Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏకోనసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ ఛత్రాదిమంత్రాదయః
పుష్కరఉవాచ :
ఛత్రాది మంత్రాన్వక్ష్యామి యైస్తత్పూజ్య జయాదికమ్ | బ్రహ్మణః సత్యవాక్యేన సోమస్య వరుణస్య చ. 1
సూర్యస్య చ ప్రభావేణ వర్ధస్వత్వం మహామతే! పాండరాభప్రతీకాశ హిమకుందేందు సుప్రభ. 2
యథామ్బుదశ్ఛాదయతే శివాయైనాం వసుంధరామ్ | తథాచ్ఛాదయ రాజానం విజయారోగ్యవృద్ధయే. 3
గంధర్వకుల జాతస్త్వం మా భూయాః కులదూషకః | బ్రహ్మణః సత్యవాక్యేన సోమస్య వరుణస్య చ. 4
ప్రభావాచ్చ హుతాశస్య వర్ధస్వత్వం తురంగమ | తేజసాచైవ సూర్యస్యమునీనాం తపసాతథా. 5
రుద్రస్య బ్రహ్మచర్యేణ పవనస్య బలేన చ | స్మరత్వం రాజపుత్రో7సి కౌస్తుభస్తు మణింస్మర. 6
యాంగతిం బ్రహ్మహా గచ్ఛేత్పితృహా మాతృహా తథా! భూమ్యర్థే7నృతవాదీచ క్షత్రియశ్చపరాఙ్ముఖః. 7
వ్రజేస్త్వం తాంగతిం క్షిప్రంమాతత్పాపంభ##వేత్తవ | వికృతిం మాపగచ్ఛేస్త్వం యుద్ధే7ధ్వని తురంగమ. 8
రిపూన్వినిఘ్నన్సమరే సహభర్త్రా సుఖీభవ | శక్రకేతో మహావీర్య సుపర్ణస్త్వాముపాశ్రితః. 9
పతత్త్రిరాడ్వైన తేయస్తథా నారాయణధ్వజః | కాశ్యపేయో7మృతా హర్తానాగారిర్విష్ణువాహనః. 10
అప్రమేయో దురాధర్షో రణదేవారి సూదనః | మహాబలో మహావేగో మహాకాయో7మృతాశనః 11
గరుత్మాన్మారుతగతిస్త్వయి సన్నిహితఃస్థితః | విష్ణునా దేవదేవేన శక్రార్థం స్థాపితోహ్యసి. 12
జయాయ భవమేనిత్యం వృద్ధయే7థ బలస్యచ | సాశ్వవర్మాయుధాన్యో ధాన్రక్షాస్మాకం రిపూన్ధహ. 13
పుష్కరుడు పలికెను. ఛత్రాది మంత్రములను చెప్పెదను. వాటిని పూజించుటచే విజయాదికమును పొందును. మహామతియైన ఓఛత్రదేవా! నీవు హిమము, మల్లెపూవు, చంద్రుడువలె, తెల్లని కాంతితో ప్రకాశించుచున్నావు. బ్రహ్మ యొక్క సత్యవచనము చేతను, వరుణ సూర్య ప్రభావములచేతను నీవు సర్వదా వృద్ధి పొందుము. మేఘము మంగళము కొరకై ఈ భూమిని ఆచ్ఛాదించునట్లు నీవు విజయము కొరకును ఆరోగ్య వృద్ధికొరకును రాజును ఆచ్ఛాదించుము. ఓఅశ్వమా! నీవు గంధర్వ కులమున బుట్టితివి కావున కులదూషకము కావద్దు. బ్రహ్మ సత్య వాక్యము చేతను, హోమ వరుణ అగ్నుల ప్రభావము చేతను, సూర్య తేజస్సు చేతను, మునుల తపస్సు చేతను, రుద్రుని బ్రహ్మ చర్యముచేతను, వాయువు బలముచేతను, నీవు సర్వదామున్ముందుకు సాగుము, నీవు అశ్వరాజపుత్రుడను విషయము స్మరించుము. కౌస్తు భమణిని స్మరించుము. బ్రహ్మహత్య, పితృహత్య, మాతృహత్య చేసిన వాడును, భూమి కొరకై అసత్యమాడినవాడు, యుద్ధము నుండి పరాఙ్ముఖుడైన