Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షడశీత్యధిక ద్విశతతమోధ్యాయః

అధ మృత్యుంజయకల్పః

ధన్వన్తరి రువాచ :

కల్పాన్మృత్యుంజయాన్వక్ష్యేహ్యాయుర్దాన్రోగమర్దనాన్‌ | త్రిశతీ రోగహా సేవ్యా మధ్వాజ్య త్రిఫలామృతా.

పలం పలార్థం కర్షం వా త్రిఫలాం (లీం) నకలాంతథా | బిల్వ తైలస్య నస్యంచ మాసం పంచశతీకవిః. 2

రోగాపమృత్యు బలిజిత్తిలం భల్లాతకం తథా | పంచాంగం వాకుచీ చూర్ణం షణ్మానంఖదిరోదకైః. 3

క్వాథః కుష్ఠం జయేత్సేవ్యం చూర్ణం నీలకురంటజమ్‌ | క్షీరేణ మధునా వాపి శీతాయుః ఖండదుగ్ధభుక్‌. 4

మధ్వాజ్య శుంఠీం సంసేవ్య పలం ప్రాతః సమృత్యుజిత్‌ | వలీపలిత జిజ్జీవేన్మాండకీ చూర్ణదుగ్ధపాః. 5

ఉచ్చటా మధునాకర్షం పయః పామృత్యు జిన్నరః | మధ్వాజ్యైః పయసావాపి నిర్గుండీ రోగమృత్యుజిత్‌.

పలాశ##తైలం కర్షైకం షణ్మానం మధునాపిబేత్‌ | దుగ్ధభోజీ పంచశతీ సహస్రాయుర్భవేన్నరః. 7

జ్యోతిష్మతీ వత్రరసం పయసా త్రిఫలాం పిబేత్‌ | మధునాజ్యం తతస్తద్వచ్ఛతావర్యా రజఃఫలమ్‌. 8

క్షౌద్రాజ్యైః పయసావాపి నిర్గుండీ రోగమృత్యుజిత్‌ | పంచాంగం నిమ్బ చూర్ణన్య ఖదిరక్వాథ భావితమ్‌. 9

కర్షంభృంగరసేనాపి రోగజిచ్చామరోభ##వేత్‌ | రుదంతికాజ్య మధుభుగ్దుగ్ద భోజీచమృత్యుజిత్‌. 10

కర్షచూర్ణం హరీతక్యా భావితం భృంగరాడ్రసైః | ఘృతేన మధునాసేవ్య త్రిశతాయుశ్చ రోగజిత్‌. 11

వారాహికా భృంగరసం లోహచూర్ణం శతావరీ | సాజ్యం కర్షం పంచశతీ కార్త చూర్ణం శతావరీ. 12

భావితం భృంగరాజేన మధ్వాజ్యం త్రిశతీభ##వేత్‌ | తామ్రంమృతం త్రివృత్తుల్యం గంధకంచ కుమారికా. 13

రసైర్విమృజ్యద్వేగుంజే సాజ్యం పంచశాతాబ్దవాన్‌ | అశ్వగంధాపలం తైలం సాజ్యంఖండం శతాబ్దవాన్‌. 14

