Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ షష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.
అథ యజుర్విధానమ్
పుష్కర ఉవాచ :
యజుర్విధానం వక్ష్యామి భుక్తిముక్తి|పదం శృణు | ఓంకార పూర్వికారామ మహావ్యాహృతయో మతాః. 1
సర్వకల్మషనాశిర్యః సర్వకామప్రదాస్తథా | అజ్యాహుతి సహస్రేణ దేవానారాధయేద్బుధః. 2
మనసః కాంక్షితం రామ మనసేప్సిత కామదమ్ | శాంతికామో యవైః కుర్యాత్తిలైః పాపాసనుత్తయే. 3
ధానైః సిద్దార్థకైశ్చైవ సర్వకామకరైస్తథా | ఔదుంబరీభిరిధ్యాభిః పశుకామస్య శస్యతే. 4
దధ్నా చైవాన్న కామస్య పయసా శాన్తిమిచ్ఛతః | అపామార్గం సమిద్భిస్తు కామయన్కనకం బహు. 5
కన్యాకామో ఘృతాక్తాని యుగ్మశోగ్రథితానితు | జాతీ పుష్పాణి జుహుయాద్గ్రామార్థీతిలతండులాన్. 6
వశ్యకర్మణి శాఖోట వాసాపా మార్గమేవచ | విషాసృఙ్ మిశ్ర సమిధో వ్యాధిఘాతస్య భార్గవ. 7
క్రుద్ధస్తు జహుయాత్సమ్యక్ఛత్రూణాం వధకామ్యయా | సర్వవ్రీహిమయీం కృత్వా రాజ్ఞః ప్రతికృతింద్విజః.
సహస్రశస్తు జుహుయాద్రాజావశగతో భ##వేత్ | వస్త్రకామస్య పుష్పాణి దూర్వావ్యాధివినాశినీ. 9
బ్రహ్మవర్చస కామస్య వాసోగ్రంచ విధీయతే | ప్రత్యంగిరేషు జహుయాత్తుష కంటకభస్మభిః. 10
విద్వేషణ చ పక్ష్మాణి కాక కౌశికయోస్తథా | కాపిలంచ ఘృతం హుత్వా తథా చంద్రగ్రహేద్విజః. 11
వచాచూర్ణేన సంపాతాత్స మానీయచతాం వచామ్ | సహస్రమంత్రితాం భుక్త్వా మేధావీ జాయతేనరః. 12
ఏకాదశాంగులం శంకుం లౌహం ఖాదిరమేవచ | ద్విషతోవధో7సీతి జపన్నిఖనేద్రి పువేశ్మని. 13
ఉచ్చాటన మిదం కర్మ శత్రూణాం కథితం తవ | చక్షుష్యా ఇతి జప్త్వాచ వినష్టం చక్షురాప్నుయాత్. 14
ఉపయుంజత ఇత్యేతదనువాకం తథాన్నదమ్ | తనూనపాగ్నే సదితి దూర్వాహుత్వార్తివర్జితః. 15
భేషజమసీతి దధ్యాజ్యైర్హోమః పశూపసర్గనుత్ | త్రియంబకం యజామహే హోమః సౌభాగ్యవర్ధనః. 16
కన్యానామ గృహీత్వాతు కన్యాలాభకరః పరః | భ##యేషుతు జపన్నిత్యం భ##యేభ్యో విప్రముచ్యతే. 17
ధుస్తూ (త్తూ) ర పుష్పం సఘృతం హుత్వా స్యాత్సర్వ కామభాక్ |
హుత్వాతు గుగ్గులం రామ స్వప్నే పశ్యతి శంకరమ్. 18
యుంజతే మనో7నువాకం జప్త్వా దీర్ఘాయురాప్నుయాత్ | విష్ణోరరాట మిత్యేతత్సర్వ బాధావినాశనమ్. 19
రక్షోఘ్నం చ యశస్యం చ తథైవ విజయప్రదమ్ | అయంనో అగ్నిరిత్యేతత్సంగ్రామే విజయప్రదమ్.20
ఇదమాపః ప్రవహత స్నానే పాపాపనోదనమ్ | విశ్వకర్మన్ను హవిషా సూచీం లౌహీం దశాం గులామ్.
