Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ షణ్ణవత్యధిక ద్విశతతమోధ్యాఃయః
అథ పంచాంగరుద్రేణ దష్టచికిత్సా
అగ్ని రువాచ :
వక్ష్యేరుద్రవిధానంతు పంచాంగం సర్వడంపరమ్ | హృదయం శివసంకల్పః శిరః సూక్తంతు పౌరుషమ్. 1
శిఖాభ్యః సంభృతం సూక్తమాశుః కవచమేవఛ | శతరుద్రీయ మస్త్రంచ రుద్రస్యాంగానిపంచహి. 2
పంచాగాన్న్య స్యతంధ్యాత్వా జపేద్రుద్రాంస్తతః క్రమాత్ |
యజ్ఞాగ్రత ఇతిసూక్తం షడృచం మానసం విదుః 3
ఋషిః స్యాచ్ఛి వసంకల్పశ్ఛంద స్త్రిష్ఠు బుదాహృతమ్ | శివః సహస్ర శీర్షేతి తస్య నారాయణో೭ప్యృషిః. 4
దేవతా పురుషో೭నుష్టుప్ఛందో జ్ఞేయంచ త్రైష్టుభమ్ | అద్బ్యః సంభూతసూక్తస్య ఋషిరుత్తర గోనరః. 5
ఆద్యానాం తినౄణాం త్రిష్టుప్ఛందో೭నుష్టుబ్ధ్వయోరపి | ఛంద సై#్తష్టుభమన్త్యాయాః పురుషో೭స్యాపి దేవతా.
ఆశురింద్రో ద్వాదశానాం ఛందస్త్రిష్టుబుదా హృతమ్ | ఋషిఃప్రోక్తఃప్రతిరథః సూక్తేసప్తదశర్చకే. 7
వృథక్పృథగ్దేవతాః స్యుః పురువిదంగ దేవతా | అవశిష్ట దైవతేషుచ్ఛందో೭నుష్టు బుదాహృతమ్. 8
అసౌయస్తామ్రో భవతీంద్రః పురులింగొక్త దేవతా | పంక్తిచ్ఛందో೭థ మర్మాణి త్వపలింగోక్త దేవతాః. 9
రౌద్రాద్యాయేచ నర్వస్మిన్నృషిః స్యాత్పరమేష్ఠ్యపి | ప్రజాపతిర్వా దేవానాం కుత్సన్య తినృణాంపునః. 10
మనోద్వయోరుమైకా స్యాద్రుద్రో రుద్రాశ్చ దేవతాః | ఆద్యోనువాకో೭థ పూర్వఏకరుద్రాఖ్య దైవతః. 11
ఛందో గాయత్రమాద్యాయా అనుష్టుప్తి నృణామృచామ్ . తినౄణాంచ తథాపంక్తి రనుష్టుబథ సంస్మృతమ్.
ద్వయోశ్చ జగతీచ్ఛందో రుద్రాణామవ్య శీతయః | హిరణ్య బాహవస్తిస్రో నమో వఃకిరికాయచ. 13
పంచర్చో రుద్రదేవాః స్యుర్మంత్రే రుద్రానువాకకే | వింశ##కే రుద్ర దేవాస్తాః ప్రథమా బృహతీ న్మృతా. 14
ఋగ్ద్వితీయా త్రిజగతీ తృతీయా త్రిష్టు బేవచ | అనుష్టుభోయజుస్తిస్ర ఆర్యోభిజ్ఞః సుసిద్ధిభాక్. 15
త్రైలోక్యమోహనేనాపి విషవ్యాధ్వరిమర్దనమ్ |
ఇం, శ్రీం, హ్రీం హ్రూం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః|
అనువ్టుభం నృసింహేన విషవ్యాధి వినాశనమ్. 16
ఓం, హం ఇమ్, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖమ్ |
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహమ్. 17
అయమేవతు పంచాంగో మంత్రః సర్వార్థ సాధకః | ద్వాదశాష్టాక్షరౌ మంత్రౌ విషవ్యాధి విమర్దనౌ. 18
కుబ్జికా త్రిపురా గౌరీచంద్రికా విషహారిణీ | ప్రసాదమంత్రో విషహృదాయురారోగ్య వర్ధనః.
సౌరోవినాయక స్తద్వద్రుద్రమంత్రా సదాఖిలాః. 19
ఇత్యది మహాపురాణ ఆగ్నేయే పంచాంగరుద్రేణ దష్టచికిత్సాన్నామ షణ్ణవత్యధిక ద్విశతతమోధ్యాయః.
