Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తపంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః
అథ సీమా వివాదాది నిర్ణయః.
అగ్నిరువాచ :
సీమ్నో వివాదే క్షేత్రస్య సామన్తాః స్థవిరాగణాః గోపాః సీమా కృషాణాయే సర్వేచవన గోచరాః. 1
నయేయురేతే సీమానం స్థలాంగారతుషద్రుమైః | సేతువల్మీక నిమ్నాస్థి చైత్యాద్యైరుప లక్షితామ్. 2
సామన్తావా సమం గ్రామచ్చాత్వారో7ష్టాదశాపివా | రక్తస్రగ్వసనాః నీమాం నయేయుః క్షితిధారిణః. 3
అనృతేతు పృథగ్దండ్యా రాజ్ఞామధ్యమ సాహసమ్ | అభావే జ్ఞాతృ చిహ్నానాం రాజా సీమ్నః ప్రవర్తకః. 4
ఆరామాయతన గ్రామ నిపానోద్యాన వేశ్మసు | ఏష ఏవ విధిర్జ్ఞేయో వర్షాంబు ప్రవహేషుచ. 5
మర్యాదాయాః ప్రభేదేషు క్షేత్రస్యహరణ తథా | నిర్మర్యాదాశ్చ దండ్యాః స్యురదమోత్తమ మధ్యమాః. 6
ననిషేధ్యో7ల్ప బాధస్తు సేతుః కల్యాణకారకః | పరభూమిం హరన్కూపః స్వల్పక్షేత్రో బహూదకః. 7
స్వామినే యో7నివేద్యైవక్షేత్రే సేతుం ప్రకల్పయేత్ | ఉత్పన్నే స్వామినో భోగస్తదభావే మహీపతేః. 8
ఫలాహతమపి క్షేత్రం యోన కుర్యాన్న కారయేత్ | నప్రదాప్యః కృష్ణఫలం క్షేత్రమన్యేన కారయేత్. 9
అగ్నిదేవుడు పలికెను : క్షేత్రము విషయమున నీమావివాదము (సరిహద్దు) ఏర్పడినపుడు సామంతులు వృద్ధులు మొదలగువారు గోపాలకులు ఆ సరిహద్దులలో వుండు కర్షకులు వనములో నివసించువారు వీరందరును ఎత్తైన ప్రదేశము బొగ్గులు ఊక (పొల్లు) వృక్షములు వంతెనలు, పుట్టలు పల్లములు, చైత్యములు మొదలైన వాటి సహాయముతో ఆ సరిహద్దును గుర్తించవలెను. సామంతులు గాని, గ్రామములోని నలుగురు గాని, ఎనమండుగురు గాని, పదిమంది గాని. ఎర్రని పుష్పమాలలను, వస్త్రములను, ధరించి, తలపై మట్టిపెట్టుకొని సీమా నిర్ణయము చేయవలెను. ఈ సామంతాదులు అసత్యము చెప్పినచో రాజు వారికి వేరువేరుగా మధ్యమ సాహసదండము ఇవ్వవలెను. సీమను నిర్ణయించు చిహ్నములులేని పక్షమున రాజే సీమా నిర్ణయము చేయువాడు, తోటలు గృహములు, గ్రామములు తటాకాదులు ఉద్యానములు దేవాలయములు, వర్షాజలములు ప్రవహించు కాలువలు మొదలగు వాటి విషయము గూడ సీమా నిర్ణయము ఇట్లే చేయపలెను. సరిహద్దులు తొలగించిన వారికిని క్షేత్రము హరించిన వారికిని సరిహద్దు దాటిన వారికిని రాజు క్రమముగా, అధమ ఉత్తమ మధ్యమ, దండములు ఇవ్వవలెను. చాలమందికి ఉపయోగించినది కొంచెము మాత్రమే బాధ కలిగించునది యగు సేతువు- పరుల భూమిలోనికి పోవు అత్యధికమగు జలముగలది - అల్పక్షేత్రమును ఆక్రమించునది యగు కూపము-వీటిని అడ్డుపెట్టరాదు. క్షేత్రాధిపతికి తెలుపకుండగనే క్షేత్రమునందు సేతువును నిర్మించినచో దానిని క్షేత్రాధిపతియే అనుభవించవలెను. అతడు లేనిచో అదిరాజునకు చెందును. దున్నువాడు తానుథున్నిన భూమిపై పంటపండింపకున్నను, ఇతరులను పండింపకుండ అడ్డుకున్నను దున్నిన భూమిపై వచ్చుటకు అవకాశమున్న పొలమును అతనికి ఇప్పించి ఆ పొలమును మరియొకనిచే చేయించవలెను.
