Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుర్నవత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ సర్పలక్షణాని

అగ్నిరువాచ :

నాగాదయోథ భావాది దశస్థానానికర్మచ | సూతకం దష్ట చేష్టేతి సప్తలక్షణ ముచ్యతే. 1

శేషవాసుకి తక్షాఖ్యాః కర్కటోబ్జో మహామ్బుజః | శంఖ పాలశ్చ కులిక ఇత్యష్టౌ నాగవర్యకాః. 2

దశాష్ట పంచ త్రిగుణ శతమూర్ధాన్వితౌ క్రమాత్‌ | విప్రౌనృపౌ విశౌ శూద్రౌ ద్వౌద్వౌ నాగేషుకీర్తితాః. 3

తదన్వయాః పంచశతం తేఖ్యోజాతా అసంఖ్యకాః | ఫణిమండలి రాజీల వాతపిత్త కఫాత్మకాః. 4

వ్యన్తరా దోషమిశ్రాస్తే సర్పాదర్వీకరాః స్మృతాః | రథాంగ లాంగలచ్ఛత్ర స్వస్తి కాంకుశ ధారిణః. 5

గోనసామందగా దీర్ఘా మండలైర్వి విధైశ్చితాః | రాజిలాశ్చి త్రితాః స్నిగ్ధాస్తిర్య గూర్ధ్వంచవాజిభిః. 6

వ్యన్తరామిశ్ర చిహ్నాశ్చ భూవర్షాగ్నేయ వాయవః చతుర్విధాస్తే షడ్వింశ##భేదాః షోడశగోనసాః. 7

త్రయోదశచ రాజీలా వ్యన్తరా ఏకవింశతిః | యోనుక్తకాలే జాయన్తేసర్పాస్తే వ్యన్తరాఃస్మృతాః. 8

ఆషాఢాదిత్రిమాసైః స్యాద్గర్భో మాసచతుష్టయే| అండకానాంశ##తేద్వేచ చత్వారిం శత్ర్పసూయతే. 9

సర్పాగ్రసన్తిసూతౌ ఘాన్వితాస్త్రీ పున్నపుంసకాన్‌ | ఉన్మీలతేక్షి సప్తాహాత్కృష్ణో మాసాద్భవేద్బహిః. 10

ద్వాదశాహాత్సుబోధః | స్యాద్దన్తాఃస్యుః సూర్యదర్శనాత్‌ |

ద్వాత్రింశద్దిన వింశత్యా చ తస్రస్తేఘ దంష్ట్రికాః 11

కరాలీ మకరీ కాలరాత్రీచ యమదూతికా | ఏతాస్తాః సవిషాదంష్ట్రా వామదక్షిణ పార్శ్వగాః.

12

షణ్మాసాన్‌ముచ్యతే కృత్తిం జీవేత్షష్టి సమాద్వయమ్‌ | నాగాః సూర్యాదివారేశాః సప్త ఉక్తాదివానిశి. 13

స్వేషాంషట్‌ ప్రతివారేషు కులికః సర్వసంధిషు | శంఖేన వామహాబ్జేన సహతస్యోదయోథవా. 14

ద్వయోర్వానాడి కామాత్రమన్తరం కులికోదయః | దుష్టః సకాలః సర్వత్ర సర్పదంశే విశేషతః. 15

కృత్తికా భరణీ స్వాతీ మూలంపూర్వత్రయాశ్వినీ | విశాఖార్ద్రా మఘాశ్లేషా చిత్రాశ్రవణ రోహిణీ. 16

హస్తోమందకుజౌవారౌ పంచమీచాష్టమీ తిథిః | షష్ఠిరిక్తా శివానింద్యా పంచమీచ చతుర్దశీ.

17

సంధ్యా చతుష్టయం దుష్టం దగ్ధయోగాశ్చరాశయః | ఏకద్విబహవోదంశా దష్టం విద్దంచ ఖండితమ్‌. 18

అదంశమవగుప్తంస్యాద్దంశ##మేవం చతుర్విధమ్‌ | త్రయోద్వ్యేకక్షతా దంశావేదనా రుధిరోల్బణా. 19

నక్తన్త్వేకాంఘ్రి కూర్మాభా దంశాశ్చ యమచోదితాః | దాహీ పిపీలికాస్పర్శీ కంఠశోధ రుజాన్వితః. 20

సతోదో గ్రంథితో దంశః నవిషోన్యస్త నిర్విషః | దేవాలయే శూన్యగృహే వర్మీకో ద్యాన కోటరే. 21

