Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోననవత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

అథాశ్వలక్షణ చికిత్సమ్‌

శాలిహోత్ర ఉవాచ :

అశ్వానాం లక్షణం వక్ష్యే చికిత్సాం చైవ సుశ్రుత | హీనదన్తో విదంతశ్చ కరాలః కృష్ణతాలుకః. 1

కృష్ణ జిహ్వశ్చ యమజోజాతముష్కశ్చ యస్తథా | ద్విశఫశ్చతయాశుంగీ త్రివర్ణో వ్యాఘ్రవర్ణకః. 2

ఖరవర్ణో భస్మవర్ణో జాతవర్ణశ్చ కాకుదీ | శ్విత్రీచ కాకసాదీచ ఖరసారస్త థైవచ. 3

వానరాక్షః కృష్ణశటః కృష్ణగుహ్యస్త థైవచ | కృష్ణ ప్రోథశ్చ శూకశ్చ యశ్చ తిత్తిరి సన్నిభః. 4

విషమః శ్వేతపాదశ్చ ధ్రువావర్త వివర్జితః | అశుభావర్త సంయుక్తో వర్జనీయస్తు రంగమః. 5

రంధ్రోపరంధ్రయోర్ధ్వౌ ద్వౌద్వౌద్వౌ మస్తకవక్షసోః | ప్రయాణచ లలాటే చకంఠావర్తాః శుభాదశ. 6

నృక్కణ్యాంచ లలాటేచ కర్ణమూలే నిగాలకే | బాహుమూలేగలే శ్రేష్ఠా ఆవర్తాస్త్వ శుభాఃపరే. 7

శుకేంద్ర గోపచంద్రా భాయేచ వాయససన్నిభాః | సువర్ణ వర్ణాః స్నిగ్ధాశ్చ ప్రశస్యాస్తు సదైవహి. 8

దీర్ఘగ్రీవాక్షి కూటాశ్చ హ్రస్వ కర్ణాశ్చ శోభనాః | రాజ్ఞాం తురంగమాయత్ర విజయం వర్జయేత్తతః. 9

పాలితస్తు హయోదంతీ శుభదో దుఃఖదోన్యథా | శ్రియః పుత్రాస్తు గంధర్వా వాజినో రత్నముత్తమమ్‌. 10

శాలిహోత్రుడు చెప్పెను సుస్రుతా ! అశ్వ లక్షణములను చికిత్సను చెప్పెదను హీన దంతము విదంతము, కరాలము, కృష్ణ తాలుకము, కృష్ణ జిహ్వము, యుగ్మజము, అజాత ముష్కము రెండు డెక్కలు గలది శృంగ యుక్తము త్రివర్ణము వ్యాఘ్రవర్ణము గర్దభ వర్ణము, భస్మ వర్ణము సువర్ణవర్ణము మూపు కలది. శ్విత్రము కలది, కాకులచే ఆక్రమింపబడునది ఖరసారము. వాన రాక్షము కృష్ణ గుహ్యము, కృష్ణ సటము, కృష్ణ ప్రోథము, కఠోర రోమము తిత్తిరి తుల్యము, విషమాంగము, శ్వేతపాదము, ధృవా వర్తములు లేనిది అశుభా వర్తములు కలది యగు అశ్వమును త్యజించవలెను. ముక్కు మీద, ముక్కు దగ్గిర రెండేసి సుడులు శిరో వక్ష స్థలము లందు రెండేసి, లలాట కంఠ దేశము నందు రెండేసి, ప్రాయణము నందున రెండు ఈ విధముగ పది సుడులు శుభకరములు. ఓష్ఠప్రాంతము నందును లలాటము నందును, కర్ణ మూలము నందున మెడ, ముందు కాళ్ళు కంఠము వీటి యందును సుడులు శ్రేష్ఠములు. ఇతర అంగములపై అశుభములు. చిలుక ఇంద్ర గోపము, చంద్రుడు వీటితో సమానమైన కాంతి కలవియు కాక వర్ణములును, సువర్ణవర్ణములును స్నిగ్ధములును యగు అశ్వములు సర్వదా ప్రశస్తములు పొడవైన కంఠము. లోపలికి జొచ్చుకొనిన నేత్రములు చిన్న చెవులు వుండి చూచూటకు అందముగా నున్న గుర్రముగా గల రాజు విజయాభిలాషను విడువవలెను. గుర్రములను గజములను పాలించుట శుభప్రదము కాని ఉచిత పాలనము చేయనిచో దుఃఖ ప్రదమగును. లక్ష్మీ పుత్రులైన గంధర్వాశ్వములు ఉత్తమ రత్నము. అశ్వము పవిత్రమగుటచే అశ్వమేధమున ఉపయోగపడుచున్నది.