మాసానష్టౌతు మహిషీ సస్యఘాతస్య కారిణీ | దండనీయా తదర్ధంతు గౌస్తదర్ధ మజావికమ్. 10
భక్షయిత్వోపవిష్టానాం యథోక్తాద్ద్విగుణోదమః | సమమేషాం వివీతే7పి ఖరోష్ట్రం మహిషీ సమమ్. 11
యావత్సస్యం వినష్టంతు తావత్క్షత్రీ ఫలం లభేత్ | పాలస్తాడ్యో7థ గోస్వామీ పూర్వోక్తం దండమర్హతి. 12
పథిగ్రామ వివీతాంతే క్షేత్రే దోషోన విద్యతే | అకామతః కామచారే చోరవద్దండ మర్హతి. 13
మహోక్షోత్సృష్ట పశవః సూతికా గన్తుకాచగౌః | పాలోయేషాంతు తేమోచ్యాదైవరాజ పరిప్లుతాః. 14
యథార్పితాన్పశూన్గోపః సాయంప్రత్యర్పయేత్తథా | ప్రమాదమృతనష్టాంశ్చ ప్రదాప్యః కృతవేతనః. 15
పాలదోష వినాశేతు పాలే దండో విధీయతే | అర్ధత్రయో దశపణః స్వామినో ద్రవ్యమేవచ. 16
గ్రామేచ్ఛయా గోప్రచారో భూమిరాజవశేనవా | ద్విజస్తృణౖధః పుష్పాణి సర్వతః స్వవదాహరేత్. 17
ధనుః శతం పరీణాహో గ్రామ క్షేత్రాంతరం భ##వేత్ | ద్వేశ##తే ఖర్వటస్యసాన్నగరస్య చతుః శతమ్. 18
గేదె సస్యమునకు కల్గించినపుడు ఎనిమిది మాషములు గోవు నష్టము కల్గించినచో నాలుగు మాషములు, మేకలు గొఱ్ఱలు, కలిగించినచో దండము విధించవలెను, గేదెలు మొదలగునవి సస్యమును భక్షించి అక్కడ కూర్చున్నచో పైన చెప్పినదానికి రెట్టింపు దండమును విధించవలెను. వివీతక్షేత్రము నందు కూడ పైన చెప్పినట్లే దండమును విధించవలెను. గాడిదలను ఒంటెలకు కుండ గేదెతో సమానముగా దండము. ఎంత సస్యము నష్టమైనదో అంత క్షేత్రస్వామికి ఆ పశువుల స్వామి చేత ఇప్పించవలెను. పశువుల కాపరికి తాడనమే దండము. గోస్వామికి ఆతడు స్వయముగా మేపినచో పైన చెప్పిన దండము విధించవలెను. ఆ క్షేత్రము మార్గమునందును గ్రామముయొక్క వివీతము చివరను వున్నపుడు తెలియక పశువులు మేసినచో దండములేదు. తెలిసిమేపినచో చోరుని వలె దండించవలెను. ఆబోతు, దేవతలనుద్దేశించి విడిచిన పశువులు క్రొత్తగా ఈనిన ఆవుచెదరి వచ్చిన ఆవు ఇవిమేసినచో దండములేదు. వాటిని విడిచిపెట్టవలెను. దైవోపహతములు, రాజోపహతములగు పశువులను కూడ విడిచిపెట్టవలెను. గోపాలకుడు ప్రాతః కాలమున పశువులను తానెట్లు తీసుకొనిపోవునో సాయంకాలమున అట్లే తిరిగి స్వామికి అప్ప