రథ్యాసంధౌ శ్మశానే చనద్యాంచ సింధుసంగమే | ద్వీపే చతుష్పథే సౌధే గృహేబ్జే పర్వతాగ్రతః. 22

బిలద్వారే జీర్ణకూపే జీర్ణవేశ్మని కుడ్యకే | శిగ్రుశ్లేష్మాతకాక్షేషు జంబూదుంబర వేణుషు. 23

వటేచ జీర్ణ ప్రాకారే ఖాస్యహృత్కక్ష జత్రుణి | తాలౌశంఖే గలేమూర్ద్ని చిబుకే నాభిపాదయోః. 24

దంశోశుభః శుభోదూతః పుష్పహస్తః సువాక్సుధీః | లింగవర్ణ సమానశ్చ శుక్ల వస్త్రోమలః శుచిః. 25

అపద్వారగతః శస్త్రీ ప్రమాదీ భూగతేక్షణః | వివర్ణవాసాః పాశాది హస్తో గద్గద వర్ణభాక్‌. 26

శుష్కకాష్ఠాశ్రితః భిన్నస్తిలాక్తక కరాంశుకః | ఆర్ద్రవాసాః కృష్ణరక్త పుష్పయుక్త శిరోరుహః.

27

కుచమర్ధీ నఖఛ్ఛేదీ గుదస్పృక్పాద లేఖక | కేశలుంచీ తృణచ్ఛేదీ దుష్టాదూతా స్తథైకశః.

