Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ త్య్రశీత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ నానారోగ హరాణ్యౌషధాని
ధన్వన్తరి రువాచ :
సింహీశటీ నిశాయుగ్మం వత్సకం క్వాథసేవనమ్ | శిశోః సర్వాతిసారేషుస్తన్య దోషేషుశస్యతే. 1
శృంగీం సకృష్ణాతివిషాం చూర్ణితాం మధునాలిహేత్ | ఏకాచాతివిషాకాసచ్ఛర్దిజ్వరహరీశిశోః. 2
బాలైః సేవ్యా వచాసాజ్యా సుదుగ్ధావాథ తైలయుక్ | యష్టికాం శంఖపుష్పీంవా బాలః క్షీరాన్వితాం పిబేత్.
వాగ్రూపసంపద్యుక్తాయుర్మేధాశ్రీర్వర్ధతే శిశోః | వచాహ్యగ్ని శిఖా వాసాశుంఠీకృష్ణానిశాగదమ్. 4
సయష్టిసైంధవం బాలః ప్రాతర్మేధాకరం పిబేత్ | దేవదారు మహాశిగ్రు ఫలత్రయ పయోముచామ్. 5
క్వాథః సకృష్ణామృద్వీకా కల్కః సర్వాస్కృమీన్హ రేత్ | త్రిఫలాభృంగ విశ్వానాం రసేఘు మధుసర్పిషోః.
మేషీక్షీరేచ గోమూత్రే సిక్తం రోగే హితంశిశోః | నాసారక్తహరో నస్యాద్దూర్వారస ఇహోత్తమః. 7
లశునార్ద్రకశి గ్రూణాం రసః కర్ణస్య పూరణమ్ | తైలమార్త్రక జాత్యం వా శూలహా చౌష్ఠ రోగనుత్. 8
జాతీపత్రం ఫలం వ్యోషం కవలం మూత్రకం నిశా | దుగ్ధ క్వాథే೭భయాకల్కే సిద్ధం తైలం ద్విజార్తినుత్.
ధాన్యాంబు నారికేలం గోమూత్రం క్రముకవిశ్వయుక్ | క్వాథితం కవలం కార్యం జిహ్వావ్యాధి ప్రశాంతయే.
సాధితంలాంగలీ కల్కే తైలం నిర్గుండికారసైః | గండమాలా గలగండౌ నాశ##యేన్నస్య కర్మణా. 11
వల్లవైరర్కపూతీకస్ను హీరుగ్ఘాత జాతికైః | ఉద్వర్తయేత్స గోమూత్రైః సర్వత్వగ్దోషనాశ##నైః. 12
(అ) 2/26
వాకుచీసతిలా భుక్తా వత్సరాత్కుష్ఠనాశినీ | పథ్యా భల్లాతకీ తైల గుడపిండీతు కుష్ఠజిత్. 13
యూథికా వహ్నిరజనీ త్రిఫలా వ్యోష చూర్ణయుక్ |
తక్రం గుదాం కురేపేయం భక్ష్యావా సగుడా೭భయా. 4
ఫలదార్వీ విషాణాంతుక్వాథౌ దాత్రీరసో೭థవా! పాతవ్యో రజనీకల్కః క్షౌద్రాక్షౌత్ర ప్రమేహిణా. 5
వాసాగర్భోవ్యాధి ఘాతక్వాథ ఏరండ తైలయుక్! వాతశోణి త హృత్పానా త్పిప్పలీస్యాత్ల్పీహా హరీ. 6
