Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచాశీత్యధిక ద్విశతతమోధ్యాయః

అథ మృతసంజీవనకర సిద్ధయోగః

ధన్వంతరి రువాచ :

సిద్దయోగాన్పు నర్వక్ష్యే మృతసంజీవనీ కరాన్‌ | ఆత్రేయ భాషితాన్దివ్యా న్సర్వవ్యాధి విమర్దనాన్‌. 1

ఆత్రేయ ఉవాచ :

బిల్వాని పంచమూలన్య క్వాథః స్వాద్వాతికే జ్వరే | పావనం పిప్పలీమూలం గుడూచీ విశ్వజోథవా. 2

ఆమలక్య భయాకృష్ణా వహ్నిః సర్వజ్వరాన్తకః | బిల్వాగ్నిమంథశ్యోనాకకాశ్మర్యః పాటలా స్థిరా. 3

త్రికంఠకం వృశ్చివర్ణీ బృహతీకృష్ణకారికాః | జ్వరావిపాక పార్శ్వార్తి కాశను త్కుశ మూలకమ్‌. 4

గుడూచీ పర్పటీ ముస్తం కిరాతం విశ్వ భేషజమ్‌ | వాతపిత్త జ్వరే దేయం పంచభద్ర మిదం స్మృతమ్‌.

త్రివృద్వి శాలాకటుకా త్రిఫలారగ్వధైః కృతః | సంస్కారో భేదనః క్వాథః పేయః సర్వజ్వరాపహః. 6

దేవదారు బలా వాసాత్రిఫలావ్యోష పద్మకైః | నవిడంగైః సితాతుల్యం తచ్చూర్ణం పంచకాసజిత్‌. 7

దశ మూలీశటీ రాస్నా పిప్పలీ బిల్వపౌష్కరైః | శ్రుంగీ తామలకీ భాంగీ గుడూచీ నాగవల్లిభిః. 8

య వాగూం విధినా సిద్దాం కషాయం వా పిబేన్నరః |

కాసా హృద్గ్రహణీ పార్శ్వ హిక్కాశ్వాస ప్రశాంతయే. 9

మధుకం మధునా యుక్తం పిప్పలీం శర్కరాన్వితమ్‌ |

నాగరంగుడ సంయుక్తం హిక్కాఘ్నం లవణ త్రయమ్‌. 10

కారవ్య జాజీమరిచం ద్రాక్షా వృక్షావ్లు దాడిమమ్‌ | సౌవర్చలం గుడం క్షౌద్రం సర్వారోచన నాశనమ్‌. 11

శృంగవేర రసం చైవ మధునాసహ పాయయేత్‌ | అరుచి శ్వాసకాసఘ్నం ప్రతిశ్యాయక ఫాన్తకమ్‌. 12

ధన్వంతరి చెప్పెను. ఆత్రేయడు చెప్పినవియు, దివ్యములును సర్వవ్యాధి నివారకములును మృత సంజీవనకరములు యగు సిద్ధ యోగములను మరల చెప్పెదను ఆత్రేయుడు చెప్పెను. వాత జ్వరమున బిల్వాది పంచమూల క్వాథము శ్రేష్ఠము. జీర్ణ శక్తికి పిప్పలీ మూల గుడూచి శుంఠీ క్వాథము ఇవ్వవలెను. ఆమలక అభయా కృష్ణ చిత్రకక్వాథము సర్వ జ్వర నాశకము. బిల్వమూల అగ్ని మంథశ్యోనాక, కాశ్మరులు పాటలా, స్థిర, త్రికంటక, పృష్లిపర్ణి, బృహతీ, కంట కారికలు వీటికి దశమూలములని పేరు. వీటి క్వాథము కుశమూల. క్వాథము జ్వరమును అజీర్ణమును పార్శ్వశూలను దగ్గును నశింప చేయును. గుడూచి, పర్పటి, ముస్త, కిరాత, విశ్వ భేషజములతో చేసిన పంచ భద్ర క్వాథము వాత పిత్తజ్వరమున ఇవ్వవలెను. త్రివృత్‌, విశాల, కటుక, త్రిఫల, ఆరగ్వధములతో చేసిన క్వాథమును. యవ క్షారము కలిపి త్రాగించినచో యది విరేచకమై, సంపూర్ణ జ్వరములను నశింప చేయును, దేవదారు, బల, వాస, త్రిఫల, వ్యోష, పద్మక, వాయు, విడంగ, సితలను సమాన భాగములో చూర్ణము చేసి సేవించినచో పంచ విధకాసములను తొలగించును. హృదయ రోగ గ్రహణి పార్శ్వరోగ హిక్కా, శ్వాస, కాస రోగములను పోగొట్టుటకు దశ మూల శఠీరాన్న పిప్పలీ, బిల్వ, పౌష్కర శృంగీ ఆమలకీ, బార్జి, గుడూచి, నాగవల్లులతో యథా శాస్త్రముగ చేసిన క్వాథమును గంజిని త్రాగవరెను మధు యుక్తముగు మధుకమును శర్కరాసహిత మగు పిప్పలిని గుడ యుక్త నాగరమును లవణత్రయమును సేవించిన ఎక్కిళ్ళు పోవును. కారవి, అజాజీ, మరిచ, ద్రాక్ష, వక్షావ్లు దాడిమ, సౌవర్చల, గుడములను సమాన భాగములుగ గ్రహించి చేసిన చూర్ణముతో తెనె కలిపి తయారు చేసిన కారవ్యాధి వటి సర్వ విధములగు అరుచి రోగములను నశింప చేయును. అల్ల పురసమును తేనె కలిపి త్రాగించినచో అరుచి, శ్వాస, కాసలు, జలుబు, కఫము నశించెను.