అశ్వమేధేతు తురగః పవిత్రత్వాత్తు హూయతే |

వృషోనింబ బృహత్యౌ చ గుడూచీ చ సమాక్షికా. 11

సింహా గంధకరీ పిండీ స్వేదశ్చ శిరస్తథా | హింగు పుష్కర మూలం చ నాగరం సావ్లువేతసమ్‌. 12

పిప్పలీ సైంధవయుతం శూలఘ్నం చోష్ణవారిణా | నాగరాతి విషా ముస్తా సానన్తా బిల్వమాలికా. 13

క్వాథ మేషాం పిబేద్వాజీ సర్వాతీ సారనాశనమ్‌ | ప్రియంగు సారివాభ్యాం చ యుక్త మాజంశృతంపయః.

పర్యాప్తశర్కరం పీత్వా శ్రమాద్వాజీ విముచ్యతే | ద్రోణికాయాంతు దాతవ్యా తైలబస్తిస్తు రంగమే. 15

కోష్ఠజాచ శిరా వేద్యా తేనతస్య సుఖం భ##వేత్‌ | దాడిమంత్రిఫలావ్యోషం గుడంచ సమభావికమ్‌. 16

పిండమేతత్ర్పదాతవ్యమశ్వానాం కాసనాశనమ్‌ | ప్రియంగులోధ్రమధుభిః పిబేద్వృషరసంహయః. 17

క్షీరం వాపంచ కోలాద్యం కాసనాద్ది ప్రముచ్యతే | ప్రస్కంధేషు చ సర్వేషు శ్రేయ ఆదౌ విశోధనమ్‌. 18

అభ్యంగోద్వర్తనం స్నేహనస్య వర్తి క్రమః స్మృతః | జ్వరితానాం తురంగాణాం పయసైవ క్రియాక్రమః. 19

లోధ్రకరంజయోర్మూలం మాతులుంగాగ్ని నాగరాః | కుష్ఠహింగువ చారాస్నాలేపోయం శోథనాశనః. 20

మంజిష్ఠా మధుకం ద్రాక్షా బృహత్యౌ రక్తచందనమ్‌ | త్రపుషీ బీజమూలాని శృంగాటక కశేరుకమ్‌. 21

అజాపయః శృతమిదం సుశీతం శర్కరాన్వితమ్‌ | పీత్వా నిరశనో వాజీరక్తమోహాత్ర్ప ముచ్యతే. 22

