Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ మహేశ్వరస్నానలక్షకోటి హోమాదయః
పుష్కర ఉవాచ :
స్నానం మాహేశ్వర వక్ష్యే రాజాదేర్జయవర్ధనమ్! దానవేంద్రాయ బలయే యజ్జగా దోశనాఃపురా. 1
భాస్కరే7నుదితే పీఠే ప్రాతః సంస్నాపయేద్వటైః! ఓం నమోభగవతే రుద్రాయచ బలాయచ.
పాండరోచిత భస్మానులిప్త గాత్రాయ! తద్యథా జయజయసర్వాన్ శత్రూన్ మూకన్య
కలహ విగ్రహ వివాదేషు భంజయ.
ఓం మథమథ సర్వపథికాన్ యో7సోయుగాంతకాలే
దిధిక్షతి ఇమాంపూజాం రౌద్రమతిః సహస్రాంశుః
శుక్లః సతేరక్షతు జీవితమ్.
సంవర్తకాగ్నితుళ్యశ్చ త్రిపురాన్త కరః శివః
సర్వదేవమయః సో7పితవరక్షతు జీవితమ్.
లిఖి లిఖి ఖిలిస్వాహ! ఏవం స్నాతస్తుమంత్రేణ జుహుయాత్తిల తండులమ్. 2
పంచామృతైస్తు సంస్నావ్య పూజయోచ్ఛూల పాణినమ్! స్నానాన్యన్యాని పక్ష్యామి సర్వదా విజయాయతే. 3
స్నానం ఘృతేన కథితమాయుష్య వర్థనంపరమ్! గోమయేన చ లక్ష్మీః స్యాద్గోమూత్రేణాఘ మర్ధనమ్. 4
క్షీరేణ బలబుద్ధిః స్వాద్దధ్నాలక్ష్మీ వివర్ధనమ్! కుశోదకేన పాపాన్తః పంచగవ్యేన సర్వభాక్. 5
శతమూలేన సర్వాప్తిర్గోశృంగోదకతో7ఘజత్! పలాశబిల్వకమల కుశస్నానంతు సర్వదమ్. 6
వచాహరిబ్రేద్వేమున్తం స్నానం రక్షోహణం పరమ్!
పుష్కరుడు పలికెను. రాజాదులకు జయమునిచ్చు మాహేశ్వర స్నానాదులగూర్చి చెప్పెదను. పూర్వము శుక్రాచార్యుడు దీనిని దానవేంద్రుడగు బలికి చెప్పెను. ప్రాతః కాలము, సూర్యోదయమునకు పూర్వము యాచార్యుడు రాజును భద్రపీఠముపై కూర్చుండబెట్టి "జయ, జయసర్వాన్ శత్రూన్" మొదలు "లిఖి, ఖిలిస్వాహా" వరకునుఉన్న మూలోక్త మంత్రమును చెప్పుచు స్నానమును చేయించవలెను. ఈ విధముగ స్నానముచేసిన పిమ్మట తండుల హోమముచేసి త్రిశూలధారియగు శివునకు పంచామృత స్నానముచేయించి పూజయేచవలయును.