28

అగ్ని దేవుడు చెప్పుచున్నాడు. ఇపుడు నాగ ఉత్పత్తి. సర్పదంశన సమయము నందలి అశుభ నక్షత్రాదులు, సర్పదంశములో వివిధ భేదములు దంశ స్థానములు, మర్మస్థలము, సూతకము, సర్పదష్టుని చేష్ట ఈ ఏడు లక్షణములను చెప్పెదను. శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు - శంఖపాలుడు, కులికుడు యను ఎవమండుగురు నాగులలో శ్రేష్ఠులు. వీరిలో ఇద్దరు నాగులు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు. ఇద్దరు వైశ్యులు, ఇద్దరు శూద్రులు. ఈ నాలుగు వర్ణముల నాగులకు క్రమముగ, వెయ్యి, ఎనిమిది వందలు, ఐదు వందలు, మూడు వందలు, పడగలు వుండును. వీరి వంశమున ఐదు వందల నాగులు పుట్టిరి. వారి నుండి పుట్టిన వారు అసంఖ్యాకులు. సర్పములు, ఫణి. మండలి. రాజిలము యిని మూడు విధములు. ఇవి వరుసగ వాత, పిత్త, కఫ ప్రధానములు. ఇవికాక వ్యంతరము, దోష మిశ్రము, దర్వీకరము యని జాతి గల సర్పములు కూడ వున్నవి. వీటిపై చక్రము హలము, ఛత్రము స్వస్తికము, అంకుశము వీటి చిహ్నము లుండును. గోనస సర్పముపై విచిత్రములైన మండలము లుండును. ఇది దీర్ఘ కాయమై మందముగ ప్రాకును. రాజిల సర్పము స్నిగ్ధముగ మండును. దాని పైభాగము నందును పార్శ్వ భాగము లందును రేఖ లుండును. వ్యంతర సర్పములపై మిశ్రిత చిహ్నము లుండును. వీటిలో పార్థివములు, ఆప్యములు, అగ్నేయములు, వాయవ్యములు, యను నాలుగు భేదములును, ఇరువది ఆరు అవాంతర భేదములును వుండును. గోనస సర్పములలో పదునారు రాజిల సర్పములలో పదమూడు, వ్యంతర సర్పములలో ఇరవది యొక్కటి భేదము లుండును. సర్పములు పుట్టు కాలము నందు కాక తద్భిన్న కాలము నందు పుట్టిన సర్పములు వ్యంతరములు యని చెప్పబడును. అషాఢము మొదలు మూడు మాసములలో సర్పములు గర్భము ధరించును. గర్భము ధరించి నాలుగు మాసము గడచిన పిమ్మట ఆడ సర్పము రెండు వందల నలుబది గ్రుడ్లను కనును. సర్పపు పిల్లలు ఆ గ్రుడ్ల నుండి బయటికి వచ్చి వాటిలో స్త్రీ, పురుష, నపుంసక లక్షణములు అవిర్భవించుటకు ముందుగానే సాధారణముగ సర్పములు వాటిని తిని వేయును. కృష్ణ సర్పము ఏడు రోజులలో కండ్లు తెరచును. ఒక మాసములో గ్రుడ్డు నుండి బయటకు వచ్చును. పండ్రెండ్రు దినములు దాటిన పిమ్మట దానికి జ్ఞాపకము కలుగును. ఇరువది దినములు పిమ్మట సూర్య దర్శనము కలుగగానే దానికి ముప్పది రెండు దంతములు మొలచును. వాటిలో నాలుగు విష దంతము లుండును. వాటికి కరాళి. మకరి, కాళరాత్రి, యమ దుతియని పేర్లు. ఇవి వాటి యెడమ కుడి ప్రక్కలలో వుండును. సర్పము ఆరు మాసముల కొక పర్యాయము కూసము విడుచును. నూట ఇరువది సంవత్సరములు జీవించును. శేషాది సప్త నాగములు వరుసగ సూర్యాది వారములకు అధిపతులు. ఈ ఆధిపత్యము పగలు, రాత్రి కూడ వుండును. శేషా దిసప్తనాగములు తమ తమ వారములలో ఉదయించును. కాని కుళికుడు అన్నిటి సంధికాలము నందును ఆవిర్భవించును. లేదా అది మహాపద్మ శంఖ పాలులతో పాటు ఉదయించును. మహా పద్మ శంఖపాలుల మధ్యనున్న రెండు గడియల కాలమున కుళి కోదయ మగునని మరొక మతము. కుళి కోదయ మతము అన్ని కార్యములకు నిషిద్ధము. సర్ప దంశము నందు ప్రధానముగ అశుభము. కృత్తికా, భరణి, స్వాతి, మూల పూర్వ ఫల్గుణీ, పూర్వాషాఢ, పూర్వాభాద్రా, అశ్వనీ విశాఖా, ఆర్ధ్ర, ఆశ్లేష చిత్ర, శ్రవణ, రోహిణి హస్త నక్షత్రములు, శని మంగళ వారములు, పంచమి అష్టమి, షష్ఠీ, రిక్త చతుర్థీ నవమీ, చతుర్దశులు తృతీయ తిథి సర్పదంశమున నింద్యములు పంచమి, చతుర్దశీ, తిథులలో సర్ప దంశము విశేషించి నిందితము. నాలుగు సంధ్య లందును, దగ్ధ రాశులందును సర్పము కరచినచో అది అనిష్టకర మగును. ఒకటి, రెండు, మూడు దంతముల కాట్లు వరసగ దుష్టము, విద్ధము ఖండితమని చెప్పబడును. సర్పము కేవలము స్పృశించి కరవకున్నచో అది అదంశము. దీనిలో మనుష్యునకు భయముండదు. ఈ నాల్గు విధములగు దంశములలో మూడు రెండు ఒకటి దంశములు వేదనాజనకములై రక్తస్రావమును కలిగించును. ఒక పాదము కూర్ము వీటితో సమాన మగు ఆకారము గల కాటు రాత్రి యందు జరిగినచో అది మృత్యు ప్రేరితమని తెలియ వలయును. వేడి చేపలు పాకుతున్నట్లు భావము. కంఠ శోధము మొదలగు పీడలతో కూడిన సర్పదంశము నందు విషముండును. ఈ లక్షణములు లేనిచో విషముండదు. దేవాలయము, శూన్య గృహము, పుట్ట, ఉద్యానము, చెట్టుతొర్ర రెండుమార్గముల సంధి, స్మశానము, నదీ సాగర సంగమము, ద్వీపము చతుష్పదము, రాజప్రాసాదము, గృహము కమలవనము గృహము, పర్వతశిఖరము, బిలద్వారము, జీర్ణకూపము, జీర్లకుడ్యము సిగ్రు - శ్లేష్మాతక - అక్ష - జంబూ - ఉదుంబర - వేణువన - వట, - వృక్షము లందును, జీర్ణ ప్రాకారాదులందును సర్పములు నివసించును. ఇంద్రియ రంధ్రములు ముఖము హృదయము, కక్షములు, కంఠమూలము, తాలువు లలాటము, కంఠము, శిరస్సు గడ్డము నాభిచరణములు ఈ అంగము పై సర్పదంశము అశుభకరము. సర్పదంశమును గూర్చి చెప్పుటకు విషచికిత్సకుని వద్దకు వెళ్ళనవాడు చేతులలో పుష్పములు గ్రహించి చక్కగ మాటలాడుచు బుద్ధిమంతుడై సర్పము కరచిన వానితో సమానమైన జాతి అంగాదులు కలిగి శ్వేత వస్త్రథారియై నిర్మలుడుగను పవిత్రుడుగను వున్నచో అది శుభకరము. ఇట్లుకాక ఆవార్త తీసుకుని వచ్చిన వాడు, ముఖ ద్వారము నుండిగాక, మరొక ద్వారము నుండి వచ్చినను శస్త్రమును ధరించినను, ప్రమాదవంతుడైనను నేలవైపు చూచుచున్నను మలిన వస్త్రములు ధరించినను చేతిలో పాశాదులు ధరించినను గద్గద కంఠముతో మాటలాడు చున్నను, ఎండిపోయిన కర్రపై కూర్చున్నను ఖిన్నుడై చేతిలో తిలను ధరించి, ఎర్ర మచ్చలు గల వస్త్రములు ధరించినను, లేదా తడిసిన వస్త్రములను ధరించినను ఆతని శిరస్సుపై నల్లని లేదా ఎర్రని పువులున్నను తనకుచస్థానములు మర్దనము చేయుచున్నను నఖములను ఛేదించున్నను గుదస్థానమును స్పృశించుచున్నను పాదములతో నేలపై వ్రాయుచున్నను జుట్టులాగు కొనుచున్నను తృణములను త్రుంపుచున్నను ఇవన్నియు అశుభ సూచకములు - వీటిలో ఏ ఒక్కటియైనను అశుభసూచకములే