ధన్వంతరి చెప్పెను. ఆయుర్దాయప్రదములు రోగ వినాశకములగు మృత్యుంజయ కల్పములను చెప్పెదను. మధు, ఘృత, త్రిఫలా, ఆమృతములు మూడు వందల రోగములను తొలగించును. త్రిఫలను నాలుగు లేదా రెండు లేదా ఒక తులములు సేవించవలెను. ఒకమాసము, బిల్వ తైలనశ్యము చేసికొన్నచో ఐదువందల సంవత్సరములు జీవించును. కవియగును. తిల, భల్లాతకములు రోగమును, అపమృత్యువును వళులను తొలగించును. వాకుచీపంచాంగా చూర్ణములను ఖదిరోదకముతో ఆరుమాసములు సేవించినచో కుష్ఠము నశించును. నీలకురంట చూర్ణమును క్షీరముతోగాని. మధువుతోగాని సేవించిన మంచిది. ఖండదుగ్ధమును పానముచేయువాడు, నూరు సంవత్సరములు జీవించును, మధు ఆజ్య శంఠులను, ప్రతి దినము ప్రాతఃకాలము, ఒక పలము సేవించువాడు మృత్యువును జయించును. మాండకీ చూర్ణముతో క్షీరము సేవించువానికి వళులు, ఫలితము వుండదు. ఉచ్చటను, మధువుతో ఒకకర్షము, తిని క్షీరసానము చేయువాడు, మృత్యువును జయించును. మధుఘృతముతో గాని క్షీరముతోగాని, నుర్గండీరసమును సేవించువాడు రోగమును మృత్యువును జయించును. ఒక తులము పలాశ తైలమును మధువుతో ప్రతిదినము ఆరుమాసములు, సేవించుచు, దుగ్ధము త్రాడువాడు ఐదువందల సంవత్సరములు జీవించును. పాలతో కూడ జ్యోతిష్మతీ పత్రరసమునుగాని త్రిఫలనుగాని త్రాగువాడు వెయ్యి సంవత్సరములు జీవించును. మధువుతో ఘృతము, నాలుగు తులముల శతావరి చూర్ణము, సేవించు వాడు, సహస్ర వర్ష జీవియగును నిర్గుండిని, మధు ఘృతములతోగాని, పాలతోగాని సేవించిన రోగమృత్యువులను నశింపచేయును. పంచాంగ నింబరసమును బదిరక్వాథముతో భావన చేసి భృంగరాజు రసముతో ఒక తులము సేవించినచో రోగములను జయించి అమర్త్యుడగును. రుదంతికా చూర్ణమును ఘృతమధువులతో గాని దుగ్ధముతో గాని సేవించువాడు, మృత్యువును జయించును. హరీతకీ చూర్ణమును భృంగరాజరసముతో భావనచేసి ఘృతమధువులతో సేవించినచో రోగముక్తుడై మూడువందల సంవత్సరము జీవించును. వారాహికా భృంగరసలోహ చూర్ణ శతావరీ, ఆజ్యములను ఒక తులము సేవించినచో అయిదువందల సంవత్సరములు జీవించును. లోహ భస్మను శతావరిని భృంగరాజు రసముతో భావనచేసి మధుఘృతములతో సేవించినవాడు మూడువందల సంవత్సరములు జీవించును. తామ్రభస్మ, అమృతాత్రివృత్‌. గంధకములను సమముగ గ్రహించి కుమారికా రసముతో రెండుగురివిందెల గోలీలు తయారుచేసి ఘృతముతో సేవించుటచే ఐదువందల సంవత్సరములు జీవించును. అశ్వగంధ; త్రిఫలాశర్కర, తైల ఘృతములను సేవించువాడు నూరువర్షములు జయించును.

పలం పునర్న వాచూర్ణం మధ్వాజ్యపయసా పిబన్‌ | అశోకచూర్ణస్య పలం మధ్వాజ్యం పయసార్తినుత్‌. 15

తిలస్య తైలం సమధునస్యాత్కృష్ట కచఃశతీ | కర్షమక్షం సమధ్వాజ్యం శతాయుః పయసాపిబన్‌. 16

అభయాం సగుడాం జగ్ధ్వా ఘృతేన మధురాదిభిః | దుగ్దాన్న భుక్కృష్ణకేశోరోగీ పంచశతాబ్దవాన్‌. 17

పలం కూష్మాండికా చూర్ణం మధ్వాజ్య పయసా పిబన్‌ |

మాసం దుగ్ధాన్న భోజీ చ సహస్రాయుర్విరోగవాన్‌. 18

శాలూకచూర్ణం భృంగాజ్యం సమధ్వాజ్యం శతాబ్దకృత్‌ | కటుతుంబీ తైలనస్యం కర్షంశత ద్వయాబ్దవాన్‌.