వటం శృంగీ శిలాలోధ్ర దాడిమం మధుకం మధు | పిబేత్తండుల తోయేన ఛర్థి తృష్టానివారణమ్‌. 13

గుడూచీ వానకంలోధ్రం పిప్పలీ క్షౌద్రసంయుతమ్‌ | కఫాన్వితం జయేద్రక్తం తృష్ణా కాస జ్వరాపహమ్‌.

వానకస్య రసస్తద్వత్స మధుస్తామ్రజోరసః | శిరీష పుష్పసురస భావితం మరిచం హితమ్‌. 15

సర్వార్తిను న్మసూరోథ పిత్తముక్తండులీయకమ్‌ | నిర్గుండి శారివాశేలురంకోలశ్చ విషావహః. 16

మహౌషధామృతా క్షుద్రాపుష్కరం గంథికోద్భవమ్‌ |

పిబేత్కణాయుతంత క్వాథం మూర్ఛాయాం చ మదేషు చ. 17

హింగు సౌవర్చలవ్యోపో ద్విపలాంశైర్ఘృతాఢకమ్‌ | చతుర్గుణ గవాంమూత్రే సిద్ధమున్మాద నాశనమ్‌. 18

శంఖ పుష్ప్వీవచాకుష్ఠైః సిద్దబ్రాహ్మీరసైర్యుతమ్‌ | పురాణం హస్త్యపస్మారం సోన్మాదం మేధ్య ముత్తమమ్‌.

పంచగవ్యం ఘృతంతద్వత్కుష్ఠనుచ్చా భయాయుతమ్‌ | పటోల త్రిఫలానిమ్బ గుడూచీ ధావనీ వృషైః. 20

నకరం జైర్ఘృతం సిద్ధం కుష్ఠనుద్వజ్రకం న్మృతమ్‌ | నిమ్బం పటోలం వ్యాఘ్రీ చ గుడూచీ వాసకం తథా.

కుర్యాద్దశ పలాన్భాగానే కైకన్య సుకుట్టితాన్‌ | జలద్రోణ విపక్తవ్యం యావత్పాదావ శేషితమ్‌. 22

ఘృతప్రస్థం పచేత్తేన త్రిఫలాదర్భ సంయుతమ్‌ | పంచతిక్తమితి ఖ్యాతం నర్పిః కుష్ఠవినాశనమ్‌. 23

అశీతిం వాతజాన్రోగాం శ్చత్వారింశచ్చ పైత్తికాన్‌ | వింశతిం శ్లైష్మికాన్కాన పీన సార్శోవ్రణాదికాన్‌. 24