కన్యాయా నిఖనే ద్ద్వారి సా7ప్యసై#్మ నప్రదీయతే | దేవ సవితరేతేన హుతేనైతేన చాన్నవాన్. 22
పుష్కరుడు పలికెను. పరశురామ ! ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు యజుర్విధానమును చెప్పెదను వినుము. ఓంకార యుక్తములగు మహావ్యాహృతులు సకల పాపనాశకములు, సర్వకామప్రదములు. బుద్ధిమంతుడు వీటితో నూరు హోమములు చేసి దేవతలను ఆరాధించవలెను. దీని వలన మనోవాంఛితములగు కోరికలు తీరును శాంతికాముడు యవలతోను పాపవినాశనమును కోరువాడు తిలలతోను, హోమము చేయవలెను. ధాన్యములతోను తెల్లావాలతోను హోమము చేసినచో సర్వకామములు సిద్ధించును. పశుకాముడు ఉదుంబరమిధలతో హోమము చేయవలెను. అన్నకాముడు పెరుగుతోను శాంతి కాముడు పాలతోను, అధికసువర్ణకాముడు అపామార్గసమిధలతోను హోమము చేయవలెను. కన్యకను కోరువాడు రెండేసి చొప్పున కట్టిన, నేతితో తడిపిన జాతిపుష్పములను హోమము చేయవలెను. కామము కోరువాడు తిలలను తండులములను హోమము చేయవలెను. వశీకరణ కర్మయందు శాకోట - వస - అపామార్గ - సమిధలను హోమము చేయవలెను. ఓ భార్గవా! రోగనాశనిమిత్తము విషరక్తములతో తడిపిన సమిధలు హోమముచేయవలెను. శత్రువధ కోరువారు క్రోధపూర్వకముగ పైసమిధలను హోమము చేయవలెను. ద్విజుడు అన్నిధాన్యములతో ఒక రాజప్రతిమను నిర్మించి దానిని వేయిసార్లు హోమము చేసినచో రాజు వశమగును. వస్త్రకాముడు పుష్పములను హోమముచేయవలెను. ''దూర్వా'' హోమము వ్యాధి వినాశకము. బ్రహ్మతేజము కోరువాడు ఉత్తమ వస్త్రమును అర్పించవలెను. విద్వేషణకర్మయందు ప్రత్యంగిరోక్త విధానానుసారముగ స్థాపించిన అగ్నియందు పొల్లుముల్లు, భస్మము, కాకి ఈకలు, గుడ్లగూబ ఈకలు హోమము చేయవలెను. చంద్రగ్రహణసమయమున కపిలధేను ఘృతమును, హోమముచేసి అఘృతమునందు వసా చూర్ణమును కలిపి ''సంపాతము'' అనే ఆహుతినిచ్చి, మిగిలిన వసను తీసుకొని వెయ్యిసార్లు గాయత్రిచే అభిమంత్రించి, అవసను తిన్నచో మేధావియగును. పదకొండు అంగుళముల లోహశంకువుకాని ఖదిర వృక్షపు శంకువు కాని ''ద్విషతోవధో7సి'' (1.28) అను మంత్రమును జపించుచు శత్రువు ఇంటిలో పాతవలెను. ఈ విధముగా శత్రువినాశకమగు కర్మను నీకు చెప్పితిని. ''చక్షుష్యా'' (2.16) ఇత్యాది మంత్రమును జపించుటచే పోయిన చూపువచ్చును. ''ఉపయుంజతే'' ఇత్యాది అనువాకము అన్నమునుఇచ్చును. ''తనూనపాగ్నే7సి'' (3-17) ఇత్యాదిమంత్రముతో దూర్వాహోమము చేసినచో సంకలములు దూరమగును. ''ఖేషజమసి'' (3-59) ఇత్యాది మంత్రముతో పెరుగు, నెయ్యి హోమము చేసినచో పశువునకు వచ్చు మహామారి రోగములు తొలగిపోవును. ''త్రియంబకం యజామహే'' (3-60) అను మంత్రము చేత చేసినహోమము సౌభాగ్యవృద్ధికరము కన్య యొక్క పేరు చెప్పికాని కన్యనుద్దేశించికాని ఈ మంత్రముతో జపహోమములు చేసినచో ఇది కన్యాలాభమునకు ఉత్తమ సాధనము. భయములు వచ్చినపుడు నిత్యము ఈ మంత్రమును జపించువాడు భయవిముక్తుడగును. ఈ మంత్రముతో ఘృతమిశ్ర తత్తూర పుష్పములను హోమము చేసినవాడు సర్వకామములను పొందును. ఈ మంత్రముతో ''గుగ్గులు'' హోమము చేసిన వాడు స్వప్నమునందు శంకరుని చూచును. ''యుంజతేమనః'' (5-14) అను అనువాకమును జపించినవాడు దీర్ఘాయుర్దాయమును పొందును. ''విష్ణోరరాటమసి'' అను మంత్రము సకల బాధలను నివారించును. రాక్షసులను నశింపచేయును. ఇది కీర్తివర్ధకము విజయప్రదము. ''అయంనోఅగ్నిః'' (5-37) ఇత్యాది మంత్రము యుద్ధమునందు జయప్రదము. ''ఇదమాపః ప్రవహత'' (6-17) అను మంత్రము జపించుచు స్నానము చేసినచో పాపనాశకము. పది అంగుళముల పొడవైన ఇనుపఊచను ''విశ్వకర్మన్ హవిషా'' (17-22) అను మంత్రముచే అభిమంత్రించి యేకన్యకయొక్క ద్వారమువద్ద పాతెదరో ఆ కన్యను మరెవరికి ఇవ్వజాలరు. ''దేవసవితః'' (11-7) అనుమంత్రముతో హోమము చేసినవాడు అన్నవంతుడగును.
