Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్‌ పంచాశదధిక ద్విశతతమో7ధ్యాయః.

అథ దాయవిభాగః

అగ్నిరువాచ :

విభాగం చేత్పితా కుర్యాదిచ్ఛయా విభ##జేత్సుతాన్‌ | జ్యేష్ఠం వాశ్రేష్ఠభాగేన సర్వేవాస్యుః సమాంశినః. 1

యది దద్యాత్సమానంశాన్కార్యాః పత్న్యః సమాంశికాః | నదత్తం స్త్రీధనం యాసాం భర్త్రావాశ్వశురేణవా. 2

శక్తస్యానీహమానస్య కించిద్దత్వా పృథక్‌ క్రియా | న్యూనాధిక విభక్తానాం ధర్మ్యశ్చపితృణా కృతః. 3

విభ##జేయుః సుతాః పిత్రోరూర్ధ్వమృక్థమృణం సమమ్‌ | మాతుర్దుహితరః శేషమృణాత్తాభ్యఋతే7న్వయః. 4

పితృ ద్రవ్యావినాశేన యదన్యత్స్వయమర్జయేత్‌ | మైత్ర మౌద్వాహికం చైవ దాయాదానాంనతద్భవేత్‌. 5

సామాన్యార్థ సముత్థానే విభాగస్తు సమఃస్మృతః | అనేక పితృకాణాంతు పితృతోభాగకల్పనా. 6

భూర్యా పితామహోపాత్తా నిబంధో ద్రవ్యమేవవా | తత్రస్యాత్సదృశం స్వామ్యం పితుః పుత్రస్యచోభయోః. 7

విభ##క్తేషుసుతోజాతః సవర్ణాయాం విభాగభాక్‌ | దృశ్యాద్వా తద్విభాగః స్యాదాయవ్యయవిశోధితాత్‌. 8

క్రమాదభ్యాగతం ద్రవ్యం హృతమభ్యుద్ధరేచ్చయః | దాయాదేభ్యో న తద్దద్యా ద్విద్యయా లబ్ధమేవచ. 9

పితృభ్యాం యస్యయద్ధత్తం తత్తసై#్యవ ధనం భ##వేత్‌ |

పితురూర్ధ్వం విభజతాం మాతాప్యంశం సమం హరేత్‌. 10

అసంస్కృతాస్తు సంస్కార్యా భ్రాతృభిః పూర్వసంస్కృతైః |

భగిన్యశ్చ నిజాదంశాద్ధత్త్వాంశం తు తురీయకమ్‌. 11

చతుస్త్రిద్వ్యెక భాగాః స్యుర్వర్ణశో బ్రాహ్మణాత్మజాః | క్షత్రజా స్త్రిద్వ్యేక భాగా విడ్‌జాస్తుద్వ్యేకభాగినః. 12

అన్యో7న్యాపహృతం ద్రవ్యం విభ##క్తేయత్తు దృశ్యతే | తత్పునస్తే సమైరంశైర్విభ##జేరన్నితి స్థితిః. 13

అపుత్రేణ వరక్షేత్రే నియోగోత్పాదితః సుతః | ఉభయోరప్యసావృక్థీ పిండదాతా చ ధర్మతః.

