Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథు షట్‌ షష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ వినాయక స్నానమ్‌

పుష్కర ఉవాచ :

వినాయకోపనృష్టానాం స్నానం సర్వకరం వదే! వినాయకః కర్మవిఘ్న సిద్ధ్యర్థం వినియోజీతః. 1

గణానా మాధిపత్యేచ కేశ##వేశ పితామహైః | స్వహ్నే7వగాహతే7త్యర్థ జలం ముండాంశ్చ పశ్యతి. 2

వినాయకోపసృష్టస్తు క్రవ్యాదానంధిరోహతి | వ్రజమానస్తథాత్మానం మన్యతే7నుగతం పరైః. 3

విమనావిఫలారంభ సంసీదత్య నిమిత్తతః | కన్యా వరం నా చాప్నోతి నచాపత్యం వరాంగనా. 4

అచార్యత్వం శ్రోత్రియశ్చన శిష్యో7ధ్యయనం లభేత్‌ ! ధనీ న లాభ మాప్నోతి నకృషించ కృషీవలః. 5

రాజా రాజ్యం నచాప్నోతి స్నాపనం తస్య కారయేత్‌ ! హస్తపుష్యాశ్వయుక్సౌమ్యే వైష్ణవే భద్రపీఠకే. 6

గౌర నర్షవ కల్కేన సాజ్యేనోత్సాది తస్యచ | సర్వౌషధైః సర్వగంధైః ప్రలిప్త శిరసస్తథా. 7

చతుర్భిః కలశైః స్నానం తేషు సర్వౌషధీః క్షిపేత్‌| అశ్వస్థానాద్గజస్థానాద్వల్మీకాత్సంగమాద్ధ్రదాత్‌. 8

మృత్తికాం రోచనాం గంధం గుగ్గులుం తేషునిక్షిపేత్‌ | సహస్రాక్షం శతాధారమృషిభిః పావనం కృతమ్‌. 9

తేనత్వామభిషించామి పావమాన్యః పునంతుతే | భగంతే వరుణో రాజా భగం సూర్యో బృహస్పతిః. 10

భగ మిన్ద్రశ్చ వాయుశ్చ భగంసప్తర్షయో దదుః | యత్తేకేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్ఛమూర్దని. 11

లలాటే కర్ణయోరక్షోరాపస్తద్‌ ఘ్నంతుసర్వదా ! దర్భపింజలి మాదాయ వామహస్తే తతోగురుః. 12

స్నాతస్య సర్షపం తైలం స్రువేణోదుంబరేణచ ! జుహుయాన్మూర్ధని కుశాన్సవ్యేన పరిగృహ్యచ. 13

మితశ్చ సమ్మితశ్చైవ తథా శాలక కంటకౌ ! కూష్మాండౌ రాజపుత్రశ్చ ఏతైః స్వాహా సమన్వితైః. 14

నామభిర్బలి మంత్తైశ్చ నమస్కార సమన్వితైః! దద్యాచ్చతుష్పథే శూర్పే కుశానాస్తీర్య సర్వతః. 15

కృతాకృతాం స్తండులాంశ్చ పలలౌదన మేవచ! మత్స్యాన్పంకాంస్తథైవా మాన్పుష్పం చిత్రం సురాంతథా.

మూలకం పూరికాం పూపాం స్తథైవైండవికాస్రజః! దధ్యన్నం పాయసం పిష్టం మోదకం గుడమర్పయేత్‌.

వినాయకస్య జననీ ముపాతిష్ఠేత్తతో7ంబికామ్‌! దూర్వాసర్షప పుష్పానాం దత్త్వార్ఘం పూర్ణమంజలిమ్‌ 18

రూపం దేహి యశో దేహి సౌభాగ్యం సుభ##గే మమ! పుత్రం దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చదేహిమ్‌.

భోజయేద్ర్బాహ్మణాన్‌ దద్యాద్వస్త్రయుగ్మం గురోరపి! వినాయకం గ్రహాన్ప్రార్చ్యశ్రియం కర్మఫలంలబేత్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వినాయక స్నానం నామషట్‌ షష్ట్యధికద్విశతతమోధ్యాయః.

