Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ద్వినవత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ గవాయుర్వేదః
ధన్వన్తరి రువాచ :
గోవిప్ర పాలనం కార్యం రాజ్ఞా గోశాంతి మావదే | గావం పవిత్రా మాంగళ్యా గోషు లోకాః ప్రతిష్ఠితాః.
శకృన్మూత్రం పరం తాసామలక్ష్మీ నాశనం పరమ్ |
గవాం కండూయనం వారి దానం శృంగస్య మర్దనమ్. 2
గోమూత్రం గోమయం క్షీరం దధిసర్పిశ్చరోచనా | షడంగం పరమం పానే దుఃస్వప్నాద్య నివారణమ్. 3
రోచనా విషరక్షోఘ్నీగ్రా సదః స్వర్గగోగవామ్ | యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకం నరః. 4
పరగోగ్రాసదః స్వర్గీ గోహితో బ్రహ్మలోకభాక్ | గోదానాత్కీర్తనా ద్రక్షాం కృత్వాచోద్దరతేకులమ్. 5
గవాం శ్వాసా త్పవిత్రా భూః స్పర్శనాత్కిల్బి షక్షయః |
గోమూత్రం గోమయం క్షీరం దధిసర్పిః కుశోదకమ్. 6
ఏక రాత్రోపవాసశ్చ శ్వపాక మపిశోధ యేత్ | సర్వాశుభ వినాశాయ పురాచరితమీశ్వరైః. 7
ప్రత్యేకంచ త్ర్యహాభ్యస్తం మహాసాన్తపనం స్మృతమ్ | సర్వకామప్రదం చైతత్సర్వాశుభ విమర్దనమ్. 8
కృచ్ఛ్రాతి కృచ్ఛం పయసా దివసానేక వింశతిమ్ | నిర్మలాః సర్వకామాప్త్యా స్వర్గగాః స్యుర్నరోత్తమాః.
త్ర్యహముష్ణం పిబేన్మూత్రం త్ర్యహముష్ణం ఘృతం పిబేత్|
త్ర్యహముష్ణం పయఃపీత్వా వాయభక్షః పరంత్ర్యహమ్. 10
తప్తకృచ్ర్ఛవ్రతం సర్వపాపఘ్నం బ్రహ్మలోకదమ్ |
శీతైస్తు శీతకృచ్ఛ్రం స్యాద్బహ్మోక్తం బ్రహ్మలోకదమ్. 11
ధన్వంతరి చెప్పెను. రాజు గోవులను బ్రాహ్మణులను పాలించ వలెను. ఇపుడు గోశాంతిని చెప్పెదను. గోవులు పవిత్రమైనవి మంగళ ప్రదమైనవి. లోకము లన్నియు గోవులలో ప్రతిష్ఠితములై యున్నవి. గోమయము గోమూత్రము, అలక్ష్మీ నాశకములు, వాటి శరీరమును గోకుట, కొమ్ముల మర్దించు, నీళ్ళు త్రాగించుట ఇవి కూడ అలక్ష్మీ నివారకములు, గోమూత్రము గోమయము, క్షీరము, దధి, ఘృతము, గోరోచన, ఇవి ఆరును సేవించుటకు ఉత్తమమైనవి దుస్స్యప్నాదులను తొలగించును. గోరోచన విషమును రాక్షసులను నశింప చేయును. గోవునకు గ్రాసమిచ్చు వాడు స్వర్గమును పొందును. ఎవని యింటిలో గోవులు దుఃఖించు చుండునో, అతడు నరకమునకు పోవును. ఇతరుల గోవుకు గ్రాసము నిచ్చు వాడు స్వర్గమును పొందును. గోహితము