Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏక సప్తతత్యధిక ద్విశతతమోధ్యాయః
అథ వేదశాఖాది కీర్తనమ్
పుష్కర ఉవాచ:
సర్వానుగ్రాహకా మంత్రాశ్చతుర్వర్గ ప్రవాధకాః | ఋగథర్వ తథాసామ యజుః సంఖ్యాతు లక్షకమ్. 1
భేదః సాంఖ్యాయనశ్చైక ఆశ్వలాయనో ద్వితీయకః |
శతాని దశ మంత్రాణాం బ్రాహ్మణా ద్విసహస్రకమ్. (2110)2
ఋగ్వేదో హిప్రమాణన స్మృతో ద్వైపాయనాదిభిః |
ఏకోన ద్విసహస్రంతు మంత్రాణాం యజుషస్తథా. (1999)3
శతాని దశ విప్రాణాం షడశీతీశ్చ శాఖికాః | కాణ్వీ మాధ్యందినీ సంజ్ఞా కఠీమాధ్యకఠీతథా. 4
మైత్రాయణీచ సంజ్ఞాచ తైత్తిరీయాభిధానికా | వైశంపాయని కేత్యాద్యాశాఖాయజుషి సంస్థితాః. 5
సామ్నఃకౌథుమసంజ్ఞైకా ద్వితీయాథర్వణాయనీ | గానాన్యపిచ చత్వారి వేదఆరణ్యకం తథా. 6
ఉక్థాఊహ చతుర్థంచ మంత్రానవసహస్రకాః | సచతుః శతకాశ్చైవ బ్రహ్మసంకటకాః స్మృతాః. 7
పుష్కరుడు పలికెను. సర్వాను గ్రాహకములగు వేదమంత్రములు నాల్గు పురుషార్థములను ఇచ్చును. ఋక్, యజుః, సామ, అథర్వములని వేదములు నాలుగు. వీటి మంత్రముల సంఖ్య ఒక లక్ష. ఋగ్వేదమునకు, సాంఖ్యాయనమువ ఆశ్వలాయనమని, రెండు శాఖలు. వీటిలో ఒకవెయ్యి ఋగ్వేద బ్రాహ్మణములలో రెండు వేలు మంత్రములున్నవి. కృష్ణ ద్వైపాయనాదులు ఋగ్వేదమును ప్రమాణముగా అంగీకరించిరి యుజుర్వేదమున పందొమ్మిది వందల తొంబది తొమ్మిది మంత్రములున్నవి. బ్రాహ్మణములందు వెయ్యి మంత్రములు వున్నవి. శాఖలు ఎనుబది ఆరు. కాండ్వి, మాధ్యందినీ, కఠి, మైత్రాయణి, తైత్తరీయ, వైశంపాయనిక - మొదలగు శాఖలు, యుజుర్వేదము నందువున్నవి. సామవేదమున కౌథుమ శాఖ. ఆథర్వణాయణిశాఖ - అను రెండుశాఖలున్నవి దీనిలో వేదము ఆరణ్యకము, ఉక్థకము, ఊహము, అనునాలుగు గానములున్నవి. సామవేదములో తొమ్మిది వేల నాలుగు వందల ఇరువదిఐదు మంత్రములు వున్నవి. ఇవి బ్రహ్మకు సంబంధించినవి. ఇంతవరకు సామవేదమానము చెప్పబడినది.
పంచవింశతిరేవాత్ర సామమానం (9425) ప్రకీర్తితమ్ | సుమంతుర్జాజలిశ్చైవ శ్లోకాయనిరథర్వకే. 8
శౌనకః పిప్పలాదశ్చ ముంజ కేశాదయో7పరే | మంత్రాణామయుతం షష్టిశతం (1600) చోపనిషచ్ఛతమ్.
వ్యాసరూపీ సభగవాఞ్ఛాఖాభేదాద్యకారయత్ | శాఖాభేదాదయో విష్ణురితి హాసః పురాణకమ్. 10
ప్రాప్యవ్యాసాత్పురాణాది సూతోవైలోమహర్షణః | సుమతిశ్చాగ్ని వర్చాశ్చ మిత్రయుః శింశపాయనః. 11
కృతవ్రతో7థ సావర్ణిః షట్‌శిష్యాస్తస్య చాభవన్ | శాంశపాయనాదయశ్చక్రుః పురాణానాంతు సంహితాః.