మధువుతో, గుడూచి, నింబ బృహతులు వీటి ముద్ధ చేసి తినిపించినచో శిరఃస్వేదము, నాశికా మొలము తొలగించును. హింగు పుష్కరమూలము శుంఠి ఆవ్లు వేతసము, పిప్పలి, సైంధవ లవణము వీటిని ఉష్ణ జలముతో ఇచ్చినచో శూల రోగము నశించును. శుంఠి అతి విషముస్త అనంత, బిల్వ, ముల క్వాథమును త్రావించినచో అశ్వమును యొక్క వివిధ అతిసార దోషములు నశించును ప్రియంగు సారివలతో కాచిన మేక పాలు కలిపి తగినంత శర్కర వేసి త్రాగించినచో అలసట తీరును. అశ్వమునకు తొట్టి యందు తైల బస్తి ఇవ్వవలెను. లేదా కోష్టము నందు పుట్టిన శిరల వేధనము చేయవలయును. అట్లు చేసినచో దానికి సుఖము కలుగును. దాడిమ త్రిఫలా. వ్యోష గుడములను సమ భాగములుగ గ్రహించి చేసిన పిండమును అశ్వమునకు తినిపించిన కాస దోషము నశించును. ప్రియంగు లోధ్ర మదువులతో కలిపిన యూష రసములు కాని, క్షీరమును గాని, పంచ కోలాదికములు గాని యిచ్చినచో కాస రోగ విముక్తి యగును. అన్ని విధముల ప్రస్కందములకును మొదట శోధనము మంచిది. పిమ్మట అభ్యంగ ఉద్వర్తన స్నేహ, వశ్య, వర్తికల ప్రయోగము చేయవలయును. జ్వరము వచ్చిన గుర్రమునకు పాలతో చికిత్స చేయవలయును. లోధ్ర మూల కరంజ మూల, మాతులుంగ, అగ్ని, నాగర, కుష్ఠ హింగు, వచా, రాస్నలతో చేసిన లేపము శోధను తొలగించును. గుర్రమును నిరాహారముగ వుంచి మంజిష్ఠామదుక, ద్రాక్ష, బృహతీ. రక్తచందన త్రపుషీ బీజ మూల శృంగాటక కశేరుకములు కలిపిన కాచిన మేక పాలను చల్లార్చి శర్కర వేసి ఇచ్చినచో దానికి రక్త ప్రమేయము తొలగును.

మన్యాహనుని గాలస్థ శిరోశోథోగలగ్రహః | అభ్యంగః కటుతైలేన తత్ర తేష్వేవ శస్యతే. 23

గలగ్రహగదీ శోథః ప్రాయశో గలదే శ##కే | ప్రత్యక్ష్పుష్పీతథా వహ్నిః సైంధవం సౌరసోరసః. 24.

కృష్ణా హింగుయుతై రేభిః కృత్వా నన్యం నసీదతి | నిశే జ్యోతిష్మతీపాఠా కృష్ణా కుష్ఠం వచామధు. 25

జిహ్వాస్తం భేచ లేపోయం గుడమూత్రముతో హితః | తిలైర్యష్ట్యా రజన్యా చ నిమ్బ పత్రైశ్చయోజితా. 26

క్షౌద్రేణ శోధనీ పిండీ సర్పిషా వ్రణురోపణీ | అభిఘాతేన ఖంజన్తియేహ్యశ్వాస్తీవ్ర వేదనాః. 27

పరిషేక క్రియాతేషాం తైలేనాశు రుజాపహా | దోషకోపాభి ఘాతాభ్యాం పక్వభిన్నే వ్రణక్రమః. 28

శాంతిర్మస్త్యండి వృద్ధాభ్యాం పక్వభిన్న వ్రణక్రమః | అశ్వత్థోదుంబర ప్లక్ష మధూకవట కల్కనైః. 29

ప్రభూత సలిలః క్వాథః సుఖోష్ణో వ్రణశో నః | శతాహ్వా నాగరం రాస్నా మంజిష్ఠాకుష్ఠ సైంధవైః. 30

దేవదారు వచాయుగ్మ రజనీరక్త చందనైః | తైలం సిద్ధం కషాయేణ గుడూచ్యాః పయసాసహ. 31

మ్రక్షణ బస్తినశ్యేచ యోజ్యం సర్వత్ర లింగినే | రక్తశ్రావో జలైకాభిర్నేత్రాంతే నేత్రరో గిణః. 32