కోరువాడు, బ్రహ్మ లోకమును పొందును. గోదానము, గోమాహాత్మ్య కీర్తనము, గోరక్షణము చేసిన వాడు తన కులమును ఉద్ధరించును. గోవుల శ్వాస తగిలి భూమి పవిత్ర మగును. వాటి స్పర్శచే పాపములు నశించును. ఒక దినమున గోమూత్ర గోమయ, క్షీర, దధి, ఘృత, కుశోదకములను, ఉపవాసము చేసినచో చండాలుడు కూడ పరిశుద్ధుడగును. పూర్వము దేవతలు కూడ అశుభము లన్నింటిని తొలగించు కొనుటకు ఈ విధముగ చేసిరి. పైన వస్తువులను వేరువేరుగా మూడేసి రోజులు భక్షించినచో దానికి ''మహాసాంతపన'' వ్రతము యని పేరు. ఇది సర్వ కామములను సిద్ధింప చేసి పాపములను తొలగించును. పాలు మాత్రము త్రాగి ఇరువది యొక్క దినములున్నచో అది కృచ్ఛ్రవ్రతము. దీనినాచరించిన నరోత్తములు పాపరహితులై సర్వ కామములను పొంది స్వర్గమునకు పోవుదురు. మూడు దినములు ఉష్ణ గోమూత్రమును, మూడు దినములు ఉష్ణఘృతమును, మూడు దినములు ఉష్ణ క్షీరమును, పిదప మూడు దినములు వాయువును మాత్రము భక్షించుటకు తప్త కృచ్ఛ్ర వ్రతమని పేరు. ఇది సమస్త పాపములను తొలగించి బ్రహ్మ లోకమును ఇచ్చును. ఈ వస్తువులను చల్లగా చేసి, భుజించినచో దానికి శీతకృచ్ఛ్ర మని పేరు. బ్రహ్మ చెప్పిన ఈ వ్రతము బ్రహ్మ లోక ప్రదము.
గోమూత్రేణా చరేత్స్నానం వృత్తిం కుర్యాచ్చగోరసైః | గోభిర్ర్వజేచ్చ భుక్తాసు భుంజీతాథచ గోవ్రతీ. 12
మాసేనైకేన నిష్పాపో గోలోకీ స్వర్గగో భ##వేత్ | విద్యాంచ గోమతీం జప్త్వా గోలోకం పరమం వ్రజేత్. 13
గీతైర్నృత్యై రప్సరోభిర్విమానే తత్రమోదతే | గవాః సురభయో నిత్యంగావో గుగ్గులగంధికాః. 14
గావః ప్రతిష్ఠాభూతానాం గావఃస్వస్త్యయనం పరమ్ | అన్నమేవ పరంగావో దేవానాం హవిరుత్తమమ్. 15
పావనం సర్వభూతానాం క్షరంతి చవహన్తి చ | హవిషా మంత్రపూతేన తర్పయన్త్యమరాన్దివి. 16
ఋషీణామగ్ని హోత్రేషు గావోహోమేఘ యోజితాః | సర్వేషామేవ భూతానాం గావః శరణముత్తమమ్. 17
గావః పవిత్రం పరమంగావో మాంగల్యముత్తమమ్| గావః స్వర్గస్వ సోపానం గావోధన్యాః సనాతనాః. 18
నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్యఏవచ | నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యోనమో నమః. 19
బ్రాహ్మణాశ్చైవ గావశ్చకులమేకం ద్విధాకృతమ్ | ఏకత్ర మంత్రాస్తిష్ఠన్తి హవిరేకత్ర తిష్ఠతి.
