Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకాశీత్యధిక ద్విశతతమోధ్యాయః

అథ రసాదిలక్షణమ్‌

ధన్వన్తరిరువాచ:

రసాది లక్షణం వక్ష్యే భేషజానాం గుణంశృణు! రసవీర్య విపాకజ్ఞో నృపాధీన్రక్షయేన్నరః. 1

రసాః స్వాద్వవ్లులవణాః సోమజాః పరికీర్తితాః! కటుతిక్త కషాయాణి తథాగ్నేయామహాభుజ. 2

త్రిథా విపాకో ద్రవ్యస్య కట్వవ్లులవణాత్మకః! ద్విధావీర్యం సముద్ధిష్టముష్టం శీతం తథైవ చ. 3

అనిర్దేశ్య ప్రభావశ్చ ఓషధీనాం ద్విజోత్తమ! మధురశ్చ కషాయశ్చ తిక్తశ్చైవ తథారసః. 4

శీతవీర్యాః సముద్ధిష్టాః శేషాస్తూష్ణాః ప్రకీర్తితాః! గుడూచీ తత్ర తిక్తాపి భవత్యుష్ణాతి వీర్యతః. 5

ఉష్ణాకషాయాపి తథా పథ్యా భవతి మానద! మధురోపి తథా మాంస ఉష్ణఏవ ప్రకీర్తితః. 6

లవణో మధురశ్చైవ విపాక మధురౌ స్మృతౌ! అవ్లూెష్ణశ్చ తథా ప్రోక్తః శేషాః కటువిపాకినః. 7

వీర్యపాకే విపర్యస్త ప్రభావాత్తత్ర నిశ్చయః! మధురోపి కటుః పాకే యచ్చ క్షౌద్రం ప్రకీర్తితమ్‌. 8

క్వాథయేత్షో éడశగుణం పిబేద్ద్రవ్యాచ్చతుర్గుణమ్‌! కల్పనైషా కషాయస్యయత్ర నోక్తో విధిర్భవేత్‌. 9

కషాయంతు భ##వేత్తోయం స్నేహపాకే చతుర్గుణమ్‌! ద్రవ్యతుల్యం సముద్దృత్య ద్రవ్యేస్నేహం క్షిషేద్బుధః.

తావత్ర్పమాణం ద్రవ్యన్య స్నేహపాదం తతఃక్షిపేత్‌! తోయవర్జంతు యద్ద్రవ్యం సేహద్రవ్యంతథా భ##వేత్‌.

సంవర్తితౌషధః పాశః స్నేహానాం పరికీర్తితః! తత్తుల్యతాతు లేహ్యస్య తథా భవతి సుశ్రుత. 12

స్వచ్ఛమల్పౌషధం క్వాభం కషాయం చోక్తవద్భవేత్‌! అక్షం చూర్జస్య నిర్దిష్టం కషాయన్య చతుష్పలమ్‌.

మధ్యమైషా స్మృతామాత్రా నాస్తి మాత్రా వికల్పనా!

వయః కాలం బలం వహ్ని దేశం ద్రవ్యం రుజంతథా. 14

సమవేక్ష్య మహాభాగ మాత్రాయాః కల్పనా భ##వేత్‌! సౌమ్యాస్తత్రరసాః ప్రాయో విజ్ఞేయాధాతువర్ధనాః. 15

ధన్వంతరి పలికెను. ఇపుడు ఓషధి రసాదుల లక్షణములు చెప్పెదను వినము. ఓషధుల రసవీర్య విపాకములు తెలిసిన వైద్యుడే రాజాదులను రక్షించగలడు. మధుర, అవ్లు, లవణరసములు, చంద్రుని నుండి పుట్టినవి. కటుతిక్త కషాయరసములు, అగ్నినుండి పుట్టినవి. ద్రవ్యవిపాకము కటు అవ్లు లవణరూపమున మూడు విధముల నుండును. శీతము, ఉష్ణము, అని, వీర్యము రెండు విధములు. ఓద్విజోత్తమా! ఓషధుల ప్రభావము చెప్ప శక్యముగానిది. మధుర తిక్తకషాయ రసములు శీతవీర్యములు. మిగిలిన రసములు ఉష్ణవీర్యములు కానిగుడూచి తిక్తమైనను అత్యంతవీర్య ప్రదమగుటచే ఉష్ణ వీర్యము. అట్లే కషాయరసముకలదైనను పథ్య ఉష్ణవీర్యము జటామాంసి మధుర రసయుక్తయైనను ఉష్ణ వీర్యము లవణ మధురములు విపాకమున మధురములని చెప్పబడినవి. అవ్లూెష్ణ విపాకము కూడ మధురము మిగిలిన రసముల విపాకములు కటువులు, విశేష వీర్యయుక్త ద్రవ్యము విపాకమునందు విపరీత ఫలముకూడ ఇచ్చును. అనుటలో సందేహము లేదు. ఎట్లనగా తేనె మధురమైనను విపాకమున కటువు అగునని చెప్పబడినది. ఒక ద్రవ్యమునకు పదునారు రెట్లు నీరు పోసి, ఆద్రవ్యమునకు నాలురెట్లు జలము మిగులునట్లు కాచి ఆక్వాథమును త్రాగవలెను. ఇది క్వాథ నిర్మాణ పద్ధతి క్వాథవిధి చెప్పని చోట్ల ఈ పద్ధతిని యనుసరించవలెను. స్నేహ (తైలఘ్నతాది) పాకమునందు స్నేహమునకు నాలుగురెట్లు కషాయముగాని, సమప్రమాణమగు, తైల క్వాథములుగాని చేర్చవలెను. తైలములో వేసిన ఓషధులు ఉడికి చల్లారిన పిమ్మట చేతితో నలిపినపుడు వత్తివలె అయినచో అపుడు తైలపరిపాకము వచ్చినట్లు గ్రహించవలెను. లేహ్యములందుకూడ ఇట్లే సమాన ప్రమాణములు గల పదార్థములు వేయవలయును. నిర్మలము. అల్పౌషధియుక్తమగు క్వాథము ఉత్తమము, చూర్ణము ఒక అక్షణ, క్వాథము నాలుగు పలములు ఇది సాధారణ మాత్ర. మాత్ర విషయమున ఒక నిశ్చిత ప్రమాణములేదు. రోగి యొక్క వయోబల అగ్ని దేశకాలద్రవ్యములను బట్టి రోగ స్వభావమును బట్టి వేర్వేరు ప్రమాణములు నిర్ణయించవలెను. సౌమ్యరసములు సాధారణముగ ధాతువర్ధకములు.

