ యేస్థితాః. 14
బహవః స్యుర్యది స్వాంశైర్దద్యుః ప్రతిభువోధనమ్ | ఏకచ్ఛాయాశ్రితేష్వేషు ధనికస్య యథారుచి. 15
ప్రతిభూర్దాపితోయత్ర ప్రకాశం ధనినే ధనమ్ | ద్విగుణం ప్రతిదాతవ్య మృణికైస్తస్య తద్భవేత్. 16
స్వ(స) సంతతిస్త్రీపశవ్యం ధాన్యం ద్విగుణమేవచ | వస్త్రం చతుర్గుణం ప్రోక్తం రథశ్చాష్ట గుణస్తథా. 17
ఆధిః ప్రణశ్యేద్ద్విగుణధనేయదినమోక్ష్యతే | కాలే కాలకృత్యం నశ్యేత్ఫలభోగ్యో న నశ్యతి. 18
దర్శనము, ప్రత్యయము, దానము - వీటియందు ప్రాతిభావ్యము (జామీను) అంగీకరింపబడినది. ఆధి (తాకట్టు) వ్యర్థమైనపుడు తాకట్టు పెట్టినవాని పుత్రులచే ఋణము తీర్పింపవలెను. దర్శన ప్రతిభూ (అవసరమైనపుడు నేనీవ్యక్తిని హాజరుపరచెదను అని జామీను ఉన్నవాడు) గాని, ప్రత్యయ ప్రతిభూ (విశ్వాసము నిమిత్తము జామీను ఉన్నవాడు)గాని మరణించినపుడు వారిపుత్రులు ఋణము చెల్లించనవసరములేదు. దాన ప్రతిభూ (ఆతడు చెల్లించెదెను) అని జామీను ఉన్నవాడు) చెల్లించవలెను దానప్రతిభూలు చాలమంది ఉన్నపుడు వారు ఋణమును తమవంతు ప్రకారము చెల్లించవలెను. అందరును ఒకే విధముగ (పూర్తిగా తీర్చుటకు జామీను ఇచ్చి) ఉన్నపుడు ధనికుడు తన ఇష్టము వచ్చిన వానినుండి ధనము వసూలు చేసికొనవచ్చును. అందరి సమక్షమున ప్రతిభూ ధనికునకు ఎంతధనము చెల్లించెనో దానికి రెట్టింపుధనమును, ఆ ప్రతిభుకు, ఋణగ్రహీతచేత ఇప్పించవలెను. ఆడపశువులను ఋణముగా గ్రహించినపుడు వాటి సంతతిని వడ్డీగా తీసికొనవలెను.. ధాన్యముపై వడ్డీ, అధికాధికము, మూడురెట్లు, వస్త్రములపై వడ్డీ పెరిగి పెరిగి నాల్గురెట్లు రసములపై ఎనిమిది రెట్లు కావచ్చును. తాకట్టు పెట్టి ఋణము తీసికొనినపుడు ఆధనము పెరిగి రెట్టింపు అయిన పిమ్మట గూడ ఋణము చెల్లించి తాకట్టు విడిపించకొననిచో, ఆవస్తువు ధనికునకుని ఋణదాత యొక్క) సొత్తు అగును. ఇంతకాలము తరువాత విడిపించుకొందునని చెప్పి తాకట్టు పెట్టినదానిని, ఆ కాలములోపల విడిపించుకొనినచో అది ధనికుని సొత్తు అయిపోవును. కాని ఫలము మాత్రమే అనుభవించుటకు వీలయిన తోట మొదలగునది తాకట్టు పెట్టినచో అది ఎన్నటికిని నష్టము కాదు. దానిస్వత్వము అధిపతికే యుండును.
గోప్యాధిభోగ్యోనా వృద్ధిః సోపకారే7థ భావితే | నష్టోదేయో వినష్టశ్చ దైవరాజ కృతాదృతే.