14

అగ్నిదేవుడు పలికెను : తండ్రిదాయవిభాగము చేసినచో జ్యేష్ఠపుత్రునకు అధికభాగము ఇవ్వవచ్చును, లేదా అందరికిని సమముగా ఇవ్వవచ్చును. సమముగా ఇచ్చిన పక్షమున భర్తద్వారా కాని, మామగారి ద్వారాకాని స్త్రీధనము లభించని స్త్రీలకు కూడా సమభాగము లివ్వవలెను. తాను స్వయముగా ధనమును సంపాదింప సమర్థుడు పితృధనము కోరని కుమారునకు కూడ ఏమైనను కొంచెము ఇచ్చి వేరుచేయవలెను. తండ్రి చేసిన దాయవిభాగమునందు న్యూనాధికములున్నను అది తండ్రి చేసినదగుటచే ధర్మసమ్మతమే తల్లిదండ్రులానంతరము కుమారులు ధనమును ఋణమును కూడ సమముగా పంచుకొనవలెను. తల్లిచేసిన ఋణమేదైనా వున్నచో దానిని తీర్చి కుమార్తెలు మిగిలిన ధనమును సమముగా పంచుకొనవలెన. కుమార్తెలు లేనిచో కుమారులు పంచుకొనవలెను. పితృధనమునకు నష్టము కల్గింపక స్వయముగ సంపాదించినది కాని, మిత్రులద్వారా కాని వివాహము ద్వారా కాని వచ్చినది గాని యైన ధనముపై దాయాదులకు అధికారము లేదు. అన్నదమ్ములందరును కలిసి సంపాదించినధనమును, వారందరును సమముగా పంచుకొనవలెను. చాలమంది తండ్రులుగల పౌత్రులు పితామహధనమును తమ తండ్రులను బట్టి పంచుకొనవలెను. పితామహుడు సంపాదించిన భూమి నిబంధము ద్రవ్యము వీటిపై తండ్రికిని పుత్రులకును అధికారము సమానము. విభాగము చేసికొనిన పిమ్మట సవర్ణస్త్రీయందు పుట్టిన కుమారునకు కూడ వాటా ఇవ్వవలెను. లేదా ఆయవ్యయములు. సరిచూచుకొనిన తరువాత దృశ్యధనమునుండి అతనికి భాగమీయవలెను. కుల క్రమాగతమైన ధనమును ఎవరైన అపహరించినపుడు దానిని మరల ఎవడుసంపాదించునో అది ఆతనికే చెందును. దాయాదులకు ఇవ్వవలసిన పనిలేదు. విద్యద్వార లభించిన ధనమును కూడ దాయాదులకు ఇవ్వపనిలేదు. తల్లితండ్రులు ఒక వస్తువును ఎవరికిత్తురో అది అతనికి మాత్రమే చెందును. తండ్రి తరువాత కుమారులు పంచుకొనునపుడు తల్లికూడ సమాంశమును పొందవలెను. వివాహాదులు జరగని సోదరులకు వివాహాదులు జరిగిన సోదరులు ఆసంస్కారములు చేయించవలెను. తోబుట్టువులకు కూడ తమధనములో నాల్గవవంతు ఇచ్చి వివాహము చేయవలెను. బ్రాహ్మణునకు బ్రాహ్మణాడి స్త్రీలయందు పుట్టిన పుత్రులకు వరుసగా నాలుగు మూడు రెండు ఒకటి భాగములు ఇవ్వవలెను, క్షత్రియులకు పుట్టిన కుమారులకు (తల్లివర్ణమును బట్టి) వరుసగా రెండు మూడు ఒకటి భాగములను, వైశ్యుని పుత్రులకు (వర్ణక్రమమునుబట్టి) వరసగా రెండు ఒకటి భాగములను ఇవ్వవలెను. ధనవిభాగము అయిన తరువాత ఏదైన ద్రవ్యమును అన్నదమ్ములలో ఎవరైన అపహరించినట్లు కనబడినచో ఆద్రవ్యమును వారందరును మరల సమముగా పంచుకొనవలెనని నియమము. పుత్రులు లేని వానిచే పరభార్యయందు నియోగముచే పుట్టింపబడిన కుమారుడు వారి ఇరువురి రిక్థమునకు (ఆస్థికి)అధికారి-ఇద్దరికిని-పిండదాత.

ఔరసో ధర్మపత్నీజస్తత్సమః పుత్రికాసుతః | క్షేత్రజః క్షేత్ర జాతస్తు సగోత్రేణతరేణవా. 15

గృహే ప్రచ్ఛన్న ఉత్పన్నో గూడజస్తుసుతః స్మృతః | కానీనః కన్యకాజాతో మాతామహసుతోమతః. 16

క్షతాయామక్షతాయాం వాజాతః పౌనర్భవః సుతః | దద్యాన్మాతా పితావా యం సపుత్రో దత్తకోభ##వేత్‌. 17

క్రీతశ్చ తాభ్యాం విక్రీతః కృత్రిమఃస్యాత్స్వయంకృతః | దత్తాత్మాతు స్వయందత్తో గర్భేవిత్తః సహోఢజః.

ఉత్సృష్టో గృహ్యతేయస్తు సోపవిద్ధో భ##వేత్సుతః | పిండదో7ంశ హరశ్చైషాం పూర్వాభావేపరఃపరః. 19

సజాతీయేష్వయం ప్రోక్తస్తనయేషుమయావిధిః |

ధర్మపత్నియందు పుట్టిన పుత్రుడు ఔరసుడు. పుత్రికాపుత్రుడు ఔరస సమానుడు. తన భార్యయందు సగోత్రుడగువానిద్వారాకాని, సగోత్రునిద్వారాకాని, ఇతరులచేతగాని, పుట్టింపబడినవాడు క్షేత్రజుడు. గృహమునందు రహస్యముగా పుట్టినవాడు గూఢజుడు. అవివాహిత కన్యకు పుట్టినవాడు కానీనుడు. వాడు మాతా మహునికి పుత్రునిగా అంగీకరింపబడును. క్షతయోనిగాని, అక్షతయోనిగాని యైన, విధవకు పుట్టినవాడు పౌనర్భ వుడు. తండ్రిచేతకాని, తల్లిచేతకాని, ఇవ్వబడినవాడు దత్తకుడు. తల్లిదండ్రులు అమ్మగా కొనబడినవాడు విక్రీతుడు. స్వయముగా పెంచుకొన బడినవాడు కృత్రిముడు. తననుతానే ఇతరులకు ఇచ్చినకుమారుడు దత్తాత్మ. గర్భవతిని వివాహమాడగా పుట్టినవాడు సహోఢజుడు తల్లిదండ్రులు పరిత్యజించగా గ్రహింపబడినవాడు అపవిద్ధుడు. ఈ పదకొండు విధముల కుమారులలో పూర్వపూర్వ పుత్రులు లేనిచో పర పర పుత్రుడు పిండమును ఇవ్వవలెను. అస్తి తీసుకొనవలెను. ఇంతవరకు చెప్పిన విధానము సమానజాతీయుల విషయముననే.