క్షత్రియుడును ఎంత శీఘ్రముగా అధోగతిని పొందుదురో, యుద్ధమునందు పృష్ఠము చూపించుటచే నీవు కూడ అట్లే దుర్గతిని పొందుదువు. నీకు అట్టి వికారము కలుగ కుండుగాక! అట్టి పాపము కలుగకుండు గాక! సమరాంగణమున శత్రువులను సంహరించుచు నీస్వామితో కూడ సుఖముగ నుండుము. మహాపరాక్రమమునకు ప్రతీకమైన ఓయింద్రధ్వజమా! నారాయణుని ధ్వజమైన గరుత్మంతుడు నీపై ప్రతిష్ఠింపబడినాడు. ఇతడు సర్ప శత్రువు. విష్ణువాహనము కళ్యపకుమారుడు. దేవలోకములోనుంచి బలాత్కారమున, అమృతమును అపహరించినాడు. అతను విశాలకాయుడు. ఆతని బలవేగములు గొప్పవి. అమృతమును ఆస్వాదించినవాడు. అతనిశక్తి అప్రమేయము. యుద్ధములో దుర్జయుడై శత్రుసంహారము చేయును. వాయుతుల్యగతి కలవాడు. అట్టి గురుత్మంతుడు ఇంద్రుని కొరకై శ్రీ మహావిష్ణువుచే నీపై స్థాపింపబడినాడు. నీవు సర్వదా నాకు విజయమును ఇమ్ము. నాబలమును పెంచుము. అశ్వములు కవచములు, ఆయుధములు వీటితో కూడిన నాయోధులను రక్షించి శత్రువులను కాల్చి భస్మముచేయుము.
కుముదైరావణౌపద్మః పుష్పదంతో7థ వామనః | సుప్రతీకో7ంజనోనీలో హ్యేతే7ష్టోదేవ యోనయః. 14
తేషాంపుత్రాశ్చ పౌత్రాశ్చ బలాన్యష్టౌసమాశ్రితాః | భద్రోమంద్రో మృగశ్చైవగజః సంకీర్ణఏవచ. 15
వనేవనేప్రసూతాస్తే స్మరయోనిం మహాగజాః | పాన్తుత్వాంవసవోరుద్రా ఆదిత్యాః సమరుద్గణాః. 16
భర్తారం రక్షనాగేంద్ర సమయఃపరిపాల్యతామ్ | ఐరావతాధి రూఢస్తు వజ్రహస్తః శతక్రతుః. 17
పృష్ఠతో7నుగతస్త్వేష రక్షతుత్వాం సదేవరాట్ | అవాప్నుహి జయంయుద్ధే సుస్థశ్చైవ సదావ్రజ. 18
అవాప్నుహి బలంచైవ చైరావతసమంయుధి | శ్రీస్తేసోమాద్బలం విష్ణోస్తేజః సూర్యాజ్జవో7నిలాత్. 19
స్థైర్యం గిరేర్జయం రుద్రాద్యశోదేవాత్పురందరాత్ | యుద్ధేరక్షన్తు నాగాస్త్వాం దిశశ్చసహదైవతైః. 20
అశ్వినౌసహగంధర్వైః పాంతుత్వాం సర్వతోదిశః | మనవోవసవోరుద్రావాయుః సోమోమహర్షయః. 21
నాగకిన్నర గంధర్వ యక్షభూతగణాగృహాః | ప్రమథాస్తు సహాదిత్యైర్భూతేశో మాతృభిఃసహ. 22
శక్రః సేనాపతిఃస్కందో వరుణశ్చాశ్రితస్త్వయి | ప్రదహన్తురిపూన్సర్వాన్రాజా విజయమృచ్ఛతు. 23
కుముద - ఐరావత - పద్మ - పుష్పదంత - వామన - సుప్రతీక - అంజన - నీలులు, అను ఎనిమిది గజ రాజులు దేవయోనియందు పుట్టినవి. వీటి పుత్ర పౌత్రులే ఎనిమిది వనములందు నివసించుచున్నవి. భద్ర - మంద్ర - మృగ - సంకీర్ణ జాతీయగజములు ప్రతివనమునందు పుట్టుచున్నవి. ఓ మహాగజములారా ః నీ జాతిని స్మరించుడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణములు, మిమ్ములను రక్షించుగాక