చెప్పవలెను. జీతము తీసుకొను గోపాలుని ప్రమాదముచే పశువులు మరణించి నను, నష్టమైనను ఆతనిచే వాటి స్వామికి ఇప్పించవలెను. గోపాలుని పొరపాటుచే పశువు నశించనిచో పదమూడున్నర పణముల దండము విధించి పశుమూల్యమునకు సమానమైన ధనమును పశుస్వామికి ఇప్పించవలెను. గ్రామస్థుల ఇష్టము ప్రకారముగాని, రాజాజ్ఞచేతగాని, గోవుల మేతకై కొంత భూమిని విడువవలెను. బ్రాహ్మణుడు అన్ని క్షేత్రములనుండియు తృణమును కట్టెలను, పుష్పములను, తన సొంత వస్తువువలె గ్రహించవచ్చును. గ్రామమునకు పొలమునకును మధ్య వంద ధనస్సుల దూరముండవలెను. ఖర్వటము (పెద్ద గ్రామము)నకు క్షేత్రమునకు మధ్య రెండువందల ధనస్సుల అంతరము నగరమునకు క్షేత్రములకు మధ్య నాలుగు వందల ధనుస్సుల అంతరము వుండవలెను.
స్వం లభేతాన్య విక్రీతే క్రేతుర్దోషో7ప్రకాశితే| హీనాగ్రహో హీనమూల్యే వేలా హీనేచ తస్కరః. 19
నష్టాపహృతమాసాద్య హర్తారం గ్రాహయేన్నరమ్ | దేశ కాలాతి పత్తౌవా గృహీత్వా స్వయమర్పయేత్.20
విక్రేతుర్దర్శనాచ్ఛుద్ధిః స్వామీ ద్రవ్యం నృపోదయమ్ |
క్ష్రేతామూల్యం సమాప్నోతి తస్మాద్యస్తత్ర విక్రయీ. 21
ఆగమేనోపభోగేన నష్టం భావ్యమతో7న్యథా | పంచబంధో దమస్తస్య రాజ్ఞేతేనాప్య భావితే.22
హృతం ప్రనష్టం యోద్రవ్యం పరహస్తా దవాప్నుయాత్ | అనివేద్యనృపే దండ్యః సతుషణ్ణవతింపణాన్.
శాల్కికైః స్థానపాలైర్వా నష్టాప హృతమా హృతమ్| అర్యాక్సంవత్సరాత్స్వామీ లభ##తే పరతో నృపః.
పణానేకశ##ఫే దద్యాచ్చతురః పంచమానుషే| మహిషోష్ట్రగవాం ద్వౌద్వౌపాదం పాదమజావికే.25
తన వస్తువును అపహరించి ఎవరైన ఇతరులకు అమ్మివేసినపుడు అది కనబడినచో దానిని స్వామి తీసుకొనవచ్చును దానిని బయటకనబడకుండా చేసినచో అది కొన్న వాని దోషము ఒక నీచుని నుంచి తక్కువ మూల్యము ఇచ్చి సమయము కాని సమయమునందు రహస్యముగా ఒక వస్తువును కొన్నవాడు చోరుడే. నష్టమైనను అపహృతమైనను ఒక వస్తువు కనబడినచో అది ఎవని వద్దనుండునో వానిని రాజపురుషులచే పట్టించవలెను. ఆదేశమునందు అసమయమునందు పట్టించుటకుదరక పోయినను, తాను స్వయముగా పట్టి ఇవ్వవలెను. అపహృత వస్తువును కొన్నవాడు అమ్మినవానిని చూపించినచో వాడు శుద్ధుడగును. రాజు