హన్త్యన్యాన్యోగరాజోయం యథార్కస్తిమిరంఖలు |

వట, శృంగి. శిల, లోధ్ర, దాడిమ, మధుకములను చూర్ణము చేసి, ఆచూర్ణముతో సమానముగ పటిక బెల్లము కలిపి తేనెతో సేవించవలెను. ఈ వటశృంగాది అవలేహమును జలముతో త్రాగినచో వమనమును దాహమును తొలగించును. గుడూచి, వాసక, లోధ్ర పిప్పలి చూర్ణమును తేనెల కలిపి సేవించినచో కఫయుక్తమగు రక్తము దాహము, దగ్గు జ్వరము నశించును. తేనె కలిపిన వాసకరసము, తామరభస్మము కాసమును పోగొట్టును. శిరీష పుష్ప రసముచే భావన చేసిన మరిచ చూర్ణము హితకరము మసూరము అన్ని భాధలను పోగొట్టును. తండులీయకము. పిత్త దోషమును తొలగించును. నిర్గుండి, శారిబ శేలు అంకోలములు విషనాశకములు, శుంఠి అమృత, క్షుత్ర పుష్కర గ్రంథి, పిప్పల మూలములతో చేసిన క్వాథము, మూర్ఛను మదమును తొలగించును. హింగు, సౌవర్చల, వ్యోషములను రెండేసి పలములు నాలుగు శేర్లఘృతము కలిపి నాలుగు రెట్ల గోమూత్రముతో సిద్ధము చేసినచో ఉన్మాదనాశకము శంఖ పుష్పివచా, కుష్ఠ సిద్ధి, బ్రాహ్మిరసములను కలిపి గుటికలు చేసి, యిచ్చినచో పాత ఉన్మాదమును అపస్మారమును తొలిగించి మంచి మేధాశక్తిని యిచ్చును. అభయముతో పంచగవ్యమును ఘృతమును కలిపి సేవించిన కుష్ఠము నశించును. పటోల త్రిఫల, నింబ, గుడూచి, ధావని, వృష, కరంజములతో తయారు చేసిన ఘృతము కుష్ఠరోగమును తొలగించును "వజ్రకము" నింబ, పటోల, వ్యాఘ్రీ, గుడూచి, వాసకములను పదేసి పలములు తీసుకుని బాగుగా నూరవలెను, పదునారు శేరుల జలముతో క్వాథముచేసి దానిలో ఒకశేరు ఘృతము త్రిఫలా చూర్ణకల్కము, వేసి నాల్గవ వంతు మిగులు వరకు వండవలెను, ఈ పంచ తిక్త ఘృతము కుష్ఠరోగమును ఎనుబది విధములగు వాత రోగములను నలుబది విధములగు పిత్తరోగములను ఇరువది విధములగు కఫరోగములను పీనస, అర్శో, వ్రణాదులను నశింపచేయును. ఈ యోగరాజము సూర్యుడు అంథకారము నశింపచేసినట్లు ఇతరరోగములను కూడ నిస్సంశయముగ నశింపచేయను.

త్రిఫలాయాః కషాయేణ భృంగరాజ రసేనచ. 25

వ్రణప్రక్షాలనం కుర్యాదుప దంశప్రశాంతయే | పటోలగల చూర్ణేన దాడిమత్వగ్రజోథవా. 26

గుండయేచ్చ గజేనాపి త్రిఫలా చూర్ణకేనచ | త్రిఫలాయోరజోయష్టిమార్క వోత్పల మారిచైః. 27

నసైంధవైః పచేత్తైల మభ్యంగాచ్ఛర్ది కాపహమ్‌ | సక్షీరాన్మార్క వరసాన్ద్విప్రస్థమధుకోత్పలైః. 28

పచేత్తు తైలకుడవం తన్నస్యం పలితాపహమ్‌ | నింబం పటోలం త్రిఫలా గుడూచీఖ దిరం వృషమ్‌. 29

భూనిమ్బ పాఠాత్రి ఫలా గుదూచీ రక్తచందనమ్‌ | యోగద్వయం జ్వరం హన్తి కుష్ఠవిస్ఫోట కాదికమ్‌.