ః ఓగజేంద్ర! నీనియమును పాటించి స్వామిని రక్షించుము. వజ్రధారియైన దేవేంద్రుడు ఐరావతమును ఎక్కి నీ వెనుకనే వచ్చుచున్నాడు అతడు నిన్ను రక్షించుగాక. యుద్ధము నందు విజయముపొంది స్వస్థుడవై ముందుకు నడువుము. యుద్ధమునందు నీకు ఐరావతము వంటి బలము వచ్చుగాక. చంద్రుని నుండి కాంతిని, విష్ణువు నుండి బలమును, సూర్యుని నుండి తేజస్సును, వాయు నుండివేగమును, పర్వతము నుండి స్థిరత్వమును, రుద్రుని నుండి విజయమును, ఇంద్రుని నుండి యశమును పొందుము. దిగ్గజములు, దిక్కులు దిక్పాలకులు, యుద్ధమున నిన్ను రక్షింతురు గాక. గంఢర్వ సహితులగు అశ్వికుమారులు అన్ని వైపుల నుండి నిన్ను రక్షింతురు గాక. మను - వసు - రుద్ర - వాయు - చంద్ర - మహర్షి - నాగ - కిన్నర - యక్ష - భూత - ప్రమథ - గ్రహ - ఆదిత్యులు, మాతృకా సహితుడగు భూతాధిపతియైన శివుడు, ఇంద్రుడు, దేవసేనాపతియైన కార్తికేయుడు, వరుణుడు, నిన్ను అధిష్టించియున్నారు. వారు సమస్త శత్రువులను భస్మము చేయుదురు గాక ! రాజు విజయము పొందుగాక!
యానిప్రయుక్తాన్యరిభిర్భూషణాని సమంతతః | పతన్తు తవళత్రూణాం హతాని తవతేజసా. 24
కాలనేమి వధే యద్యద్యుద్దే త్రిపురఘాతనే | హిరణ్యకశిపోర్యుద్దేవధే సర్వాసురేషుచ. 25
శోభితాసి తథైవాద్య శోభస్వ సమయం స్మర | నీలశ్వేతామిమాం దృష్ట్వా నశ్యంత్వాశు నృపారయః. 26
వ్యాధిభిర్వివిధైగ్ఘోరైః శ##సై#్తశ్చ యుధి నిర్జితాః | పూతనా రేవతీ లేఖాకాలరా త్రీతిపఠ్యతే 27
దహంత్వాశు రివూన్సర్వాన్పతా కేత్వా ముపాశ్రితాః | సర్వమేధేమహాయజ్ఞే దేవదేవేన శూలినా. 28
శ##ర్వేణ జగతశ్చైవ సారేణ త్వం వినిర్మితః | నన్దకస్యాపరాం మూర్తిం స్మరశత్రునిబర్హణా. 29
నీలోత్పల దలశ్యామ కృష్ణ దుఃస్వప్న నాశన | అసిర్విశసనః ఖడ్గస్తీక్ణధారో దురాసదః. 30
శ్రీగర్భో విజయశ్చైవ ధర్మపాలస్తథైవచ | ఇత్యష్టౌ తవనామాని పురోక్తాని స్వయంభువా. 31
నక్షత్రం కృత్తికా తుభ్యం గురుర్డేవో మహేశ్వరః | హిరణ్యం చ శరీరం తే దైవతం తే జనార్దనః. 32
రాజానం రక్ష నిస్త్రింశ సబలం నపురం తథా | పితా పితామహోదేవః సత్వం పాలయ సర్వదా. 33
ఓ పతాకా! శత్రువులు నలువైపులనుండిచేయు ఘాతకప్రయోగములు నీతేజస్సుచే కొట్టబడి నశించుగాక! కాలనేమి-త్రిపురసంహార యుద్ధములందును, హిరణ్యకశిపుయుద్ధములందును, సకలదైత్యయుద్దములందును, నీవుఎట్టుప్రకాశించితివో అట్లేనేడు ప్రకాశించుము. నీప్రతిజ్ఞను స్మరించుము, నల్లగను తెల్లగను వున్ననిన్నుచూచి రాజుశత్రువులు వెంటనే నశింతురుగాక! వ్యాధులచేతను శస్త్రములచేతను