అగ్నౌస్వాహేతి జహుయాద్భల కామో ద్విజోత్తమః | తిలైర్య వైశ్చ ధర్మజ్ఞ తథాపామార్గతండులైః. 23
సహస్రమంత్రితాం కృత్వా తథా గోరోచనా ద్విజ | తిలకంచ తథాకృత్వా జనస్య ప్రియతామియాత్. 24
రుద్రాణాం చ తథా జప్యం సర్వాషు వినిషూదనమ్ | సర్వకర్మకరో హోమస్తథా సర్వత్ర శాంతిదః. 25
అజావికానామశ్వానాం కుంజరాణాం తథాగవామ్ | మనుష్యాణాం నరేంద్రాణాం బాలానాం యోషితామపి.
గ్రామాణాం నగరాణాంచ దేశానామపి భార్గవ | ఉపద్రుతానాం ధర్మజ్ఞ వ్యాధితానాం తథైవచ. 27
మరకేసమను ప్రాప్తే రిపుజే చ తథాభ##యే | రుద్రహోమః పరాశాంతిః పాయసేన ఘృతేనచ. 28
కూష్మాండ ఘృత హోమేన సర్వాన్పాపాన్వ్యపోహతి | సక్తుయావక భైక్షాశీ నక్తం మనుజసత్తమ. 29
బహిః స్నానరతో మాసాన్ముచ్యతే బ్రహ్మహత్యయా | మధువాతేతి మంత్రేణ హోమాదితో7ఖిలంలభేత్. 30
దధిక్రావ్ణేతి హుత్వాతు పుత్రాన్ర్పాప్నోత్య సంశయమ్ | తథాఘృతవతీత్యేతదాయుష్యం స్యాద్ఘృతేన తు. 31
స్వస్తిన ఇంద్ర ఇత్యేతత్సర్వ బాధావినాశనమ్ | ఇహగావః ప్రజాయధ్వమితిపుష్టివివర్ధనమ్. 32
ఘృతాహుతి సహస్రేణ తథా7లక్ష్మీ వినాశనమ్ | స్రువేణ దేవస్య త్వేతి హుత్వాపామార్గతండులమ్. 33
ముచ్యతే వికృతాచ్ఛీఘ్ర మభిచారాన్న సంశయః |
రుద్రపాతు (ద్రంయత్తే) పలాశస్య పమిద్భిః కనకం లభేత్. 34
శివో భ##వేత్యగ్న్యుత్పాతే వ్రీహిభిర్జుహుయాన్నరః | యాః సేనా ఇతి చైతచ్చ తస్యరేఖ్యో భయాపహమ్. 35
యో అస్మభ్య మవాతీయాద్ధుత్వా కృష్ణతిలాన్నరః | సహస్రశో7భిచారాచ్చ ముచ్యతే వికృతాద్‌ద్విజః. 36
అన్నేనాన్నపతే త్యేవం హుత్వా చాన్న మవాప్నుయాత్ | హంసః శుచిషదిత్యేతజ్జప్తం తోయే7షు నాశనమ్.
చత్వారి శృంగే త్యేతత్తు సర్వపాపహరం జలే | దేవాయజ్ఞేతి జప్త్వాతు బ్రహ్మలోకే మహీయతే. 38
వసంతేతిచ హుతవ్‌ఆజ్యమాదిత్యాద్వ రమాప్నుయాత్ | సుపర్ణో సీతి చేత్యస్య కర్మవ్యాహృతి వద్భవేత్. 39
నమః స్వాహేతి త్రిర్జప్త్వా బంధనాన్మోక్ష మాప్నుయాత్ | అంతర్జలే త్రిరావర్త్య ద్రుపదాసర్వ పాపముక్.