త్రిఫలా పిప్పలీ శుంఠీ సేవితా త్రిశతాబ్దకృత | శతావర్యాః పూర్వయోగః సహస్రాయుర్బలాదికృత్‌. 20

చిత్రకేణ తథా పూర్వస్తథా శుంఠీ విడంగతః | లోహేన భృంగరాజేన వలయానింబ పంచకైః. 21

ఖదిరేణ చ నిర్గుండ్యా కంఠకార్యథ వానకాత్‌ | వర్షాభువాతద్ర సైర్వాభావితో వీటికాకృతః. 22

చూర్ణం ఘృతైర్వామధునా గుడాద్యైర్వారిణా తథా | ఓంహ్రూంస ఇతిమంత్రేణ మంత్రితో యోగరాజకః. 23

మృతసంజీవనీకల్పో రోగమృత్యుంజయో భ##వేత్‌ | సురాసురైశ్చ మునిభిః సేవితాః కల్పసాగరాః.

గజాయుర్వేదం ప్రోవాచ పాలకాప్యో ంగ రాజకమ్‌. 24

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ మృత్యుంజయ కల్పో నామ షడశీత్యధిక ద్విశతతమోధ్యాయః.

అశోక వృక్షము బెరడు యొక్క చూర్ణమును మధు ఘృతములతో సేవించి దుగ్ధ పానము చేయుటచే రోగములు నశించును. పునర్నవా చూర్ణమును మధు ఆజ్య క్షీరములతో సేవించిన వాడు రోగ విముక్తుడగును. మధు సంహిత మగు తిల తైలమును నశ్యముగ తీసుకొన్నచో శత వర్ష జీవి యగును. కృష్ణ కేశములు కలవాడు యగును. అక్ష చూర్ణమును ఒక తులము మధ్వాజ్య క్షీరములతో సేవించిన శతాయువగును. అభయా గుడములను మధురాది ఓషధులను ఘృతముతో తిని, పాలతో అన్నము భుజించు వాని కేశములు సర్వదా కృష్ణ వర్ణములై యుండును. అతడు రోగ రహితుడై అయిదు వందల సంవత్సరములు జీవించును. ఒక పలము కూష్మాండ చూర్ణమును ఘృత దుగ్ధములతో ఒక మాసము సేవించుచు దుగ్ధాన్న భోజనము చేయువాడు రోగరహితుడై సహస్ర వర్ష జీవియగును శాలుక చూర్ణమును భృంగాజ్యమును మదుఘృతములతో సేవించిన వాడు నూరు సంవత్సరములు జీవించును. ఒక తులము కటుతుంబీ తైలమును నశ్యముగా గ్రహించు వాడు రెండు వందల సంవత్సరములు జీవించును. త్రిఫలా పిప్పలి శుంఠుల సేవనము మూడు వందల సంవత్సరము ఆయుర్దాయము నిచ్చును. వీటిని శతావరితో కలిపి సేవించినచో బలమును, సహస్రాయువును ఇచ్చును. చిత్ర శుంఠి విడంగముల సేవనము పూర్వోక్త ఫలమును ఇచ్చును. త్రిఫలా, పిప్పల శుంఠులను లోహ భృంగరాజ, నింబ పంచక, ఖదిర నిర్గుండీ, అంటకారి వాసక పునర్నవలతోగాని, వీటి రసముతో భావన చేసి కాని, వటి లేదా చూర్ణము తయారు చేసి ఘృత మధుగడ జలాదులతో సేవించినచో పూర్వోక్తఫలము లభించును. ''ఓం హ్రూంసః'' అను మంత్రముచే అభిమంత్రిత మగు యోగ రాజము మృత్యు సంజీవని సమానమై రోగములను మృత్యువులను జయింప చేయును. ఈ కల్పసాగరములను దేవతాసుర మునులు సేవించిరి. పాలకాప్యుడు అంగరాజునకు గజాయుర్వేదము బోధించెను.

అది మహాపురాణమున మృత్యుంజ కల్ప మను రెండు వందల యెనుబది ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page