మన్యాః హను గ్రీవల యందున్న నాడులు వాచినను గల గ్రహ రోగము వచ్చినను ఆయా స్థానము లందు కలుతైలాభ్యంగము ప్రశస్తము. సాధారణముగ గల గ్రహ శోధ రోగములు గల దేశము నందే వచ్చును. పతక్పుష్పీ చిత్రక సైంధవ సౌరసరస పిప్పల హింగువులతో వశ్యము ఇచ్చినచో అశ్వమునకు ఎన్నడును విషాదము కలుగదు. హరిద్రా జ్యోతిష్మతీ, పాఠా, కృష్ణా, కుష్ఠ, వచా, మధువులను గుడ గోమూత్రములతో కలపి జిహ్వపై వ్రాసినచో జిహ్వాస్తంభము తొలగును. తిల, యష్ఠి, హరిద్రా నింబ పత్రములతో చేసిన ముద్దను తేనెతో ఉపయోగించిన వ్రణము శోధితమగును. ఘ్పతముతో ఉపయోగించినచో వ్రణము మారును. దెబ్బ తగిలి తీవ్ర వేదనతో కుంటు గుర్రములకు తైముతో పరిషేక క్రియ చేసినచో ఆ బాధ తొలగును. వాత పిత్థ కఫ దోషములచే కాని, కోపముచే గాని దెబ్బ తగిలి గాయపడినచో అది మానుటకు ఈ క్రింది చికిత్స చేయవలయును. అశ్వత్థ ఉదుంబర, ప్లక్ష, మధూక, వటములను అధిక జలముతో కలిపి చేసిన క్వాథము కొంచము ఉష్ణముగ వున్నచో వ్రణ శోధనము చేయుము. శతాహ్వ, నాగర, రాస్నా, మంజిష్టా, కుష్ఠ, సైంధవ, దేవదారు వచా, ద్వివిధ హరద్ర, రక్త చందనముల స్నేహమును క్వాథముగ చేసి గుడూచి జలముతో గాని పాలతోగాని ఉద్వర్తనము బస్తి లేదా నశ్యము ఇచ్చినచో అన్ని లింగిత దోషములను పోవును నేత్ర రోగము గల అశ్వము యొక్క నేత్రాంతమున జలగను పట్టించి అభిస్రావణము చేయవలయును. ఖదిర ఉదుంబర, అశ్వత్థ కషాయటొలతో నేత్ర శోధము చేయవలయును.

ఖదిరో తుంబరాశ్వత్థకషాయేణ చ సాధనమ్‌ |

ధాత్రీ దురాల భాతిక్తా ప్రియంగు కుంకుమైః సమైః. 33

గుడూచ్యా చకృతః కల్కోహితో యుక్తావలంబినే | ఉత్పాతే చ శిలే శ్రావ్యే శుష్క శోఫేత థైవచ. 34

క్షిప్రకారిణి దోషేచ సద్యో విదల మిష్యతే | గోశకృన్మంజికాకుష్ఠ రజనీతల సర్షపైః. 35

గవాం మూత్రేణ పిష్టైశ్చ మర్దనం కండునాశనమ్‌ | శోతోమధుయుతః క్వాథో నాసికాయాం సశర్కరః. 36

రక్తపిత్తహరః పానాదశ్వ కర్ణే తథైవచ | సప్తమే సప్తమే దేయమశ్వానాం లవణం దినే. 37

తథా భుక్తవతాం దేయా ప్రతిపానే తువారుణీ | జీవనీయైః సమధురై ర్మృద్వీకా శర్కరాయుతైః. 38

సప్పలీకైః శరది ప్రతిపానం సపద్మకైః | విడంగ పిప్పలీధాన్య శతాహ్వా లోధ్ర సైంధవైః. 39

సచిత్ర కైస్తురంగాణాం ప్రతిపానం హిమాగమే | లోధ్రం ప్రియంగుకా ముస్తా పిప్పలీ విశ్వభేషజైః. 40

సక్షౌద్రైః ప్రతిపానం స్యాద్వ సన్తే కఫనాశనమ్‌ | ప్రియంగు పిప్పలీ లోధ్రయష్ట్యాహ్వైః సమహౌషధైః 41

నిదాఘే సగుడా దేయా మదిరాం ప్రతిపానకే | లోధ్రకాష్ఠంస లవణం పిప్పల్యో విశ్వభేషజమ్‌. 42

భ##వైత్తైల యుతైరేభిః ప్రతిపానం ఘనాగమే | నిదాఘెద్ధృత పిత్తా యేశరత్సు పుష్టశోణితాః. 43