ధన్వంతరి చెప్పిను. సింహ, శటి రెండు విధముల పసుపు వత్సకము వీటి క్వాథము శిశువునకు కలుగు అన్ని అతిసారములు స్తన్యదోషములను తొలగించును శృంగి, కృష్ణ, అతివిష, వీటి చూర్ణమును తేనెతో నాకించవలెను. లేదా ఒక్క అతివిషనే నాకించవలెను. దీనిచే శిశువుల దగ్గువమనము, జ్వరము, నశించును. పిల్లలకు దుగ్ధముతో ఘృతము లేదా తైలముతో వచఇవ్వవలెను. లేదా యష్టికను గాని, శంఖపుష్పిని గాని, పాలతో త్రాగించవలెను. అట్లు చేయుటచే వారి వాక్శక్తిరూప సంపత్తి ఆయువు బుద్ధి కాంతి వృద్ధిచెందును. వచ అగ్నిశిఖ వాసా శుంఠి పిప్పలి, పసుపు కూటము, యష్టిక, సైంధవము వీటి చూర్ణము ప్రాతః కాలమున బాలకులకు ఇచ్చినచో మేధావృద్ధి కలుగును. దేవదారు. మహాశిగ్రు త్రిఫలా పయోముక్కుల క్వాథముగాని, కృష్ణ, మృద్వికలతో చేసిన కల్కముగాని, సర్వకృమి రోగములను అపహరించును. త్రిఫల, భృంగరాజు విశ్వముల రసములందును మధు ఘృతములందును, మేషీ క్షీరమునందు కాని, గోమూత్రమునందుకాని తడిపినచో శిశురోగములను తొలగించును. దూర్వారసమును నశ్యముగా ఇచ్చినచో నాసారక్తము శాంతించును. లశునము (తెల్లఉల్లి) ఆర్ద్రకము, శిగ్రు, వీటి రసమును చెవిలో పోసినను, అల్లము రసముకాని, తైలముగాని పోసినను చెవిపోటును ఓష్ఠ రోగములును నశించును జాతి పత్రము. త్రిఫల, వ్యోషము గోమూత్రము, పసుపు, గోదుగ్ధము, ఆభయాకల్కము, తైలము, వీటిని కబలించుటచే దంత బాధ తొంగును. ధాన్యము నారికేశ జలము, గోమూత్రము, పౌన్ శొంఠి వీటి క్వాథమును నోటిలో వుంచుకొన్నచో జిహ్వా వ్యాధితౌలగును. లాంగలీ కల్కమునందు నిర్గుండీ రసముతో సాధించిన తైలము "గండమాల" గల గండ దోషములను నశింపచేయును. అర్కపూతిక స్నుహీ, రుగ్ఘాత, జాతిక పత్రములను గోమూత్రముతో నూరి ఒంటిరి రాసినచో చర్మరోగము లన్నియు నశించును. వకుచిని తిలలలో ఒక సంవత్సరము తిన్నచో కుష్ఠరోగమును నశించును. పథ్య భల్లాతకీ గుడమ, తైలము, పిండ ఖర్జూరము ఇవి కుష్ఠరోగ నాశకములు, యూథిక, చిత్రకము పసుపు, త్రిఫల, వ్యోషముల చూర్ణమును తక్రముతో త్రాగినను గుడముతో ఉసిరికాయ తిన్నను హర్షరోగము నశించును, ప్రమేయరోగము కలవాడు త్రిఫల, దార్వి విషముల క్వాథమును గాని, ఉసిరికాయ రసమును, పసుపు కల్కము, తేనె వీటితో కల్పిగాని సేవించవలెను. వాసాగర్భమును వ్యాధి ఘాత క్వాథమునందు ఆముదము కలిపి త్రాగినచో వాతశోణిత రోగము తగ్గును పిప్పలి ప్లీహరోగమును తొలగించును.
