Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుఃషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః

పునరుత్పాత శాంతయః

పుష్కర ఉవాచః

దేవపూజాదికం కర్మ వక్ష్యే చోత్పాత మర్దనమ్‌ | ఆపోహిష్ఠేతి తిసృభిః స్నాతో7ర్ఘ్యం విష్ణవేర్పయేత్‌.

హిరణ్యవర్ణా ఇతి చ పాద్యంచ తిసృభిర్ధ్విజః | శన్న ఆపోహ్యాచమనమిద మాపో7భిషేచనమ్‌. 2

రథేఅక్షే చ తిసృభిర్గంధం యువేతి వస్త్రకం | పుష్పం పుష్పవతీత్యేవం ధూపం ధూపో7పి చాప్యథ. 3

తేజో7సి శుక్రం దీపేస్యాన్మధుపర్కం దధీతిచ | హిరణ్య గర్భ ఇత్యష్టావృచః ప్రోక్తా నివేదనే. 4

అన్నస్యమనుజ్యశ్రేష్ఠపానస్య చ సుగంధినః | చామరవ్య జనోపానచ్ఛత్రం యానాసనే తథా. 5

యత్కించి దేమాదిస్యాత్సావిత్రేణ నివేదయేత్‌ | పౌరుషంతు జపేత్సుక్తం తదేవ జుహుయాత్తథా. 6

అర్చాభావే తథా వేద్యాం జలే పూర్ణఘటే తథా | నదీతీరే7థ కమలే శాంతిః స్యాద్విష్ణుపూజనాత్‌. 7

పుష్కరుడు పలికెను : ఇపుడు ఉత్పాతములను తొలగించు దేవ పూజాది కర్మను గూర్చి చెప్పెదను. స్నానము చేసి ''అపోహిష్ఠా'' మొదలగు (యజు (36-14,16) మూడు మంత్రములతో మహావిష్ణువునకు అర్ఘ్యము సమర్పించి, ''హిరణ్యవర్ణాః'' (ఋక్‌ 11-11-1,3) మొదలగు మూడు మంత్రములతో పాద్యము ''శంనో అపః'' అను మంత్రముతో ఆచమనము, ''ఇదమాపః'' (యజు-6-17) అనుమంత్రముతో అభిషేకమును సమర్పించవలెను. ''రథే'' ''అక్షేమ,'' ''చతస్ర,'' అను మూడు మంత్రములతో గంధమును, ''యువాసువాసాః'' (ఋ.3-8-4) అనుమంత్రముతో వస్త్రమును ''పుష్పవతీ'' (అథర్వ 8-7-27) అనుమంత్రముతో పుష్పమును, ''ధూరసి'' (యుజు 1-8) ఆది మంత్రముతో ధూపమును, ''తేజో7సి'' శుక్రమసి'' (యజు 1-36) అనుమంత్రముతో దీపమును ''దధిక్రావ్ణో'' (యజు 23-23) అను మంత్రముచే మధుపర్కమును సమర్పించి ''హిరణ్యగర్భః'' మొదలగు ఎనిమిది ఋక్కులను పఠించి అన్నమును సుగంధమగు పానీయమును సమర్పించవలెను. మిగిలిన చామర, వ్యజన, పాదుకా, ఛత్ర, యాన, ఆసనాదులను సావిత్రమంత్రముతో సమర్పించవలెను. పురుషసూక్తముతో జపహోమములు చేయవలయును. భగవద్విగ్రహము లేనిచో వేదికపై స్థాపించిన జలపూర్ణకలశము నందుకాని నదీ తటమునందుగాని, కమలమునందుగాని, విష్ణువును పూజించినచో ఉత్పాతములు శమించును.

తతో హోమః ప్రకర్తవ్యో దీప్యమానే విభావసౌ | పరిసంమృజ్య పర్యుక్ష్య పరిస్తీర్య పరిస్తరైః. 8

సర్వాన్నాగ్రం సముద్ధృత్య జుహుయాత్ర్పయతస్తతః | వాసుదేవాయ దేవాయ ప్రభ##వే చావ్యయాయచ. 9

ఆగ్నయే చైవ సోమాయ మిత్రాయ వరుణాయచ | ఇంద్రాయచ మహాభాగ ఇంద్రాగ్నిభ్యాం తథైవచ. 10

విశ్వేభ్యశ్చైవ దేవేభ్యః ప్రజానాం పతయేనమః | అనుమత్యైతథారామ ధన్వన్తరయ ఏవచ. 11

వాస్తోష్పత్యై తతో దేవ్యై తతః స్విష్టకృతే7గ్నయే | స చతుర్థ్యన్త నామ్నాతు హుత్వైతేభ్యో బలింహరేత్‌. 12

తక్షోపతక్షమభితః పూర్వేణాగ్నిమతః పరమ్‌ | అశ్వానా మపి ధర్మజ్ఞ ఊర్ణానామాని చాప్యథ. 13