20
దేవబ్రాహ్మణగోసాధు సాధ్వీభిః సకలం జగత్ | ధార్యతేవైసదా తస్మాత్సర్వే పూజ్వతమామతాః. 21
పిబన్తియత్ర తత్తీర్థం గంగాద్యాగావ ఏవహి | గవాం మాహాత్మ్యంముక్తంహి చికిత్సాంచ తథాశృణు. 22
ఒక మాసము గోమూత్రముతో స్నానము చేయుచు గోరసముపై జీవించుచు, గోవులను అనుసరించుచు, అవి భుజించిన పిమ్మట భుజించవలయును. ఇట్లు గోవ్రతముచేసిన వాడు పాపరహితుడైగో లోకమును చేరును గోమతీవిద్యా జపముచేత కూడ గోలోకము లభించును. ఆ లోకము నందు మానవుడు విమానమున అప్సరసలతో కలసి నృత్య గీతములతో సేవింపబడుచు ఆనందించును. గోవులు సురభి స్వరూపములు గుగ్గులు గంధము కలవి అవి సమస్త ప్రాణులకు ఆధార భూతములు. పరమ మంగళ మయములు. గోవులే శ్రేష్ఠమైన యన్నముగను ఉత్తము హవిస్సు గను దేవతలకు ఉపకరించును. అవి సకల ప్రాణులను పవిత్రింప చేయు మూత్ర క్షీరాదికమును గ్రహించి వాటిని స్రవించు చుండును. మంత్ర పూత మగు హవిస్సుతో స్వర్గము నందున్న దేవతలను తృప్తి పరచును. ఋషులు తమ అగ్ని హోత్రము లందు గోవులను హోమము నందు ఉపయోగింతురు. సమస్త భూతములకును గోవులు ఉత్తమ శరణము. గోవులు చాల పవిత్రమైనవి, మంగళకరమైనవి. స్వర్గ సోపానములు, ధన్యములు, సనాతనములు సురభి కుమార్తెలకు లక్ష్మీ ప్రదములైన గోవులకు నమస్కారము, బ్రహ్మసుతులకు, నమస్కారము. ఒకే కులము బ్రాహ్మణులు, గోవులు యని రెండు విధములుగా చేయబడినది. ఒక దాని యందు మంత్రములు, మరియొక దాని యందు హవిస్సు ఆధారపడి యున్నవి. ఈ జగత్తంతయు దేవ, బ్రాహ్మణ, గోసాధు, పతివ్రతలపై నిలిచి యున్నది. అందుచే వారందరును పూజ్యతములు. గోవులు నీరు త్రాగు స్థానము తీర్థము. గంగా దినదులు గోస్వరూపములు. గోమాహాత్మ్యమును చెప్పితిని. ఇపుడు వాటి చికిత్సను వినుము.
శృంగామయేషు దేనూనాంతైలం దద్యాత్ససైంధవమ్ | శృంగవేరబలామాంసకల్కసిద్ధం సమాక్షికమ్. 23
కర్ణశూలైషు సర్వేషు మంజిష్ఠా హింగుసైంధవైః | సిద్ధంతైలం ప్రదాతవ్యం రసోనేనాథ వాపునః. 24
బిలమూలమఫామార్గం ధాతకీ చ సపాటలా | కుటజం దంతమూలేషు లేపాత్తచ్ఛూల నాశనమ్. 25
దంతశూల హరైర్ద్రవ్యైర్ఘృతం రామవిపాచితమ్ | ముఖరోగహరం జ్ఞేయం జిహ్వారోగేషు సైంధవమ్. 26
శృంగవేరం హరిద్రేద్వే త్రిఫలాచ గలగ్రహే | హృచ్ఛూలే బస్తిశూలేచ వాతరోగే క్షయేతథా.
27
త్రిఫలా ఘృతమిశ్రాచ గవాం పానే ప్రశస్యతే | అతీసారే హరిద్రేద్వే పాఠాంచైవ ప్రదాపయేత్. 28
సర్వేషు కోష్ఠరోగేషు తథాశాఖాగదేషుచ | శృంగవేరం చ భార్గీంచ కాసేశ్వాసే ప్రదాపయేత్. 29
దాతవ్యా భగ్నసంధానే ప్రియంగుర్లవణాన్వితా | తైలం వాతహరం పిత్తేమధుయష్టీ విపాచితమ్. 30
కఫేవ్యోషంచ సమధు సుపష్టకరజో೭స్రజే | తైలాజ్యం హరితాలంచ భగ్నక్షతే శృతందదేత్. 31
మసాస్తిలాః సగోధూమాః పశుక్షీరం ఘృతం తథా | ఏషాంపిండీ సలవణా వత్సానాం పుష్టిదాత్వియమ్.
