Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అశీత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ సర్వరోగ హరాణ్యౌషధాని

ధన్వంతరి రువాచ :

శారీరమాన సాగన్తు సహజావ్యాధయో మతాః | శారీరా జ్వరకుష్ఠాద్యా క్రోధాద్యా మానసా మతాః. 1

ఆగన్తవో విఘాతోత్థాః సహజాఃక్షుజ్జ రాదయః | శారీరాగన్తు నాశాయ సూర్యవారే ఘృతం గుడమ్‌. 2

లవణం సహిరణ్య చ విప్రాయార్చ్య సమర్పయేత్‌ | చంద్రే చాభ్యంగదో విప్రే సర్వరోగైః ప్రముచ్యతే.

తైలం శ##నైశ్చరే దద్యా దాశ్వినే గోరసాన్నదః | ఘృతేన పయసా లింగం సంస్నాప్య స్యాద్రుగుజ్ఘితః. 4

గాయత్ర్యా జుహుయాద్వహ్నౌ దూర్వాంత్రి మధురప్లుతామ్‌.|

యస్మిన్భే వ్యాధిమాప్నోతి తస్మిన్‌స్నానం బలిః శుభే. 5

మానసానాం రుజాదీనాం విష్ణోః స్తోత్రం హరంభ##వేత్‌ | వాతపిత్త కఫాదోషా ధాతవశ్చ తథాశృణు. 6

భన్వంతరి చెప్పెను : రోగములు శారీరములు మానసము, ఆగంతుకములు సహజములు యని నాల్గువిధములు జ్వరకుష్టాదులు శారీరములు. క్రోధాదులు మానసములు. దెబ్బలు తగులుట మొదలగునవి ఆగంతుకములు, ఆకలి ముసలితనమనునవి సహజములు. శారీర ఆగంతుక వ్యాధులను తొలగించుకొనుటకు శనివారమున బ్రాహ్మణుని పూజించి ఆతనికి ఘృతము గుడము, లవణము, సువర్ణము దానము చేయవలెను. సోమవారమున బ్రాహ్మణునకు అభ్యంగన స్నానము చేయించిన వాడు సర్వ రోగవిముక్తుడగును. శనివారమున తైలదానము చేయవలయును. ఆశ్వీయుజ మాసమున గోరసములను దానము చేయవలయును. శివలింగమునకు దధిఘృతములతో స్నానము చేయించినవాడు రోగ విముక్తుడగును.ఏనక్షత్రమున రోగము త్రిమధురములలో ముంచి దూర్వను గాయత్రి మంత్రముతో హోమము చేసినవాడు, రోగవిముక్తుడగును. ఏనక్షత్రమున రోగము పుట్టినదో ఆ నక్షత్రమునందే స్నానము చేసి బలి ఇవ్వవలెను. మానస రోగములను విష్ణుస్తోత్రము హరించును. ఇపుడు వాత పిత్తకఫములను దోషములను గూర్చియు ధాతువులను గూర్చియు వినుము.

భుక్తం పక్వాశయాదన్నం ద్విధాయాతి చ సుశ్రుత | అంశేనై కేన కిట్టత్వం రసతాం చాపరేణ చ. 7

కిట్టభాగో మలస్తత్ర విణ్మూత్రస్వేద దూషికాః | నాసామలం కర్ణమలం తథాదేహమలం చయత్‌. 8

రసభాగాద్ర సస్తత్ర సమాచ్ఛోణితతాం వ్రజేత్‌ | మాంసం రక్తాత్తతో మేదో మేదసో7స్థ్నశ్చ సంభవః. 9

అస్థ్నోమజ్జా తతః శుక్రం శుక్రాదా గస్తథౌజసః | దేశమార్తిం బలం శక్తిం కాలం ప్రకృతి మేవ చ. 10

జ్ఞాత్వా చికిత్సితం కుర్యా ద్భేషజస్య తథాబలమ్‌ | తిథిరిక్తాం త్యజేద్భౌమం మందభం దారుణోగ్రకమ్‌. 11

హరిగోద్విజ చన్ద్రార్క సురాదీన్ర్పతి పూజ్యచ | శృణు మంత్రమిమంవి ద్వన్భేష జారంభ మాచరేత్‌. 12

బ్రహ్మ దక్షాశ్వి రుద్రేంద్రభూ చంద్రార్కా నిలానలాః |

ఋషయశ్చౌషధి గ్రామా భూత సంఘాశ్చ పాన్తుతే. 13

రసాయన మివర్షీణాం దేవానాం మమృతం యథా | సుదేవోత్తమ నాగానాం భైషజ్యమిద మస్తుతే. 14

వాతశ్లేష్మాతకో దేశో బహువృక్షో బహూదకః | అనూప ఇతివిఖ్యాతో జాంగలస్తద్వి వర్జితః.