19
ఆధేః స్వీకరణా త్సిద్ధీరక్షమాణో7ప్యసారతామ్ | యాతశ్చేదన్య ఆధేయో ధనభాగ్వా ధనీభ##వేత్. 20
చరిత్ర బంధక కృతం సవృద్ధ్యా దాపయేద్ధనమ్ | సత్యంకార కృతం ద్రవ్యం ద్విగుణం ప్రతిదాపయేత్. 21
ఉపస్థితస్య భోక్తవ్య ఆధిర్ధండో 7 (స్తేనో) న్యథా భ##వేత్ |
ప్రయోజకేసతి ధనం కులే7న్యస్యాధి మాప్నుయాత్. 22
తత్కాలకృతమూల్యోవా తత్ర తిష్ఠేద వృద్ధికః | వినాధారణకాద్వాపి విక్రీణీతే సమాక్షికమ్. 23
యదాతు ద్విగుణీ భూత మృణమాధౌతదాఖలు | మోచ్యశ్చాధిస్తదుత్సాద్య ప్రవిష్టే ద్విగుణధనే. 24
వ్యసనస్థమనాఖ్యాయ హస్తేన్యస్యయదర్పయేత్ | ద్రవ్యం తదౌపనిధికం ప్రతిదేయం తథైవతత్. 25
నదాప్యో7పహృతం తత్తు రాజ దైవక తస్కరైః | భ్రెషశ్చేన్మార్గితే దత్తే దాప్యో దండశ్చ తత్సమమ్. 26
అజీవన్స్వేచ్ఛయా దండ్యో దాప్యస్తచ్చాపి సోదయమ్ | యాచితాన్వా హితన్యాసనిక్షేపాదిష్వయం విధిః. 27
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వ్యవహారో నామ చతుష్పంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః.
దాని ఉంచవలసిన వస్తువు తాకట్టు బెట్టినచో దానిని ధనికుడు అనుభవించినను, ఉపయోగించు పశ్వాదులను తాకట్టు పెట్టినను వాటిపై వడ్డీ ఉండదు. తాకట్టుపెట్టిన వస్తువు పాడైపోయినను, పోయినను ఋణదాత తిరిగి ఇవ్వవలెను. అది దైవ - రాజ్ఞోపప్లవములందు పోయినచో ఇవ్వవలసిన పనిలేదు. అట్టి పరిస్థితులలో ఋణగ్రహీత మరొక వస్తువు తాకట్టుగా ఇవ్వవలెను. లేదా ధనము వడ్డీతో చెల్లించవలెను. చరిత్రమునే బంధకముగా పెట్టి (నమ్మకము మీద) తీసి కొన్న ధనమును వడ్డీతో ఇప్పించవలెను. సత్యంకారముతో చేసిన ఋణమును రెట్టింపు చెల్లింపచేయవలెన. తాకట్టు విడిపించుకొనవలసిన సమయము వచ్చినపుడు విడిపించుకొనవచ్చినచో ఇచ్చివేయవలెను. అట్లు కానిచో ధనికుని ఋణము నిచ్చినవాడు, బంధకము విడిపించుకొను సమయమునకు లేనిచో అతని కుటుంబమునకు ధనము చెల్లించి బంధకము విడిపించుకొనవలెను. లేదా ఆనాటి వరకు ఎంత వృద్ధియైనదో నిశ్చయము చేయించుకొని, ధనికుడు మరల వచ్చువరకును బంధకమును ఆతనివద్దనే ఉంచివేయవలెను. కాని ఆనాడు మొదట వడ్డీ ఉండదు. దూరదేశమునకు వెళ్ళిన ధనికుడు అనుకున్న సమయానికి రాజాలకపోయినచో ఋణగ్రహీత విశ్వసనీయుడైన సాక్షుల ఎదుట బంధకమును అమ్మివేసి తనకు రావలసిన సొమ్ము తీసికొనవలెను. ఋణము తీసికొనిన ధనము, వడ్డీ పెరిగి రెట్టింపు అయినచో అంతధనమును ఇచ్చి బంధకమును విడిపించుకొనవలెను. పెట్టి మొదలైన వాటిలో ద్రవ్యము ఉంచి, (సీలుచేసి) అది ఏద్రవ్యమో, ఎంతయో చెప్పకుండ ఇతరుల వద్దదాచనిచ్చినచో అది ''ఔషనిధికము''. దానిని ఇచ్చినట్లుగనే తిరిగి ఇచ్చివేయవలెను. కాని అదిరాజ- దైవ - తస్కరాదుల ద్వారా నష్టమైనచో తిరిగి ఇవ్వవలసిన పనిలేదు. ఉపనిధి ఉంచినవాడు అడిగినను ఉంచుకొన్నవాడు తిరిగి ఈయకున్నచో దానిని ఆతనికిప్పించి, అంతధనము దండము విధించవలెను. ఉపనిధి ఉపయోగించి దానిపై ధనము సంపాదించిన వానిని దండించి లాభముతో సహ ఆవస్తువును తిరిగి ఇప్పించవలెను. యాచిత - అవ్వాహిత - న్యాస - నిక్షేపాదుల విషయమున గూడ ఉపనిధికి సంబంధించిన నియమములు వర్తించును.
అగ్ని మహాపురాణమునందు వ్యవహారమను రెండువందల ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.