ప్రావృడ్భిన్న పురీషాశ్చ పిబేయుర్వాజినో ఘృతమ్‌ | పిబేయుర్వాజినసై#్తలం కఫవాయ్వధికాస్తుయే. 44

స్నేహవ్యా పద్భవో యేషాం కార్యం తేషాం విరూక్షణమ్‌ |

త్ర్యహం యవాగురూక్షా స్యాద్భోజనం తక్రసంయుతమ్‌. 45

శరన్ని దాఘయోః సర్పిసై#్తలం శీతవసన్తయోః | వర్షాసు శిశిరే చైవ బస్తౌ యమక మిష్యతే.

46

గుర్వభిష్యన్ది భక్తాని వ్యాయామః స్నానమాతపమ్‌ | వాయువర్జంచ వాహన్య స్నేహపీతస్య వర్జితమ్‌. 47

స్నానం పానం సకృత్కుర్యా దశ్వానాం సలిలాగమే | అత్యర్థం దుర్దినే కాలే పానమేకం ప్రశస్యతే. 48

యుక్తశీతాతపేకాలే ద్విపానం స్నపనం సకృత్‌ | గ్రీష్మేత్రిః స్నానపానం స్యాచ్బిరం తస్యావగాహనమ్‌.

నిస్తుషాణాం ప్రదాతవ్యా యవానాంచతురాఢకీ | చణక వ్రీహిమౌద్గాని కలాయం వాపిదాపయేత్‌. 50

అహోరాత్రేణ చార్ధస్య యవసస్య తులాదశ | అష్టౌ శుష్కస్య దాతవ్యాశ్చతస్రోథ బుసస్యవా. 51

దూర్వాపిత్తం యవః కాసం బుసశ్చశ్లేష్మ సంచయమ్‌ | నాశయత్యర్జునః శ్వాసం తథావాలో బలక్షయమ్‌.

వాతికాః పైత్తికాశ్చైవ శ్లేష్మజాః సాన్నిపాతకాః | నరోగాః పీడయిష్యంతి దూర్వాహారం తురంగమమ్‌. 53

ద్వౌరజ్జు బంధౌ దుష్టానాం పక్షయోరుభయోరపి | పశ్చాద్ధనుశ్చ కర్తవ్యో దూరకీల వ్యపాశ్రయః. 54

వాసే యుస్త్వా స్తృతే స్థానే కృతధూపన భూమయం |

యత్రోపన్యస్త యవసాః సప్రదీపాః సురక్షితాః | కృకవాక్వజకపయో ధార్యాశ్చాశ్వ గృహె మృగాః. 55

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయోశ్వ లక్షణ చికిత్సనం నామైకోననవత్యధిక ద్విశతతమోధ్యాయః.