15

కించిద్వృక్షోదకో దేశ స్తథా సాధారణః స్మృతః | జాంగలః పిత్తబహులో మధ్యః సాధారణః స్మృతః. 16

అన్న ఆహారము పక్వాశయమునుండి రెండుమార్గములుగా పోవును. ఒక భాగము కిట్టమగును. రెండవ భాగమురసమగును. కిట్టభాగము మలము. అది మనమూత్ర స్వేదదూషికాదిరూపమునను నాసామల కర్ణమల దేహ మలరూపమునను పరిణితిచెందును. రసభాగమంతయు రక్తముగ మారును. రక్తమునుండి మాంసము దానినుండి మేదస్సు దానినుండి ఆస్తి, దానినుండి మజ్జ, దానినుండి శుక్రము, దానినుండి రాగ ఓజస్సులు పుట్టును. చికిత్సకుడు దేశకాల పీడాబల శక్తి ప్రకృతి భేషజ బలములను గుర్తించి తదనుకూలముగ చికిత్స చేయవలయును. రిక్తాతిథులు (4, 9; 14) భౌమవాసరము మందక్రూర నక్షత్రములు విడిచి చికిత్సా ప్రారంభము చేయవలయును. విష్ణుగోబ్రాహ్మణ చంద్ర సూర్యాదుల పూజచేసి రోగినుద్దేశించి ''బ్రహ్మదక్షుడు, అశ్వినీ దేవలలు, రుద్ర, ఇంద్ర, సూర్య, అనిల, అనల, ఋషులు,ఓషధి సముదాయము, భూతసముదాయము నివ్న రక్షింతురుగాక! ఋషులకు రసాయనము ఎట్లో, దేవతలకు అమృతము ఎట్లో, ఉత్తమ నాగులకు సుధ ఎట్లో అట్లే నీకు ఈ ఔషధము ఆరోగ్యకరము, ప్రాణరక్షణము అగుగాక'' అను అర్థములు గల మూలోక్త శ్లోకములను పఠించుచు, ఔషధ ప్రారంభము చేయవలయును. బహు వృక్షములు, అధిక జలముకలిగి అనూపమను పేరుగల దేశము వాతశ్లేష్మకరము. అట్లుకానిది జాంగలము. అల్పవృక్షోదకములు గల దేశము సాధారణము. జాంగలము పిత్తమును వృద్ధిపొందించును. సాధారణదేశము, మధ్యముగ నుండును.

రూక్షః శీతశ్చలో వాయుః పిత్తముష్టం కటుత్రయమ్‌ | స్థిరావ్లు స్నిగ్ధమధురం బలాశం చ ప్రచక్షతే. 17

వృద్ధిః సమానైరేతేషాం విపరీతైర్వి పర్యయః | రసాఃస్వాద్వవ్లు లవణాః శ్లేష్మలావాయు నాశనాః. 18

కటుతిక్త కషాయాశ్చ వాతలాః శ్లేష్మ నాశనాః | కట్వవ్లులవణాజ్ఞేయా స్తథా పిత్తవివర్ధనాః. 19

తిక్తస్వాదు కషాయాశ్చ తథాపిత్త వినాశనాః | రససై#్యష గుణోనాస్తి విపాకసై#్యష ఇష్యతే 20

వీర్యోష్ణాః కఫవాతఘ్నాః శీతాః పిత్తవినాశనాః | ప్రభావత స్తథాకర్మ తేకుర్వన్తి చ సుశ్రుత. 21