సేవ్యా జఠరిణా కృష్ణాస్రుక్షీర బహు భావితా | ప్రయోవా రచ్యదంత్యాగ్ని విడంగవ్యోష కల్కయుక్. 7
గ్రంథికోగ్రా భయాకృష్ణా విడంగాక్తాఘృతేస్థితా |
మాసం తక్రం గ్రహణ్యర్శః పాండుగుల్మ కృమీన్హరేత్. 18
ఫలత్రయామృతా వాసా తిక్త భూనింబజస్తథా | క్వాథః సమాక్షికో హన్యా త్పాండురోగం సకామలమ్. 19
రక్తపిత్తీ పిబేద్వాసా సురసం ససితం మధు | వరీ ద్రాక్షా బలాశుంఠీ సాధితం వాపయః పృథక్. 20
వరీ విదారీ పథ్యాచ బలాత్రయం సవాసకమ్ | శ్వ దంష్ట్రా మధుసర్పిర్భ్యామాలిహేత్కత రోగవాన్. 21
పథ్యాశిగ్రు కరంజార్క త్వక్సారం మధుసింధుమత్ | సమూత్రం విద్రథిం హన్తి పరిపాకాయ తంత్రజిత్.
త్రివృతా జీవితీ దంతీ మంజిష్ఠా శర్వరీద్వయమ్ | తార్ఱజం నింబపత్రంచ లేవః శస్తో భగందరే. 23
రుగ్ఘాత రజనీలాక్షా చూర్ణాజక్షేద్ర సంయుతా | వాసోవర్తిర్ర్వణ యోజ్యాశోధినీ గతినాశినీ. 24
శ్యామాయష్టి నిశాలోధ్ర పద్మకోత్పల చందనైః | సమరీచైః శృతం తైలం క్షీరేస్యాద్ర్వణ రోహణమ్. 25
శ్రీకార్పాసదలైర్బస్మ ఫలోపల వణానిశా | తత్పిండీ స్వేదనం తామ్రే తత్తైలం స్యాత్ఱతౌషధమ్. 26
కుంభీసారం పయోయుక్తం వహ్నిదగ్దం వ్రణలిపేత్ | తదేవ నాశ##యేత్సేకాన్నారికేల రజోఘృతమ్. 27
ఉదరరోగము గలవాడు స్నుక్ క్షీరమునందు అనేక పర్యాయములందు భావన చేసిన పిప్పలి సేవించవలెను చిత్రకవిడంగ త్రికటు కల్కములతో సిద్దమగు క్షీరము, అరుచి రోగమును తొలగించును గ్రంథికా, ఉగ్ర అభయ, కృష్ణ, విడంగములను నేతిలో కల్పం వుంచి గాని కేవలము తక్రముతో గాని, ఒక మాసము సేవించుటచే గ్రహణహర్ష, పాండు గుల్మకోగములు క్రుమి రోగములు నశించును. త్రిఫలం, అమృత, వాస, తిక్త భూనింబ, ముల క్వాథమున తేనెతో సేవించినచో పాండురోగము కామలారోగము నశించును. రక్తపిత్తము కలవాడు వాసారసమును పటికబెల్లము తేనె కలిపి, త్రాగినను శతావరి ద్రాక్షబల, శుంఠిలలో సాధించిన పాలు త్రాగినను ఆరోగము నశించును. క్షయరోగి శతావరి. విదారి, పథ్య, బలాత్రయ, వాసక, శ్వదంష్ట్రలను చూర్ణము చేసి తేనె, నెయ్యి కలిపినాకవలెను, పథ్యశిగ్రు, కరంజ, అర్క, త్వక్సార మధు సైంధవములను గోమూత్రముతో కలిపి రాసినచో విద్రథిని పక్వముచేసి మాన్పుటకు మంచిది. త్రివృతా, జీవంతీ దంతీ, మంజిష్ఠా ద్వివిధ శర్వరీ, తార్షజా, నింబపత్రముల లేపము భగరంద్రమునకు మంచిది. రుగ్ఘాత, హరిద్ర, లాక్షాచూర్ణములను గోఘృతముతోను తేనెతోను కలిపి వస్త్రముతో వర్తిచేసి వ్రణము నందుంచినచో వ్రణమును శుద్ధముచేసి మాన్పును. శ్యామా, యష్టి హరిద్రా లోధ్ర, పర్మక, ఉత్పల. చందన, మరీచములతో క్షీరములో కాచిన తైలము వ్రణములను మాన్పును. శ్రీ కార్పాసదళ భస్మ, త్రిఫల, ఉపల, నిశలతో గోశములు చేసి తామ్రపాత్రయందు ఉడికించి ఆతైలమును గాయమునందు వ్రాయవలెను. కుంభీసారమును నిప్పుపై మాడ్చి దాని పాలతో కలిపి వ్రణముపై వ్రాయవలెను. లైదా కొబ్బరి చెట్టు మొదటిలోనున్న నున్న మట్టిలో ఘృతము కలిపి కాచినచో వ్రణము మానును.