బలప్రదా విషాణాం స్యాద్గ్రవానాశాయ ధూపకః | దేవచారువచామాంసీ గుగ్గులుర్హింగుసర్షపాః. 33
గ్రహాది గదనాశాయ ఏషధూపోగవాం హితః ఘంటా చైవ గవాంకార్యా ధూపేనానేన ధూపితాః. 34
అశ్వగంధాతిలైః శుక్లంతేనగౌః క్షీరణీ భ##వేత్ | రసాయనంచ పిణ్యాకం మత్తోయో ధార్యతేగృహే. 35
కొమ్ములకు రోగము వచ్చునపుడు శృంగవేరబలా మాంసి, కల్కముతో సిద్ధము చేయబడిన సైంధవము చేర్చిన తైలమును తేనె కలిపి ఉపయోగించవలయును. కర్ణరోగమునందు మంజిష్ఠాహింగు, సైంధవములతో సిద్ధమగు తైలమును ఉపయోగించవలయును లేదా వెల్లుల్లి వేసి కాచిన తైలము ఉపయోగించవలయును. దంత శూలమునందు బిల్వమూల అపామార్గధాతకీ, పాటల, కుటజముల లేపము చేయవలయును. ఇవి దంతశూలమును పోగొట్టును. దంతశూలమును హరించు ద్రవ్యములను ఘృతమునందు ఉడికించి ఇచ్చనచో ముఖరోగమును తొలగించును. జిహ్వారోగములందు సైంధవము ప్రశస్తము. గల గ్రహరోగమున శుంఠి ద్వివిధ హరిద్ర, త్రిఫం, మంచిది. హృద్రోగ పస్తిరోగ, పాతరోగ, క్షయరోగములందు, గోవులకు ఘృతమిశ్ర త్రిఫలాను పానము ప్రశస్తము. అతిసారమున ద్వివిధ హరిద్ర పాఠ ఇవ్వవలెను. అన్ని విధముల కోష్టరోగములందును. ఇతరావయవ రోగములందును కాసశ్వాసాది సాధారణరోగము లందును. శుంఠి బారంగీలను ఇవ్వవలెను. విరిగిన ఎముక అతుకులకు లవణ యుక్తమగు ప్రియంగువును. పూయ వలయును. తైలము వాతరోగముహరించు పిత్తరోగమున తైలపక్వమగు మధు యష్టిని, కఫరోగమున మధు సహిత యోషమును, రక్తవికారమున దృఢమైన నఖమూల భస్మము హితకరములు. భగ్న క్షతమునందు తైల ఘృతములందు వేయించి హరితాళము ఇవ్వవలెను. మాషములు తిలలు, గోధుమలు. పాలు, ఘృతము, వీటిని లవణము కలిపి పిండముగా చేసి, లేగదూడలకు ఇచ్చినచో, పుష్టికలుగును. విషాణి బలప్రదము, గ్రహ భాధనివృత్తికి ధూపమును ప్రయోగించవలయును. గ్రహజనిత రోగ నివృత్తికి, దేవదారు వచా మాంసీ, గగ్గులు, హింగు, సర్షపముల ధూపము హితకరము ఈ ధూపమువేసిన ఘంట గోవుల కంఠమునందు కట్టవలయును అశ్వగంధ తిలలతో నవనీత భక్షణము చేయించుటచే ఆవుపాల నిచ్చును. ఇంటిలోమదమత్తమగు వృషభమునకు తెలక పిండి ఉత్తమమైన రసాయనము.
గవాంపురీపే పంచమ్యాం నిత్యం శాంత్యైశ్రియం యజేత్ | వాసుదేవంచ గంధాద్యైరపరా శాంతిరుచ్యతే.