నిరున్ధీ ధూమ్రిణీకాచ అస్వపన్తీతథైవచ | మేఘపత్నీచ నామాని సర్వేషామేవ భార్గవ. 14

ఆగ్నేయాద్యాః క్రమేణాథ తతః శక్తిషునిక్షిపేత్‌ | నందిన్యై చసుభాగ్యైచ సుమంగళ్యైచ భార్గవ. 15

భద్రకాల్యై తతోదత్వాస్థూణాయాంచ తథాశ్రియే | హిరణ్యకేశ్యైచ తథా వనస్పతయ ఏవచ. 16

ధర్మాధర్మ మ¸° ద్వారే గృహమధ్యే ధృవాయచ | మృత్యవేచ బహిర్దద్యాద్వరుణాయోదకాశ##యే. 17

భూతేభ్యశ్చ బహిర్దద్యాచ్ఛరణ ధనదాయచ | ఇంద్రాయేన్ద్ర పురుషేభ్యో దద్యాత్పూర్వేణ మానవః. 18

యమాయ తత్పురుషేభ్యో దద్యాద్దక్షిణతస్తథా | వరుణాయ తత్పరుషేభ్యో దద్యాత్పశ్చిమేతథా. 19

సోమాయ సోమ పురుషేభ్యో ఉదగ్దద్యాద నంతరమ్‌ | బ్రహ్మణ బ్రహ్మపురుషేభ్యో మధ్యేదద్యాత్తథైవచ.

ఆకాశేచ తథా చోర్ధ్వే స్థండిలాయ క్షితౌ తథా | దివాదివాచరేభ్యశ్చ రాత్రౌరాత్రిచరేషుచ. 21

బలిం బహిస్తథా దద్యాత్సాయం ప్రాతస్తు ప్రత్యహమ్‌ | పిండనిర్వపనంకుర్యాత్ర్పాతః సాయం నకారయేత్‌. 22

భూమిపైనున్న వేదికపై మార్జన ప్రోక్షణములు చేసి దాని నలువైపుల కుశలు పరచి అగ్నిని ప్రదీప్తము చేసి దానిలో హోమము చేయవలెను. పరశురామా! మనస్పును, ఇంద్రియములను నిగ్రహించుకొని అన్ని అన్నములనుండియు మొదటి భాగమును గ్రహించి వాసుదేవాదులకు హోమము చేయవలెను. వాసుదేవ, దేవ, ప్రభు, అద్యయ, అగ్ని, సోమ, మిత్ర, వరుణ, ఇంద్ర, మహాభాగ, ఇంద్రాగ్ని, విశ్వదేవ, ప్రజాపతి, అనుమతి, ధన్వంతరి, వాస్తోష్పతి, దేవి, స్విష్టకృదగ్ని అను దేవతానామములను చతుర్థ్యంతముచేసి, వీటికి హోమముచేసి, క్రిందచెప్పువిధముగ బలి సమర్పించవలెను. ఓ ధర్మజ్ఞ! ముందు ఆగ్నేయ దిక్కునందు ప్రారంభించి, తక్షా, ఉపతక్షా, అశ్వా, ఊర్జ, నిరుంధీ, ధూమ్రణీకా, అస్వపంతీ, మేధపత్నీ, అనువారికి బలి అర్పింపవలెను. ఓ భృగునందన! ఇవి బలిని స్వీకరించు దేవతల పేర్లు. పిదప నందిన్యాది శక్తులకు బలి అర్పింపవలెను. నందినీ, సుభాగ్యా, సుమంగళీ భద్రాకాళీ యను నలుగురు శక్తులకు పూర్వాదిదిక్కులు నాల్గింటియందును బలిన యిచ్చి ఒక శంఖువుపైగాని స్తంభముపైగాని, ''శ్రీహిరణ్యకశీ'' వనస్పతులకు బలియివ్వవలెను. ద్వారము రెండుప్రక్కల ధర్మమయ, అధర్మమయులకు గృహమధ్యమమున ధృఉవునకు ఇంటివెలుపల మృత్యువునకు జలాశయమున వరుణునకు బలిసమర్పించి ఇంటివెలుపల భూతబలిని ఇవ్వవలెను. ఇంటిలోపల కుబేరునకు తూర్పున ఇంద్రునకు ఇంద్రపురుషులకు, దక్షిణమున, యమునకు, యమపురుషులకు , పశ్చిమమున, వరుణునకు వరుణపురుషులకు ఉత్తరమున, సోమమునకు సోమపురుషునకు గృహమధ్యమున బ్రహ్మకు బ్రహ్మపురుషులకు ఆకాశమున విశ్వేదేవతలకు పృథివీపై స్థందల దేవతలకు బలియిచ్చి పిదప పగలు దివాచరములకు రాత్రి రాత్రిచరములకు బలియివ్వవలెను. ప్రతిదినము సాయంకాలమందును ప్రాతఃకాలమునందును ఇంటివెలుపల బలి యివ్వవలెను. ఒక దినమున శ్రాద్ధమునకు సంబంధించిన పిండప్రదానము జరిగినచో ఆనాడు సాయంకాల బలి యివ్వకూడదు.

