Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ అష్టసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ పురువంశవర్ణనమ్
అగ్నిరువాచ :
పురోనమే జయో7భూత్ర్పా చీవాన్నామ తత్సుతః | ప్రాచీవతోమనస్యుస్తు తస్మాద్వీత మయోనృపః 1
శుంధుర్వీతమయాచ్ఛా భూచ్ఛుంధోర్బహువిధః సుతః | బహువిధాచ్చ సంయాతి రహోవాదీచ తత్సుతః. 2
తస్యపుత్రో7థ భద్రాశ్వో భద్రాశ్వస్య దశాత్మజాః | ఋక్షేయశ్చ కృషేయుశ్చ సన్నతేయుస్తథాత్మజః. 3
ఘృతేయుశ్చ చితేయుశ్చస్థండిలేయుశ్చ సత్తమః | ధర్మేయుః సన్నతేయుశ్చ కృతేయుర్మ తినారకః. 4
తంసురోధః ప్రతిరథః పురస్తోమతినారజాః | ఆసీత్ర్పతిరథాత్కణ్వః కణ్వాన్మేధా తిథిస్త్వభూత్. 5
తంసురోధాచ్చ చత్వారో దుష్యంతో7థ ప్రవీరకః | సుమంతశ్చానయోవీరో దుష్యంతాద్భరతో7భవత్. 6
శకుంతలాయాంతు బలీయస్యనామ్నాతు భారతాః | సుతేషు మాతృకోపేన నష్టేషు భరతస్యచ. 7
తతోమరుద్భి రానీయపుత్రః సతుబృహస్పతేః | సంక్రామితో భరద్వాజః క్రతుభిర్వితథో7భవత్. 8
నచాపి వితథః పుత్రాఞ్జనయామాస పంచవై | సుహోత్రంచ సుహోతారం గయం గర్భంత థైవచ. 9
కపిలశ్చ మహాత్మానం సుకేతుంచ సుతద్వయమ్ | కౌశికంచ గృత్సపతిం తథాగృత్సపతేః సుతాః. 10
బ్రాహ్మణాః క్షత్రియావైశ్యాః కాశే (శా) దీర్ఘతమాః సుతాః |
తతోధన్వన్తరిశ్చా సీత్తత్సుతో7భూచ్చ కేతుమాన్.
కేతుమతో హేమరథో దివోదాసఇతిశ్రుతః | ప్రతర్దనో దివోదాసాద్భర్గపత్సౌ ప్రతర్దనాత్. 12
వత్సాదనర్క ఆసీచ్చహ్యనర్కాతేక్ష మకో7భవత్ | క్షేమకాద్వర్ష కేతుశ్చ వర్షకేతోర్విభుః స్మృతః 13
విభోరానర్తః పుత్రో7భూద్విభోశ్చ సుకుమారకః | సుకుమారాత్సత్య కేతుర్వత్స భూమిస్తు వత్సకాత్. 14
సుహోత్రస్య బృహత్పుత్రో బృహతస్తనయాస్త్రయః | అజమీఢో ద్విమీఢశ్చ పురుమీఢశ్చ వీర్యవాన్. 15
అజమీఢస్య కేశిన్యాం జజ్ఞేజహ్నుః ప్రతాపవాన్ | జహ్నోరభూదజకాశ్వో బలాకాశ్వస్తదాత్మజః. 16
బలాకాశ్వస్య కుశికః కుశికాద్గాధి రింద్రకః | గాధేః సత్యవతీ కన్యా విశ్వామిత్రః సుతోత్తమః. 17
దేవరాతః కతిముఖా విశ్వామిత్రస్య తే సుతాః | శునఃశేపో7ష్టకశ్చాన్యోహ్యజ మీఢాత్సుతో7భవత్. 18
నీలిన్యాం శాంతిరపరః పురుజాతిః సుశాంతితః | పురుజాతేస్తు బాహ్యాశ్వో బాహ్యాశ్వాత్పంచ పార్థివాః. 19
ముకులః సృంజయశ్చైవ రాజా బృహదిషస్తథా | యవీనరశ్చ కృమిలః పాంచాలా ఇతి విశ్రుతాః. 20
ముకులస్యతు మౌకుల్యాః క్షే(క్ష) త్రోపేతా ద్విజాతయః |
చంచాశ్వో ముకులాజ్జజ్ఞే చంచాశ్వాన్మిథునం హ్యభూత్. 21
దివోదాసోహ్య హల్యాచ త్వహల్యాయాం శరద్వతాత్ | శతానందః శతానందాత్సత్యధృఙ్ మిథునం తతః.