విశ్వాజమోద సింధూత్థ చించాత్వగ్భిః సమాభయా | తక్రేణోష్ణామ్భునావాథ పీతాతీసార నాశినీ. 28
వత్సకాతి విషావిశ్వ బిల్వముస్త శృతం జలమ్ | సామే పురాణ೭తీ సారే సాసృక్ఛూలేచ పాయయేత్. 29
అంగారదగ్ధం సుగతం సింధుముష్ణాంబునా పిబేత్ | శూలవానథవా తద్ది సింధుహింగు కణాభయా. 30
కటురోహోత్కణా తంకలాజ చూర్ణం మధుప్లుతమ్ | వస్త్రచ్ఛిద్రగతం వక్త్రేన్యస్తం తృష్ణాం వినాశ##యేత్. 31
పాఠాదార్వీజాతిదలం ద్రాక్షా మూలఫలత్రయైః | సాధితం సమధుక్వాథం కవలం ముఖపాకహృత్. 32
కృష్ణాతివిషతి క్తేంద్ర దారుపాఠా పయోముచామ్ | క్వాథో మూత్రేశృతః క్షౌద్రో సర్వకంఠగదాపహః. 33
పథ్యాగోక్షుర దుఃస్పర్శ రాజవృక్ష శిలాభిదామ్ | కషాయః సమధుః పీతో ముత్రకృచ్ఛ్ర వ్యపోహతి. 34
వంశత్వగ్వరుణక్వాథః శర్కరాశ్మ విఘాతనః | శాఖోటక్వాథ సక్షౌత్ర క్షీరాశీ శ్లీపదీభ##వేత్. 35
మాసార్కత్వక్పయసై#్తలం మధుసిక్తం చ సైంధవమ్ | పాదరోగం హరేత్సర్పిర్జాల కుక్కుటజం తథా. 36
శుంఠీ సౌవర్చలో హింగు చూర్ణం శుంఠీరసైర్ఘృతమ్! రుజంహరే దథ క్వాథో విద్ది బద్దాగ్ని సాధనమ్. 37
సౌవర్చలాగ్ని హింగూనాం సదీప్యానాం రసైర్యుతమ్ | విడదీప్యక యుక్తం వాతక్రం గుల్మాతురః పిబేత్.
ధాత్రీ పటోలముద్గానాం క్వాథః సాజ్యో విసర్పహా | శుంఠీదారు నవాక్షీర క్వాథోమూత్రాన్వితో೭పరః. 39
సవ్యోషాయోరజః క్షారః ఫలక్వాథశ్చ శోథహృత్ | గుడశిగ్రుత్రి వృద్భశ్చ సైంధవానాం రజోయుతః 40
త్రివృతాఫలజః క్వాథః సగుడః స్యాద్విరేచనః | వచాఫల కషాయోత్థం వయోవమన కృద్భవేత్. 41
త్రిఫలాయాః పలశతం వృథగ్బృంగజ భావితమ్ | విడంగం లోహ చూర్ణంచ దశభాగసమన్వితమ్. 42
శతావరీ గుడూచ్యగ్ని పలానాం శత (పంచ) వింశతిః | మధ్వాజ్య తిలజైర్లిహ్యాద్వలీ పలితవర్జితః. 43
శతమబ్దం హి జీవేత సర్వరోగ వివర్జితః | త్రిఫలా సర్వరోగఘ్నీ సమధుః శర్కరాన్వితా. 44
సితామధుర్ఘృతైర్యుక్తా నకృష్ణా త్రిఫలాతథా | పథ్యా చిత్రక శుంఠ్యశ్చ గుడూచీముశలీరజః. 45
స గుడం భక్షితం రోగహరం త్రిశతవర్షకృత్ | కించిచ్చూర్ణం జవాపుష్పం పిండితం విసృజేజ్జలే. 46
తైలం భ##వేద్ఘృతాకారం కించిచ్చూర్ణం జలాన్వితమ్ | ధూపార్థం దృశ్యతే చిత్రం వృషదంశ జరాయునా.