ఆ ద్రవ్యమును స్వామికి ఇప్పించి అమ్మినవానిని శిక్షించి కొన్నవానికి మూల్యమును తిరిగి ఇప్పించవలెను. నష్టమైన వస్తువును దాని స్వామి తనకు ఎట్లు వచ్చినదో తాను ఎట్లు అనుభవించెనో చెప్పి అది తనదని నిరూపించుకోనవలెను. అట్లు చేయజాలనిచో రాజు దానిలో పంచుమాంశమును దండముగా విధించవలెను. హృతమైన లేదా నష్టమైన తన వస్తువును గూర్చి రాజుకు నివేదించక ఇతరుల ద్వారా దానిని పొందిన వానికి రాజు తొంబది యాఱు పణములు విధించవలెను. శుల్కాధికారులు కాని, స్థానపాలకులు గాని, తీసుకొనివచ్చి రాజువద్ద వుంచిన నష్ట అపహృత ధనమును దాని స్వామి ఒక సంవత్సరములోపుగ తనదని నిరూపించి మరల పొందవచ్చును. సంవత్సరము దాటినచో అది రాజుకుచెందును. ఏకశఫములు (గుఱ్ఱములు మొదలగునవి)పోయి మరల లభించినచో వాటి స్వామి రాజునకు నాలుగు పణములు ఇవ్వవలెను. మనుష్యజాతికి సంబంధించిన ద్రవ్యములభించినచో ఐదుపణములు, మహిషము, ఉష్ట్రము, గోపు తిరిగి లభించినపుడు రెండేసి పణములు, మేకలకు గొఱ్ఱలకు పణములో నాలుగవవంతు ఇవ్వవలెను.
స్వకుటుంబా విరోధేన డేయం దారసుతాహృతే| నాన్యయేసతి సర్వస్యం దేయం యచ్చాన్య సంశ్రుతమ్. 26
ప్రతి గ్రహః ప్రకాశః స్వాత్థ్సావరస్య విశేషతః| దేయం ప్రతిశ్రుతం చైవ దత్త్వానాపహరేత్పునః. 27
దశైకపంచ నస్తాహ మాసత్య్రహార్ధమాసికమ్| బీజాయోవాహ్యరత్న స్త్రీదోహ్యపుంసాం పరీక్షణమ్. 28
అగ్నౌ సువర్ణమక్షీణం ద్విపలం రజతేశ##తే | అష్టౌత్రపుణి సీసే చ తామ్రే పంచదశాయసి. 29
శ##తే దశ పలావృద్థిరౌర్ణే కార్పాసికే తథా| మధ్యే పంచపలాజ్ఞేయా సూక్ష్మేతు త్రిపలామతా.30
కార్మి కే రోమబద్ధేచ త్రింశద్భాగః క్షయోమతః | నక్షయోనచ వృద్ధిస్తు కౌశేయే వల్కలేషుచ.31
దేశం కాలం చ భోగం చ జ్ఞాత్వానష్టే బలాబలమ్|
ద్రవ్యాణాం కుశేలా బ్రూయుర్యత్తద్దాప్యమసంశయమ్.32