కృపః కృపీ దివో దాసాన్మైత్రేయః సోమపస్తతః | సృంజయాత్పంచ ధనుషః సోమదత్తశ్చతత్పుతః. 23
సహదేవః సోమదత్తాత్సహ దేవాత్తు సోమకః | ఆసీచ్చ సోమకాజ్జంతుర్జం తోశ్చ పృషతః సుతః. 24
పృషతాద్ద్రుపదస్తస్మాద్ధృష్టద్యుమ్నో7థ తత్సుతః | ధృష్టకేతుశ్చ ధూమిన్యామృక్షో7భూదజమీఢతః. 25
ఋక్షాత్సం వరణో జజ్ఞే కురుః సంవరణాత్తతః | యః ప్రయాగాద పాక్రమ్య కురుక్షేత్రం చకారహ. 26
అగ్ని దేవుడు పలికెను. పురుషునకు జనమేజయుడు, వానికి ప్రాచీవంతుడు, వానికి మనస్యుడు వానికి వీతమయుడు, వానికి శంధుడు, వానికి బహువిధుడు. వానికి సంయాతి, వానికి రహోవాది, వానికి భద్రాశ్వుడు పుట్టెను. భద్రాశ్వునకు ఋచేయు-కృషేయు-సంనతేయు-ఘృతేయు - చితేయు - స్థండిలేయు - ధర్మేయు -సంనతేయు-కృతేయు మతినారులను పదిమంది పుత్రులు పుట్టిరి. మతినారునకు తంసురోధ-ప్రతిరథ-పురస్తులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. ప్రతిరథునకు -దుష్యంత -ప్రవీరక-సుమంత-వీరవరులను నలుగురు పుత్రులుపుట్టిరి. దుష్యంతునకు భరతుడుపుట్టెను. భరతుడు శకుంతలా పుత్రుడు; మహాబలశాలి. ఇతని వంశమున పుట్టిన వారికి భారతులను పేరువచ్చినది. భరతుని పుత్రులు మాతృక్రోధముచే నశించగా, రాజుయజ్ఞముచేసెను. అపుడు మరుద్గణములు బృహస్పతి పుత్రుడగుభరద్వాజుని తీసుకొనివచ్చి అతనిని ఆరాజునకు పుత్రునిగాయిచ్చిరి. ఇతడు వితధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యెను వితథునకు సుహోత్ర సుహోత్రు గయ-గర్భ కపిలులు అను ఐదుగురు పుత్రులు పుట్టిరి. వీరుకాక మహాత్ముడు సుకేతువుఅను ఇరువురు పుత్రులు పుట్టిరి. పిదప కౌశికుడు గృత్సపతి అను పుత్రులు కూడ బుట్టిరి. గ్నత్సపతికి బుట్టిన అనేక కుమారులలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అందరును వుండిరి. కాశ-దీర్ఘతములుగృత్సపతి కుమారులే, దీర్ఘతమునకు ధన్వంతరి వానికి కేతుమంతుడు, వానికి కేతుమంతుడు వానికి దివోదాసుడను ప్రసిద్ధిగల హిమరథుడు, వానికి ప్రతర్దనుడు వానికి భర్గ-వత్సులు. వత్సునకు అనర్కుడు-వానికి క్షేమకుడు-వానికి వర్షకేతువు-వానికి విభుడు, -వానికి విభుడు, -వానికి అనర్త - సుకుమారులు, సుకుమారునకు సత్యకేతువు పుట్టెను. వత్సరాజునకు వత్సభూమియను పుత్రుడు పుట్టెను. వితథునికుమారుడగు సుహోత్రునకు బృహత్ అనుపుత్రుడు పుట్టెను. బృహత్తునకు అజమీఢ-ద్విమీఢ పురుమీఢులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. అజమీఢునకు కేశినియను భార్యయందు జహ్నువుపుట్టెను. ఆతనికి అజకాశ్వుడు ఆతనికిబలాకాశ్వుడు ఆతనికి కుశికుడు, ఆతనికి ఇంద్రత్వమును సంపాదించినగాధి అతనికి సత్యవతి యను కుమార్తెయు, విశ్వామిత్రుడను కుమారుడును పుట్టెను దేవరాతకతిముఖాదులు విశ్వామిత్రుడి పుత్రులు. అజమీఢునకు శువశ్శేపుడు, అష్టకులనుపేరుగల ఇతర పుత్రులును