ఆశ్వయుక్ఛుక్లపక్షస్య పంచదశ్యాం యజేద్ధరిమ్ |
హరింరుద్ర మజం సూర్యం శ్రియమగ్నిం ఘృతేనచ. 37
దధిసంప్రాశ్యగాః పూజ్యకార్యం వహ్నిప్రదక్షిణమ్ | వృషాణాం యోజయేద్యుద్ధం గీతవాద్యరవైర్బహిః. 38
గవాంతులవణం దేయం బ్రాహ్మణానాంచ దక్షిణాః | నైమిత్తికే మాకరాదౌ యజేద్విష్ణుం సహశ్రియా. 39
స్థండిలే೭బ్జే మధ్యగతే దిక్షుకేసర గాన్సురాన్ | సుభద్రాజో రవిః పూజ్యోబహురూపో బలిర్బహిః. 40
ఖం విశ్వరూపా సిద్దశ్చబుద్ధిః శాంతిశ్చ రోహిణీ | దిగ్దేనవో హిపూర్వాద్యాః కేసరైశ్చంద్ర ఈశ్వరః. 41
ది క్పాలాః పద్మ పత్రేషు కుంభేష్వగ్నౌ చ హోమయేత్ | క్షీర వృక్షస్య సమిధః సర్షపాక్షత తండులాన్.
శతం శతం సువర్ణం చ కాంస్యాదికం ద్విజేదదేత్ |
గావః పూజ్యా విమోక్తవ్యాః శాంత్యై క్షీరాది సంయుతాః. 43
అగ్ని రువాచ :
శాలిహోత్రః సుశ్రుతాయ హయాయుర్వేద ముక్తవాన్ | పాలకాప్యో೭ంగ రాజాయ గజాయుర్వేదమ బ్రవీత్.
ఇత్యాది మహా పురాణ ఆగ్నేయే గవాయుర్వేద కథనం నామ ద్వినవత్యధిక శతతమో೭ధ్యాయః.
శాంతికొదకై పంచమినాడు గోపురీషముపై లక్ష్మిని వాసుదేవుని, గంధాదులతో పూజించవలయును. దీనికి అపరాశాంతియని పేరు. ఆశ్వీయుజ, శుక్ల పూర్ణిమనాడు, శ్రీహరిని పూజించవలయును. హరిరుద్ర బ్రహ్మసూర్య అగ్ని లక్ష్ములను ఘృతముతో పూజించవలయును. దధితిని గోవులను పూజించి అగ్ని ప్రదక్షిణము చేయవలయును. గృహ బహిర్భాగమున గీతవాద్య ధ్వనులతో వృషభయుద్ధమును ఏర్పరచవలయును. గోవులకు లవణమును బ్రాహ్మణులకు దక్షిణలను ఇవ్వవలెను. మకరసంక్రాంత్యాది పర్వములందు లక్ష్మి సహితుడగు శ్రీ మహా విష్ణువును స్థండిలముపై నిర్మించిన పద్మ మధ్యమున పూజించవలయును. దిక్కులందు కమల కేసరములపై దేవతలను పూజించవలయును. కమల బహిర్భాగమున మంగలమయులగు బ్రహ్మసూర్య, బహురూప, బలిఆకాశ, విశ్వరూపులను రుద్ధిసిద్ధిశాంతి, రోహిణ్యాది దిగ్ధేనువులను చంద్రశివులను, పులగముతో పూజించవలయును. కలశస్థపద్మపత్రములపై దిక్పాలురను పూజించవలయును. అగ్నియందు సర్షవ, అక్షత, తండుల, క్షీరవృక్ష సమిధలను హోమముచేసి బ్రాహ్మణులకు సూరేసిసువర్ణములను కంచు మొదలగు దానిని దానము చేయవలయును. పిదప క్షీరాదులతో గూడిన గోవులను పూజించి శాంతి నిమిత్తమై వాటిని విడువలయును. అగ్నిదేవుడు పలికెను. శాలిహోత్రుడు సుశ్రుతునకు అశ్వ ఆయుర్వేదమును పాలకాప్యుడు అంగరాజునకు గజాయ్వరేదమును ఉపదేశించెను.
అగ్నిమహాపురాణమున గవాయుర్వేద కథనమను రెండవందల తొంబదిరెండవ అధ్యాయము సమాప్తము.