(అ) 2 /19
బల కాముడగు ద్విజుడు ''అగ్నౌస్వాహా'' అనుమంత్రముతో తిలలు యవలు, అపామార్గ సమిధలు తండులములు హోమము చేయవలెను. ఈ మంత్రముతో వెయ్యిపర్యాయములు అభిమంత్రించిన గోరోచనమును తిలకముగా ధరించినచో లోకప్రియుడగును. రుద్రమంత్రముల జపము సర్వపాద వినాశకము. వానితో చేసిన హోమము సర్వకర్మ సాధకము. అంతటను శాంతిప్రదాయకము. మేకలు, గొఱ్ఱలు, గుర్రములు, ఏనుగులు, గోవులు, మనుష్యులు, రాజులు, బాలురు, స్త్రీలు, గ్రామములు, నగరములు, దేశములు, వివిధోపద్రవ పీడితములై రోగగ్రస్తులైనను మహామారీ భయము కాని శత్రుభయము కాని వచ్చినను ఘృతమిశ్రితమగు పాయసముతో రుద్రదేవతనుద్దేశించి హోమము చేసినచో గొప్పశాంతి లభించును. ఓ నరశ్రేష్ఠా! రాత్రియందు మాత్రమే సక్తువులు యవల గంజి భిక్షాన్నము భుజించుచు ఒక మాసముపాటు బయటస్నానము చేయువాడు బ్రహ్మహత్యా పాపవిముక్తుడగును. ''మధువాతా'' (13-17) ఇత్యాది మంత్రముతో హోమాదులు చేసినచో సర్వము లభించును. ''దధిక్రావ్‌ణో'' (23-32) అను మంత్రముచే హోమముచేయు గృహస్థుడు నిస్సంశయముగా పుత్రులను పొందును. ''ఘృతవతీ భువనానామఖి'' (34-45) అను మంత్రముతో ఘృతహోమము చేసినచో ఆయుర్వృద్ధి కలుగును. ''స్వస్తినః ఇంద్రః'' (25-19) అనుమంత్రము సమస్తబాధలను నశింపచేయును. ''ఇహగావః ప్రజాయధ్వం'' అను పుష్టివర్ధక మంత్రముతో వెయ్యి ఘృతహోమములు చేసినచో దారిద్ర్యము నశించును. ''దేవస్యత్వా'' అను మంత్రముతో సృఉవముతో అపామార్గ సమిధలను, తండులములను హోమము చేసినవాడు శీఘ్రముగా అభిచారవిముక్తుడగును. సంశయము లేదు ''రుద్రయత్తే'' (10-20) అను మంత్రముతో పలాశసమిధలను హోమము చేసినచో సువర్ణము లభించును. అగ్ని ప్రమాదము కల్గినపుడు ''శివోభవ'' (11.45) అనుమంత్రముతో వ్రీహి హోమము చేయవలయును. ''యాఃసేనాః'' అను మంత్రము చోరభయము తొలగించును. ''యో అస్మభ్యమరాతీయాత్ '' (11-80) అను మంత్రముతో వెయ్యి తిలహోమములు చేయువాడు భయంకరమగు అభిచారము నుండి విముక్తుడగును. ''అన్నపతే'' (11-83) అను మంత్రముతో అన్నహోమమును చేసినవానికి అన్నము లభించును. నీటిలో నిలచి ''హంసః శుచిషత్'' (11-24) అను మంత్రమును జపించినచో సర్వపాపములు నశించును. నీటిలో నిలచి ''చత్వారిశృంగా'' (17-91) అను మంత్రమును జపించినచో సర్వపాపములు నశించును. ''దేవాయజ్ఞ మతన్వత'' (19-12) అను మంత్రమును జపించువాడు బ్రహ్మలోకమున పూజితుడగును. ''వసంతో7స్యాసీత్'' (31-14) అనుమంత్రముతో ఆజ్యహోమము చేయువానికి సూర్యుడు వరముల నిచ్చును. ''సువర్ణో7సి'' (17-22) అనుమంత్రముతో వ్యాహృతి మంత్రములతో చేసినట్లే కర్మ చేయవలెను. ''నమఃస్వాహా'' ఇత్యాది మంత్రమును మూడు పర్యాయములు జపించినవాడు బంధవిముక్తుడగును నీటిలో నిలచి ''దృఉపదాదివ'' (20-20) అనుమంత్రమును మూడు పర్యాయములు చెప్పువాడు సర్వపాపవిముక్తుడగును.
ఇహగావః ప్రజాయధ్వం మంత్రోయం బుద్ధివర్దనః | హుతంతు సర్పిషాదధ్నా పయసా పాయసేనవా. 41
శతం య ఇతి చైతేన హుత్వా పూర్ణఫలానిచ | ఆరోగ్యం శ్రియమాప్నోతి జీవితం చచిరం తథా. 42
ఓషధీః ప్రతిమోదధ్వం వషనే లవనే7ర్థకృత్ | అశ్వావతీ పాయసేన హోమాచ్ఛాన్తి మవాప్నుయాత్. 43
తస్మా ఇతి చ మంత్రేణ బంధనస్థో విముచ్యతే | యువా సువాసా ఇత్యేవ వాసాంస్యాప్నోతి చోత్తమమ్. 44
ముంచంతు మాశపథ్యాని (ది) సర్వాన్తక వినాశనమ్ | మామాహింసీ స్తిలాజ్యేన హుతం రిపు వినాశనవ్జు.