పిట్టిరి. ఆతనికి నీలినియను భార్యయందు శాంతియను మరొక పుత్రుడు కూడ పుట్టెను. శాంతికి పురుజాతి-వానికి బాహ్యాశ్వుడు, వానికి ముకుల-సృంజయ-బృహదిషు-యవీనర-కృమిలులను ఐదుగురుకుమారులును పుట్టిరి. వీరికి పాంచాలులని ప్రసిద్ధి. ముకుల వంశీయులకు మౌకుల్యులని పేరు. వీరు క్షాత్రధర్మమును అనుసరించు బ్రాహ్మణులు. ముకులునకు చంచాశ్వుడు-వానికి ఒక పుత్రుడు పుత్రి కవలలు పుట్టిరి. పుత్రుని పేరు దివోదాసుడు పుత్రికపేరు అహల్య, అహల్యకు శరద్వంతుని (గౌతముని) వలన శతానందుడు పుట్టెను శతానందునకు సత్యధృక్ అను పుత్రుడు పుట్టెను. వానికి కృపుడు అను పుత్రుడు, కృపియను పుత్రిక కవలలుగా పుట్టిరి. దివోదాసునకు మైత్రీయుడు వానికి సోమకుడు, పుట్టెను. సుబుంజయునకు పంచహనుష్కుడు ఆతనికి సోమదత్తుడు, ఆతనికి సహదేవుడు ఆతనికి సోమకుడు, ఆతనికి జంతువు, ఆతనికి పృషత్, వానికి ద్రుపదుడు, వానిధృష్టద్యుమ్నుడు వానికిదృష్టకేతువు పుట్టెను. అజమీడునునకు ధూమినియను భార్యయందు ఋక్షుడను పుత్రుడు పుట్టెను ఆతనికి సంవరణుడు, ఆతనికి కురువుపుట్టెను అతడు ప్రయాగనుంచి కురుక్షేత్ర తీర్థమును స్థాపించెను.
కురోః సుధన్వా సుధమః పరీక్షిచ్చారిమేజయః |
సుధన్వనః సుహోత్రో7భూత్సుహోత్రాచ్చ్య వనోహ్యభూత్. 27
వశిష్ఠపరిచారాభ్యాం సప్తాసన్గిరికాసుతాః | బృహద్రథః కుశోవీరో యదుఃప్రత్య గ్రహోబలః. 28
మత్స్యకాలీ కుశాగ్రో7తోహ్యాసీద్రాజ్ఞో బృహద్రథాత్ | కుశాగ్రా దృషభోజజ్ఞే తస్య సత్య హితః సుతః. 28
సుధన్వాతత్సుతశ్చోర్జ ఊర్జాదాసీచ్చ సంభవః | సంభవాచ్చ జరాసంధః సహదేవశ్చ తత్సుతః. 29
సహదేవాదు దాపిశ్చాప్యు దాపేః శ్రుతకర్మకః | పరీక్షితస్య దాయాదో ధార్మికో జసమేజయః. 31
జనమేజయాత్త్రసద్దస్యుర్జహ్నోస్తు సురథః సుతః | శుతసేనోగ్రసేనౌచ భీమసేనశ్చ నామతః. 32
జనమేజయస్య పుత్రౌతు సురథో మహిమాంస్తథా | సురథాద్విదూరథో7భూదృక్ష ఆసీద్విదూరథాత్. 33
ఋక్షస్య తు ద్వితీయస్య భీమసేనో7భవత్సుతః | ప్రతీపో భీమసేనాత్తు వ్రతీపస్యతుశన్తనుః 34
దేవాపిర్బాహ్లి కశ్చైవ సోమదత్తస్తు శన్తనోః | బాహ్లికాత్సో మదత్తో7భూద్బూరిర్భూరి శ్రవాః శలః. 35
గంగాయాం శంతనోర్భీష్మః కాల్యాయాం విచిత్ర వీర్యకః |
కృష్ణద్వైపాయనశ్చైవ క్షేత్రే వై విచిత్రవీర్యకే. 36
ధృతరాష్ట్రంచ పాండుంచ విదురం చాప్యజీజనత్ | పాండోర్యుధిష్టిరః కున్త్యాం భీమశ్చైవార్జున స్త్రయః.
నకులః సహదేవశ్చ పాండోర్మా ద్ర్యాం చ దైవతః | అర్జునస్య చ సౌభద్రః పరీక్షి దభి మన్యుతః. 38
ద్రౌపదీ పాండవానాంచ ప్రియాతస్యాం యుధిష్ఠిరాత్ | ప్రతివింధ్యో భీమసేనాచ్ఛృత కీర్తిర్దనంజయాత్. 39
సహదేవాచ్ఛ్రుత కర్మాశతానీకస్తునాకులిః | భీమసేనాద్దిడంబాయామన్య ఆసీద్ఘటోత్కచః. 40
ఏతే భూతా భవిష్యాశ్చ నృపాః సంఖ్యా నవిద్యతే | గతాః కాలేన కాలోహి హరిస్తం పూజయేద్ద్విజ.
