Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ పంచసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ యదువంశవర్ణనమ్
అగ్నిరువాచ :
యదోరాసన్పంచ పుత్రా జ్యేష్ఠస్తేతు సహస్రజిత్ | నీలాంజికో రఘుః క్రోష్ఠుః శతజిచ్చ సహస్రజిత్. 1
శతజిద్దైహయోరేణు హయో హయ ఇతిత్రయః | ధర్మనేత్రో హైహయస్య ధర్మనేత్రస్య సంహనః. 2
మహిమా సంహనస్యా సీన్మహిమ్నో భద్రసేనకః | భద్రసేనాద్ధుర్గమో7భూద్దు ర్గమాత్కనకో7భవత్. 3
కనకాత్కృత వీర్యస్తు కృతాగ్నిః కరవీరకః | కృతౌజాశ్చ చతుర్థో7భూత్కృత వీర్యాత్తుసో7ర్జునః. 4
దత్తో7ర్జు నాయతపతే సప్తద్వీప మహీశతమ్ | దదౌబాహు సహస్రంచ హ్యజేయత్వం రణ7రిణా. 5
అధర్మే వర్తమానస్య విష్ణుహస్తాన్మృతిర్ధృవా | దశయజ్ఞ సహస్రాణి సో7ర్జునః కృతవాన్నృపః. 6
అనష్ట ద్రవ్యతా రాష్ట్రేతస్య సంస్మరణాదభూత్ | నన్యూనం కార్తవీర్యస్య గతింయాస్యన్తివైనృపాః. 7
యజ్ఞైర్దానైస్తపోభిశ్చ విక్రమేణ శ్రుతేనచ | కార్తవీర్యస్య చ శతం పుత్రాణాం పంచవైపరాః. 8
సూరసేనశ్చ సూరశ్చ దృష్టోక్తః కృష్ణఏవచ | జయధ్వజశ్చ నామ్నాసీదా వన్త్యో నృపతిర్మహాన్. 9
జయధ్వజాత్తాలజంఘ స్తాల జంఘాత్తతః సుతాః | హై హయానాం కులాః పంచ భోజాశ్చావన్తయస్తథా. 10
వీతిహోత్రాః స్వయంజాతాః శౌండికేయాస్తథైవచ | వీతిహోత్రాదనన్తో7భూదనన్తాద్దుర్జయోనృపః. 11
అగ్నిదేవుడు పలికెను : యదువునకు నీలాంజికుడు, రఘువు, క్రోష్టు, శతజిత్, సహస్రజిత్ అను ఐదుగురు పుత్రులు జన్మించిరి. వారిలో సహస్రజిత్ జేష్ఠుడు. శతజిత్తునకు హైహయుడు, రేణుహయుడు, హయుడు అని ముగ్గురు పుత్రులు పుట్టిరి. హైహయునకు ధర్మనేత్రుడు వానికి సంసాతుడు, వానిచి మహిముడు, వానికి భద్రసేనుడు, వానికి దుర్గముడు, వానికి కడు జన్మించిరి. కనకునకు కృతవీర్య - కృతాగ్ని - కరవీర - కృతౌజులను పుత్రులుజన్మించిరి. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అతని తపస్సుకుప్రసన్నుడైన దత్తాత్రేయుడు ఆతనికి సప్తద్వీప పరివృతమగు పృథ్విపై ఆధిపత్యమును, వెయ్యిభుజములను యుద్ధమునందు అజేయత్వమును వరముగ ఇచ్చి ''నీవు ఎప్పుడు అధర్మము చేయుదువో అపుడు శ్రీమహావిష్ణువు నిన్ను సంహరించును'' అని చెప్పెను. అర్జునుడు పదివేలయజ్ఞములు చేసెను. అతనిని స్మరించగనే రాష్ట్రములో ఎవరికిని ధననాశనము కలుగకుండెను. యజ్ఞదాన, తపఃపరాక్రమ, శాస్త్రజ్ఞానము లందు కృతవీర్యకుమారుడగు అర్జునునకు సాటి ఎవ్వరును లేరు. అతనికి ఐదువందల పుత్రులు జనించిరి. వారిలో శూరసేన-శూర-ధృష్టోక్త-కృష్ణ-జయధ్వజులు, అను ఐదుగురు ప్రధానులు. జయధ్వజుడు అవంతీ దేశరాజాయెను. అతనికి తాలజంఘుడు పుత్రుడు. తాలజంఘునకు అదేపేరుతో ప్రసిద్ధులగు చాలమంది పుత్రులు జనించిరి. హైహయవంశ క్షత్రియులలో భోజ-అవంతీ-వీతిహోత్ర- స్వయంసంజాత, శౌండికేయులను ఐదు కులములు ఉండెను. వీతిహోత్రునకు అనంతడు అతనికి దుర్జయుడు జన్మించెను.