శిశిరేచ వసన్తేచ నిదాఘేచ తథాక్రమాత్‌ | చయప్రకోప ప్రశమాః కఫస్యతు ప్రకీర్తితాః. 22

నిదాఘ వర్షారాత్రౌచ తథా శరది సుశ్రుత | చయప్రకోప ప్రశయాః పవనస్య ప్రకీర్తితాః. 23

మేఘకాలే చ శరది హేమన్తే చ యథాక్రమాత్‌ | చయప్రకోప ప్రశమా స్తథా పిత్తస్య కీర్తితాః 24

వర్షాదయో విసర్గాస్తు హేమన్తాద్యా స్తథాత్రయః | శిశిరాద్యా స్తథా77దానే గ్రీష్మాన్తా ఋతవస్త్రయః. 25

సౌమ్యో విసర్గస్త్వాదాన మాగ్నేయం పరికీర్తితమ్‌ | వర్షాదీంస్త్రీ నృతూన్సోమశ్చ రన్ప ర్యాయశోరసాన్‌. 26

జనయత్య వ్లులవణ మధురాంస్త్రీ న్యథాక్రమమ్‌ | శిశిరాదీనృతూ నర్కశ్చరన్పర్యాయశోరసాన్‌. 27

వివర్ధయేత్తథా తిక్తకషాయ కటుకాన్క్రమాత్‌ | యథారజన్యో వర్ధన్తే బలమేకం హివర్దతే. 28

క్రమశో7థ మనుష్యాణాం హీయమానాసుహీయతే | రాత్రి భుక్తదినానాం చ వయసశ్చ తథైవ చ. 29

ఆదిమధ్యావసానేషు కఫపిత్త సమీరణాః | ప్రకోపం యాన్తి కోపాదౌ కాలే తేషాం చ యఃస్మృతః. 30

ప్రకోపోత్తరకే కొలేశమస్తేషాం ప్రకీర్తితః | అతి భోజనతో విప్రతథాచా భోజనేన చ. 31

రోగాహిసర్వే జాయన్తే వేగోదీరణ ధారణౖః| అన్నేన కుక్షేర్ద్వా వంశావేకం పానేన పూరయేత్‌. 32

ఆశ్రయం పవనా దీనాం తథైక మవశేషయేత్‌| వ్యాధేర్నిదానస్య తథా విపరీతమథౌషధమ్‌.

33

వాతము రూక్ష శీతఛల స్వభావము కలది. పిత్తము ఉష్ణము. కటుత్రయము పిత్తమును పెంచును. కఫము స్థిర ఆవ్లు స్నిగ్ధ మధుర స్వభావము కలది. సమాన వస్తువులచే యిది వృద్ధిచెందును. అసమాన వస్తువులచే తగ్గును. మధుర, ఆవ్లు, లవణ, రసములు శ్లేష్మకరములు, వాయునాశకములు. కటుతిక్త కషాయరసములు వాయువృద్ధికరములు కవనాశకములు. కటు ఆవ్లులవణ రసములు పిత్తవర్ధకములు. తిక్త మధుర కషాయరసములు పిత్తనాశకములు. ఈ గుణములు రసములవి కావు. వాటి విపాకమునకు చెందినవని గ్రహించ వలెను. ఉష్ణవీర్యములు కఫనాశకములు, శీతవీర్యములు పిత్తనాశకములు. ఓ సుశ్రుతా! ఇవన్నియు తన ప్రభావముచే ఆయా కార్యములను చేయును. శిశిర వసంత గ్రీష్మములందు క్రమముగ, కఫములకు చయము. ప్రకోపము, ప్రశమనము వుండును. సుశ్రుతా! వాయువునకు గ్రీష్మ, వర్ష, రాత్రి శరదృతువులందు వరుసగ చయ, ప్రకోప, ప్రశమములు చెప్పబడినవి. ఇట్లే వర్ష, శరత్‌, హేమంతములందు క్రమముగ పిత్తములకు చయ, ప్రకోష, ప్రశమములు చెప్పబడినవి. ఇట్లే వర్ష, శరత్‌, హేమంతములందు క్రమముగ పిత్తములకు చయ, ప్రకోప, ప్రశమములు చెప్పబడినవి. వర్షఋతువు నుండి హేమంతమువరకు మూడు ఋతువులును విసర్గకాలము. శిశిరమునుండి గ్రీష్మము వరకు మూడు ఋతువులు ఆదానకాలము. విసర్గకాలము సౌమ్యము ఆదానకాలము ఆగ్నేయము. వర్షాది ఋతుత్రయమున సంచరించుచున్న చంద్రుడు ఓషధులలో క్రమముగ, ఆవ్లు లవణ మధుర రసములను పుట్టించును. శిశిరాది ఋతుత్రయమున సంచరించుచున్న సూర్యుడు క్రమముగ, తిక్తకషాయ కటు రసములను వృద్ధిపొందించును. రాత్రులు పెరుగుచున్న కొలది ఓషధుల బలము పెరుగుచుండును. రాత్రులు తగ్గుచున్న కొలది మనుష్యుల బలము క్రమముగ తగ్గుచుండును. రాత్రి, దిన, భోజనాంతమునందును. వయస్సు యొక్క అది మధ్య అవసాన కాలములందును కఫి పిత్త వాయువులు ప్రకోపించును ప్రకోప ప్రారంభమున వీటికి జయము కలుగును. ప్రకోపా నంతరము వీటికి శమనము కలుగును అతి భోజనము వలనను అధికోపవాసము వలనను, మలమూత్ర వేగనిరోధము వలనను కూడ అన్ని రోగములు పుట్టును. ఉదము నందలి రెండు భాగములను అన్నముతోను. ఒక భాగమును జలముతోను నింపి ఒక భాగమును వాయ్యాధి సంచారమునకై విడువలయును. వ్యాధికి ఏది మూలకారణమో దానికి విపరీతమైనది ఔషధము. అట్టి ఔషధమును ఇవ్వవలెను. ఇదియే అన్నింటి సారము. అని నేను చెప్పుచున్నాను.