మధురాస్తు విశేషేణ విజ్ఞేయా ధాతువర్ధనాః| దోషాణాం చైవ ధాతూనాం ద్రవ్యం సమగుణం తుయత్‌.16

తదేవ వృద్ధయేజ్ఞేయం విపరీతం క్షయావహమ్‌ | ఉపక్రమ త్రయం ప్రోక్తం దేహేస్మిన్మనుజోత్తమ. 17

ఆహారో మైథునం నిద్రాతేషు యత్నః సదా భ##వేత్‌ | అసేవ నాత్సేవ నాచ్చ అత్యంతం నాశమాప్నుయాత్‌.

క్షయస్య బృంహణం కార్యం స్థూలదేహస్య కర్షణమ్‌ | రక్షణం మధ్యకాయస్య దేహ భేదాస్త్రయో మతాః.

ఉపక్రమధ్వయం ప్రోక్తం తర్పణం వాప్యతర్పణమ్‌ | హితాశీ చ మితాశీ చ జీర్ణాశీ తథాభ##వేత్‌. 20

ఓషధీనాం పంచవిధా తథా భవతి కల్పనా | రసః కల్కః శృతః శీతః ఫాంటశ్ఛమనుజోత్తమ. 21

రసశ్చ పీడకో జ్ఞేయః కల్క ఆలోడితాద్భవేత్‌ | క్వథితశ్చ శ్రుతోజ్ఞేయః శీతః పర్యుషితో నిశామ్‌. 22

సద్యోభి శృతపూతం యత్తత్ఫాంట మభిధీయతే | కరణానాం శతం చైవ షష్టిశ్‌ చైవాధికాస్మృతా. 23

యోవేత్తి సహ్యజేయః స్యాత్సంబంధే బాహు శౌండికః | ఆహారశుద్ధిరగ్న్యర్థ మగ్నిమూలం బలంనృణామ్‌.

నసింధుత్రిఫలాం చాద్యాత్సురాజ్ఞాజ్యాభి వర్ణదామ్‌ |

జాం గలంచ రసం సింధుయుక్తం దధిపయః కణామ్‌. 25

రసాధికం నమం కుర్యాన్నరో వాతాధికోపివా | నిదాఘే మర్దనం ప్రోక్తం శిశిరేచ సమం బహు. 26

వసన్తే మధ్యమం జ్ఞేయం నిదాఘే మర్దనోల్పణమ్‌ | త్వచంతు ప్రథమం మజ్గర్ద్య మంచ తదనంతరమ్‌. 27

స్నాయురుధిరదేహేషు అస్థిచాతీవ మాంసలమ్‌ | స్కంధౌ బాహూతథై వేహ తథా జంఘేసజానునీ. 28

అరివన్మర్దయేత్ప్రాజ్ఞో జత్రువక్షశ్చ పూర్వవత్‌ | అంగసంధిషు సర్వేషు నిష్పీడ్య బహులం తథా. 29

ప్రసారయేదంగ సంధీన్నచ క్షేపేణ చాక్రమాత్‌ | నాజీర్ణేతు శ్రమం కుర్యాన్న భుక్త్వాపీతవాన్నరః. 30

దినస్యతు చతుర్భాగ ఊర్ద్వంతు ప్రహారార్దకే | వ్యాయామం నైవ కర్తవ్యం స్నానాచ్ఛీతాంబునాసకృత్‌. 31

వార్యుష్ణం చశ్రమం జహ్యాద్ధృదా శ్వాసం నధారయేత్‌ |

వ్యాయామశ్చ కఫం హన్యాద్వాతం హన్యాచ్చ మర్దనమ్‌. 32

స్నానం పిత్తాదికం హన్యాత్తస్యాన్తే చాతపాః ప్రియాః | ఆతపక్లేశకర్మాదౌ క్షేమవ్యాయామినోనరాః 33

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రసాదిలక్షణం నామైకాశీత్యధిక ద్విశతతమోధ్యాయః.