పటోలామృత భూనిమ్బ వాసారిష్టక పర్పటైః | ఖదిరాన్తయుతైః క్వాథో విస్ఫోటజ్వర శాంతికృత్‌. 31

దశమూలీ ఛిన్నరుహాపథ్యాదారు పునర్నవా | జ్వర విద్రధి శోథేషు శిగ్రు విశ్వజితా హితాః. 32

మధూకం నిమ్బపత్రాణి లేపః స్యాద్ర్వణ శోధనః | త్రిఫలా ఖదిరో దార్వీన్యగ్రోధాతి బలాకుశాః. 33

నిమ్బమూలక పత్రాణాం కషాయాః శోధనే హితాః | కరం జారిష్ట నిర్గుండీ రసోహన్యాద్ర్వణకృమీన్‌. 34

ధాతకీ చందన బలాసమంగా మధుకోత్పలైః | దార్వీమేదోన్వితైర్లేవః నసర్పిర్ర్వణ రోపణః. 35

ఉపదంశము శమించుటకై త్రిఫలాకషాయ భృంగరాజరసములతో ప్రణమును కడిగివేసి పటోలవత్ర చూర్ణముతో గాని, దాడిమ చూర్ణముతోగాని, గజచూర్ణముతోగాని త్రిఫలా చూర్ణముతోగాని, ఆవ్రణమును కప్పవలెను. త్రిఫాలా, లోహచూర్ణ, యష్టిక, ఆర్కవ, నీలకమల, మరిచ, సైంధవములువేసి, వండిన తైలమునుమర్దించినచో వమనములు శాంతించును. క్షీర మార్కవరస, మధుక, ఉత్పలములను రెండు శేర్లు తీసుకొని తైలము నాల్గవ వంతు మిగులు వరకు వండి దానిని నశ్యముగ ఉపయోగించినచో పలితము తగ్గును. నింబపటోల, త్రిఫలా, గుడూచి, ఖదిర, వృష, భూనింబ, పాఠాత్రి ఫలా, గుడూచి రక్త చందనములు అను ఈ రెండు యోగములు జ్వరమును తొలగింనును. కుష్ఠ విస్ఫోట కాదులను నశింపచేయును. పటోల, అమృత, భూనింబ, వాస, అరిష్టక, పర్పట, ఖదిరల క్వాథము, విస్పోట జ్వరములను తొలగించును. దశమూలీ, ఛిన్నరుహా, పథ్యాదారు, పునర్నవ, శిగ్రు, విశ్వజిత్‌లతో చేసిన క్వాథము జ్వర, విద్రథి, శోథములందు హితకరములు. మధూకము, నింబ పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర దార్వీ, న్యగ్రోథ, అతిబల, కుశ, నింబ, పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర దార్వీ, న్యగ్రోధ, అతి బల, కుశ, నింబ, మూలక పత్రములతో చేసిన కషాయములు శరీర బాహ్య శోధనమునకు మంచివి. కరంజ, అరిష్టం, నిర్గుండీ రసములు, గాయము నందలి క్రుములను నశింప చేయును. ధాతకీ, చందన, బలాస, మంగా మధుక, ఉత్పల, దారు, మేదలను నేతితో కలిపి లేపముగ వ్రాసినచో వ్రణములను మాన్పును.

గుగ్గులు త్రిఫలావ్యోషనమాంశైర్ఘృత యోగతః | నాడీ దుష్టవ్రణం శూలం భగందర ముఖం హరేత్‌. 36

హరీతకీం మూత్రసిద్ధాం సతైల లవణాన్వితామ్‌ | ప్రాతఃప్రాతశ్చ సేవేత కఫవాతామయాపహామ్‌. 37

త్రికటుత్రిఫలాక్వాథం నక్షార లవణం పిబేత్‌ | కఫవాతాత్మ కేష్వేవ విరేకః కఫవృద్ధినుత్‌. 38

పిప్పలీ పిప్పలీ మూలవచా చిత్రకనాగరైః | క్వాథితం వా పిబేత్పేయ మామవాత వినాశనమ్‌. 39

రాస్నాం గుడూచీ మేరండ దేవదారు మహౌషధమ్‌ | పిబేబత్సర్వాంగికే వాతే సామేసంధ్యస్థిమజ్జగే. 40

దశమూల కషాయం వా పిబేద్వానాగరాంభసా | శుంఠీ గోక్షురకక్వాథః ప్రాతః ప్రాతర్ని షేవితః. 41

సామవాత కటీశూల పాచనో రుక్ర్పణాశనః | సమూలపత్ర శాఖాయాః ప్రసారణ్యాశ్చతైలకమ్‌. 42

గుడూచ్యాః సురనః కల్కః చూర్ణం వాక్వాథ మేవచ | ప్రభూత కాలమాసేవ్య ముచ్చతే వాతశోణితాత్‌. 43