కర్తవ్యమేత దేవాత్ర వయాసారం ప్రకీర్తితమ్‌| నాభేరూర్ధ్వ మధశ్చైవ గుదశ్రోణ్యోస్తథైవ చ. 34

బలాశ పిత్తవాతానాం దేహేస్థానం ప్రకీర్తితమ్‌| తథాపిసర్వగాశ్చైతే దేహే వాయుర్విశేషతః.

35

దేహస్య మధ్యే హృదయం స్థానం తన్మనసః స్మృతమ్‌| కృశోల్పకేశశ్చపలో బహువాగ్విషమానలః. 36

వ్యోమగశ్చ తథా స్వప్నేవాత ప్రకృతి రుచ్యతే| అకాల పలితః క్రోధీ ప్రస్వేదీ మధురప్రియః. 37

స్వప్నే చ దీప్తిమత్ర్పేక్షీ పిత్తప్రకృతిరుచ్యతే| దృఢాంగః స్థిరచిత్తశ్చ సుప్రభః స్నిగ్ధ మూర్ధజః. 38

శుద్ధామ్బు దర్శీ స్వప్నే చ కఫప్రకృతికో నరః| తామసా రాజసాశ్ఛైవ సాత్త్వికాశ్చ తథా స్మృతాః. 39

మనుష్యా మునిశార్దూల వాత పిత్తకఫాత్మకాః| రక్త పిత్తం వ్యవాయాచ్చ గురుకర్మ ప్రవర్తనైః. 40

కదన్న భోజనాద్వాయుర్ధేహేశోకాచ్చ కుప్యతి| విదా హినాం తథోల్కానామష్ణాన్న ధ్వనిసేవినామ్‌. 41

పిత్తం ప్రకోపమాయాతి భ##యేన చ తథా ద్విజ| అత్యంబు పాన గుర్వన్న భోజినాం భుక్తశాయినామ్‌. 42

శ్లేష్మా ప్రకోపమాయాతి తథాయే చాలసాజనాః| వాతా ద్యుత్థానిరోగాణి జ్ఞాత్వా శామ్యాని లక్షణౖః. 43

అస్థిభంగః కషాయత్వమాస్యే శుష్కాస్యతా తథా| జృంభణం లోమహర్షశ్చ వాతిక వ్యాధిలక్షణమ్‌. 44

నఖ నేత్రశఇరాణాంతు పీతత్వం కటుతాముఖే! తృష్ణా దాహోష్ణతాచైవ పిత్తవ్యాధి నిదర్శనమ్‌. 45