తనకుబుంబమునకు నష్టముకాని విధమున తన వస్తువులను దానము చేయవచ్చును. భార్యపుత్రాదులను ఎన్నడును దానము చేయకూడదు. తనసర్వస్వమును తనవంశమువున్నపుడు ఇతరుల ఎవ్వరికిని ఇవ్వకూడదు. ఒకరికి ఇచ్చిన దానిని మరొకరికి ఇవ్వకూడదు. ప్రతిగ్రహము అందరి యెదుటను చేయవలెను. ఇచ్చెదనని చెప్పినవస్తువును తప్పక ఇవ్వవలెను. ఇచ్చి మరల తీసుకొనగూడదు. బీజములు ఇనుము, వాహనములు, రత్నములు, దాసి, పాలిచ్చు పశువులు దాసులు వీరిని రక్షించుటకు వరుసగ పది, ఒకటి, ఐదు, ఏడుదినములు మాసము, మూడు దినములు, అర్ధమాసము తీసుకొనవచ్చును. బంగారము అగ్నిలో వేసినను తరగదు. వెండి నూటికి రెండుపలములు తగ్గును. తగరము సీసము నూటికి ఎనిమిదిపలములు తగ్గును. రాగికి ఐదుపలములు ఇనుముకు పదిపలములు తరుగువచ్చును. ఉన్నినూలు వీటితో నేసిన బట్టలకు నూటికి పది పలములు పెరుగును. మధ్య ప్రమాణముగల దారమైనచో ఐదు పలములు సూక్ష్మమయినచో మూడు పలములు హెచ్చును. అద్దకము బట్టలందును, రొమములు గుచ్చిన బట్టలందును నూటికి ముపై#్పవంతులు తరుగవచ్చును. పట్టుబట్టలందు, నారచీరలందు, క్షయముగాని వృద్ధికాని ఉండదు. కుశలులగు వారు దేశమును కాలమును భోగమును దృష్టిలో వుంచుకొని నష్టమైన వస్తువుల విషయమున బలాబలములను ఏ విధముగా నిర్ణయింతురో ఆ నష్టమును రాజు తప్పక ఇప్పించవలెను. బలాద్దాసీకృతశ్చారైర్విక్రీతశ్చాపి ముచ్యతే | స్వామీ ప్రాణప్రదో భక్తత్యాగాత్తన్నిష్క్రయాదపి. 33
ప్రవ్రజ్యావసితో రాజ్ఞోదాస ఆమరణాంతికః | వర్ణానామానులోమ్యేన దాస్యం నప్రతిలోమతః34
కృతశిల్పో7పి నివసేత్కృత కాలం గురోర్గృహే | అంతేవాసీ గురుప్రాప్త భోజనస్తత్ఫలప్రదః.35
రాజాకృత్వాపురేస్థానం బ్రాహ్మణాన్న్యస్యతత్రతు |
త్రై విద్యం వృత్తిమద్బ్రూయాత్స్వ ధర్మఃఫాల్యతామితి.36
నిజధర్మావిరోధేన యస్తు సామయికో భ##వేత్ | సో7పి యత్నేన సంరక్ష్యోధర్మో రాజకృతశ్చయః.37
గణ ద్రవ్యం హరేద్యస్తు సంవిదం లంఘయేచ్ఛయః |
సర్వస్వ హరణం కృత్వాతం రాష్ట్రాద్విప్రవాసయేత్.38
కర్తవ్యం వచనం సర్వైః సమూహహిత వాదిభిః | యస్తత్ర విపరీతః స్యాత్స దాప్యః ప్రథమం దమమ్. 39
సమూహకార్య ప్రహితో యల్లభేత్తత్త దర్పయేత్ | ఏకాదశ గుణం దాప్యో యద్యసౌ నార్పయేత్స్వయమ్.40
వేదజ్ఞాః శుచయో7లుబ్దా భ##వేయుః కార్యచింతకాః | కర్తవ్యం వచనం తేషాం నమూహహిత వాదినామ్.41
శ్రేణినైగమపాషండి గణానా మప్యయం విధిః | బేదం చైషాం నృపో రక్షేత్పూర్వవృత్తిం చపాలయేత్.