నమో7స్తు సర్వసర్పేభ్యో ఘృతేన పాయసేనతు | కృణుధ్వం రాజ ఇత్యేతదభిచార వినాశనమ్. 46
దూర్వాకాండాయుతం హుత్వా కాండాత్కాండేతి మానవః |
గ్రామే జనపదే వాపి మరకం తు శమం నయేత్. 47
రోగార్తో ముచ్యతే రోగాత్తథా దుఃఖాత్తు దుఃఖితః | ఔదుంబరీశ్చ సమిధో మధుమాన్నో వనస్పతిః. 48
హుత్వా సహస్రశో రామ ధనమాప్నోతి మానవః | సౌభాగ్యం మహదాప్నోతి వ్యవహారే తథాజయమ్. 49
అపాం గర్భమితి హుత్వాదేవం వర్షాపయేద్ధృవమ్ | అపః పిబేతి చ తథా హుత్వా దధిఘృతం మధు. 50
ప్రవర్తయతి ధర్మజ్ఞ మహావృష్టి మనన్తరమ్ | నమస్తే రుద్ర ఇత్యేతత్స్వోపద్రవ నాశనమ్. 51
సర్వశాంతికరం ప్రోక్తం మహాపాతక నాశనమ్ | ఆధ్యవోచ దిత్యనేన రక్షణం వ్యాధితస్యతు. 52
రక్షోఘ్నం చ యశస్యంచ చిరాయుః పుష్టివర్ధనమ్ | సిద్ధార్థకానాం క్షేపేణ పథి చైతజ్జపన్సుఖీ. 53
అసౌ యస్తామ్ర ఇత్యేతత్పథన్నిత్యం దివాకరమ్ | ఉపతిష్ఠేత ధర్మజ్ఞ సాయంప్రాతర తంద్రితః. 54
అన్నమక్షయమాప్నోతి దీర్ఘమాయుశ్చ విన్దతి | ప్రముంచ ధన్వన్నిత్యేతత్షడ్బిరాయుధ మంత్రణమ్. 55
రిపూణాం భయదం యుద్ధే నాత్రకార్యావిచారణా | మానో మహాన్త ఇత్యేవం బాలానాం శాంతికారకమ్. 56
నమో హిరణ్యబాహవే ఇత్యనువాకసప్తకమ్ | రాజికాం కటుతైలాక్తాం జుహుయాచ్ఛత్రునాశినీమ్. 57
నమోవః కిరికేభ్యశ్చ పద్మలక్షైర్హుతైర్నరః | రాజలక్ష్మీమవాప్నోతి తథా బిల్వైః సువర్ణకమ్. 58
ఇమారుద్రాయేతి తిలైర్హోమాచ్చ ధనమాప్యతే | దూర్వాహోమేన చాన్యేన సర్వవ్యాధి వివర్జితః. 59
ఆశుః శిశాన ఇత్యేతదాయుధానాం చరక్షణ | సంగ్రామే కథితం రామ సర్వశత్రునిబర్హణమ్. 60
రాజసామేతి జుహుయాత్సహస్రం పంచభిర్ద్విజ | అజ్యాహుతీనాం ధర్మజ్ఞ చక్షూరోగాద్విముచ్యతే. 61
''ఇహగావః ప్రజాయధ్వం'' అను మంత్రముతో నెయ్యి, పెరుగు, పాలు లేదా పాయసము హోమము చేసినచో బుద్ధి వృద్ధి చెందును. ''శంన్నో దేవీః'' అను మంత్రముతో పలాశఫలములను హోముమ చేసినవానికి ఆరోగ్యము, లక్ష్మి చిరజీవనము లభించును. ''ఓషధిఃప్రతిమోదధ్వం'' (12-17) అను మంత్రముతో విత్తనుముల చల్లునపుడు, పంటకోయునపుడు హోమము చేసినచో అర్థప్రాప్తి కలుగును. ''అశ్వావతీః'' (34-40) అను మంత్రముతో పాయస హోమము చేసిన శాంతి లభించును. ''తస్మాఅరం'' (36-16 ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో బందియైన వాడు విడువబడును. ''యువాసువాసా'' (తై||బా|| 3-6-13) అను మంత్రముతో హోమము చేసిన వస్త్రము లభించును. ''మంచన్తు మాశపథ్యాత్'' (12-90) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో శాపాదులు నశించును. ''మామాహింసీజనీతాః'' (12-102) అను మంత్రముతో ఘృతమిశ్ర తిలలు హోమముచేయగ శత్రవులు నశింతురు.'' నమో7స్తు సర్వేభ్యః'' (13-6) అనుమంత్రముతో ఘృత హోమము ''కృణుధ్వం రాజ'' అను మంత్రముతో పాయసమును హోమము చేసినచో అభిచారము, నశించును. ''కాండాత్కాండాత్'' (13-20) అను మంత్రముతో దూర్వాకాండములను వెయ్యిపర్యాయములు హోమము చేసినచో