పిప్పలీ వర్ధమానంవా సేవ్యం పధ్యా గుడేనవా | పటోల త్రిఫలా తీవ్ర కటుకామృత సాధితమ్‌. 44

పక్వం పీత్వా జయత్వాశు సదాహం వాత శోణితమ్‌ | గుగ్గులుం కోష్ణశీతేతు గుడూచీత్రిఫలాంభసా. 45

బలాపునర్నవైరండ బృహతీద్వయ గోక్షురైః | సహింగులవణౖః పీతం సద్యో వాతరుజాపహమ్‌. 46

కార్షికం పిప్పలీ మూలం పంచైవ లవణానిచ | పిప్పలీ చిత్రకం శుంఠీ త్రిఫలా త్రివృతావచా. 47

ద్వౌక్షారౌశాద్వలా దన్తీ స్వర్ణక్షీరీ విషాణికా | కోల ప్రమాణాం గుటికాం పిబే త్సౌవీరకాయుతామ్‌. 48

శోథావపాకే త్రివృతా ప్రవృద్దే చోదరాదికే | క్షీరం శోథహరం దారు వర్షా భూర్నాగరైః శుభమ్‌. 49

సేకస్త థార్క వర్షాభూనిమ్బ క్వాథేన శోథజిత్‌ | వ్యోషగర్బం పలాశస్య త్రిగుణ భన్మవారిణి. 50

సాధితం పిబతః నర్పిః పతత్యర్శోన సంశయః | విష్వక్సేనాబ్జ నిర్గుండీ సాధితం చాపి లావణమ్‌. 51

విడంగానల సింధూర్థరాస్నాగ్ర క్షార దారుభిః | తైలం చతుర్గుణం సిద్దం కటుద్రవ్యం జలేథవా. 52

గుగ్గులు, త్రిఫలా, వ్యోషములను సమాంశమున గ్రహించి ఘృతము కలిపి. పూసినచో నాడీ వ్రణములు దుష్టవ్రణములు శూల భగందరము మొదలగునవి నశించును. గోమూత్రము నందు, శుద్ధము చేయబడిన హరీతకిని తైలము నందు వేయించి ప్రతి దినము లవణముతో ప్రాతః కాలమున సేవించినచో కఫ వాత రోగములు తొలగును. త్రికటు, త్రిఫలా క్వాథమును క్షార లవణము కలిపి త్రాగినచో కఫ వాత ప్రకృతి గల వారికి విరేచనమగును. కఫ వృద్ధి తగ్గును. పిప్పలీ, పిప్పలీమూల, వచా, చిత్రక, నాగరములతో చేసిన క్వాథమును గాని, పేయమును గాని త్రాగినచో ఆవ్లు వాతము తొలగును. రాస్నా గుడూచి, హేరండ, దేవదారు శుంఠుల క్వాథము సర్వాంగ వాతమును సంధి వాతమును, అస్తి మజ్జా గత ఆమవాతమును తొలగించును. దశ మూల కషాయమును నాగర జలముతో కలపి త్రాగినను పైరోగములు శాంతించును.

