Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ చతుఃసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ సోమవంశవర్ణనమ్
అగ్నిరువాచ :
సోమవంశం ప్రవక్ష్యామి పఠితం పాపనాశనమ్ | విష్ణునాభ్యబ్జజో బ్రహ్మాబ్రహ్మపుత్రో7త్రిరత్రితః. 1
సోమశ్చక్రే రాజసూయం త్రైలోక్యం దక్షిణాందదౌ | సమాప్తే7వభృథే సోమం తద్రూపాలోకనేచ్ఛవః. 2
కామబాధాభితప్తాంగ్యో నరదేవ్యః సిషేవిరే | లక్ష్మీనారాయణంత్యక్త్వా సినీవాలీ చ కర్దమమ్. 3
ద్యుతిర్విభావసుంత్యక్త్వా పుష్టిర్ధాతార మవ్యయమ్ | ప్రభా ప్రభాకరం త్యక్త్వాహవిష్మన్తం కుహూఃస్వయమ్
కీర్తిర్జయన్తం భర్తారం వసుర్మారీచ కశ్యపమ్ | ధృతిస్త్యక్త్వా పతిం నందీ సోమమేవాభజత్తదా. 5
స్వకీయా ఇవ సోమో7పి కామయామాసతాస్తదా | ఏవం కృతాపచారస్య తాసాంభర్తుర్గణస్తదా. 6
నశశాకాపచారాయ శాపైః శస్త్రాదిభిఃపునః | సప్తలోకైక నాథత్వమవాప్తస్తపసాహ్యుత. 7
విబభ్రామ మతిస్తస్య వినయాదనయా77హతా | బృహస్పతేః సవైభార్యాం తారాంనామయశస్వినీమ్. 8
జహారతరసా సోమోహ్యవమాన్యాంగిరఃసుతమ్ | తతస్తద్యుద్ధమ భవత్ర్పఖ్యాతం తారకామయమ్. 9
దేవానాం దానవానాంచ లోకక్షయకరం మహత్ | బ్రహ్మానివార్యోశనసం తారామంగిరసే దదౌ. 10
తామంతః ప్రసవాం దృష్ట్వాగర్భంత్యజాబ్రవీద్గురుః | గర్భస్త్యక్తః ప్రదీప్తో7థ ప్రాహాహంసోమసంభవః. 11
ఏవం సోమాద్బుధః పుత్రః పుత్రస్తస్య పురూరవా | స్వర్గంత్యక్త్వోర్వశీ సా తం వారయామాస చాప్సరాః. 12
అగ్నిదేవుడు చెప్పెను : ఇపుడు పఠించినచోపాపములను నశింపచేయు సూర్యవంశమును గూర్చి చెప్పెదను. విష్ణు నాభికమలమునుండి బ్రహ్మపుట్టెను బ్రహ్మపుత్రుడు అత్రి, ఆతనికి సోముడు పుత్రుడు. ఆతడు రాజసూయయాగము చేసి త్రిలోక రాజ్యమును దక్షిణగా ఇచ్చివేసెను. అవభృథస్నానము సమాప్తమైన పిమ్మట అతని రూపమును చూడగోరి తొమ్మండుగురు దేవతాస్త్రీలు అతని దగ్గరకువచ్చి కామబాణ సంతప్తలై అతనిని సేవించిరి. నారాయణుని విడిచి లక్ష్మియు, కర్దముని విడిచి సినీవాలి, అగ్నిని విడిచి ద్యుతి, అవ్యయుడగుధాతను విడిచిపుష్టి, ప్రభాకరుని విడిచి ప్రభ, హవిష్మంతుని విడచి కుహు, వీరందరు స్వయముగ సోముని దగ్గరకు వచ్చిరి. భర్తయగు జయంతుని విడిచి కీర్తి, మరీచిపుత్రుడగు కశ్యపుని విడిచి వసువు, పతియైన నందిని విడిచి ధృతియు, వచ్చి సోముని సేవించిరి. చంద్రుడుకూడ వారలను స్వకీయస్త్రీలనువలె కామించెను. ఈ విధముగ అపచారముచేసిన ఆతని విషయమున ఆస్త్రీల భర్తలు శాపములచేతగాని, శస్త్రాదులచేతగాని శిక్షించుటకు సమర్థులు కాకపోయిరి. సోముడు తన తపోబలముచే సప్తలోకములకు ఏకమాత్రాధిపతియయ్యెను. ఈ దుర్వినీతిచే కలుషితమైన ఆతని బుద్ధి వినయ విహీనమై భ్రాంతిచెందెను. ఆతడు అంగిరానందనుడగు బృహస్పతిని అవమానించి ఆతని భార్యయగు యశస్వినియైన తారను బలాత్కారముగ అపహరించెను. అందుచే దేవదానవులమధ్య తారకామయముయను ప్రసిద్ధిగల లోకక్షయకరమగు గొప్పయుద్ధము జరిగెను. అంతమున బ్రహ్మ శుక్రుని అడ్డగించి తారను బృహస్పతికి ఇప్పించెను. ఆమె గర్భవతి యని తెలిసి బృహస్పతి ఈగర్భమును విడువుముయని ఆజ్ఞాపించగ ఆమె ఆగర్భమును విడిచెను. అపుడు తేజశ్శాలియగు కుమారుడు ఆవిర్భవించి నేను సోముని పుత్రుడను అనిచెప్పెను. ఈ విధముగ సోమునకు బుధుడను పుత్రుడు కలిగెను. అతనికి పురూరవుడు పుత్రుడు. ఊర్వశియను అప్సరస స్వర్గము విడచి పురూరవుని వరించెను.