బలాత్కారముగా, దాసుడుగా చేయబడిన వానిని చోరులచే అమ్మబడిన వానిని తన స్వామిని ప్రాణసంకటము నుండి రక్షించిన వానిని, తనకై స్వామి ఎంత వ్యయము చేసెనో అంతధనము తిరిగి ఇచ్చివేసిన వానిని దాసత్వమునుండి విడిపించవలెను. ప్రవ్రజ్యావసితుడు ( సన్యాసమును స్వీకరించి భ్రష్టుడైన వాడు) అమరణాంతము రాజుకు దాసుడుగా వుండవలెను. వర్ణములలో దాస్యము అనులోమ్యముచే (క్రిందవర్ణము వారుపై వర్ణము వారికి) దాస్యముండును. ప్రతి లోమ క్రమముచేకాదు. శిల్పము నేర్చుకొన్న శిష్యుడు నిశ్చితమగు కొంతకాలము పాటు గురుగృహమునందే నివసించుచు, గురువు పంట భోజనము చేయుచు, శిల్పమువలన సంపాదించిన ధనమును గురువునకు ఇవ్వవలెను. రాజు తన నగరమున స్థానము కల్పించి అచట బ్రాహ్మణులకు నివాసమేర్పరచి వేదవిదులకు వారికి వృత్తి కల్పించి ''మీరు ఇచట స్వధర్మానుష్ఠానము చేయుడు'' అని ప్రార్థించవలెను. స్వధర్మమునకు అవిరుద్ధమగు అయాసమయములందు ఏర్పరచబడిన రాజనిర్ణీత ధర్మమును కూడ ఆ బ్రాహ్మణులు పాలించవలెను. ఎవడు జనగణము యొక్క ద్రవ్యమును హరించునో, మర్యాదను లంఘించునో అతని సర్వస్వమును తీసుకొని రాష్ట్రమునుండి వెడలగొట్టవలెను. సమాజహితమును కోరువారు చెప్పిన విషయమును అందరును ఆచరించవలెను. తద్విపరీతముగా ప్రవర్తించు వానిని ప్రథమ సాహస దండముచే శిక్షించ వలెను. సమాజ కార్యముపై పంపబడినవాడు తనకు లభించిన దంతయు సమాజమునకు సమర్పించ వలయును. వాడు అట్లు అర్పించకున్నచో వానిచే పదకొండు రెట్లు ఇప్పించవలెను. వేదజ్ఞులు, పవిత్రలు, లోభము లేనివారు, కార్యచింతకులు కావలెను. సమాజ హితమును చెప్పువారి వచనమును అందరును ఆచరించ వలెను. శ్రేణులు, నైగములు, పాషండులు, గణములు వీరికి కూడ ఇది వర్తించును. రాజు వీరి ధర్మ భేధములను, పూర్వవృత్తిని పాలించవలెను.
గృహీత వేతనః కర్మత్యజన్ద్వి గుణమావహేత్ | అగృహీతే సమం దాప్యో భృత్యై రక్ష్య ఉపస్కరః.43
దాప్యస్తు దశమం భాగం వాణిజ్య పశుసస్యతః | అనిశ్చిత్య భృతిం యస్తుకారయేత్స మహీక్షితా.44
దేశం కాలంచ యో7తీయాత్కర్మ కుర్యాచ్చయో7న్యథా|
తత్రతు స్వామినశ్ఛందో7ధికం దేయం కృతే ధికే.45
యోయావత్కురుతే కర్మతావత్తన్న తు వేతనమ్ | ఉభయోరప్య సాధ్యం చేత్సాధ్యే కుర్యాద్యథా శ్రుతమ్.
అరాజదైవికం నష్టం భాండం దాప్యస్తు వాహకః|
ప్రస్థాన విఘ్నకృచ్చైవ ప్రదాప్యొ ద్విగుణాం భృతిమ్.47
ప్రక్రాన్తే సప్తమం భాగం చతుర్థంపథి సంత్యజన్ | భృతిమర్దపథే సర్వాం ప్రదాప్యస్త్యాజకో7పి చ.48
గ్లహే శతికవృద్ధేస్తు సభికః పంచకం శతమ్ | గృహ్ణీయాద్దూర్త కితవాదితరాద్దశకం శతమ్. 49
ససమ్యక్పాలితో దద్యాద్రాజ్ఞే భాగం యథాకృతమ్ | జితముద్గ్రాహయేజ్ఞేత్రే దద్యాత్సత్యం వచఃక్షమీ.50
ప్రాప్తేనృపతినాభాగే ప్రసిద్ధేదూర్తమండలే | జితం ససభికేస్థానే దాపయే దన్యథానతు.51
దృష్టారోవ్యవహారాణాం సాక్షిణశ్చత ఏవహి | రాజ్ఞాసచిహ్నా నిర్వాస్యాః కూటాక్షోపధి దేవినః.52
ద్యూతమేక ముఖం కార్యం తస్కరజ్ఞానకారణాత్ | ఏషఏవ విధిర్ఙ్ఞయః ప్రాణిద్యూతే సమాహ్వయే.53
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సీమా వివాద ద్యూతాది నిర్ణయోనామ
సప్తపంచాశదధిక ద్విశతతమో7ధ్యాయః.