గ్రామములో గాని జనపదములోగాని వ్యాపించిన మహామారి శాంతించును. రోగపీడితుడు రోగవిముక్తుడగును. దుఃఖితుడు దుఃఖవిముక్తుడగును. ''మధుమాన్నోవనస్పతిః'' (13-29) అను మంత్రముతో వెయ్యి ఉదుంబర సమిధలు హోమము చేయుటచే ధనము గొప్ప సౌభాగ్యము, వ్యవహారములో విజయము లభించును. ''అపాంగర్భంసీద'' (వా||13-30) అనుమంత్రముతో హోమముచేయువాడు తప్పక పర్జన్య దేవునిచే వర్షముకుర్పింప చేయును. ''అపఃపిబన్'' (14-8) ఇత్యాది మంత్రముతో దధిఘృత మధువులను హోమము చేసినచో వెంటనే గొప్పవర్షము కురియును. ''నమస్తేరుద్ర'' (16-1) అను మంత్రము సర్వోపద్రవనాశకము, సర్వశాంతికరము, మహాపాతకములను నశింపచేయును. ''అధ్యవోచ దధిపక్తా'' (16-5) అను మంత్రముతో హోమము చేసినచో వ్యాధిగ్రస్తుడు రక్షింపబడును, రాక్షసులు నశింతురు, యశస్సులు లభించును. చిరాయువు పుష్టివృద్ధికలుగును. ఈమంత్రము చదువుతూ మార్గమునందు తెల్లఆవాలను చల్లు బాటసారి సుఖవంతుడగును. ''అసౌయస్తామ్రః'' (16-6) అనుమంత్రమును చదువుచూ, నిత్యము సాయం ప్రాతఃకాలములందు, ఆలస్యరహితుడు సూర్యోపస్థానము చేయుడు అక్షయమైన అన్నమును, దీర్ఘాయువును పొందును. ''ప్రముంచధన్వన్'' (16-9-14) ఇత్యాదిమంత్ర షట్కముతో ఆయుధములను అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులకు భయము కలుగును. ఈ విషయమున మరియొక విధముగా ఆలోచింప పనిలేదు. ''మానోమహాంతం'' (16-15) అను మంత్రము బాలలకు శాంతికారకము. ''నమోహిరణ్యవాహవే'' అను ఏడు అనువాకములతో తైలము కలిపిన రాజికలను హోమము చేసినచో శత్రువులు నశింతురు. ''నమోవఃకిరికేభ్యః'' (16-46) అను మంత్రముతో ఒకలక్ష కమలములను హోమము చేసినవాడు రాజ్యలక్ష్మిని, ఒక బిల్వఫలముల హోమము చేసినవాడు, సువర్ణ రాశిని పొందును. ''ఇమారుద్రాయ'' (16-48) అనుమంత్రముతో తిలహోమము చేసినచో ధనములభించును. ఈ మంత్రముతోనే దూర్వాహోమము చేసినచో సర్వవ్యాధులు నశించును. ''అశుఃశిశానః'' (17-33) అను మంత్రముతో ఆయుధములకు రక్ష, యుద్ధములందు సర్వ శత్రువినాశము కలుగును. ''వాజశ్చమే'' (18-15-19) ఇత్యాది మంత్రపంచకముతో అజ్యాహుతులు వెయ్యి చేసినచో నేత్రరోగములనుండి విముక్తుడగును.
శన్నోవనస్పతేగేహే హోమః స్యాద్యవాస్తు దోషనుత్|
అగ్న ఆయూంషి హుత్వాజ్యం ద్వేషం నాప్నోతి కేనచిత్. 62
అపాంఫేనేతి లాజాభిర్హుత్వా జయమవాప్నుయాత్ | భద్రా ఇతీంద్రియైర్హీనో జపన్స్యాత్సకలేంద్రియః. 63
అగ్నిశ్చపృథివీ చేతి వశీకరణ ముత్తమమ్ | అధ్వనేతి జపన్మంత్రం వ్యవహారే జయీభ##వేత్. 64
బ్రహ్మరాజన్యమితిచ కర్మారంభేతు సిద్ధికృత్ | సంవత్సరో7సీతి ఘృతైర్లక్షహోమాదరోగవాన్. 65
కేతుం కృణ్వన్నిత్యే తత్సంగ్రామే జయవర్ధనమ్ | ఇంద్రోగ్నిర్ధర్మ ఇత్యేతద్రణ ధర్మనిబంధనమ్. 66
ధన్వా నాగేతి మంత్రశ్చ ధనుర్గ్రాహణికః పరః | యుంజీతేతి తథామంత్రో విజ్ఞేయోహ్యభిమంత్రణ. 67
మంత్రశ్చాహి రథేత్యేతచ్ఛరాణాం మంత్రణ భ##వేత్ | వహ్నీనాం పితరిత్యేతత్తూణమంత్రః ప్రకీర్తితః. 68