పరాజితులగుదురు గాక! నీవు పూతన, రేవతి, లేఖాకాళరాత్రి మొద పేళ్లతో ప్రసిద్ధురాలవు. ఓ పతాకా! నిన్ను ఆశ్రయించుచున్నాము. మాశత్రువులందరిని కాల్చివేయుము, సర్వమేధ మహాయజ్ఞమును, దేవదేవుడగు రుద్రుడు జగత్తు యొక్కసారముతో నిన్ను స్మరించినాడు. శత్రునాశకమగు ఓ ఖడ్గమా! నీవునారాయణుని, నందకమను ఖడ్గమునకు రెండవమూర్తివను విషయమును స్మరింపుము. నీవు నీలకమల దళముతో సమానమగు శ్యామకృష్ణవర్ణములు కలదానవు. దుస్వప్నములను నశింపచేయుదువు. పూర్వము, బ్రహ్మదేవుడు నీకు అసి, విషసనము, ఖడ్గము, తీక్ష్ణధారము, శ్రీ గర్భము, విజయము, ధర్మపాలము అను ఎనిమిది పేర్లు పెట్టినాడు. నీది కృత్తికానక్షత్రము మహేశ్వరుడు నీగురువు. సువర్ణము నీశరీరము. జనార్ధనుడు నీదేవత. ఓ ఖడ్గమా! శయనా నగరసహితుడగు రాజునురక్షింపుము. దేవశ్రేష్ఠుడగు పితామహుడు నీకుతండ్రి నీవుసర్వదామమ్ముల రక్షించుము.
శర్మప్రదస్త్వం సమరే వర్మ న్సైన్యే యశో7ద్యమే | రక్షమాం రక్షణీయో7హం తవానఘనమో7స్తుతే.
దుందుభేత్వం సపత్నానాం ఘోషాద్ధృదయకంపనః | భవ భూమిప సైన్యానాం యథా విజయువర్ధనః.. 35
యథా జీమూత ఘోషేణ హృష్యన్తి వరవారణాః | తథాస్తు తవ శ##బ్దేన హర్షో7స్మాకం ముదా77వహ. 36
యథా జీమూత శ##బ్దేన స్త్రీణాం త్రాసో7భిజాయతే | తథాతు తవశ##బ్దేన త్రస్యంత్వస్మద్ద్విషోరణ. 37
మంత్రైఃసదార్చనీయాస్తే యోజనీయాజయాదిషు | ఘృతకంబల (డ) విష్ణ్వాదేస్త్వభిషేకంచ వత్సరే.
రాజ్ఞోభిషేకః కర్తవ్యో దైవజ్ఞేన పురోధసా. 38
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఛత్రాది మంత్రాదికం నామైకోన సప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
ఓ కవచమా! నీవు రణభూమిలో కల్యాణప్రదము. ఓ నిష్పాపమా నేనునీనుండి రక్షపొందుటకు అర్హుడను. నన్ను రక్షింపుము నీకు నమస్కారము ఓ దుందుభీ నీవు ధ్వనిచే శత్రువుల హృదయములను కంపింపచేయుదువు మా రాజసేనలకు విజయవృద్ధిని చేయుము. మేఘధ్వనిచే ఉత్తమ గజములు సంతసింటినట్లు నీశబ్దముచే మాకుహర్షము కలుగు గాక! మేఘ గర్జనముచే స్త్రీలకు భయము కలుగునట్లు నీధ్వనిచే యుద్ధమునకు వచ్చిన నా శత్రువులు భయపడుదురుగాక! ఈ తంత్రములతో రాజోపకరణములను పూజించి వాటిని విజయకార్యమునకై వినియోగించవలెను. దైవజ్ఞుడు అగు రాజపురోహితుడు రక్షాబంధనాదుల ద్వారా రాజరక్షణముచేసి, ప్రతిసంవత్సరము విష్ణ్వాది దేవతలకును రాజునకును, అభిషేకము చేయవలెను.
అగ్ని మహాపురాణమున ఛత్రాదిమంత్రాదికమను రెండువందల ఆరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.