క్రోష్టోర్వంశం ప్రవక్ష్యామి యత్రజాతో హరిః స్వయమ్ |
క్రోష్టోస్తు వృజినీవాంశ్చ స్వాహా భూద్వృజినీవతః. 12
స్వాహాపుత్రో రుదద్గుశ్చ తస్యచిత్ర రథః సుతః | శశబిందిశ్చిత్ర రథాచ్చక్రవర్తీ హరౌరతః. 13
శశబిందోశ్చ పుత్రాణాం శతానామభవచ్ఛతమ్ | ధీమతాం చారురూపాణాం భూరి ద్రవిణతేజసామ్. 14
పృథుశ్రవాః ప్రధానో7భూత్తస్యపుత్రః సుయజ్ఞకః | సుయజ్ఞస్యోశనాః పుత్రస్తితిక్షురుశనః సుతః. 15
తితిక్షోస్తు మరుత్తో7భూత్తస్మాత్కంబల బర్హిషః | పంచాశద్రుక్మ కవచాద్రుక్మేషుః పృథురుక్మకః. 16
హవిర్జ్యామఘః పాపఘ్నోజ్యామఘః స్త్రీజితో7భవత్ | సేవ్యాయాం జ్యామఘాదాసీ ద్విదర్భస్తస్యకౌశికః. 17
లోమపాదః క్రథః శ్రేష్ఠాత్కృతిః స్యాల్లోమపాదతః | కౌశికస్యచిదిః పుత్రస్త స్మాచ్చైద్యానృపాః స్మృతాః.
క్రథాద్విదర్భ పుత్రాశ్చకుంతిః కుంతేస్తుధృఫ్టకః | దృష్టస్య నిధృతిస్తస్య ఉదర్కాఖ్యోవిదూరథః. 19
దశార్హపుత్రో వ్యోమస్తు వ్యోమాజ్జీమూత ఉచ్యతే | జీమూత పుత్రోవికలః తస్యభీమరథఃసుతః. 20
భీమరథాన్నవరథః తతోదృఢ రథో7భవత్ | శకున్తిశ్చదృఢ రథాచ్ఛకున్తేశ్చ కరంభకః. 21
కరంభాద్దేవ రాతో7భూద్దేవక్షేత్రశ్చ తత్సుతః | దేవక్షేత్రాన్మధుర్నామ మధోర్ద్రవరసో7భవత్. 22
ద్రవరసాత్పురుహూతో7భూజ్జంతు రాసీత్తుతత్సుతః | గుణీతుయాదవో రాజాజంతుపుత్రస్తు సాత్వతః. 23
సాత్వతాద్భజమానస్తు వృష్టిరంధక ఏవచ | దేవావృధశ్చ చత్వారస్తేషాం వంశాస్తు విశ్రుతాః. 24
భజమానస్య వాహ్యో7భూద్వృష్టిః కృమిర్నిమిస్తథా | దేవావృధాద్బభ్రురాసీత్తస్య శ్లోకో7త్రగీయతే 25
యథైవశృణుమో దూరాద్గణాం స్తద్వత్స మంతికాత్ | బభ్రుః శ్రేష్ఠో మనుష్యాణాం దేవైర్దేవా వృధఃసమః. 26
చత్వారశ్చ సుతా బభ్రోర్వాసుదేవపరా నృపాః | కుహరో భజమానస్తు శినిః కంబలబర్హిషః. 27
ఇపుడు క్రోష్టువంశమును గూర్చిచెప్పెదను, ఈవంశమున శ్రీమహావిష్ణువు స్వయముగ జన్మించెను. క్రోష్టునకు వృజినీవంతుడు అతనికి స్వాహా, వానికి రుషద్గుడు, అతనికి చిత్రరథుడు అతనికి చక్రవర్తియైల శశిబిందువు జనించిరి. శశిబిందువు సర్వదా విష్ణుభజన సక్తుడై యుండెను. అతనికి పదివేలమంది పుత్రులు పుట్టిరి