బ్రహ్మాదీని పురాణాని హరివిద్యా దశాష్టచ! మహాపురాణ హ్యాగ్నేయే విద్యారూపో హరిఃస్థితః. 13
సప్రపంచో నిష్క్రపంచో మూర్తామూర్తస్వరూపధృక్ |
తంజ్ఞాత్వాభ్యర్చ్య సంస్తూయ భుక్తిముక్తిమవాప్నుయాత్. 14
విష్ణుర్జిష్ణుర్భవిష్ణుశ్చ అగ్నిసూర్యాది రూపవాన్ | అగ్నిరూపేణ దేవాదేర్ముఖం విష్ణుః పరాగతిః. 15
వేదేషుసపురాణషు యజ్ఞమూర్తిశ్చ గీయతే! ఆగ్నేయాఖ్యం పురాణంతు రూపం విష్ణోర్మహత్తరమ్. 16
ఆగ్నేయాఖ్య పురాణస్య కర్తాశ్రోతా జనార్దనః | తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేద మయంమహత్. 17
సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం వరమ్ |
సర్వాత్మ హరిరూపంహి పఠతాం శృణ్వతాం నృణామ్. 18
విద్యార్థినాంచ విద్యాదమర్థినాం శ్రీధనప్రదమ్ | రాజ్యార్థినాం రాజ్యదంచ ధర్మదం ధర్మకామినామ్. 19
స్వర్గార్థినాం స్వర్గదంచ పుత్రదం పుత్రకామినామ్ | గవాదికామినాం గోదం గ్రామదం గ్రామకామినామ్ 20
కామార్థినాం కామదం చ సర్వసౌభాగ్య సంప్రదమ్ | గుణకీర్తిప్రదం నౄణాం జయదం జయకామినామ్. 21
సర్వేప్సూనాం సర్వదంతు ముక్తిదం ముక్తికామినామ్ |
పాపఘ్నం పాపకర్తౄణామాగ్నేయంహి పురాణకమ్.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయేవేదశాఖాదికీర్తనం నామైక సప్తత్యధికద్విశతతమో7ధ్యాయః.
సుమంతువు - జాజలి - శ్లోకాయణీ - శౌనకుడు పిప్పలాదుడు ముంజకేశుడు, మొదలగువారు అథర్వవేదమున శాఖా ప్రవర్తకులగు ఋషులు. దీనిలో పదహారువేల మంత్రములు నూరు ఉపనిషత్తులు వున్నవి. శ్రీ మహావిష్ణువు వ్యాసరూపమున అవతరించి వేదశాఖా విభాగమును చేసెను. వేద శాఖా భేదాదులు ఇతిహాసములు పురాణములు, ఇవన్నియు విష్ణు స్వరూపములు. లోమహర్షనుడను నూతుడు వ్యాసుని నుండి పురాణాదులు గ్రహించి, ప్రచారము చేసెను. అతనికి సుమతి- అగ్నివర్చసుడు, మిత్రము శింశపాయనుడు, కృతవ్రతుడు, సావర్ణి - అను ఆరుగురు శిష్యులుండిరి. శింశపాయనాదులు పురాణ సంహితను రచించిరి. శ్రీ మహావిష్ణువే బ్రాహ్మాది అష్టాదశపురాణముల రూపమునను అష్టాదశ విద్యారూపమునను, వున్నాడు. సప్రపంచ, నిష్ర్పపంచ, మూర్తామూర్త, స్వరూపధారియగు శ్రీమహావిష్ణువు అగ్ని పురాణరూపమున నున్నాడు. అతనిని తెలుసుకొని పూజించి స్తుతించినచో భుక్తిముక్తులు లభించును. విజయశీలుడగు విష్ణువు ప్రభావసంపన్నుడు. అగ్ని సూర్యాదిరూపముననున్నవాడు. ఆ విష్ణువే అగ్ని రూపమున దేవతాదుల ముఖముగ నున్నాడు. ఆతడే పరమగతి. వేద పురాణములందు యజ్ఞమూర్తిగ వర్ణింపబడుచున్నాడు. ఈ అగ్ని పురాణము విష్ణవు యొక్క మహత్తరరూపము. ఈ అగ్ని మహాపురాణమునకు కర్తయు శ్రోతయు కూడ జనార్దనుడే అందుచే ఈ అగ్ని మహాపురాణము సర్వవేదమయము. సర్వ విద్యామయము సర్వజ్ఞానమయము, పుణ్యము శ్రేష్ఠము. చదువు వారికిని వినువారికిని సర్వాత్ముడగు శ్రీహరియే స్వరూపము ఈ పురాణము విద్యార్థులకు విద్యను ధనార్థులకు ఐశ్వర్యమును, రాజ్యార్థులకు రాజ్యమును, ధర్మకాములకు ధర్మమును, స్వర్గకాములకు స్వర్గమును, పుత్రకాములకు పుత్రులను, గవాదికాములకు గోవులను గ్రామకాములకు గ్రామములను ఇచ్చును. కామార్థులకు సర్వసౌభాగ్యములను, గుణ కీర్తులను ఇచ్చును. జయకాములకు జయమును, సర్వకాములకు సర్వమును ముక్తి కోరువారికి ముక్తిని ఇచ్చును. పాపములు చేసిన వారికి పాపములు తొలగించుడు.
అగ్నిమహాపురాణమున వేదశాఖ కీర్తనమును రెండువందలడెబ్బది ఒకటవ ఆధ్యాయము సమాప్తము.