Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్విషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథాథర్వవిధానమ్‌

పుష్కర ఉవాచః

సామ్నాం విధానం కథితం వక్ష్యే చాథర్వణామథ |

శాంతా (తా) తీయం గణం హుత్వా శాంతిమాప్నోతి మానవః . 1

భైషజ్యంచ గణం హుత్వా సర్వాన్రోగాన్వయపోహతి | త్రిసప్తీయం గణం హుత్వా సర్వపాపైః ప్రముచ్యతే. 2

క్వచిన్నాప్నోతి చ భయం హుత్వా చైవాభయం గణమ్‌| న క్వచిజ్జాయతే రామ గణం హుత్వాపరాజితమ్‌. 3

ఆయుష్యం చ గణం హుత్వా అపమృత్యుం వ్యపోహతి |

స్వస్తిమాప్నోతి సర్వత్ర హుత్వాస్వస్త్యయనం గణమ్‌. 4

శ్రేయసా యోగమాప్నోతి శర్మవర్మగణం తథా | వాస్తోష్పత్యగణం హుత్వా వాస్తుదోషాన్వ్యపోహతి. 5

తథారౌద్రగణః హుత్వా సర్వాన్దోషాన్వ్యపోహతి | ఏతైర్దశగుణౖర్హోమోహ్యష్టాదశసు శాంతిషు. 6

వైష్ణవీ శాంతిరైంద్రీచ బ్రాహ్మీరౌద్రీతథైవచ | వాయవ్యా వారుణీ చైవ కౌబేరీ భార్గవీ తథా. 7

ప్రాజాపత్యా తథాత్వాష్ట్రీ కౌమారీ వహ్నిదేవతా | మారుద్గణాచ గాంధారీశాంతి ర్నైరృతకీతథా. 8

శాంతిరాంగీరసీ యామ్యా పార్థివీ సర్వకామదా |

పుష్కరుడు పలికెను : పరశురామా! సామవిధానము చెప్పబడినది. ఇపుడు అధర్వవిధానమును చెప్పెదను. శాంతాతీయ గణమునుద్దేశించి హోమము చేసినచో మానవుడు శాంతిని పొందును. బహషజ్య గణమునుద్దేశించి హోమము చేసినవాడు సమస్తరోగములను తొలగించుకొనును. ఆసప్తీయ గణమునుద్దేశించి ఆహుతులనిచ్చువాడు సకలపాపవిముక్తుడగును. అభయగజమునకు హోమము చేసిన వానికి పరాజయముండదు. ఆయుష్యగణమునకు హోమమును చేసిన వానికి అపమృత్యు భయముండదు. స్వస్త్యయన గణమునకు హోమము చేసినవాడు అంతటను మంగళములు పొందును. శర్వవర్మగణమునకై హోమము చేయువాడు శ్రేయస్సు పొందును. వాస్తోష్పత్యగణమునకు హోమము చేయువాడు వాస్తుదోషములను తొలగించును. రౌద్రగణమునకు హోమము చేయుటచే సకలదోషములు నశించును. క్రింద చెప్పబోవు పదునెనిమిది విధములగు శాంతులలో పదిగణములకు హోమము చేయవలెను. వైష్ణవీ, ఫోంది, బ్రాహ్మి, రౌద్రి, వాయవ్య, వారుణి, కౌబేరి, భార్గవి, ప్రాజాపత్య, త్వాష్ట్రి కౌమారి, ఆగ్నేయి, మారుద్గణి, గాంధర్వి నైఋతికి, ఆంగిరసి, యామ్య ఈ పదునెనిమిది కోరికలను తీర్చు పార్థివ శాంతులు.

యస్త్వాం మ్యృతురితిహయేతజ్జప్తం మృత్యు వినాశనమ్‌. 9

సుపర్ణస్త్వేతి హుత్వాచ భుజగైర్నైవ బాధ్యతే | ఇంద్రేణ దత్తమిత్యేత్రత్సర్వ కామకరం భ##వేత్‌. 10

ఇంద్రేణ దత్త మిత్యేతత్సర్వ బాధావినాశనమ్‌ | ఇమాదేవీతి మంత్రశ్చ సర్వశాంతి కరః పరః. 11

దేవాంమరుత ఇత్యేతత్సర్వ కామకరం భ##వేత్‌ | యమస్య లోకాదిత్యేతద్దుః స్వప్నశమనం పరమ్‌. 12

ఇంద్రశ్చ (ద్రంచ) పంచవణిజేతి (జ) పుణ్యలాభకరం పరమ్‌ |

కామోమే వాజీతి హుతం స్త్రీణాం సౌభాగ్య వర్ధనమ్‌. 13

తుభ్యమేవ జపన్నిత్యమయుతం తు హుతం భ##వేత్‌ | అగ్నే గోభిన్న ఇత్యేతన్మే ధావృద్ధికరం పరమ్‌. 14

ధ్రువం ధ్రువేణతి హుతం స్థానలాభకరం భ##వేత్‌ | అలక్తజీవేతి శునా కృషిలాభకరం భ##వేత్‌. 15

అహంతు భగ్న ఇత్యేతద్భవేత్సౌభాగ్య వర్ధనమ్‌ | యేమేపాశాస్తథాప్యేతద్బంధనాన్మోక్షకారణమ్‌. 16

శపత్వ హన్నితి రిపూన్నాశ##యే ద్ధోమ జాప్యతః | త్వముత్తమమితీత్యేతద్యశో బుద్ధివివర్ధనమ్‌. 17

యథా మృగమతీత్యేతత్‌స్త్రీణాం సౌభాగ్యవర్ధనమ్‌ | యేన చేహదిశం చైవ గర్భలాభకరం భ##వేత్‌. 18