వారందరును అధికధనవంతులు తేజశ్శాలులుఅయివుండిరి. వారిలో పృథుశ్రవుడు జ్యేష్టుడు, అతనికుమారుడు సుయజ్ఞుడు అతనికి ఉశనుడు ఆతనికి తితిక్షువు, ఆతనికి మరుత్తుడు, ఆతనికి ఋక్మకవచుడను కంబలబర్హిశుడు పుట్టెను. ఋక్మకవచునకు ఋక్మేశువు, పృథురుక్మకుడు, హవి, జ్యామగుడు, పాపఘ్నుడు మొదలగు ఏబది పుత్రులు జన్మించిరి. వీరిలో జ్యామగుడు స్త్రీలకులొంగిన వాడై యుండెను. వానికి శైబ్యయిందు విదర్భుడు యను కుమారుడు పుట్టెను. ఆతనికి కౌశికుడు లోమపాదుడు క్రథుడు అనుపుత్రులు పుట్టిరి. వీరిలో లోమపాదుడు జ్యేష్టుడు, అతనికి కృతియను పుత్రుడు పుట్టెను. కౌశికుని పుత్రుడు చిది. ఈ వంశమువారు చైద్యులు యనుపేరుతో ప్రసిద్ధులు. విదర్భపుత్రుడగు పృథునకు కుంతి, కుంతికి ధృష్టకుడు, పుట్టిరి. వానికి ధృతి, వానికి విదూరథుడు, పుట్టిరి విదూరథునకు దశార్హుడనికూడ పేరు. దశార్హునకు వ్యోముడు వానికి జీమూతుడు వానికి వికలుడు వానికి భీమరథుడు, వానికి నవరథుడు, వానికి ధ్రుఢరథుడు, వానికి శకుంతి, వానికి కరంభుడు, వానికి దేవరాతుడు, వానికి దేవక్షేత్రుడు, వానికి మధువు, వానికి ధ్రవరసుడు, వానికి పురుహూతుడు, వానికి జంతవు - వానికి సాత్వతుడు పుట్టెను. సాత్వతుడు పుట్టెను. సాత్వతుడు యదు వంశీయులలో ఉత్తమగుణవంతుడగు రాజు ఆతనికి భజమానుడు, వృష్టి అంధకుడు దేవావృధుడు, అను నలుగురు పుత్రులు పుట్టిరి. ఈ నలుగురి వంశములును ప్రసిద్ధములైనవి. భజమానునకు బాహ్యుడు, వృష్టి-కృమి, నిమి, అను పుత్రులు పుట్టిరి. దేవావృధునకు బభ్రువు పుట్టెను. ఆతని విషయమున ఈశ్లోకము చెప్పబడుచున్నది. ''మనము దూరమునుండి సద్గుణములను ఎట్లువినుచున్నామో, దగ్గరనుండి కూడ అట్లే చూచుచున్నాము. బభ్రువు మనుష్యులలో శ్రేష్ఠుడు. దేవావృధుడు దేవతాసమానుడు.'' బభ్రువునకు కుహురుడు భజమానుడు శిని, కంబలర్హిషుడు అను వాసుదేవభక్తులగు నలుగురు కుమారులు పుట్టిరి.
కుహురస్య సుతో ధృష్ణుర్ధృష్ణోస్తు తనయోధృతిః | ధృతేః కపోతరోమాభూత్తస్య పుత్రస్తు తిత్తిరిః. 28
తిత్తిరేస్తు నరః పుత్రస్తస్య చందన దుందుభిః పునర్వసుస్తస్య పుత్ర ఆహుకశ్చాహుకీ సుతః.