తయాసహాచరద్రాజా దశవర్షాణి పంచ చ | పంచషట్‌సప్తచాష్టౌ చ దశచాష్టౌ మహామునే. 13
ఏకో7గ్ని రభవత్పూర్వం తేన త్రేతాప్రవర్తితా | పురూరవా యోగశీలో గాంధర్వంలోక మీయివాన్. 14
ఆయుర్దృఢాయురశ్వా యుర్ఘనాయుర్ధృ తిమాన్వసుః | దివిజాతః శతాయుశ్చ సుషువే చోర్వశీన్పపాన్. 15
ఆయుషోనహుషఃపుత్రో వృద్ధశర్మారజిస్తథా | దర్భోవిపాప్మా పంచాగ్న్యం రజేః పుత్రశతంహ్యభూత్. 16
రాజేయా ఇతివిఖ్యాతా విష్ణుదత్తవరోరజిః | దేవాసురేరణ దైత్యానవధీత్సురయాచితః. 17
గతాయేంద్రాయ పుత్రత్వం గత్వారాజ్యం దివంగతః | రజేఃపుత్రైర్హృతంరాజ్యం శుక్రస్యాథ సుదుర్మనాః. 18
గృహశాంత్యాది విధినా గురురింద్రాయతద్ధదౌ | మోహయిత్వా రజిసుతానాసంస్తే నిజధర్మగాః. 19
నహుషస్యసుతాః సప్తయతిర్యయాతిరుత్తమః | ఉద్భవః పంచకశ్చైవ శర్యాతి మేఘపాలకౌ. 20
యతిః కుమారభావే7పి విష్ణుంధ్యాత్వా హరింగతః | దేవయానీ శుక్రకన్యా యయాతేః వత్న్యభూత్తదా. 21
వృషపర్వజా శర్మిష్ఠా యయాతేః పంచతత్సుతాః | యదుంచ తుర్వసుంచైవ దేవయాని వ్యజాయత. 22
ద్రుహ్యం చానుంచ పూరుంచ శర్మిష్ఠావార్షపర్వణీ | యదుః పురుశ్చాభవతాం తేషాం వంశ వివర్ధనౌ. 23
ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే సోమవంశవర్ణనంనామ చతుఃసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
పురూరవుడు ఊర్వశితో ఏబదితొమ్మిది సంవత్సరములు విహరించెను. పూర్వము ఒకేయగ్ని వుండెడిది. పురూరవుడు ఆ అగ్నిని మూడుగా విభజించెను. మహాయోగియగు ఆతడు గంధర్వలోకము చేరెను. పురూరవునకు ఊర్వశియందు ఆయు,-దృఢాయు-అశ్వాయు-ధనాయు-దృతిమత్-వసు-దివిజాత-శతాయు అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి. ఆయువునకు నహషుడు, వృద్ధశర్మ, రజి, దంభుడు, విపాప్మ అను ఐదుగురు పుత్రులు పుట్టిరి. రజికి రాజేయులని ప్రసిద్ధిచెందిన నూర్గురుపుత్రులు జనించిరి. రజికి విష్ణువు వరములను ఇచ్చెను. దేవతలు ప్రార్థింపగ, ఆతడు దేవాసురయుద్ధమునందు దైత్యులను చంపెను. తనకు పుత్రుడుగాజన్మించిన ఇంద్రునకు రాజ్యము ఇచ్చి రజి స్వర్గముచేరెను. కొంతకాలము తరవాత రజి కుమారులు ఇంద్రునిరాజ్యమును లాగుకొనగ అతడు దుఃఖితుడయ్యెను. పిదప బృహస్పతి గ్రహశాంత్యాది విధులచే రజిపుత్రులను మోహింపచేసి రాజ్యముతీసుకొని మరల యింద్రునకు ఇచ్చెను. అపుడు రజికుమారులు ధర్మభ్రష్టులైరి. సహుషునకు-యతి-యయాతి-ఉత్తమ-ఉద్ధవ-పంచక-శర్యాతి-మేఘ పాలకులను ఏడుగురు కుమారులు జనించిరి. యతి బాల్యమునందే విష్ణుధ్యానము చేసి విష్ణుపదమును పొందెను. శుక్రుని కుమార్తెయైన దేవయానియు, వృషపర్వుని కుమార్తెయైన శర్మిష్ఠయు యయాతి భార్యలైరి. వీరియందుయయాతికి ఐదుగురుకుమారులు జనించిరి. దేవయాని, యదు, తుర్వసు, అనువారిని కనెను. శర్మష్ఠ ధృహ్యుడు అను, పూరుడు అనుముగ్గురు పుత్రులను కనెను. వీరిలో యదు-పూరువులు సోమవంశవర్ధకులైరి.
అగ్ని మహాపురాణమున సోమవంశవర్ణనమను రెండువందల డెబ్బదినాల్గవ అధ్యాయము సమాప్తము.