జాతో7పిదాస్యాం శూద్రేణ కామతో7ంశహరో భ##వేత్‌. 20

మృతేపితరి కుర్యుస్తం భ్రాతర న్త్వర్ధ భాగికమ్‌ | అభ్రాతృకో హరేత్సర్వం దుహితౄణాం

సుతాదృతే. 21

పత్నీ దుహితరశ్చైవ పితరౌ భ్రాతరస్తథా | తత్సుతో గోత్రజో బంధుః శిష్యః సబ్రహ్మచారిణః. 22

ఏషామభావే పూర్వేషాం ధనభాగుత్తరోత్తరః | స్వర్యాతస్యహ్యపుత్రస్య సర్వవర్ణేష్వయం విధిః. 23

వానప్రస్థయతిబ్రహ్మచారిణామృక్థభాగినః | క్రమేణాచార్య సచ్చిష్య ధర్మభ్రాత్రేకతీర్థినః. 24

సంసృష్టినస్తు సంసృష్టీ సోదరస్యతు సోదరః | దద్యాచ్చాప హరేచ్చాంశం జాతస్యచ మృతస్యచ. 25

అన్యోదర్యస్తు సంసృష్టీ నాన్యోదర్యధనం హరేత్‌ | అసంసృష్ట్యపి చాదద్యాత్సోదర్యోనాన్యమాతృజః. 26

శూద్రునకు దాసియందు పుట్టినవాడుకూడ తండ్రికి ఇష్టమైనచో అంశహరుడు అగును (ఆస్తిపంచుకొనువాడగును) తండ్రి మరణించిన పిమ్మట సోదరులు ఆతనికి అర్థభాగములు ఇవ్వవలెను. ఆతనికి సోదరులు లేనిచో, దౌహిత్రుడుకూడ లేనిచో దాసీపుత్రుడే అంతయు తీసుకొనవచ్చును. పైన చెప్పిన పదకొండు విధముల పుత్రులులేనివాని ధనముపై క్రమముగా భార్యకు, కుమార్తెలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, సోదరపుత్రులకు, గోత్రమువారికి, బంధువులకు, శిష్యునకు సహాధ్యాయికి అధికారముండును. ఈ నియమము అన్నివర్ణములవారికిని చెల్లును. వానప్రస్థ, సన్యాసి, బ్రహ్మచారుల రుక్థముపై క్రముముగ ఆచార్యునకు ఉత్తమశిష్యునకు ధర్మభ్రాతకు ఏక తీర్థికి అధికారముండును. సోదరుడు జన్మించినను, సోదరుడు మరణించినను వారిద్దరు కలసివున్నపుడు ఆతనికి భాగమును ఇవ్వవలెను. ఆతని భాగమును తీసుకొనవలెను. కలసివున్న మరియొక సోదరుడు మరియొక సోదరుని ధనమును గ్రహించకూడదు. సవతిసోదరుడుకూడ కలిసిలేక పోయినను, మరణించినవాని ధనమును తీసుకొనవచ్చును.

పతితస్తత్సుతః క్లీబః పంగుర్‌ఉన్మత్తకోజడః | అంధో7చికిత్స్య రోగాద్యా భర్తవ్యాస్తు నిరంశకాః. 27

ఔరసాః క్షేత్రజాస్త్వేషాం నిర్దోషా భాగహారిణః | సుతాశ్చైషాం ప్రభర్తవ్యా యావద్వై భర్తృసాత్కృతాః. 28

అపుత్రా యోషితశ్చైషాం భర్తవ్యాః సాధువృత్తయః | నిర్వాస్యా వ్యభిచారిణ్యః ప్రతికూలాస్తథైవచ. 29

పితృమాతృ పతిభ్రాతృ దత్తమధ్యగ్న్యుపాగతమ్‌ | ఆధివేదనికం చైవ స్త్రీధనం పరికీర్తితమ్‌. 30