29
ఆహుకాద్దేవకోజజ్ఞే ఉగ్రసేనస్తతో7భవత్ | దేవవానుప దేవశ్చ దేవకస్య సుతాః స్మృతాః. 30
తేషాం స్వసారఃసప్తాసన్వసుదేవాయ తాదదౌ | దేవకీశ్రుత దేవీచ మిత్రదేవీయశోధరా. 31
శ్రీదేవీ సత్యదేవీచ సురాపీ చేతి సప్తమీ | నవోగ్రసేనస్య సుతాః కంసస్తాసాం చ పూర్వజః. 32
న్యగ్రోధశ్చ సునామాచ కంకః శంకుశ్చ భూమిపః | సుతనూరాష్ట్ర పాలశ్చ యుద్ధముష్టిః సుముష్టికః. 33
భజమానస్య పుత్రో7థ రథముఖ్యో విదూరథః | రాజాధిదేవః శూరశ్చ విదూరథసుతో7భవత్. 34
రాజాధిదేవ పుత్రౌద్వౌ శోణాశ్వః శ్వేతవాహనః | శోణాశ్వస్య సుతాః పంచ శమీశత్రుజిదాదయః. 35
శమీపుత్రః ప్రతి క్షేత్రః ప్రతిక్షేత్రస్య భోజకః | భోజస్య హృదికః పుత్రో హృదికస్య దశాత్మజాః. 36
కృతవర్మా శతధన్వా దేవార్హోభీషణాదయః | దేవార్హాత్కంబల బర్హిరస మౌజాస్తతో7భవతు 37
సుదంష్ట్రశ్చ సువాసశ్చ ధృష్టో7భూదసమౌజసః | గాంధారీ చైవ మాద్రీచ ధృష్టభార్యేబభూవతుః. 38
సుమిత్రో7భూచ్చ గాంధార్యాం మాద్రీజజ్ఞేయుధాజితమ్ | అనమిత్రః శనిర్ధృష్టాత్తతోవై దేవమీడుషః. 39
అనమిత్ర సుతో నిఘ్నో నిఘ్నస్యాపి ప్రసేనకః | సత్రాజితః ప్రసేనో7థ మణిం సూర్యాత్స్యమన్తకమ్. 40
ప్రాప్యారణ్య చరంతంతు సింహోహత్వాగ్రహీన్మణిమ్ | హతో జాంబవతా సింహో జాంబవాన్హరిణాజితః. 41
తస్మాన్మణిం జాంబవతీం ప్రాప్యా గాద్ద్వారకాం పురీమ్ | నత్రాజితాయ ప్రదదౌ శతధన్వా జఘానతమ్. 42
హత్వాశతధనుం కృష్ణో మణిమాదాయ కీర్తిభాక్ | బలయాదవ ముఖ్యాగ్రేహ్య క్రూరే మణిమర్ఫయేత్. 43
మిథ్యా భిశస్తిం కృష్ణస్య త్యక్త్వా స్వర్గీచసంపఠన్ |
సత్రాజితో భంగకారః సత్యభామా హరేఃప్రియా. 44
అనమిత్రాచ్ఛి నిర్జజ్ఞే సత్యకస్తు శినేః సుతః | సత్యకాత్సాత్యకిర్జజ్ఞే యుయుధానాద్దునిర్హ్యభూత్. 45
ధునేర్యు గంధరః పుత్రః స్వాహ్యో7భూత్సయుధాజితః | ఋషభ##క్షేత్రకౌతస్య ఋషభాచ్చశ్వఫల్కకః.
శ్వఫల్క పుత్రోహ్యక్రూరశ్చా క్రూరాచ్చ సుధన్వకః |
శూరాత్తు వసుదేవాద్యాః పృథా పాండోః ప్రియా7భవత్. 47
ధర్మాద్యుధిష్ఠిరః పాండోర్వాయోః కున్త్యాం వృకోదరః|ఇంద్రాద్ధనంజయోమాద్ర్యాం నకులః సహదేవకః. 48
వసుదేవాచ్చ రోహిణ్యాం రామః సారణ దుర్దమౌ | వసుదేవాచ్చ దేవక్యామాదౌ జాతః సుసేనకః. 49
కీర్తిమాన్భద్రసేనశ్చ జారుఖ్యో విష్ణుదాసకః | భద్రదేహః కంస ఏతాన్షడ్గర్భాన్ని జఘానహ. 50
తతో బలస్తతో కృష్ణః సుభద్రాభద్రభాషిణీ | చారుదేష్ణశ్చ సాంబాద్యాః కృష్ణాజ్జాంబవతీ సుతాః. 51
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యదువంశ వర్ణనం నామ పంచసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
కుహురునకు ధృష్ణువు-వానికిధృతి- కపోతరోముడు, వానికి తిత్తిరి, వానికి నరుడు, వానికి, ఆనకదుందుభి పుట్టిరి. ఆనకదుందుభికి పునర్వసువు ఆతనికి ఆ హుకీ పుత్రుడగు ఆ హుకుడు పుట్టెను. ఆ హుకునకు దేవక ఉగ్రసేనులు పుత్రులు. దేవకునకు దేవవంతుడు ఉపదేవుడు సహదేవుడు, దేవరక్షితుడు, అను నలుగురు పుత్రులు పుట్టిరి. వీరికి ఏడుగురు సోదరీలు ఉండిరి. వారిని వసుదేవుడు వివాహమాడెను. దేవకి శ్రుతదేవి. మిత్రదేవి, యశోధర, శ్రీదేవి, సత్యదేవి, సురాపి, అని