యుంజ న్తీతి తథాశ్వానాం యోజనేమంత్ర ఉచ్యతే | ఆశుః శిశాన ఇత్యేతద్యాత్రారంభణ ముచ్యతే. 69
విష్ణోః కర్మేతి మంత్రశ్చ రథారోహిణికః పరః | ఆజంఘేతీతి చాశ్వానాం తాడనీయ ముదాహృతమ్. 70
యాః సేనా అభిత్వరీతి పరసైన్య ముఖేజ పేత్ | దుందుభ్య ఇతి చాప్యేతద్దుందుభీతాడనం భ##వేత్. 71
ఏతైః పూర్వహితైర్మంత్రైః కృత్వైవం విజయీభ##వేత్ | యమేన దత్తమిత్యస్య కోటి హోమాద్విచక్షణః. 72
రథముత్పాదయేచ్ఛీఘ్రం సంగ్రామే విజయప్రదమ్ | ఆకృష్ణేతి తథైతస్య కర్మవ్యాహృతివద్భవేత్. 73
శివసంకల్ప జాపేన సమాధిం మనసో లభేత్ | పంచనద్యః పంచలక్షం హుత్వాలక్ష్మీమవాప్నుయాత్. 74
యదా వధూ దాక్షాయణం మంత్రే ణానేన మంత్రితమ్ | సహస్రకృత్వః కనకం ధారయేద్రిపువారణమ్. 75
ఇమం జీవేభ్య ఇతిచ శిలాం లోష్టం చతుర్థిశమ్ | క్షి పేద్గృహే తదా తస్యన స్యాచ్చోర భయం నిశి. 76
పరిమే గామనేనేతి వశీకరణ ముత్తమమ్ | హన్తుమభ్యాగతస్తత వశీభవతి మానవః. 77
భక్ష్యతాంబూల పుష్పాద్యం మంత్రితం తుప్రయచ్ఛతి | యస్యధర్మజ్ఞ వశగః సో7స్య శీఘ్రం భవిష్యతి. 78
శన్నోమిత్ర ఇతీత్యేతత్సదా సర్వత్రా శాంతిదమ్ | గణానాంత్వా గణపతిం కృత్వా హోమం చతుష్పథే. 79
వశీకుర్యాజ్జగత్సర్వం సర్వధాన్యైర సంశయమ్ | హిరణ్యవర్ణాః శుచయో మంత్రో7య మభిషేచనే. 80
శన్నోదేవీరభిష్టయే తథా శాంతికరః పరః | ఏక చక్రేతి మంత్రేణ హుతేనాజ్యేన భాగశః. 81
గృహేభ్యః శాంతి మాప్నోతి ప్రసాదం చన సంశయః |
గావోభగ ఇతి ద్వాభ్యాం హుత్వాజ్యంగా అవాప్నుయాత్. 82
ప్రవాదాంషః సోపదితి గ్రహయజ్ఞే విధీయతే | దేవేభ్యో వనస్పత ఇతి ద్రుమయజ్ఞే విధీయతే. 83
గాయత్రీ వైష్ణవీ జ్ఞేయా తద్విష్ణోః పరమం పదమ్ | సర్వపాపప్రశమనం సర్వకామకరం తథా. 84
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యజుర్విధానం నామ షష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.
''శంనో వనస్పతే'' (19-38) అనుమంత్రముతో గృహమునందు హోమము చేసినచో వాస్తుదోషములు నశించును. ''అగ్న ఆయానాంసి'' (19-38) అను మంత్రముతో ఆజ్యహోమము చేయువానికి ఎవ్వనితోను వైరముండదు. ''అంపాంఫేనేన'' (19-71) అను మంత్రముతో లాజహోమము చేసినవాడు విజయము పొందును. ''భద్రాహుత'' (14-39) అను మంత్రమును జపించిన ఇంద్రియహీనుడు, లేనా దుర్బలేంద్రియుడు ఇంద్రియశక్తి సంపన్నుడగును. ''అశిశ్చపృథివీచ'' (26-1) అను మంత్రము గొప్ప వశీకరణ మంత్రము. ''అధ్వనా'' (5-33) అనుమంత్రమును జపించువాడు వ్యవహారమున జయమును పొందును. కార్యప్రారంభమున ''బ్రహ్మక్షత్రంపవతే'' (19-5) అనుమంత్రమును జపించినచో కార్యసిద్ధికలుగును. ''సంవత్సరో7సి'' అను మంత్రముతో లక్ష ఆజ్యహోమములు చేసినవాడు రోగవిముక్తుడగును. ''కేతుంకృణ్వన్'' (29-37) అను మంత్రము యుద్ధమునందు జయవర్ధకము. ''ఇంద్రో7గ్నిధర్మః'' అనుమంత్రము యుద్ధమునందు ధర్మసమ్మతమైన విజయము నిచ్చును. ధనుస్సును ధరించునపుడు ''ధన్వనాగా'' (29-39) అను