హోమ మగ్నౌసముద్దిశ్య కురుసర్వ ప్రదం యతః. 41
ఇత్యాది మహాపురాణ అగ్నేయే పురువంశ వర్ణనం నామాష్ట సప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
కురువునకు సుధన్వుడు సుధనుడు, పరీక్షిత్తు, రిపుంజయుడు అను నలుగురు పుప్రులు పుట్టిరి సుధన్వునకు సుహోత్రుడు వానికి చ్యవనుడు పుట్టెను. చ్యవనుని భార్యయైన గిరికయందు ఉపరిచరవసువు అంశ##చే - బృహద్రథ - కుశ - వీర - యదు-ప్రతిగృహ-బల-మత్స్యకాశి-అను ఏడుగురు పుత్రులుపుట్టిరి. బృహద్రథునకు కుశాగ్రుడు వానికి వృషభుడు, వానికి సుధన్వుడు, వానికి ఊర్జుడు, వానికి సంభవుడు వానికి జరాసంధుడు, వానికి సహదేవుడు వానికి ఉదాపి వానికి శ్రుతకర్మ పుట్టెను. కురునందనుడైన పరీక్షిత్తునకు జనమేజయుడను పుత్రుడు పుట్టెను. ఇతడు పరమధార్మికుడు. ఇతనికి త్రసద్దస్యువు అను పుత్రుడుపుట్టెను. అజమీఢుని కుమారుడగు జుహ్నునకు సురథ-శ్రుతసేన- ఉగ్రసేన-భీమసేనులను నలుగురు పుత్రులు పుట్టిరి. పరీక్షిత్ కుమారుడగు జనమేజయునకు సురథుడు మహిమంతుడు అను పుత్రులు పుట్టిరి. సురథునకు విదూరథుడు. వానికి ఋక్షుడు, పుట్టెను. ఈవంశములో ఇతడు ఋక్షుడను పేరుతో ప్రసిద్ధుడగు రెండవరాజు. ఇతనికి భీమసేనుడు, వీనకి ప్రతీపుడు వీనికి శంతనుడు, వీనికి దేవాపి-బాహ్లిక-సోమదత్తులను ముగ్గురు కుమారులు జన్మించెను. బాహ్లికునకు సోమదత్తుడు, వానికి భూరి-భూరిశ్రవస్-శలులు పుట్టిరి. శంతనునకు గంగయందు భీష్ముడు పుట్టెను. కాల్య (సత్యవతి) యను భార్యయందు విచిత్రవీర్యుడు పుట్టెను. విచిత్రవీర్యుని భార్యయందు శ్రీకృష్ణద్వైపాయనునకు-ధృతరాష్ట్ర పాండు విదురులు పుట్టిరి. పాండువు భార్యయగు కుంతికి యుధిష్ఠిర, భీమ, అర్జునులు, మాద్రికి నకుల సహదేవులు పుట్టిరి. ఈ ఐదుగురు పాండవులును దేవాంశసంభూతులు. అర్జునుని పుత్రుని పేరు అభిమన్యుడు. సుభద్రకు పుట్టినవాడు అభిమన్యునకు పరీక్షిత్తు అను పుత్రుడు పుట్టెను. ద్రౌపదిపంచ పాండవుల భార్య. ఆమెయందు యుధిష్ఠిరునకు ప్రతి వింద్యుడు, భీమసేనునకు శ్రుతసోముడు, అర్జునునకు శ్రుతకీర్తి, సహదేవునకు శ్రుతకర్మ, నకులునకు శతానీకుడు పుట్టెను. భీమసేనునకు హిడింబయందు పుట్టిన ఘటోత్కచుడను మరియొక పుత్రుడుండెను. వీరందరును భూతకాలమునకు చెందిన రాజులు - భవిష్యత్తులో రాబోవు రాజుల సంఖ్య ఎవరు చెప్పజాలరు, వీరందరును కాలగ్రస్తులై గడచిపోయిరి. ఓ వశిష్ఠా ! కాలము విష్ణు స్వరూపము. అందుచేత ఆవిష్ణువునే పూజించవలెను. ఆ విష్ణువునే ఉద్దేశించి అగ్నిలో హోమము చేయుము. ఆతడే సర్వమును ఇచ్చువాడు.
అగ్ని మహాపురాణమున కురువంశవర్ణనమను రెండువందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.