పుష్కరుడు పలికెను. వినాయకులచే పీడితలకు సర్వమనోరథములు ఇచ్చుస్నానమును చెప్పెదను. కర్మలకు విఘ్నుముకల్గించుటకు బ్రహ్న విష్ణు, మహేశ్వరులు వినాయకుని నిర్మించి అతనికి గణాధి పత్యమును కూడ ఇచ్చిరి వినాయక పీడితుడు స్వప్నములో లోతైన నీటిలో మునిగిపోవును. ముండిత శిరస్కులను చూచును. మాంసమును తిను మృగములను ఎక్కును ఎచటకేని నడచివెళ్లినపుడు తనవెనుక ఎవరోవచ్చుచున్నట్లు అనుకొనును. కారణము లేకుండగనే మనస్సుచెడి వ్యర్థప్రయత్నములు కలవాడగును. కన్యకు వరుడు లభించడు, స్త్రీకి సంతానము లభించదు. శ్రోత్రియునకు ఆచార్యత్వము శిష్యునకు అధ్యయనము, ధనికునకు లాభము, కృషీవలునకు కృషి, రాజు నకు రాజ్యము లభింపపు. అట్టివారికి స్నానము చేయించవలెను. హస్త, పుష్యమి, అశఅవని, మృశిర శ్రవణనక్షత్రము లందు భద్రపీఠముపై కూర్చుండబెట్టి పచ్చటి ఆవాలు నూరినేతితో తడపి వాని శరీరమునందంతటను నలిచి, వాని శిరస్సుపై సర్వౌషధ సహితములగు. అన్ని విధముల సుగంధ ద్రవ్యములను లేపనమునుచేసి సర్వౌషధులు వుంచిన నాలుగు కలశాలజలముతో అతనికి స్నానము చేయించవలెను. అశ్వశాల, గజశాల, పుట్ట, నదీసంగమము, జలాశయము, వీటినుండి తీసుకొనివచ్చిన ఐదువిధములగు మట్టియు, గోరోచనము, గంధము, గుగ్గులు, ఆ కలశజలము లందు ఉంచవలెను. ఆచార్యుడు తూర్పుననున్న కలశతీసుకొని సహస్రనేత్రములు కలదియు, మహర్షులచే పవిత్రీ కృతమును, అగుజలముతో నీకు స్నానముచేయించుదున్నాను. ఈ పవిత్రజలము నిన్నుపవిత్రుని చేయుగాక అని చెప్పుచు స్నానము చేయించవలయును. రాజీవ వర్ణుడు సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు, నీకు కల్యాణమును చేసిరి. అనియు, "నీకేశములందును, సీమంతమునందును, శిరస్సుయందును, లలాట, కర్ణ, నేత్రములందున్న దౌర్భాగ్యమును ఈజలము పూర్తిగా తొలగించుగాక." యనియు చెప్పుచు స్నానముచేయించవలెను. గురువు తనఎడమచేతిలో గ్రహించిన కుశలను ఆస్నానము చేసినవాని శిరస్సుపై ఉంచి, ఉడుంబస్రువతో ఆవ నూనెను హోమముచేయవలెను. ఆసమయమున చివరస్వాహాయను పదముచేర్చిన చతుర్థ్యంతములగా మిత-సమ్మిత-శాలకకంటక-కూష్మాండ-రాజపుత్ర-ఆనుపదములను చెప్పవలెను. హోమముచేయగా మిగిలిన చరువుతోనమః అను పదము చేరిన జలమంత్రములను ఉచ్చరించుచు వారికి బలిఇవ్వవలెను. పిమ్మట చేటలో అంతట కుశములు పరచి తడిపొడిగా వున్న బియ్యము నూరిన తిలలుకలిపిన అన్నము, వివిధపుష్పములు మాంసాన్నము, మత్స్యములు, త్రివిధసుర, మూలి, పూరి, అపూపములు ఏండవికమాలలు, దధ్యన్నము, పాయసము, పిష్టము, లడ్డులు, బెల్లము వీటిని ఒకచోట చతుష్పథమునందు చేర్చి వాటిని దేవతా-సుపర్ణ-సర్ప-గృహ-అసుర-యాతుధాన--పిశాచ-నాగమాతృ-శాకినీ-.యక్ష-వేతాళ-యోగినీ-పూతనాదులకు అర్పించవలెను. పిదప వినాయకుని తల్లియైన అంబికకు దూర్వాదళములు తెల్ల ఆవాలు, పుష్పములు, వీటితోనిండిన అంజలినిసమర్పించి, సౌభాగ్యవతియైన ఓ దేవి! నాకురూపమును, యశస్సును, సౌభాగ్యమును, పుత్రుని, ధనమును, సర్వకామములను ఇమ్ము అని ప్రార్థించవలెను. బ్రాహ్మణులకు భోజనముపెట్టి ఆచార్యునకు రెండు వస్త్రములు ఇవ్వవలెను. ఈ విధముగ వినాయకుని గ్రహములను పూజిచుటచే ఐశ్వర్యమును, కర్మఫలమును పొందును.

అగ్ని వినాయక స్నానమను రెండువందల అరువదియారవ ఆధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page