మంత్రమును జపించుట ఉత్తమము. ''యజీత అను మంత్రముచే ధనుస్సునభిమంత్రించవలెను. ''అహిరివ'' (29-51) అను మంత్రముచే బాణములను అభిమంత్రించ వలెను ''వహ్నీనాం పితః (29-42) అను మంత్రమును తూణీరమును అభిమంత్రించవలెను. ''యుంజన్త్యస్యా'' (23-6) అను మంత్రమును చదువుచు గుర్రములను రథములకు కట్టవలెను. యాత్రారంభ సమయమున ''ఆశువుశిశానః' (17-35) అను మంత్రమును చదువవలెను. రథారోహణసమయమున ''విష్ణోఃక్రమోసి'' (12-5) అను మంత్రమును గుర్రములను తొలిసారిగా తోలునపుడు ''అజంఘన్తి'' (29-50) అను మంత్రమును, శత్రుసేనెదుట ''యాస్సేనాఅభిత్వరీః'' (11-77) అను మంత్రమును, దుందుభివాయించునపుడు ''దుందుభ్యః'' అను మంత్రమున పఠించవలెను. ముందుగా ఈమంత్రములతో హోమముచేసి, తరువాత ఈ విధముగ చేసినచో విజయము లభించును. ''యమేనదత్తమ్'' (29-13 అను మంత్రముతో కోటిహోమములు చేసినచో యుద్ధమునందు వెంటనే విజయమునిచ్చు రథము ఆవిర్భవించును, ''ఆకృష్ణేన'' అను మంత్రము వ్యాహృతులతో చేసిన కర్మల వంటికర్మలను చేయవలయును. ''మజ్జాగత్రః'' (34-1) ఇత్యాది శివసంకల మంత్రములను జపించుటచే మనస్సుకు ఏకాగ్రత లభించును ''పంచపద్యః'' (34-11) అనుమంత్రముతో ఐదు లక్షల హోమము చేసినవాడు లక్ష్మిని పొందును. ''యదాబధ్నన్ దాక్షాయణాః'' (34-52) అను మంత్రముతో వెయ్యిపర్యాయములు అభిమంత్రించిన సువర్ణమును ధరించినచో అది శత్రునివారణము. ''ఇమంజీవేభ్యః (35-15) అనుమంత్రమును చదువుచు రాళ్లులని మట్టిపెడ్డలు గాని అభిమంత్రించి ఇంటినలువైపుల విసిరినచో రాత్రిచోరభయము ఉండదు. ''ప్రమేగామరేషత్'' (35-18) ది ఉత్తమమై వశీకరణ మంత్రము. చంపుటకు వచ్చినవాడు కూడ లొంగిపోవును ఓధర్మజ్ఞుడా! ఈ మంత్రముతో అభిమంత్రించిన భక్ష్యములు తాంబూలములు పుష్పములు మొదలగు నవి ఎవనికైన ఇచ్చినచో వాడు శీఘ్రముగా వశ##మై పోవును ?? నోమిత్రః ''( 36-9) అను మంత్రము అంతటను ఎల్లవేళలను శాంతిప్రదము ''గణానాత్వాగణపతిం'' (23-19 అను మంత్రముతో చతుష్పదమునందు సర్వధాన్యములను హోమము చేసినవాడు జగత్తునంతను వశము చేసుకొనును. సందేహము లేదు. అభిషేక సమయమున ''హిరణ్య వర్ణాః శుచయః'' అను మంత్రమును పఠించవలెను. ''శంనోదేవీంభీష్టయే'' అను మంత్రము పరమ శాంతికారకము. ఏకచక్ర ఇత్యాదిమంత్రముతో ఆజ్యభాగపూర్వకముగా గృహమునకు ఆజ్యహోమము చేసినచో గ్రహముల అనుగ్రహము శాంతి లభించును. సందేహములేదు. ''గావుపావతాపం'' (33-29) ''భగపణతః '' (34-36-37) అనుమంత్రత్రయముచే ఆజ్యహోమము చేసినవానికి గోవులు లభించును. ''ప్రవాదాంశః సో?త్ '' అను మంత్రమును గృహయజ్ఞమున ఉపయోగించవలెను. ''దేవేభ్యోవనస్పతే'' ఇత్యాదిమంత్రములను వృక్షయజ్ఞములందు వినియోగించవలెను. గాయత్రి విష్ణురూప మైనదిని తెలుసుకొనవలెను సమస్త పాపములలను శమింపచేయునది, సమస్తకామములను తీర్చునదియగు విష్ణుపరమపదము కూడ గాయత్రియే
అగ్నిమహాపురాణమునందు యజుర్విధానమను రెండువందల అరువదవ అధ్యాయము సమాప్తము.