(అ) 27/2

శుంఠి గోక్షుర క్వాథమును ప్రతి దినమున ప్రాతః కాలమున సేవించినచో ఆమ వాత సహితమగు కటి శూలము పాండురోగము నశించును. శాఖా పత్ర సహిత మగు ప్రసారిణి తైలము కూడ పైరోగములు తగ్గించును. గుడూచి స్వరసము కల్కము, చూర్ణము, లేదా క్వాథము చాల కాలము సేవించినచో వాత రోగము పోవును. పిప్పలి, కాని, వర్ధమానముగాని, గుడముతో గాని, పథ్యతో గాని సేవించవలెను, పటోల, త్రిఫలా, తీవ్ర కుటకీ, అమృతముల పాకము తయారుచేసి, సేవించినచో దాహ యుక్త వాత రక్త రోగము శీఘ్రముగ నశించును. గుగ్గులును గోరువెచ్చటి నీటితో త్రిఫలను సమ శీతోష్ణ జలముతోసు లేదా బలా, పునర్నవ, హేరండమూల, బృహతీద్వయ, గోక్షుర, హింగు. లవణములతోను తీసుకునినచో వెంటనే వాత రోగము నశించును. ఒక కర్షము పిప్పలీమూలము పంచ లవణములు పిప్పలీ, చిత్రక, శుంఠి, త్రిఫలా, త్రివృత్‌, వచా, క్షారద్వయ, శాద్వల, దంతీ స్వర్ణక్షీరి, విపాశికలను కలిపి రేగి పండు ప్రమాణము గల గుటికలు చేసి, గంజితో త్రాగవలెను, శోధము నందును దాని వలన కలిగిన ఆమపాకము నందును దీనిని సేవించ వచ్చును. ఉదర వృద్ధి యందు కూడ దీనిని సేవించ వచ్చును. దారు వర్షాభూ, శుంఠి క్షీరములు శోధ నాశకములు. అర్క, వర్షాభూ, నింబ, క్వాథ కూడ శోధను తొలగించును. వ్యోషముతో గూడిన ఘృతమును మూడు రెట్లు పలాశ భస్మ జలముతో సిద్ధము చేసి త్రాగినచో వాని అర్షో రోగము తప్పక నశించును. విశ్వక్సేన అబ్జ నిర్గుండులతో సాధితమైన లవణము కూడ విడంగ అవల సైంధవ, రాన్న దుర్థ దేవదారు వచలతో నాలుగు రెట్ల కటు ద్రవ్యములు కలిసిన తైలము మర్దించుటచే గండమాల గల గండ రోగములు నశించును.

గండ మాలా పహం తైలమభ్యంగా ద్గల గండనుత్‌ | శటీకునాగ వలయక్వాథః క్షీరసంయుతమ్‌. 53

పయస్యా పిప్పలీవాసాకల్కం సిద్ధం క్షయేహితమ్‌ | వచా విడభయాశుంఠీ హింగుకుష్ఠాగ్ని దీప్యకాన్‌. 54

ద్విత్రిషట్‌ చతురేకాంశ సప్తపంచాశికాః క్రమాత్‌ | చూర్ణం పీతం హన్తి గుల్మముదరం శూలకాసనుత్‌. 55

పాఠానికుంభ త్రికటు త్రిఫలాగ్నిషు సాధితమ్‌ | మూత్రేణ చూర్ణగుటికా గుల్మ ప్లీహాదిమర్దనీ. 56

వాసానింబపటోలాని త్రిఫలా వాతపిత్తనుత్‌ | లిహ్యాతౌద్రేణ విడంగ చూర్ణం కృమి వినాశనమ్‌. 57

విడంగ సైంధవక్షార మూత్రేణాపి హరీతకీ | శల్లకీ బదరీ జంబూప్రయాలామ్రార్జునత్వచః. 58

పీతాః క్షీరేణ మధ్వక్తాః పృథక్ఛోణిత వారణాః | బిల్వామ్రధాతకీ పాఠాశుంఠీమోచరసాః సమాః. 59

పీతా రుంధన్త్యతీసారం గుడతక్రేణ దుర్జయమ్‌ | చాంగేరీకోలదధ్యమ్బునాగరక్షారసంయుతమ్‌. 60

ఘృతయుక్క్వాథితం పేయం గుదభ్రంశరుజాపహమ్‌ | విడంగాతి విషాముస్తదారు పాఠాకలింగకమ్‌. 61