ఇడన్యావా వహేద్ద్వేధాయది దూతస్య చాత్మనః |

ఆభ్యాం ద్వాభ్యాం పుష్టయాస్మాన్వి ద్యాత్‌స్త్రీపున్నపుంసకాన్‌. 29

దూతః స్పృశతి యద్గాత్రం తస్మిన్దంశ ముదాహరేత్‌ | దూతాంఘ్రి చలనం దుష్టముత్థితిర్నిశ్చలాశుభా. 30

జీవ పార్శ్వే శుభోదూతో దుష్టోన్యత్ర సమాగతః | జీవోగతా గతైర్దుష్టః శుభోదూత నివేదన్‌. 31

దూతస్య వాక్ప్రదుష్టాసా పూర్వామజ్జార్ధనిందితా | విభ##క్తైస్తస్య వాక్యాన్తైర్విష నిర్విష కాలతా. 32

అద్యైః స్వరైశ్చ కాద్యైశ్చ వర్ణైర్బిన్నలిపిర్ద్విధా | స్వరజో వసుమాన్వర్గీ ఇతిజ్ఞేయాచ మాతృకా. 33

వాతాగ్నీన్ద్ర జలాత్మానోవర్గేషుచ చతుష్టయమ్‌ |

నపుంసకాః పంచమాః స్యుఃస్వరాః శక్రామ్బుయోనయః. 34

దుష్టౌదూతస్య వాక్పాదౌ వాతాగ్నీ మధ్యమోహరిః | ప్రశస్తా వారుణావర్ణా అతిదుష్టా నపుంసకాః. 35

ప్రస్థానే మంగళం వాక్యం గర్జితం మేఘహస్తినోః | ప్రదక్షిణం ఫలేవృక్షే వామస్య చరుతం జితమ్‌. 36

శుభా గీతాది శబ్దాః స్యురీదృశంస్యాద్ధి సిద్ధయే | అనర్థగీరథాక్రన్దో దక్షిణ విరుతం క్షుతమ్‌.

37

వేశ్యాక్షుతోసృపాః కన్యాగౌర్దన్తీ మురజద్వజౌ | క్షీరాజ్యదధి శంఖాంబుచ్ఛత్రం భేరీఫలం సురాః. 38

తండులా హేమరూప్యంచ సిద్ధయోభి ముఖాఅమీ | సకాష్ఠః సానలః కారుర్మలి నాంబర భారభృత్‌. 39

గలస్థటంకో గోమాయు గృధ్రోలూక కపర్దికాః | తైలం కపాల కార్పాసా నిషేధే భస్మనష్టయే.

40

విషరోగాశ్చ సప్తస్యుర్దా తోర్ధాత్వన్తరాప్తితః | విషదంశో లలాటం యాత్యతోనేత్రం తతోముఖమ్‌.

ఆస్యాచ్చవచనీనాడ్యో ధాతూన్ర్పాప్నోతి హిక్రమాత్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే సర్పలక్షణంనామ చతుర్నవత్యధిక ద్విశతతమోధ్యాయః.

