Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
ఆధ అష్టషష్ట్యధిక ద్విశతతమోధ్యాయః
అథ నీరాజనవిధిః
పుష్కరఉవాచ :
కర్మసాంవత్సరం రాజ్ఞాం జన్మర్కే వూజయేచ్చతమ్! మాసిమాసి చ సంక్రాన్తౌ సూర్యసోమాది దేవతాః. 1
అగన్త్య స్యోదయో7గన్త్యం చాతుర్మాస్యంహరింయజేత్! శయనోత్థాపనే పంచదినం కుర్యాత్యముత్యవమ్. 2
ప్రోష్టపాదేసితే పక్షే త్రతిపత్ర్పభృతిక్రమాత్! శిబిరాత్పూర్వ దిగ్భాగే శుక్రార్థం భవనం చరేత్. 3
తత్రశక్రధ్వజంస్థాప్య శచీం శక్రం చ వూజయేత్! అష్టమ్యాం వాద్యఘెషేణ తాంతుయష్టిం ప్రవేశ##యేత్.
ఏకాదశ్యాం సోపవాసో ద్వాదశ్యాం కేతుమత్థితమ్! యజేత్వస్త్రాది సంవీతం ఘటస్థం సురపంశచీమ్. 5
వర్ధస్వేంద్ర జితామిత్ర వృత్రహన్పాక శాసన! దేవదేవమహాభాగ త్వం హిభూమిష్ఠతాంగతః. 6
త్వంప్రభుః శాశ్వతశ్చైవ సర్వభూత హితేరతః! అనంతతేజా వైరాజో యశోజయవివర్ధనః. 7
తేజస్తే వర్ధయంత్వేతే దేవాః శక్రః సువృష్టి కృత్! బ్రహ్మవిష్ణుమహేశాశ్చ కార్తికేయోవినాయకః. 8
ఆదిత్యా వసవోరుద్రాః సాధ్యాశ్చభృగవోదిశః! మరుద్గణాలోకపాలా గ్రహా యక్షాది నిమ్నగాః. 9
సముద్రాః శ్రీర్మహీగౌరీ చండికాచ సరస్వతీ! ప్రవర్తయంతు తేతేజో జయశక్ర శచీపతే. 10
తవచాపి జయన్నిత్యం మమసంపద్యతాం శుభం! ప్రసీదరాజ్ఞాం విప్రాణాం ప్రజానామపి సర్వశః. 11
భవత్ర్పసాదాత్పృథినీ నిత్యం సస్యవతీ భ##వేత్! శివం భవతి నిర్విఘ్నం శామ్యన్తా మీతయోభృశమ్. 12
మంత్రేణంద్రం సమహభ్యర్చ్య జితభూఃస్వర్గ మాప్నుయాత్!
పుష్కరుడు చెప్పెను. రాజుకు చేయదగిన సాంవత్సర కర్మచెప్పెదను. రాజుజన్మ నక్షత్రమున ఆనక్షత్రమును పూజించవలెను. ప్రతిమాసమునందును, సంక్రాంతి యందు సూర్య హోమాది దేవతలను అగస్త్యోదయ సమయమున అగస్త్యుని, చాతుర్మాస్యము నందు హరిని పూజించవలెను. శయన ఉత్థాన ఏకాధశులందు ఐదుదినములు ఉత్సవము చేయవలెను. భాద్రపద శుక్ల ప్రతిపత్తున శిబిరమునకు తూర్పున ఇంద్రపూజ కై భవనము నిర్మించవలెను. అచట శక్రధ్వజము స్థాపించి శచీదేవుని ఇంద్రుని ప్రతిపత్తు మొదలు అష్టమి వరకు పూజించవలెను. అష్టమినాడు వాద్యఘోషములతో ఆ ఇంద్రధ్వజమునకు దండము తొడుగవలెను. ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశినాడు ఆధ్వజము ఎత్తవలెను. ఒక కలశముపై వస్త్రాదులచే చుట్టబడిన ఇంద్రుని శచీదేవిని స్థాపించి ''శత్రువులను జయించు వృత్రనాశకుడవగు ఓ పాకశాసనా! ఓ మహాభాగా ఓదేవ దేవా! నీకు అభ్యుదయమగు గాక. నీవు ఈ భూమిపైకి వచ్చితివి. నీవు శాశ్వతుడవైన ప్రభువు. సర్వభూతముల హితమునందు ఆసక్తుడవు. అనంతతేజముకలవాడవు. విరాట్ పురుషుడవు. యశోజయములను వృద్ధి చేయువాడవు. నీవు ఉత్తమ వర్షమును కల్గించు ఇంద్రుడు. సమస్తదేవతలు, నీతేజస్సును వృద్ధి పొందించెదరు గాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కార్తికేయుడు వినాయకుడు ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, భృగువులు, దిక్కులు, మరుద్గణములు, లోకపాలకులు, గ్రహములు, యక్షులు, పర్వతములు, నదులు, సముద్రములు, లక్ష్మి, భూమి, గౌరి, చండికా, సరస్వతీ, వీరందరును నీతేజస్సును వృద్ధి పొందిచెదరు గాక! శచీపతివైన ఓయింద్రా! నీవు జయించెదవుగాక! నీ విజయముచే నాకు కూడ సర్వదా శుభము కలుగుగాక! రాజులు బ్రాహ్మణులు, ప్రజలు, వీరందరిని అనుగ్రహించుము. నీయనుగ్రహముచే భూమి నిత్యము సస్యసంపన్న అగుగాక ! అందరికి విఘ్నవిహీనమగు కల్యాణమగు గాక! ఈతిబాధలు పూర్తిగా నశించుగాక!'' యని ప్రార్థించుచు పూజించవలెను. ఈమంత్రముతో యింద్రుని పూజించిన వాడు భూమిని స్వర్గము పొందును.