పునర్మాక్షిక ధూపేన దృశ్యతే తద్యథాపురా | కర్పూరజల కాభేక తైలం పాటలిమూలయుక్. 48
పిష్ట్వాలిప్య పదేద్వేచ చరేదం గారకెనరః | తృణౌత్థానాదికం వ్యూహ్య దర్శయన్వైకుతూహలమ్. 49
విషగ్రహరుజ ధ్వంస క్షుత్రనర్మ చ కామికమ్ | తత్తేషట్కర్మకం ప్రోక్తం సిద్దిద్వయ సమాశ్రయమ్. 50
మంత్రధ్యా నౌషధి కథాముద్రేజ్యాం యత్ర ముష్టయః | చతుర్వర్గఫలం ప్రోక్తం యఃపఠేత్ నదివం వ్రజేత్.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానారోగ హరౌషధ కథనం నామ త్ర్యశీత్యధిక ద్విశతతమో೭ధ్యాయః.
విశ్వ, అజమోద సైంధవ చించాత్వక్కుల సమ భాగము గల అభయతో కలిపి తక్రము గాని, ఉష్ణ జలము గాని త్రాగుటచే అతిసారము నశించును. ఇంద్రయవ, అతి విష, విశ్వముస్తలు వేసి, కాచిన క్వాథము ఆమసహిత మగు జీర్ణాతి సారమును శూలముతో కూడిన రక్తాతిసారమును పోగొట్టును. అంగారములపై కాల్చిన సుగతమును సింధువును వేడినీళ్ళతో త్రాగవలెను. పిదప ళూల బాధ కల వాడు దానిని వేడి నీళ్ళతో త్రాగవలెను లేదా సైంధవము, ఇంగువ, పిప్పలి అభయ వీటితో వేడి నీళ్ళతో త్రాగవలెను తేనెలో తడిపిన కటురోహ, కమల, ఆతంక, లాజ చూర్ణములను గుడ్డ చుట్టబెట్టి ముఖము నందుంచుకున్నచో దాహము తగ్గును. పాఠదార్వి జాతీదలములను, ద్రాక్ష, మూల త్రిఫలములతో సాధించి మధుక్వాథముతో కలిపి ముఖము నందుంచి చప్పరించినచో దాహము తగ్గును. కృష్ణ, అతి విష, తిక్త ఇంద్రదారు, పాఠ, వయో ముక్కుల క్వాథమును గోమూత్రము నందు మరిగించి తేనె కలిపినచో స్వర కంఠ రోగములను పోగోట్టును పథ్యగోక్షుర, దుఃస్పర్శ, రాజ వృక్ష, శిలా జిత్తుల కషాయమును తెనెతో త్రాగినచో మూత్ర కృఛ్రము పోవును. వెదురు బెరడు, వరుణ వృక్షపు బెరడుతో చేసిన క్వాథము శర్కరను, అశ్మరీ రోగమును నశింప చేయును స్లీపద రోగము కలవాడు శాకోటక క్వాథమును తేనెతో కలిపి తినవలెను. మాష, అర్కత్వక్కులను, అర్కవృక్షపాలను, తైలమును, మైనమును, సైంధవమును కలిపి ఉపయోగించినచో పాద రోగములు నశించును. శొంఠి సౌవర్చము, హింగు చూర్ణము వీటిని శొంఠి రసముతో కాని, నేతితో కాని లేదా వీటి క్వాథములు కాని, మలబంధ దోషమును పోగొట్టును. గుల్మ రోగము కలవాడు, సౌవర్చల చిత్రక హింగు అజా మోదముల