బంధుదత్తం తథా శుల్కమన్వా ధేయక మేవచ | అప్రజాయామతీతాయాం బాంధవాస్తదవాప్నుయః. 31

అప్రజ స్త్రీ ధనం భర్తుం ర్బ్రాహ్మ్యాదిషు చతుర్ష్వపి | దుహితౄణాం ప్రసూతాచేచ్ఛేషేషు పితృగామితత్‌. 32

దత్త్వా కన్యాం హరన్దండ్యో వ్యయం దద్యాచ్చ సోదయమ్‌ |

మృతాయాం దత్తమాదద్యాత్పరిశోధ్యో భయవ్యయమ్‌. 33

దుర్భిక్షే ధర్మకార్యేచ వ్యాధౌ సంప్రతి రోధకే | గృహీతం స్త్రీధనం భర్తా నస్త్రియే దాతుమర్హతి. 34

అధివిన్నస్త్రియై దద్యాదాధి వేదనికం సమమ్‌ | నదత్తం స్త్రీధనం యసై#్య దత్తేత్వర్ధం ప్రకీర్తితమ్‌. 35

విభాగ నిహ్నవే జ్ఞాతి బంధు సాక్ష్యభి లేఖితైః | విభావ భావనాజ్ఞేయా గృహక్షేత్రైశ్చ¸°తకైః. 36

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దాయవిభాగో నామ షట్పాంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

నపుంసకుడు పతితుడు ఆతని కుమారుడు, కుంటివాడు, ఉన్మత్తుడు, జడుడు, గ్రుడ్డివాడు చికిత్సచేయ శక్యము గాని రోగములతో బాధపడువాడు వీరికి అంశము ఉండదు. వీరిని కేవలము పోషించవలెను. ఔరసులు, క్షేత్రజులు అయిన పుత్రులు ఈ దోషములు లేకున్నచో భాగమును తీసుకొనవచ్చును. వీరి కుమార్తెలనుకూడ వివాహమగునంతవరకు పోషించవలెను. వీరి భార్యలు పుత్రులు లేనివారైనచో సచ్చరత్రలైన పక్షమున వారినికూడ పోషించవలెను. వ్యభిచారిణులు ప్రతికూలులు అయినచో వారిని ఇంటినుండి వెడలగొట్టవలెను. స్త్రీలకు తల్లిదండ్రులు భర్త సోదరులు ఇచ్చినది అగ్ని సమీపమునందు ఉపాయముగా లభించినది అధివేదన సమయమున లభించినది స్త్రీధనమని చెప్పబడును. బందువులిచ్చినది శుల్కముగా లభించినది వివాహానంతరము పారితోషికముగా లభించినదికూడ స్త్రీ ధనము. స్త్రీ సంతానరహితురాలై మరణించినపుడు ఆ ధనము బంధువులకు చెందును. బ్రాహ్మము మొదలైన నాలుగు వివాహ పద్ధతులచే పెండ్లాడిన భార్య, సంతానము లేకుండ మరణించినచో ఆమెధనము భర్తకు చెందును. ఆమె సంతానవతి యైనచో ఆధనము పుత్రికలకు చెందును. మిగిలిన వివాహ పద్ధతులచే వివాహము చేసికొన్న స్త్రీధనము ఆమెతండ్రికి చెందును. కన్యనుఇచ్చి మరల ఆమెను హరించిన వానిని దండించవలెను. ఆతనినుండి వ్యయమైన ధనమునంతను ఉదయముతో (వడ్డీతో) తీసుకొనవలెను. ఆ కన్య మరణించినచో ఇద్దరి వ్యయమును పరిశీలించి భర్త ఇచ్చినదానిని ఆ కన్య తండ్రి నుండి తీసుకొనవలెను. భర్త దుర్భిక్ష సమయమునందును, ధర్మకార్యమునందును వ్యాధియందును దేశోపప్లవమునందును, భార్యనుండి తీసుకొనిన స్త్రీ ధనమును తిరిగి ఆమెకు ఇవ్వవలసిన పనిలేదు. స్త్రీ ధనములేని భార్యఉండగా, మరొక వివాహము చేసుకొనువాడు ఆ వివాహమునకు, ఎంత వ్యయమగునో అంతధనమును మొదటి భార్యకు ఇవ్వవలెను. ఆమెకు స్త్రీ ధనమున్నచో సగము ఇవ్వవలెను. విభాగ విషయమున సందేహము వచ్చినపుడు జ్ఞాతులు, బంధువులు, సాక్షులు, అభిలేఖితములు (వ్రాసిన పత్రములు) గృహములు, క్షేత్రములు కట్నము వీటినిబట్టి విభాగనిర్ణయము చేయవలెను.

''అగ్నిమహాపురాణమునందు దాయ విభాగమను రెండువందల యేబది ఆఱవ అధ్యాయము సమాప్తము'

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page