భద్రకాశీం పటేలిఖ్యపూజయే దాశ్వినేజయే. 13
శుక్లపక్షే తథాష్టమ్యా మాయుధం కార్ముకం ధ్వజమ్! ఛత్రం రాజలింగాని శస్త్రాద్యం కుసుమాదిభిః. 14
జాగ్రన్నిశిబలిం దద్యాద్ధ్వితీయే7హ్నిపునర్యజేత్! భద్రకాళి మహాకాళి దుర్గే దుర్గార్తి హారిణి. 15
త్తైలోక్య విజయే చండిమమశాంతౌ జయేభవ! నీరాజనావిధిం వక్ష్యే హ్యైశాన్యాం మందిరంచరేత్. 16
తోరణత్రితయం తత్రగృహే దేవాన్యజేత్సదా! చిత్రాం త్యక్త్వాయదా స్వాతింసవితా ప్రతిపద్యతే. 17
తతఃప్రభృతి కర్తవ్యం యావత్స్వాతౌరవిః స్థితః! బ్రహ్మావిష్ణుశ్చ శంభుశ్చ శక్రశ్చైవానలానిలౌ. 18
వినాయకః కుమారశ్చవరుణో ధనదోయమః! విశ్వేధేవా వైశ్రవసో గజాశ్చాష్టౌచతాన్య జేత్. 19
కుముదైరావణౌపద్మః పుష్పదంతశ్చవామనః! సుప్రతీకో7జనోనీలః పూజాకార్యాగృహాదికే. 20
పురోధా జుహుయా దాజ్యం సమిత్సిద్ధార్థకం తిలాః! కుంభా అష్టౌ పూజితాశ్చతైః స్నాప్యాశ్చగజోత్తమాః.
అశ్వాస్నాప్యా దదేత్పిండాంస్తతో హిప్రథమం గజాన్! నిష్ర్కామయేత్తోరణౖస్తు గోపురాది నలంఘయేత్.
విక్రమేయుస్తతః సర్వేరాజలింగం గృహేయజేత్! వారుణోవరుణం ప్రార్చ్య రాత్రౌ భూతబలిందదేత్. 23
విశాఖాయాంగతే సూర్యే ఆశ్రమే నివసే న్నృపః! అలంకుర్యాద్దినే తస్మిన్వాహనం తు విశేషతః. 24
పూజితా రాజ లింగాశ్చ కర్తవ్యా నరహస్తగాః! హస్తినం తురగం ఛత్రం ఖడ్గం చాపంచ దుందుభిమ్. 25
ధ్వజం పతాకాం ధర్మజ్ఞ కాలజ్ఞస్త్వభి మంత్రయేత్! అభిమంత్ర్య తతః సర్వాన్ కుర్యాత్కుంజర ధూర్గతాన్.
కుంజరోపరిగౌ స్యాతాం సాంవత్సర పురోహితౌ! మంత్రితాంశ్చ సమారుహ్య తోరణన వినిర్గమేత్. 27
నిష్ర్కమ్య నాగమారుహ్య తోరణనాథ నిర్గమేత్! బలిం విభజ్యవిధివద్రాజా కుంజరధూర్గతః. 28
ఉల్ముకానాంతు నిచయమాదీపిత దిగన్తరమ్! రాజాప్రదక్షిణం కుర్యాత్త్రీన్వారాన్సుసమాహితః. 29
చతురంగబలో పేదః సర్వసైన్యేన నాదయన్! ఏవం కృత్యాగృహం గచ్ఛేద్విసర్జిత జలాంజలిః.