ఆయుష్యంచ యశస్యంచ ధర్మమేధావివర్ధనమ్. 7
హైమాద్భిశ్ఛైవ మాంగల్యం రూప్యతామ్రోదకైస్తథా! రత్నోదకైస్తు విజయః సౌభాగ్యం సర్వంగంధకైః,
పలాద్భిశ్చతథారోగ్యం ధాత్ర్యద్భిః పరమాంశ్రియమ్! తిలసిద్ధార్థకైర్లక్ష్మీః సౌభాగ్యం చ ప్రియంగుణా. 9
పద్మోత్పలకందబైశ్చ శ్రీర్బలం బలాద్రుమోదకైః | విష్ణుపాదోదకస్నానం సర్వస్నానేభ్య ఉత్తమమ్. 10
సర్వదా విజయమునిచ్చు ఇతర విధములగు స్నానములను చెప్పెదను. ఘృతస్నానము ఆయుర్వర్ధకము. గోమయస్నానము లక్ష్మీప్రదము. గోమూత్రస్నానము పాపనాశకము. క్షీరస్నానము బలవృద్ధికరము. దధిస్నానము లక్ష్మీవర్ధకము. కుశోదకముతో స్నానము పాపములను నశింపచేయును. పంచగవ్యస్నానముచే సర్వకామములును లభించును. శృంగోదక స్నానము పాపవినాశకము. వలాశ, బిల్వ, కమల, కుశ, స్నానము సర్వకామ్య ప్రదము. వచ, రెండు విధముల పసుపు, ముస్త కలిపిన నీటితో స్నానము రాక్షసవినాశకము. ఆయుర్వృద్ధి యశస్సు ధర్మము, మేధ కూడ దీనిచే లభించును. సువర్ణోదకములతో స్నానము మంగళకరము. రజతతామ్ర జల స్నానములు కూడ మంగళ కరము రత్నమిశ్ర జలముతో స్నానము విజయమును, సర్వగంధమిశ్రిత జలముతో స్నానము సౌభాగ్యమును. ఫలో దక స్నానము, ఆరోగ్యమును, ఉసిరికాయల జలముతో స్నానము లక్ష్మిని ఇచ్చును. తిలశ్వేత సర్షపములు కలిపిన జలముచే లక్ష్మియు, ప్రియంగు జలస్నానముచే సౌభాగ్యము, పద్మఉత్పల కదంబ మిశ్రజలస్నానములచే లక్ష్మియు బలావృక్ష జలస్నానముచే బలము లభించును. విష్ణుచరణోదక స్నానము అన్నిస్నానముల కంటెను శ్రేషమైనది.
ఏకాకీ ఏకామాయేత్యేకోర్కం విధివచ్చరేత్! ఆక్రందయతి సూక్తేన ప్రబధ్నీయాన్మణింకరే. 11
కుష్ఠపాఠావచాశుంఠీ శంఖలోహాదికోమణిః! సర్వేషామేవ కామానామీశ్వరో భగవాన్హరిః. 12
తస్య సంపూజనాదేవ సర్వాన్కామాన్సమశ్నుతే! స్నాపయిత్వా ఘృతక్షీరైః పూజయిత్వా చ పిత్తహా.
పంచముద్గబలిందత్వా అతిసారాత్ర్ప ముచ్యతే! పంచగవ్యేన సంస్నాప్య వాతావ్యాధిం వినాశ##యేత్. 14
ద్విస్నేహన్నపనా చ్ల్ఛేష్మరోగహా చాతిపూజయాః
ఘృతం తైలం తధా క్షౌద్రం స్నానంతు త్రిరసంపరమ్. 15
స్నానం ఘృతాంబు ద్విస్నేహం సమలం ఘృతతైలకమ్!
క్షౌద్రమిక్షురసం క్షీరంస్నానం త్రిమధురం స్మృతమ్. 16
ఘృతక్షురసం తైలం క్షౌద్రంచ త్రిరసంశ్రియే! అనులేపస్త్రి శుక్లస్తు కర్పూరోశీరచందనైః. 17
చందనాగురు కర్పూర మృగదర్పైః సకుంకుమైః! సంచానులేపనం విష్ణోః సర్వకామఫలప్రదమ్. 18
త్రిసుగంధం చ కర్పూరం తథా చందన కుంకుమైః! మృగదర్పం నకర్పూరం మలయం సర్వకామదమ్.
జాతీఫలం సకర్పూరం చందనంచ త్రిశీతకమ్7! పీతాని శుక్లవర్ణాని తథా శుక్లానిభార్గవ. 20
కృష్ణాని చైవరక్తాని పంచవర్ణాని నిర్దిశేత్! ఉత్పలం పద్మజాతీ చ త్రిశీతం హరిపూజనే. 21
కుంకుమం రక్తపద్మాని త్రిరక్తంరక్తముత్పలమ్! ధూపదీపాదిభిః ప్రార్చర్య విష్ణుం శాంతిర్భవేన్నృణామ్. 22
చతురస్రకరే కుండే బ్రాహ్మణాశ్చాష్ట షోడశ! లక్షహోమం కోటిహోమం తిలాజ్యయవధాన్యకైః.