వీరి పేర్లు. ఉగ్రసేనునకు కంస-న్యగ్రోధ-సునామ-కంక-శంకు-సుతను-రాష్ట్రపాల-యుద్ధముష్టి-సుముష్టికులను అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి వీరిలో కంసుడు జ్యేష్ఠుడు. భజమానునకు ఉత్తమ రథికుడైన విదూరథుడు అతనికి రాజాధి దేవశూరులు పుట్టిరి. రాజాధి దేవునకు శోణాశ్వుడు. శ్వేతవాహనుడు, అను ఇరువురు పుత్రులు జన్మించిరి. శోణాశ్వునకు శనిశత్రుజిత్, మొదలగు ఐదుగురు పుత్రులు జన్మించిరి. శమికి ప్రతిక్షేత్రుడు వాని భోజుడు, వానికి హృదికుడు జన్మించిరి. హృదికుని పదిమంది పుత్రులలో కృతవర్మ-శతధ్వనుడు-దేవార్హుడు-భీషణుడు-మొదలగు ప్రధానులు. దేవార్హునకు కంబల బర్హి అతనికి అసమౌజుడు, ఆతనికి సుదౌష్ట్ర-సువాస-ధృష్టులు జన్మించిరి. ధృష్టునకు గాంధారిమాద్రియను ఇద్దరు భార్యలుండిరి. గాంధారియందు సుమిత్రుడు, మాద్రియందు యుధాజిత్తు పుట్టిరి. ధృష్టునకు అనమిత్రుడుశిని పుట్టిరి. శినికి దేవమీఢుషుడు జనించెను. అనమిత్రునకు నిఘ్నుడు ఆతనికి ప్రసేన-సత్రాజిత్తులు పుట్టిరి. సోదరుడగు సత్రాజిత్తుకు సూర్యుని నుండి లభించిన శ్యమంతకమణిని ధరించి ప్రసేనుడు వేటకైవెళ్ళగా ఒక సింహ మతనిని చంపి మాణిక్యమును గ్రహించెను. ఆసింహమును చంపి జాంబవంతుడు ఆ మణిని తీసుకొనెను. పిదప శ్రీ కృష్ణుడు యుద్ధము నందు జాంబవంతుని ఓడించి జాంబవతిని ఆమణిని స్వీకరించి ద్వారకాపురికి తిరిగివచ్చి మణిని సత్రాజిత్తునకు ఇచ్చివేసెను. శతధ్వనుడు సత్రాజిత్తును చంపివేసెను. శ్రీకృష్ణుడు శతధన్వునిచంపి ఆమాణిక్యమును లాగుకొని యశశ్శాలియయ్యెను. ఆతడు బలరామాది యదువంశీయుల సమక్షమున ఆమణిని ఆక్రూరునకు యిచ్చెను. దీనితో శ్రీ కృష్ణునిపై వచ్చిన మిథ్యారోపము తొలగి పోయెను. ఈ కథను చదువువానికి స్వర్గములభించును. సత్రాజిత్తునకు బంకకారుడను పుత్రుడు శ్రీకృష్ణుని భార్యయగు సత్యభామయు జనించిరి. అనమిత్రునకు శిని వానికి సత్యకుడు వానికి యుయుధానుటను నామాంతరముగల సాత్యకి, వానికిధుని, వానికి యుగంధరుడు పుట్టిరి. యుధాజిత్తునకు స్వాహ్యుడు వానికి ఋషభ - క్షేత్రకులు పుట్టిరి. ఋషభునకు స్వఫల్కుడు, వానికి అక్రూరుడు, వానికి సుధన్వకుడు పుట్టిరి. శూరునకు వసుదేవుడు మొదలగు పుత్రులు పృథయను కన్యయు పుట్టిరి. ఆమెపాండురాజునకు భార్య. కుంతియను నామాంతరముగల ఆమెకు (పృథ) యముని అంశముచే యుధిష్ఠిరుడు, వాయుఅంశముచే భీమసేనుడు, ఇంద్రాంశముచే అర్జునుడు జన్మించిరి. మాద్రికి నకుల సహదేవులు జన్మించిరి. వసుదేవునకు రోహిణియందు బలరామ సారణదుర్గములు అను ముగ్గురు పుత్రులు దేవకియందు సుషేణ - కీర్తిమత్ - భద్ర సేన- జారుఖ్య - విష్ణుదాస భద్రదేహులు జన్మించిరి. ఈ ఆరుగురు శిశువులను కంసుడు చంపివేసెను. పిదప బలరామ కృష్ణులు ఆవిర్భవించిరి. చివర కల్యాణవచనముగల సుభద్ర జన్మించెను. శ్రీకృష్ణునకు చారుదేష్ణుడు సాంబుడు మొదలగు పుత్రులు పుట్టిరి. సాంబాదులు జాంబవతి పుత్రులు.
అగ్ని మహాపురాణమున యదువంశవర్ణనమను రెండువందలడెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.