శాంతినీరాజనాఖ్యేయం వృద్ధయేరిపుమర్దినీ. 30
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నీరాజనావిధిర్మామాష్ట షష్టధిక ద్విశతతమో7ధ్యాయః.
ఆశ్వీయుజు శుక్ల అష్టమినాడు వస్త్రముపై భద్రకాళిని చిత్రించి, విజయము కోరువాడు ఆదేవతలను పూజించవలెను. ఆయుధములు, ధనస్సు, ధ్వజము, ఛత్రము, రాతి చిహ్నములు శస్త్రాదులు వీటిని కూడ పుష్పాదులతో పూజింపవలెను. రాత్రి జాగరణముచేసి బలియిచ్చి, మరునాడు మరల పూజించవలెను. ''భద్రకాళి, మహాకాళి, దుర్గా, దుర్గ బాధనుహరించుదానా, త్రైలోక్య విజయా, చండీ నాకు శాంతివిజయమును ఇమ్ము'' ఇపుడు నీరాజనావిధిని చెప్పెదను. ఈశాన్యమున దేవతామందిరము నిర్మించి మూడు ద్వారములు ఏర్పరచి యచట సర్వదా దేవతా పూజ చేయవలయును. సూర్యుడు చిత్తానక్షత్రమును విడిచి స్వాతిలో ప్రవేశించునపుడు ప్రారంభించి, ఆ నక్షత్రముల ఉండు వరకును దేవతా పూజచేయవలయును. బృహ - విష్ణువు - శంభు - శక్ర - అగ్ని - వాయు - వినాయక - కుమార - వరుణ - కుబేర విశ్వేదేవ - వైశ్రవసులను కుముద, ఐరావణ, పద్మ, పుష్పదంత వామన, సుప్రతీక - అంజననీలులను దిగ్గ జములను గృహాదలందు పూజించవలెను. పిదప పురోహితుడు ఆజ్య, సమిత్, సిద్ధార్ధ తిలలతో హోమము చేయవలయును. ఎనిమిది కలశములు పూజించి వాటితో ఉత్తమమైన అశ్వములను గజములను స్నానము చేయించి ముందు గజములకు గ్రాసము ఇవ్వవలెను తోరణ ద్వారమునుండి బయటకు తీసుకుని రావలెను. గోపురాదులనుదాట కూడదు. పిదప అందరును బయటకు వచ్చిన పిమ్మట ఇంటియందే రాజ చిహ్నములను పూజించవలెను. శతభిషా నక్షత్రమున వరుణిని పూజించి భూతములకు బలియివ్వవలెను. సూర్యుడు విశాఖలో ప్రవేశించిన పిమ్మట రాజు ఆశ్రమములో నివసించవలెను. ఆ దినమున వాహనములను అధికముగ అలంకరించవలెను. రాజ చిహ్నములను పూజించి వాటివాటి రక్షకుల చేతికి ఇవ్వవలెను. కాలజ్ఞుడగు జ్యోతిషుడు గజములు అశ్వములు, ఛత్రము, ఖడ్గము. ధనస్సు, దుందుభి, ధ్వజము, పతాక, వీటిని అభిమంత్రించవలెను. వాటిని, ఏనుగులపైకి ఎక్కించవలెను. జ్యోతిష్కుడు పురోహితుడు కూడ ఏనుగును ఎక్కవలెను. అభిమంత్రితములగు వాటిని ఎక్కి ద్వారమునుంచి, నిష్ర్కమింప చేయవలయును. ఈ విధముగ నిష్ర్కమించి ఏనుగును ఎక్కిరాజు రాజు ద్వారమునుండి బయటకు శచ్చి విధి పూర్వకముగ బలిఇవ్వవలెను. పిదప అతడు, సుస్థిరచిత్తుడై చతురంగ సైన్యములతో కూడి వారి అందరిచేత జయ ఘోషములు పలికించుచు, దిగంతములను ప్రకాశింపచేయుచున్న కాగడాల సముదాయములకు మూడు పర్యాయములు ప్రదక్షిణములు చేసి, జలాంజలి యిచ్చి ఇంటికి మరలి రావలయును. నీరజనమను ఈ పేరుగల శాంతి వృద్ధి నిచ్చును. శత్రువులను నశింపచేయును.
అగ్ని మహాపురాణమున నీరాజనావిధియను రెండువందల అరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.