గ్రహానభ్యర్చ్యగాయత్ర్యా సర్వశాంతిః క్రమాద్భవేత్. 23
ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మహేశ్వరస్నాన లక్షకోటిహోమాదికంనామ సప్తషష్ట్యధిక ద్విశత తమో7 ధ్యాయః.
ఏకాకియైన మనుష్యుడు ఒక కోరికతో ఒకే స్నానము చేయవలయును. ఆక్రందయతి ఇత్యాది సూక్తము చెప్పుచు చేతికి మణికట్టవలెను ఈమణి కుష్ఠ-పాఠ్యా-వచా-శుంఠీ-శంఖ-లోహాదులతో చేయబడవలెను. శ్రీ మహావిష్ణువు సర్వకామములకు అథిపతి. అతనిని పూజించుటచే సర్వకామములను పొందును. ఘృతమిశ్రదుగ్ధముతో స్నానముచేయించి విష్ణువును పూజించు వానికి పిత్తరోగము నశించును. పంచముద్గ బలియిచ్చినచో అతిసారరోగము పంచగవ్య స్నానముచేయించినచో వాతవ్యాధి ద్విస్నేహ ద్రవ్యములతో స్నానముచేయించి శ్రద్ధాపూర్వకముగ పూజించుటచే శ్లేష్మరోగములు నశించును. ఘృత - తైల, మధువులతో, చేయించిన స్నానము, ''త్రిరస'' స్నానము. ఘృత జలములతో చేయించిన స్నానము, ''ద్విస్నేహ'' స్నానము గృత, తైల, మిశ్రజలము చేయించిన స్నానము సమలస్నానము. మధు ఇక్షురస క్షీరములతో, చేయించిన స్నానము త్రిమధురస్నానము. ఘృత, ఇక్షురస, మధులతో చేయించి ''త్రిరస'' స్నానము లక్ష్మీప్రదము. కర్పూర, ఉషీర చందనములతో చేసిన అనులేపనము''త్రిశుక్లము'' చందన అగురు, కర్పూర, కస్తూరి కుంకుమములతో చేసిన అనులేపనమును, విష్ణువునకు, సమర్పించినచో యది సర్వకామఫలప్రదము, కర్పూరచందన, కుంకుమములతో కాని కస్తూరి కర్పూర చందనములతో కాని, చేసిన త్రిసుగంధ మనులేపనము సర్వకామప్రదము. జాతిఫల కర్పూర చందనములుయనునవి "త్రిశీతకమని" చెప్పబడును. పీతవర్ణములు, శుక్లవర్ణములు, శుక్లములు, కృష్ణములు, రక్తములు, ఇవి పంచవర్ణములు, విష్ణుపూజకు, ఉత్పలములను, కమలములను, జాతీపుష్పములను త్రిశీతములకు త్రిశీతమును ఉపయోగించవలెను. కుంకుమ రక్తకమల రక్తోత్పలములకు "త్రిరక్తము" యని పేరు. ధూపదిపాదులతో మహావిష్ణువుకు పూజచేసినచో మానవులకు శాంతి లభించును. నాలుగు హస్తముల చతురస్ర కుండమునందు ఎనమండుగురు లేదా పదునారుగురు బ్రాహ్మణులు తిల, ఆజ్య, తండులములతో లక్షగాని, కోటిహోమము చేయవలయును. గృహపూజచేసి గాయత్రిచే హోమము చేసినచో క్రమముగా అన్ని విధముల శాంతి కలుగును.
అగ్నిమహాపురాణమున మహేశ్వరస్నాన లక్ష, కోటి, హోమాదికమును రెండువందల అరువదియోడవ అధ్యాయము సమాప్తము.