రసముతో కలిపి లేదా విడంగ చిత్రకములతో కలిపి తక్రసానము చేయవలెను. ధాత్రి, పటోల, ముద్గముల క్వాథము, ఆజ్యముతో కలిపి తీసుకున్నచో విసర్ప రోగము తొలగును, శొంఠి దేవదారు, నవాక్షీర క్వాథము గోమూత్రముతో కలిపి తీసుకున్నచో విసర్పరోగమును పొందును. వ్యోష, అయోరజ, క్షార త్రిఫల క్వాథము శోధ రోగములు తొలగించును. గుడ శిగ్రు త్రివృత్, సైంధవల వణముల చూర్ణముతో చేసిన క్వాథము శోధ రోగమును తొలగించును, విశోధ త్రిఫల, గుడములతో చేసిన క్వాథము విరేచకరము వచా, ఫల కషాయము నుండి తీసిన జలము వమనకారి. భృంగ రాజ రసమున భావితమైన త్రిఫల నూరు పలములు వాయు విడంగలోహ చూర్ణములు, పదవ భాగము శతావరి, గుడూచి, చిత్ర మూలమూలను ఇరువది ఐదు పలములు గ్రహించి చూర్ణము చేసి, దానిని మధు, ఘృత, తైలములతో సేవించినచో వళులు పలితములు తొలగిపోవును. అట్లు సేవించిన వాడు సకల రోగ ముక్తుడై నూరు సంవత్సరములు జీవించును. మధు శర్కరలు కలిపి సేవించి త్రిఫల సర్వరోగ వినాశకరము. కృష్ణా సహితమగు త్రిఫలను సితా మధు ఘృతములతో సేవించినచో అట్టి ఫలమే యిచ్చును. పథ్య, చిత్రక, శొంఠి గుడూచి, ముసలీ చూర్ణములను గుడముతో భక్షించినచో రోగములను తొలగించి మూడు వందల సంవత్సరముల ఆయుర్దాయము యిచ్చును. జపా పుష్పమును కొంచెము నలిపి నీటిలో కలిపి ఆ చూర్ణ జలమును కొంచెము తైలములో కల్పినచో ఆ తైలము ఘృతమువలె యగును. పిల్లిమావితో ధూపము వేసినచో చిత్రము కనబడదు. మరల మైనము ధూపము వేసినచో వెనుకటి వలెనే కనబడును. కర్పూరము, జలగ, భేక తైలము, వీటిని పాటలిమూలముతో కలిపి నూరి పాదములకు రాసుకొని మనుష్యుడు నిప్పుల మీద నడువగలడు. తృణోత్థాపనాదము చేయుచు, అశ్చర్యకరముగ నడువగలడు. విషములను తొలగించుట, రోగ నాశము, గ్రహనాశము, తుచ్ఛక్రీడలు, కామ నాపరమైనవి. ఇహ లోక పరలోకము లందు సిద్ధి నిచ్చు కర్మలను షట్కర్మ సహితముగ నీకు చెప్పితిని మంత్ర, ధ్యాన ఔషధ, కథా, ముద్రా, యజ్ఞములు ఈ ఆరును ఇచట పిడికిళ్ళు ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చు దీనిని ఎవడు పఠించునో ఆతడు స్వర్గమునకు వెళ్ళును.
అగ్ని మహాపురాణమున నానారోగహరౌషధ కథన మును రెండు వందల యెనుబది మూడవ ఆధ్యాయము సమాప్తము.