మిత్రేతు ప్రథమం దద్యాత్తిత్పిత్రే తదనంతరమ్‌ | ప్రపితామహాయ తన్మాత్రే పితృమాత్రేతతో7ర్పయేత్‌.

తన్మాత్రే దక్షిణాగ్రేషు కుశేష్వేవం యజేత్పితౄన్‌ | ఇంద్రావారుణ వాయవ్యా యామ్యావా నైరృతాశ్చయే.

తేకాకాః ప్రతిగృహ్ణంతు ఇమం పిండం మయోద్ధృతమ్‌ |

కాక పిండంతు మంత్రేణ శునః పిండం ప్రదాపయేత్‌. 25

వివస్వతః కులే జాతౌద్వౌశ్వావ (మ) శబలౌశునౌ | తేషాం పిండం వ్రదాస్వామి పథిరక్షస్తు మేసదా. 26

సౌరభేయ్యః సర్వహితాః పవిత్రాః పాపనాశనాః | ప్రతిగృహ్ణన్తు యే గ్రాసం గావసై#్త్రలోక్య మాతరః. 27

గోగ్రాసంచ స్వస్త్యయనం కృత్వా భిక్షాంప్రదాపయేత్‌ |

అతిథీన్దీనాన్పూజయిత్వా గృహీభుంజీతచ స్వయమ్‌.

ఓం భూఃస్వాహా ఓం భువః స్వాహా ఓం స్వః స్వాహా ఓం భూర్భువః స్వాహా

ఓం దేవకృతసై#్యనసో7వయజనమసి స్వాహా |

ఓం పితృ కృతసై#్యనసో7వ యజనమసి స్వాహా |

ఓం ఆత్మకృత సై#్యనసో7వ యజనమసి స్వాహా |

ఓం మనుష్య కృతసై#్యనసో7వ యజనమసి స్వాహా |

ఓం ఏవస ఏవసో7వయజనమసిస్వాహా |

యచ్చాహమేనో విద్వాంశ్చకార |

యచ్చా విద్వాంస్తస్య సర్వసై#్యనసో7వ యజనమసి స్వాహా |

ఆగ్నయే స్విష్ట కృతే స్వాహా |

ఓం ప్రజాపతయే స్వాహా | విష్ణుపూజావైశ్వదేవ బలిస్తే కీర్తితామయా. 28

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఉత్పాత శాంతిర్నామ చతుఃషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః.

పితృశ్రాద్ధమునందు దక్షిణాగ్ర కుశములపై మొదటి తండ్రికి పిదప పితామహునకు పిండదానము చేవలెను. ఇదే విధముగా మొదట తల్లికి, పిదప పితామహికి పిదప ప్రపితామహికి పిండదానము చేయవలెను. ఈ విధముగపితృయాగము చేయ వలయును. వండిన వంటనుండి బలివైశ్వ దేవములు చేసిన పిమ్మట ఐదు బలులు ఇవ్వవలెను ఇంద్ర, వరుణ, వాయు యము, నిఋతి దేవతల దిక్కులందు నివసించు కాకులు నేను ఇచ్చిన ఈ పిండమును గ్రహించుగాక! అను అర్థము గల మంత్రముతో కాక బలి ఇవ్వవలెను శ్యామ శబల, వర్ణములు గల రెండు శునకములు వివస్వంతుని కులమున జన్మించినవి. నేను ఆరెండింటి పిండ ప్రదానము చేయుచున్నాను. అని నన్ను మార్గమునందు సర్వదా రక్షించుగాక! అను అర్థము గల మూలోక్తమంత్రము చదువుతూ కుక్కలకు బలిఇవ్వవలెను. త్రిలోకజననులు, కామధేను పుత్రికలు అయిన గోవులు అందరికిని హితకరములు పవిత్రములు, పాపవినాశకములు. అవినేనిచ్చు ఈ గ్రాసమును గ్రహించుగాక! అను అర్థము గల మూలోక్తముంత్రముతో గోవునకు గ్రాసమును ఇచ్చి స్వస్త్యయనము చేయవలయును. పిదప యాదకులు భిక్షయిచ్చి దీనులగు ప్రాణులకును అతిథులకును అన్నము పెట్టి గృహస్థుడు తాను తినవలెను. ''ఓం భూఃస్వాహా'' మొదలు ''ఓం ప్రజాపతయే స్వాహా'' వరకును గల మూలోక్త మంత్రములు చదువుతు. అన్నాహుతులివ్వవలెను. ఈ విధముగా విష్ణుపూజా వైశ్యదేవ బలులను గూర్చి నీకు చెప్పితిని.

అగ్నిమహాపురాణమున ఉత్పాతశాంతి యను రెండువందలఆరువదినాల్గవ ఆధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page