వేతనము తీసుకొని పనిమానివేసినవాడు వేతనమునకు రెట్టింపు ధనమును స్వామికి ఇవ్వవలెను. అతడు వేతనము తీసుకొనకుండ పనిమాని వేసినచో వేతన ధనమును స్వామికి ఇప్పించవలెను. భృత్యుడు ఉపకరణములను రక్షించుచుండవలెను. వేతనము నిశ్చయించకుండగ ఎవరైనా భృత్యునిచే పని చేయించున్నచో రాజు వానిచే ఆ భృత్యునికి వాణిజ్యము పశువలు సస్యము వీటిలో పదవవంతు ఇప్పించ వలెను. దేశకాలములను దాటబెట్టుకటచే పనిని చెడ గొట్టిన భృత్యునకు స్వామి తన ఇష్టము వచ్చినంత వేతనమునే ఇవ్వవలెను. అనుకొనిన దానికంటె అధికము. సమకూర్చినచో అధిక వేతనము ఇవ్వవలెను. ఎవడు ఎంత పనిచేయునో అతనికి అంతయే వేతనము- ఇద్దరికి అసాధ్యమైన పనిని ఒకడు ఎంత చేయునో అంతయే వేతనము సాధ్యమైనచో చెప్పినంత వేతనము ఈయవలెను. భారమును మోయు భృత్యుడు, రాజునకు కాని దైవమునకు కాని, సంబంధించిన వస్తువును మోయుచు దానిని నష్టపరచినచో ఆవాహకునిచే అంత ధనము స్వామికి ఇప్పించవలెను. యాత్రలో విఘ్నము కలిగించు భృత్యునిచే వేతనమునకు రెట్టింపు ధనమును ఇప్పించవలెను. యాత్రా ప్రారంభమున పనిమానివేసిన వానిచే వేతనములోని సప్తమ భాగమును మార్గమునందు మానివేసిన వానిచే చతుర్థ భాగమును, మార్గమధ్యమునందు మానివేసినవానిచే మొత్తము వేతనమును ఇప్పించవలెను. జూదములో పందెము నందు , నూరుగాని, అంతకంటె అధికము గాని ఎక్కువ సంపాదించిన జూదరి నుండి సభికుడు రాజునకు సభికుడు ( ద్యూతగృహాధ్యక్షుడు) నూటిలో పదవ వంతు తీసికొనవలెను. మరల అంత లాభము వచ్చినప్పుడు నూటికి పదవ వంతు తీసుకొనవలెను. రాజుచే బాగుగ పరిపాలింపబడిన సభికుడు రాజునకు నర్ణీతభాగమును ఇవ్వవలెను. జయించిన ధనమును జయించిన వానికే యిచ్చి క్షమాపరాయణుడై సత్యమునే పలుకవలెను. ప్రసిద్ధులగు జూదరుల సముదాయము సభికులతో సహ రాజువద్దకువెళ్ళి ఆతని భాగమును చెల్లించిననే రాజు జయించనివానికి జయించిన సొమ్మునే ఇప్పించవలెను. ద్యూతమును సంబంధించిన వ్యవహారములను పరిశీలించుటకును, సాక్ష్యము చెప్పుట కును, జూదరులనే నియమించవలెను. తప్పుడు పాచికలతో ఆడించువారి వారి శరీరముపై కొన్ని గుర్తులుచేసి దేశమునుండి వెడలగొట్టవలెను. జూదములో దొంగలను తెలుసుకొనుటకు ఒక్క వ్యక్తినే ప్రధానునిగా నియమించవలెను. ప్రాణి ద్యూతమునందు కూడ ఇదియే నియముము.
అగ్ని మహాపురాణమునందు సీమావివాద ద్యూతాది నిర్ణయమను రెండువందల యేబది ఏడవ అధ్యాయము సమాప్తము.