ఆలస్యంచ ప్రసేకశ్చ గురుతా మధురాస్యతా! ఉష్ణాభిలాషితా చేతి శ్లైష్మిక వ్యాధి లక్షణమ్‌. 46

స్నిగ్ధోష్ణమన్నమభ్యంగ సై#్తలపానాది వాతసుత్‌! ఆజ్యం క్షీరం సితాద్యంచ చంద్రరశ్మ్యాది పిత్తనుత్‌. 47

సక్షౌద్రం త్రిఫలాతైలం వ్యాయామాది కఫాపహమ్‌! సర్వరోగ ప్రశాంత్యైస్యాద్విష్ణోర్ధ్యానంచ పూజనమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వరోగ హరౌ షధాది. కథనం నామాశీత్యధిక ద్విశతతమోధ్యాయః.

నాభిపైన పిత్తస్థానము దాని క్రింద శ్రోణీగుదములు వాతశ్తానములు. కాని ఇవన్నియు శరీరమునందు తిరుగుచునుండును. విశేషించి వాయువు తిరుగును దేహమధ్యమున హృదయమున్నది అదిమనస్సునకు స్థానము స్వభావతః దుర్బలుడును, అల్పకేశములు కలవాడును. చంచలుడును ఎక్కువ మాటలాడు వాడును విషమమైన జఠరాగ్ని కలవాడును, ఆకాశమునందెగురుచున్నట్లు స్వప్నములు చూచువాడును. వాత ప్రకృతి కలవాడు. అకాలమున జుట్టు నరసిన వాడును క్రోధశీలుడును ఎక్కువ చెమట పట్టువాడును. తీపి ఇష్టమైన వాడును, స్వప్నమునందు అగ్ని చూచువాడును పిత్తప్రకృతి, దృఢమైన అవయవములు కలవాడును స్థిరచిత్తుడు మంచికాంతి కలవాడు దట్టమైన కేశములు కలవాడు స్వప్నమున నిర్మలోదకమును చూచువాడు, కఫప్రకృతి ఈ విధముగనే తామస, రాజస, సాత్త్వికులని మనుష్యులు మూఢు విధములు ఓ ముని శ్రేష్ఠా! మానవులందరను వా, పిత్తకఫాత్మకులు మైథునము చేతను, బరువు పనులు చేయుట చేతను రక్తపిత్థము కలుగును. చెడ్డ ఆహారము తినుటవలనను శోకమువలనను వాయుప్రకోపము కలుగును ద్విజోత్తమా! దాహమును కల్పించు వాటిని కటుతిక్తకషాయ పదార్థములను తినుట చేతను నడచుటచేతను భయముచేతను పిత్త ప్రకోపము కలుగును. ఎక్కువ జలము త్రాగువారికిని గురువైన భోజనము చేయువానికి భుజించి వెంటనే నిద్రపోవువానికి, సోమరులకును, శ్లేష్మ ప్రకోపము కలుగును. లక్షణములను బట్టి వాతాది రోగములను గుర్తించి వాటిని శమింప చేయవలయును. ఎముకలు విరుగుట, నోటిచేదు నోరుఎండుట, ఆవు లింతలు, రోమాంచము, ఇవి వాత వ్యాధి లక్షణములు గోళ్ళు నేత్రములు నాడును పచ్చబడుట, ముఖమునందు చేదుదాహము వేయుట శరీరము వెచ్చగా నుండుట ఇవి పిత్త వ్యాధి లక్షణములు. సోమరితనము నోటిలో నీళ్ళు ఊరుట. శరీరము బరువుగావుండుట నోటితీపి వేడినికోరుట ఇవి కఫ వ్యాధి లక్షణములుః స్నిగ్ధము ఉష్ణమును అయిన అన్నమును, అభ్యంగ స్నానము, తైలపానాదికము, వాతరోగమును నివారించును నెయ్యి పాలు, పటిక బెల్లము, చంద్రకిరణాదులు పిత్తమును తొలగించును. త్రిఫలా తైలమును తేనెలో సేవించుట వ్యాయామాదికము కఫరోగమును తొలగించును. విష్ణుపూజాధ్యానములు సర్వరోగనివారకములు.

అగ్నిమహాపురాణమున సర్వరోగహరౌషధాదికథనమను రెండువందల ఎనుబదవ ఆధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page