శటీ, కొనాగ, వలయ, క్వాథమును క్షీర రస పయస్యా. పిప్పలి వాసా కల్కమును క్షీరముతో సేవించినచో క్షయ రోగము నశించును. వచా, విట్ల వణ, అభయా, శుంఠి. హింగు, కువ్ఠ అగ్ని, దీభ్మకములను రెండు, మూడు, ఆరు నాలుగు, ఒకటి, ఏడు, భాగముల చొప్పున, వరుసగ గ్రహించి చూర్ణము చేసి సేవించినచో గుల్మ రోగమును, ఉదర రోగమును శూలరోగమును కాసరోగమును తొలగించును. పాఠ, నికుంబ, త్రికటు త్రిఫల, చిత్రకముం చూర్ణమును గోమూత్రముచే సాధించి గుటికలు చేసి సేవించినచో గుల్మ ప్లీహాదికములు నశింప చేయును. వానా, నింబ పటోల త్రిఫలములు, వాత పిత్తములను తొలగించును వాయు విడంగ చూర్ణమును తేనెతో సేవించినచో క్రుమి వినాశకరము. విడంగ సైంధవ, యవక్షారములు, గోమూత్రముతో కలిపి సేవించిన హరీతకీ, క్రుమిఘ్నములు శల్లకీ, బదరీ, జబూ, ప్రియాల, ఆమ్ర, అర్జున వృక్షముల, బెరడు తేనెతో కలిపి, పాలతో సేవించినచో రక్తాతి సారము నశించును. బిల్వ ఆమ్ర ధాతకీ, పాఠా శుంఠి మోచరసములు సమములుగా గ్రహించి చేసిన చూర్ణమును గుడ మిశ్ర తక్రముకో సేవించినచో దుర్జయ మగు అతిసారమును జయించును చాంగేరీ, కోల, దధ్యంబు, శుంఠి యవక్షారముల క్వాథమును మృతముతో సేవించినచో గుదభ్రంశ రోగము తొలుగును. విడంగ, అతి విషా, ముస్త, దేవదారు పాఠా కలింగకములు క్వాథము మిర్చ చూర్ణముతో కలిపి సేవించినచో శోధ అతి సారములు నశించును.

మరీచేన సమాయుక్తం శోథాతీసారనాశనమ్‌ |

శర్కరాసింధు శుంఠీభిః కృష్ణామధు గుడేనవా. 62

ద్వేద్వేఖాదేద్దరీతక్యౌ జీవేద్వర్షశతం సుఖీ | త్రిఫల పిప్పలీయుక్తా సముధ్వాజ్యాతథైవ సా. 63

చూర్ణమామలకం తేన సురసేనతు భావితమ్‌ | మధ్యాజ్య శర్కరాయుక్తం లీడ్యాస్త్రీశఃపయఃపిబేత్‌. 64

మాషపిప్పలి శాలీనాం యవగోధూమయోస్తథా | చూర్ణభాగైః సమాంశైశ్చపచేత్పిప్పలికాం శుభామ్‌. 65

తాం భక్షయిత్వా చ పిబేచ్ఛర్కరామధురం పయః | నవశ్చటక వద్గచ్ఛేద్దశ వారా న్త్రియం ధ్రువమ్‌. 66

సమంగా ధాతకీ పుష్ప లోధ్ర నీలోత్పలానిచ | ఏతత్ఱీరేణ దాతవ్యం స్త్రీణాం ప్రదర నాశనమ్‌. 67

బీజం కౌరంటకం చాపి మధుకం శ్వేతచందనమ్‌ | పద్మోత్పలస్య మూలాని మధుకం శర్కరా తిలాన్‌. 68

ద్రవమాణషు గర్భేషు గర్భస్థాపన ముత్తమమ్‌ | దేవదారు నభః కుష్ఠ నలదం విశ్వభేషజమ్‌. 69

లేపః కాంజికసమ్పిష్ట సై#్తలయుక్తః శిరోర్తినుత్‌ | వస్త్రపూతం క్షిపేత్కోష్ణం సింధూత్థం కర్ణశూలనుత్‌. 70

లశునార్ద్రక శిగ్రూణాం కదల్యా వారసః పృథక్‌ | బలాశతావరీ రాస్నామృతాః సైరీయకైః పిబేత్‌. 71

త్రిఫలా సహితం సర్పిస్తిమిరఘ్న మనుత్తమమ్‌ | త్రిఫలావ్యోష సింధూత్థైర్ఘృతం సిద్ధం పిబేన్నరః. 72

చాక్షుష్యం భేదనం హృద్యం దీపనం కఫరోగనుత్‌ | నీలోత్పలస్య కింజల్కం గోశకృద్రస సంయుతమ్‌.

గుటికాంజన మేతత్స్యాద్దినరాత్ర్యం ధయోర్హితమ్‌ | యష్టీమధు వచాకృష్ణా బీజానాం కుటజస్యచ. 74

కల్కేనాలోడ్య నిమ్బస్య కషాయో వమనాయ సః | స్నిగ్ధస్వన్నయవం తోయం ప్రదాతవ్యం విరేచనమ్‌.

అన్యథాయోజితం కుర్యాన్మం దాగ్నిం గౌరవారుచిం | పథ్యాసైంధవకృష్ణానాం చూర్ణముష్ణాంబునా పిబేత్‌.