యుక్తావలంబియగు అశ్వమునకు ధాత్రీ దురాలభా, తిక్తపియంగు, కుంకుమ, గుడూచులను సమ భాగముగ గ్రహించి, చేసిన కల్కము హితకరము ఉపద్రవమునందు కర్ణ దోషమునందును శిలయందును శుష్క శోఫము నందును, శీఘ్ర హానికరమగు దోషమునందును వెంటనే వేధనము చేయవలయును. గోమయ మంజికా కుష్ఠ రజనీ తిల సర్షపములను, గోమూత్రము నందు నూరి మర్దనము చేసినచో దురద తగ్గును. శాల క్వాథము చల్లబడిన పిమ్మట మధుశర్కరలు కలిపి ముక్కులో వేసి త్రాగించినచో రక్తపిత్తము నశించును. ప్రతి ఏడవ రోజునను అశ్వమునకు లవణము తినిపించవలెను. ఎక్కువ ఆహారము తిన్న అశ్వమునకు, శరదృతువునందు జీవనీయ గణమునకు చెందిన ద్రవ్యములను మధు మృద్వీకా శర్కర, పిప్పలీ, పద్మకములు కలిపి ప్రతిపానము చేయించవలెను. హేమంత ఋతువునందు వాయువిడంగ పిప్పలీధాన్య, శతాహ్వ, లోధ్ర, సైంధవ, చిత్రకముల ప్రతిపానము చేయించవలెను. వసంత ఋతువునందు లోధ్ర ప్రియంగు ముస్తా పిప్పలీ శుంఠీ మధువులతోకూడిన ప్రతిపానము కఫనాశనము. గ్రీష్మఋతువునందు ప్రియంగు పిప్పలీ లోధ్ర యష్టి శుంఠీ గుడములతోకూడ మద్యము ప్రతిపానముగ ఇవ్వవలెను. వర్షఋతువునందు లోధ్ర కాష్ఠలవణ పిప్పలీ హింగుతైలములు ప్రతిపానముగ ఇవ్వవలెను. గ్రీష్మమునందు కలిగిన పిత్తప్రకోపముచే పీడింపబడిన అశ్వమునకును శరత్కాలమున రక్త ఘనత్వముతో బాధపడుచున్న ఆశ్వమునకును వర్షకాలమున, భిన్న పురీషములుగల అశ్వమునకును ఘృతము త్రాగించవలెను. కఫ వాతములు అధికమైనపుడు తైలము త్రాగించవలెను. స్నేహతత్వము అధికమగుటచే శరీరమునకు బాధఏర్పడిన అశ్వములకు విరూక్షణము చేయించవలెను. మజ్జిగతో భోజనము మూడుదినములు గంజి ఇచ్చినచో రూక్షణము అగును. శరద్గ్రీష్మ ఋతువులందు ఘృతము, హేమంత వసంతములందు తైలము, వర్షాశిశిర ఋతువులందు ఘృతతైలములు రెండును ఇవ్వవలెను. స్నేహపానము చేయించిన గుర్రములకు గురువయినదియు, అభిష్యందియు అగు భోజనము వ్యాయామము స్నానము ధూపము వాయురహిత స్థానములు వర్జితము. వర్షఋతువునందు గుర్రమునకు ఒక పర్యాయము స్నానము పానము చేయించవలెను. దుర్దినసమయమున కేవలపానము ప్రశస్తము. సమశీతోష్ణ ఋతువునందు రెండు పర్యాయములు పానము, ఒక పర్యాయము స్నానము మంచివి. గ్రీష్మఋతునందు మూడు పర్యాయములు స్నానము ప్రతిపానము చేయించవలయును. పూర్ణజలమునందు చాలసేపు నిలిపి స్నానము చేయించవలయును. గుర్రములకు ప్రతిదినములు పొట్టులేని యవలు నాల్గు ఆఢకములు తినిపించవలెను. శనగలు, ధాన్యము, పెసలు, బటానీలు కూడ తినిపించవలెను. రాత్రింబవళ్ళు ఐదుశేర్లుపాలు త్రాగించవలయును. ఎండిపోయినచో ఎనిమిదిశేర్లు పొట్టువున్నచో నాలుగుశేర్లు ఇవ్వవలెను. దూర్వ పిత్తమును, యవలు కాసమును, పొట్టుకఫాధిక్యమును, అర్జునము శ్వాసను మానకందము బలక్షయమును తొలగించును దూర్వలు తిను గుర్రమునకు వాతపిత్తకఫజములగు రోగములు, సన్నిహిత రోగములు కలుగవు. దుష్టమైన అశ్వములను వెనుకకు ముందును రెండు త్రాళ్ళతో కట్టవలెను. మెడకు కూడకట్టవలెను. ఆస్తరణమువున్న ధూపధూపితమగు స్థానమున దానిని కట్టవలెను. అచట ఉపాయపూర్వకముగ గడ్డివుంచవలెను. అచట దీపము వుంచి స్థానమును సురక్షితము చేయవలయును. అశ్వశాలయందు మయూరములు మేకలు వానరములు, మొదలగు మృగములను ఉంచవలెను.

అగ్నిమహాపురాణమున అశ్వచికిత్సా కథనమను రెండువందలయెనుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page