Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
ఆథ సప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
అథ విష్ణు పంజరమ్
పుష్కర ఉవాచ:
త్రిపురం జఘ్నుషః పూర్వం బ్రహ్మణా విష్ణుపంజరం | శంకరస్య ద్విజశ్రేష్ఠ రక్షణాయ నిరూపితమ్. 1
వాగీశేన చ శక్రన్య బలం హన్తుం ప్రయాసతః | తస్యస్వరూపం పక్ష్యామి తత్త్వం శృణు జయాదిమత్. 2
విష్ణుః ప్రాచ్యాం స్థితశ్చక్రీ హరిర్దక్షిణతోగదీచ | ప్రతీచ్యాం శార్జధృగ్విష్ణుర్జిష్ణుః ఖడ్గీమమోత్తరే. 3
హృషీకేశో వికోణషు తచ్ఛిద్రేషు జనార్దనః | క్రోడరూపీ హరిర్భూమౌ నరసింహో7ంబరే మమ. 4
క్షురాన్తమమలం చక్రం భ్రమత్యేతత్సుదర్శనమ్ |
అస్యాంశుమాలా దుష్ప్పేక్ష్యా హన్తుం ప్రేతనిశాచరాన్. 5
గదా చేయం సహస్రార్చిః ప్రదీప్తపావకోజ్జ్వలా | రక్షోభూతపిశాచానాం డాకినీనాంచ నాశినీ. 6
శార్జ విస్ఫూర్జితం చైవ వాసుదేవస్య మద్రివూన్ | తిర్యఙ్మునుష్యు కూష్మాండ ప్రేతాదీన్హన్త్వశేషతః. 7
ఖడ్గధారోజ్జ్వలజ్యోత్స్నా నిర్దూతామే సమాహితాః | తేయాన్తు శామ్యతాం సద్యోగరుడేనేవ పన్నగాః. 8
పుష్కరుడు పలికెను. పూర్వము త్రిపురసంహారోద్యుక్తుడగు శివునిరక్షకై బ్రహ్మవిష్ణు పంజరస్తోత్రమును ఉపదేశించెను.
బలాసురుని చంపుటకై వెళ్లుచున్న ఇంద్రునకు బృహస్పతి ఉపదేశించెను. విజయప్రదమగు దానిస్వరూపము చెప్పెదను. వినుము. "నాకు తూర్పున చక్రధారియగు విష్ణువు, దక్షిణమున గాదాధారియగు విష్ణువు, ఉత్తరమున ఖడ్గధారియగు విష్ణువు ప్రకాశించుచున్నాడు. విదిశలందు హృషీకేశుడు, వాటి మధ్యలందు జనార్దనుడు, భూమియందు, వరాహరూపధారియగు హరి, ఆకాశమున నరసింహుడు వుండి నన్ను రక్షించుచున్నారు. చివరక్షురములువున్న నిర్మలమగు ఈ సుదర్శన చక్రము తిరుగుచున్నది. ఇది ప్రేతను రాక్షసులను చంపుచువెళ్ళునపుడు దీనికిరణములవైపు ఎవ్వరును చూడజాలరు సహస్రార్చులు గల ప్రజ్వలించుచున్న అగ్నితో సమానమైన ఈ గదరక్షో, భూత, పిశాచములను నశింపచేయును. వాసుదేవుని, శార్‌జ్గటంకారధ్వని నా శత్రువులను తిర్యక్, మనుష్య, కూష్మాండ, ప్రేతాదులను, పూర్తిగా నశింపచేయుగాక! శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గధారయొక్క, ఉజ్జ్వలమగు వెన్నెలలోస్నానము చేసిన నా శత్రువులు, గరుత్మంతునిచే సర్పములువలె వెంటనేశమింతురుగాక!
యే కూష్మాండాస్తథా యక్షాయే దైత్యాయే నిశాచరాః | ప్రేతావినాయకాః క్రూరా మనుష్యా జంభగాఃఖగాః.
సింహాదయశ్చ పశవో దందశూకాశ్చ పన్నగాః | సర్వేభవన్తుతే సౌమ్యాః కృష్ణశంఖరవాహతాః. 10
చిత్తవృత్తి హరాయేమే యేజనాః స్మృతి హారకాః | బలౌజసాంచ హర్తార శ్ఛాయావి భ్రంశకాశ్చయే. 11
యే చోవభోగ హర్తారో యేచ లక్షణ నాశకాః | కూష్మాండాస్తే ప్రణశ్యన్తు విష్ణుచక్ర రవాహతాః. 12
బుద్ధిస్వాస్థ్యం మనః స్వాస్థ్యం స్వాస్థ్య మైంద్రియకంతథా | మమాస్తు దేవ దేవస్య వాసుదేవస్య కీర్తనాత్.
వృష్ఠే పురస్తాన్మమ దక్షిణోత్తరే వికోణతశ్చాస్తు జనార్దనో హరిః |
తమీడ్య మీశాన మనంత మచ్యుతం జనార్దనం ప్రణిపతితోన సీదతి. 14
యథా పరం బ్రహ్మ హరిస్తథాపరో జగత్సరూపశ్చ నఏవ కేశవః |
సతేన తేనాచ్యుత నామ కీర్తనాత్ర్పణాశ##యేత్తు త్రివిధం మమాశుభమ్. 15
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే విష్ణుపంజరం నామ సప్తత్యధిక ద్విశతతమోధ్యాయః.
"కూష్మాండ, యక్ష, రాక్షస, ప్రేత, వినాయక, క్రూరమనుష్య, క్రూరపక్షి, సింహాదులును, సర్పాదులును, విష్ణువుయొక్క శంఖరవముచేకొట్టబడినవై సౌమ్యత్వమును పొందుగాక! నాచిత్త వృత్తిని స్మరణ శక్తిని అపహరించువారును, నాబల తేజస్సులు నశింపచేయువారును నాకాంతిని తగ్గించువారును, భోగములను హరించువారును, శుభ లక్షణములను నశింపచేయువారును అగు కూష్మాండులు విష్ణు చక్రహతులై నశింతురుగాక! దేవదేవుడైన వాసుదేవుని, సంకీర్తనముచే నామనో బుద్ధి, ఇంద్రియములకు, స్వాస్థ్యము లభించుగాక! నా వెనుకను ఎదుటను, యెడమ ప్రక్కను కోణ దిశలందును అంతటను జనార్దనుడగు హరి ఉండుగాక! సర్వ పూజనీయుడును, ఎన్నటికిని చ్యుతుడు కాని వాడును, అనంతరూపుడును, పరమేశ్వరుడును, అగు జనార్దనుని పాదములకు నమస్కరించువాడు ఎన్నడును దుఃఖితుడు కాడు. శ్రీ హరి పరమాత్మయైనట్లే ఆ కేశపుడు జగత్స్వరూపుడు కూడ. ఈ సత్యము యొక్క ప్రభావముచేతను, అచ్యుతునినామ సంకీర్తనముచేతను, నాత్రి విధపాపములు నశించుగాక!"
అగ్నిమహాపురాణమునందు విష్ణుపంజరమును రెండువందల డెబ్బదవ ఆధ్యాయము సమాప్తము.