విశేషించి మధుర రసములు ధాతువర్దకములు. దోషధాతు ద్రవ్యములు, సమాన గుణయుక్తములైనచో శరీర వృద్ధి కల్గించును విపరీతమైనచో క్షయకారకములు. ఓ నరశ్రేష్ఠా! ఈ శరీరమునకు ఆహారము మైథునము, నిద్ర అను మూడు ఉపస్థంబములు వున్నవి. వీది విషయమున ప్రయత్నశీలుడై వుండవలెను. వీటిని పూర్తిగా సేవింపకున్నను. ఎక్కువ సేవించినను, శరీరము క్షీణించును. కృశించిన శరీరమును పోషించవలయును. స్థూలశరీరమును తగ్గించవలయును. మధ్యశరీరమును రక్షించు కొనవలెను. మొదటి రెండు ఉపక్రమములకు తర్పణము, అతర్పణము యని రెండు భేదములు. మానవుడు హితమైన దానిని తినవలెను. మితమైన దానిని తినవలెను మొదట తిన్నది జీర్ణమైన పిమ్మట తినవలెను. ఓ నరశ్రేష్ఠా! రసము కల్కము, క్వాథము శీతకషాయములు, ఫాంటముయని ఓషధి నిర్మాణము ఐదు విధములు. ఓషధులను పిండుటచే రసము, మథించుటచే కల్కము, మరగబెట్టుటచే క్వాథము, రాత్రి యంతయు నీటిలో వుంచుటచే శీత కపాయము, నీటిలోవేసి తాత్కాలికముగ వేడిచేయుటచే ఫాంటము తయారగును. చికిత్సకు నూట అరువది సాధములున్నవి. ఇవన్నియు తెలిసిన వైద్యుడు అజేయుడగును. అతనికి "బహుశౌండికుడు" అని పేరు. జఠరాగ్నిని సంరక్షించుటకు, వృద్ధిపొందించుటకు శుద్ధము చేయుటకును ఆహారశుద్ధి ఆవశ్యకము. మనుష్యుని బలమునకు అగ్నియే మూలాధారము. బలముకొరకై సైంధవ లవణయుక్తత్రిఫలను, కాంతి ప్రదములగు ఉత్తమ పేయములను, జాంగలరసమును సైంధవయుక్తమగు పెరుగును. పాలను పిప్పలిని సేవింపవలయును. ఏ రసములు అధికమైపోయినవో వాటిని సామ్యావస్థకు తీసుకొని రావలెను. వాతప్రకృతి కలవాడు గ్రీష్మఋతువునందు మర్దనము చేయించుకొనవలెను. శిశిర ఋతువునందును సాధారణముగను, లేక ఆధికముగను, వసంతమునందు మధ్యమంబుగను, గ్రీష్మమునందు విశేష రూపముగను మర్దనము చేయించుకొనవలెను. మొదట చర్మమును అనంతరము మజ్జను మర్దనము చేయించు కొనవలెను. స్నాయు రుధిక పూర్ణముఅగు శరీరమున అస్తులు చాలా లావుగా వున్నట్లు కనిపించును. భుజములు, బాహువులు, మోకాళ్ళు పిక్కలు కూడ మాంసలములుగా నుండును. బుద్దిమంతుడు ఈ అవయవములను శత్రువును మర్దించినట్లు మర్దించవలెను. మణవలు, వక్షస్థలము వీటిని సాధారణముగా మర్దించవలెను. అవయవ సంధులను మర్దించి వాటిని చాచవలెను. కాని హఠాత్తుగాను క్రమవిరుద్దముగాను చాచకూడదు. అజీర్ణ సమయమునందును భోజనానంతరము జలపానానంతరము వ్యాయామము చేయకూడదు. దినమునకు నాల్గుభాగము లుండును. మొదటి జాములో సగము దాటిపోయినచో వ్యాయామము చేయ కూడదు. శీతలజలముతో ఒక పర్యాయము స్నానము చేయవలయును. ఉష్ణ జలము శ్రమను తగ్గించును. శ్వాస నిరోధము చేయకూడదు. వ్యాయామము, కఫమును తొలగించును. స్నానము పిత్తాధిక్యమును తొలగించును. స్నావానంతరము ఎండను సేవించుట మంచిది. వ్యాయామము చేయువాడు ఎండను ఇతరక్లేశములను సహింపసమర్ధుడగును.

అగ్ని మహాపురాణమున రసాదిలక్షణమును రెండువందల యెనుబది యొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page