ఆయంతే యోనిరిత్యేతత్పుత్ర లాభకరం భ##వేత్‌ | శివః శివాభిరిత్యే తద్బవేత్సౌ భాగ్యవర్ధనమ్‌. 19

బృహస్పతిర్నః పరిపాతు పథిస్వస్త్యయనం భ##వేత్‌ | ముంచామిత్వేతి కథితమపమృత్యు నివారణమ్‌. 20

అథర్వశిరసో7ధ్యేతా సర్వపాపైః ప్రముచ్యతే | ప్రాధాన్యేనతు మంత్రాణాం కించిత్కర్మత వేరితమ్‌. 21

వృక్షాణాం యజ్ఞియానాంతు సమిధః ప్రథమం హవిః | ఆజ్యంచ వ్రీహయశ్చైవ తథావై గౌరసర్షపాః. 22

అక్షతాని తిలాశ్చైవ దధిక్షీరేచ భార్గవ | దర్భాస్తథైవ దుర్వాశ్చ బిల్వాని కమలానిచ. 23

శాంతిపుష్టికరాణ్యాహుర్ద్రవ్యాణ్యతాని సర్వశః | తైలం కణాని సర్వజ్ఞ రాజికారుధిరం విషమ్‌. 24

సమిధః కంటకోపేతా అభిచారేషు యోజయేత్‌ | ఆర్షం వై దైవతం ఛందో వినియోగజ్ఞ ఆచరేత్‌. 25

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అథర్వవిధానం నామ ద్విషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

''యస్త్వాం మృత్యుం'' అను మంత్రమును జపించినచో మృత్యువు నశించును. సుపర్ణస్త్వా (4-63) అను మంత్రముచేహోమము చేసినవానికి సర్పబాధ వుండదు. ''ఇంద్రేణదత్తో'' (2-2-94) అను మంప్రము సమస్త కామసిద్ధికరము. ''ఇంద్రేనాదత్తమ్‌'' అను మంత్రము సమస్త బాధావినాశకరము. ''ఇమాయాదేవి'' (2-10-4) అను మంత్రము సర్వశాంతి కరము. ''దేవామరుతః'' అను మంత్రము సకలకామప్రదము. ''యమస్యలోకాత్‌'' (19-56-1) అనుమంత్రము దుస్సప్ననాశమున శ్రేష్ఠము. ''ఇంద్రశ్చపంచవణిజః'' అనుమంత్రము వర్తకములో లాభము కలిగించును. ''కామోమేవాజి'' అను మంత్రముతో హోమము చేసిన స్త్రీలకు సౌభాగ్య వృద్ధి కలుగును. ''తుభ్యమేవ జవీమన్‌'' (2-28-1) అను మంత్రము వెయ్యిసార్లు జపించి దశాంశ హోమము చేసి పిదప ''ఆగ్నేగోభిర్న'' అను మంత్రముతో హోమము చేసినచో మేధాశక్తి పెంపొందును. ''ధ్రువంధ్రువేణ'' (7-84-1) అను మంత్రముతో హోమము చేసినచో ఉత్తమస్థానము లభించును. ''అలక్తజీవేతిశునా'' అను మంత్రము కృషిలో లాభము కలిగించును. ''అహంతే భగ్నః'' అనుమంత్రము సౌభాగ్య వర్ధకము. ''యేమేపాశాః'' అను మంత్రము బంధనమునుండి విముక్తి కలిగించును. ''శపత్వహన్‌'' అను మంత్రముతో జపహోమములు చేసినవాడు శత్రువులను నశింపచేయ కలుగును. ''త్వముత్తమ'' అను మంత్రము యశస్సును బుద్ధిని వృద్ధిపొందించును. ''యదామృగాః'' ఈ మంత్రము స్త్రీల సౌభాగ్యము పెంపొందించును. ''యేనచేహదిశంచైవ'' అను మంత్రము గర్భము నిచ్చును. ''అయంతే యోనిః'' (3-20-1) అను మంత్రము పుత్రలాభకరము. ''శివశ్శివాభిః'' అను మంత్రము సౌభాగ్యవర్ధకము. ''బృహస్పతిర్ణః పరిపాతు'' (7-51-1) అనుమంత్రమును జపించుటచే మార్గమున క్షేమము కలుగును. ''ముంచామిత్వా'' అను మంత్రము అపమృత్యునివారకము. అథర్వశీర్షమును పఠించువారు సమస్తపాప విముక్తుడగును. కొన్ని ప్రధాన మంత్రములచే సాధింపతగిన కర్మలను నీకుచెప్పితిని. పరశురామా! యజ్ఞోపయుక్తములగు వృక్షముల సమిధలు అన్నిటి కంటెను ముఖ్యమైన హవిస్సు, ఘృతము, ధాన్యము, తెల్లని ఆవాలు, అక్షింతలు, తిలలు, దధి, దుగ్ధము, కుశలు దుర్వలు, బిల్వములు, ఈద్రవ్యములు కూడ శాంతిపుష్టి కరములు. తైలము, కణములు, రాజికలు, రక్తము, విషము, కంటక యుక్తసమిధలు వీటిని అభిచార ప్రయోగము నందు ఉపయోగించవలెను. మంత్రముల ఋషి, దేవతా, ఛందో, వినియోగములు తెలిసినవాడే ఆయామంత్రములతో ఆయాకర్మలను చేయవలెను.

అగ్నిమహాపురాణమున అథర్వవిధానమును రెండువందల అరువదిరెండవ అధ్యాయము సమాప్తము.

(అ) 2/20

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page