విరేకః సర్వరోగఘ్నః శ్రేష్ఠో నారాచ సంజ్ఞకః | సిద్దయోగా మునిభ్యోయే ఆత్రేయేణ ప్రదర్శితాః.

నర్వరోగహరాః సర్వయోగాగ్ర్యాః సుశ్రుతేనహి. 77

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మృతనంజీవన కర సిద్దయోగోనామ పంచాశీత్యంధిక ద్విశతతమోధ్యాయః.

శర్కరాసైంధవ శుంఠులతో కాని కృషా, మధు గుడములతో గాని ప్రతిదినము రెండేసి, కర్కాయలు తిను వాడు నూరు సంవత్సరములు సుఖముగ జీవించును. పిప్పలి యుక్తమగు త్రిఫలను కూడ మధుఘృతములతో సేవించిన ఆ విధముగనే ఫలము నిచ్చును. ఆమలక సురస భావితమగు ఆమలకమును మధుఘృత, శర్కరులతో కలిపి దుగ్ధ పానము చేసినవాడు స్త్రీలకు ప్రభువగును, మాష, పిప్పల, శాలి, యవగోధూమల, చూర్ణమును సమాన ప్రమాణములో గ్రహించి, పిప్పలికను వండి దానిని భక్షించి, శర్కరాయుక్తమగు, మధుర దుగ్ధమును చేసినవాడు, చటక పక్షివలె నిస్సంశయముగ పది పర్యాయములు స్త్రీ సంగమము చేయసమర్ధుడగును. సమంగ, ధాతకీ పుష్ప, లోధ్ర నీలో త్పలములను పాలతో ఇచ్చినచో స్త్రీల ప్రదర రోగమును నశించును. కరంటక బీజము, మధుకము, శ్వేతచందనము, పద్మోత్పల మూలములు, మధుకము, శల్కరతిలలు, వీటి చూర్ణమును గర్భపాత శంఖ కలుగునపుడు, సేవించి గర్భమును స్థిరముగ వుంచును. దేవదారు, సభః కుష్ఠ, నలద, విశ్వభేషజములను గంజిలో నూరి తైలము కలిపి పూసినచో శిరో రోగములు పోవును. సైంధవలవణమును, వస్త్రముతో శుద్ధము చేసి, కొంచెము వేడి తైలములో కలిపి, కర్ణములో పోసినచో కర్ణశూల రోగము తగ్గును, లశున, ఆర్ద్రక, శిగ్రు కదళీల వేరువేరు రసము కర్ణశూలహరము. బలా, శతావరీ, రాస్నా, అమృతా సైరీయక త్రిఫలలతో సిద్ధము చేసినఘృతము, తిమిర రోగమును తొలగించును. త్రిఫలా, వ్యోష, సైంధవములు కలిపిన ఘృతము త్రాగినచో కండ్లకు హితము విరేచనకరము, హృదయమునకు హితము జఠరాగ్ని దీపనము, కఫరోగనాశకము, నీలో త్పల కింజల్కము. గోమయు రసముతో కలిపి గుటి కాంజనముచేసి, ఉపయోగించినచో అది దినాంధ రాత్ర్యంధులకు హితకరము. యష్ఠి, మధువచ, పిప్పలీబీజ కుటజముల బెరడుతో కల్కమును నింబ క్వాథమును కలిపి ఇచ్చినచో అదివమనకారము, తడిసినయవల నీరు విరోచనకరము. దీనిని అనుచితముగ ప్రయోగించినచో అగ్నిమాంద్యము, ఉదరము గౌరము, అరుచిపుట్టును. పథ్యా సైంధవ ప్పిలములను సమాన భాగములుగ గ్రహించి చూర్ణముచేసి, ఉషోదకముతో త్రాగినచో నారాద సంజ్ఞకమగు ఈ చూర్ణము విరేచనకరము. సర్వరోగ వినాశకము. ఆత్రేయుడు మునులకు చెప్పిన సిద్ధయోగములలో శ్రేష్ఠములైన సర్వరోగనాశక యోగములను సుశ్రుతుడు తెలుసుకొనెను.

అగ్నిమహాపురాణమున మృత సంజీవనీకర సిద్ధయోగగములను రెండువందల యెనబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page