తనకును ఆవచ్చిన దూతకును ఇడా పింగళనాడులు రెండును ఆడుచున్నచో దానిని బట్టి సర్పము స్త్రీయా, పురుష, నపుంసక మాయని తెలుసుకొనవచ్చును. దూతయే అంగమును స్పృశించునో ఆ అంగమునందే సర్పదంశ##మైనట్లు తెలుసుకొనవచ్చును. దూతపాదములు చంచలములైనచో అశుభములు, స్థిరముగనున్నమచో శుభము. ఒకజీవుని పార్శ్వమునందున్న దూత, శుభసూచకుడు, ఇతర భాగములందున్నచో అశుభము. దూత నివేదించు సమయమున ఏప్రాణియైన వచ్చినచో శుభము. బయటకు వెళ్ళిపోయినచో అశుభము. దూతమాటలు, దోషయుక్తముగా నున్నును అస్పష్టముగా నున్నను అది నిందితము. ఆతని స్పష్టమైన మాటలను బట్టి సర్పదం శనము, విషసహితమా | విషరహితమా | యను విషయమును తెలుసుకొనవచ్చును. దూత వాక్యమునందు ప్రారంభమున, స్వరములు వున్నచో వాటిని బట్టియు "" అది వర్గాక్షరములున్నచో వాటిని బట్టియు, లిపిరెండు విధములుగ నుండును. వాక్య ప్రారంభమున స్వరమున్నచో సర్పదష్టుడు జీవించును. క ఆది వర్గాక్షరములున్నచో అ శుభము కలుగవచ్చును. మాతృకా విధానము ఈ విధముగ గ్రహించవలయును. కాది వర్గములలో మొదటి నాలుగు అక్షరములకును వరుసగ వాయు అగ్ని ఇంద్ర, వరుణములు దేవతలు వీటి పంచమాక్షరములు నపుంసకములు. స్వరములు హ్రస్వములైనచో ఇంద్ర దేవతాకములు. దీర్ఘములైనచో వరుణదేవతాకకములు. దూతవాక్య ప్రారంభమున వాయు అగ్ని దేవతాక అక్షరములు చెడ్డవి. ఐంద్రాక్షరము మధ్యమ ఫలప్రదము. వరుణ దైవత్య వర్ణము ఉత్తమము. నపుంసక వర్ణము అత్యంతము అశుభము. చికిత్సకుడు బయలుదేరి వచ్చునపుడు మంగళ మయమగు వాక్కులు మేఘ గర్జన గజ గర్జనములు, కుడిప్రక్క ఫల యుక్త వృక్షముండుట వామ భాగమున యేపక్షియైనను కలరవము చేయుడు ఇవి జయమును సాఫల్యమును సూచించును. గీతాదిశబ్దములు కూడ శుభకరములు. కుడి ప్రక్కనుండి అనర్థ సూచకములగు మాటలు వినబడుట, చక్రవాకముల రోదనము ఇవి కూడ సిద్ధి సూచకములు. పక్షుల అశుభ ధ్వని తుమ్ము ఇవి అనర్థ సూచకములు. వేశ్య బ్రాహ్మణుడు, రాజుకన్య, గోవు, ఏనుగు, మురజము, గజము, క్షీరము, ఆజ్యము, దధిశంఖము, జలము, ఛత్రము, ఫలము, భేరి, మధ్యము అక్షతలు, బంగారము వెండి ఇవి ఎదురైనపుడు కార్య సిద్ధి కలుగును. కాష్ఠము అగ్ని ధరించిన శిల్పిమాసిన బట్టలు మోసుకొనువచ్చువాడు టంకమును మెడలో వేసుకొన్నవాడు, నక్క గ్రద్ద గుడ్లగూబ, గవ్వలు, తైలము, కపాలము, దూది భస్మము ఇవి నాశ సూచకములు. విషము ఒక ధాతువు నుండి మరొక ధాతువుకు ప్రవేశించుటచే ఏడు విధములగు విషరోగము కలుగును. విషదంశము ముందుగ లలాటములోనికి, లాలాటము నుండి నేత్రములలోనికి, అచటి నుండి ముఖములోనికి పిదప అన్ని వాడులలోనికి ప్రవేశించి క్రమముగ ధాతువులలో ప్రవేశించును.

అగ్నిమహాపురాణమున నాగలక్షణ కథనమను రెండువందల తొంభైనాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page