అగ్నిదేవుడు చెప్పెను. ఇపుడు అత్యుత్తమము సర్వ కామ ప్రదమగు పంచాంగ రుద్ర విధానమును చెప్పెదను. దీనికి శివ సంకల్పము హృదయము. పురుష నూక్తము శిరస్సు. ''అద్భ్యః సంభూతః'' (యుజు 31-17) ఇత్యాది సూక్తము ''ఆశుః శిషానః'' ఇత్యాది అధ్యాయము కవచము. శత రుద్రియము అను రుద్రమునకు ఈ యైదను అంగములు. రుద్ర దేవత ధ్యానము చేసి పంచాంగ భూత రుద్రుల జపము క్రమముగ చేయవలయును. ''యజ్జాగ్రతో'' మొదలగు ఆరు ఋక్కులు గల శివ సంకల్ప సూక్తము (యజు 34-1-6) దీని హృదయము. దీని ఋషి శివ సంకల్పుడు. ఛందస్సు త్రిష్టుప్ ''సహస్రశీర్షా'' యను ప్రారంభముగల పురుషసూక్తము దీనికి శీర్షస్థానీయము. దీని ఋషి నారాయణుడు. పురుషుడు దేవత. అనుష్టుప్ త్రిష్ఠుప్లు ఛందస్సులు. ''అద్భ్యః సంభూతః'' ఇత్యాది సూక్తమునకు ఉత్తరగామి నరులు ఋషులు. వీటిలో క్రమముగా మొదటి మూడు మంత్రములకు త్రిష్టుప్ తరువాత రెండు మంత్రములపై అనుష్టుప్ చివర మంత్రములకు త్రిష్టుప్ ఛందస్సులు. పురుషుడు దేవత ''ఆశుః శిషానః'' (యజు 17-33-) ఇత్యాది సూక్తమున పన్నెండు మంత్రములకు ఇంద్రుడు దేవత. ఛందస్సు త్రిష్టుప్. పదునేడు ఋక్కులుగల ఈసూక్తమునకు ఋషి ప్రతిరథుడు. దేవతలు మాత్రము వేరువేరుగ నుందురు. కొన్ని మంత్రములకు పురువిత్ అంగదేవత. మిగిలిన దేవతమంత్రములకు ఛందస్సు అనుష్టుప్. ''అసౌయస్తామ్రః'' (యజు - 16 -6) మంత్రములకు పురులింగోక్త దేవత పంక్తి ఛందస్సు. ''మర్మాణితే'' (యజు 17 - 19) మంత్రమునకు త్రిష్టుప్ ఛందస్సు. దేవత లింగోక్తము రుద్రాధ్యాయము నంతకును ఋషి పరమేష్టి. దేవానామిత్యాది మంత్రమునకు ఋషిప్రజాపతి. మూడు ఋక్కులకు మాత్రము ఋషికుత్సుడు. ''మానోమహాంతం'' (యజు 16 - 15) 'మానస్తోకే' (యజ 16 - 16) అనురెండు మంత్రములకు ఉమయు అన్యమంత్రములకు రుద్రుడును రుద్ర గణములును దేవతలు. పదునారు ఋక్కులుగల మొదటి అను వాకమునకు దేవత రుద్రుడు. మొదటి మంత్రమునకు ఛందస్సు గాయత్రి. మూడు ఋక్కులకు అనుష్టుప్. మూడు ఋక్కులకు పంక్తి. ఏడు ఋక్కులకు అనుష్టుప్. రెండు మంత్రములకు జగతి. ''నమోహిరణ్య బాహవే (యజు 16 - 17) మొదలు ''నమోవః కిరి కేభ్యః'' వరకు రుద్రగణము యొక్క మూడు అశీతులు వున్నవి. రుద్రాను వాకము నందలి ఐదు ఋక్కులకు రుద్రుడు దేవత. ఇరువదవ ఋక్కునకు కూడ దేవత రుద్రుడు. మొదట ఋక్కు యొక్క ఛందస్సు బృహతి. రెండవదాని ఛందస్సు త్రిజగతి. మూడవదాని ఛందస్సు త్రిష్టుప్. మిగిలిన మూడును అనుష్టుప్. వీటి జ్ఞానము కలవాడు మంచి సిద్ధిని పొందును. త్రైలోక్య, మోహన మంత్రము కూడ విషమును తొలగించును. ''ఇంశ్రీం, హీం హ్రూం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః'' యనునది మంత్రము. ''ఓం హం మొదలు సమామ్యహమ్ వరకును వున్న మూలోక్త అనుష్టుభనృసింహ మంత్రముచేత కూడ విషవ్యాధి తొలగును, ఈ పంచాంగ మంత్రము సర్వార్థ సాధకము. ద్వాదశాక్షరి. అష్టాక్షరిలు కూడ విషవ్యాధిని తొలగించును. ''కుబ్జికా, త్రిపురా, గౌరి, చంద్రికా విషహారిణీ'' యను ప్రసాద మంత్రము విషమును తొలగించి ఆయురారోగ్యమును వృద్ధి పొందించును. సూర్య వినాయక మంత్రములు రుద్రమంత్రములన్నియు కూడ విషము తొలగించును.
అగ్ని మహాపురాణమున పంచాంగ రుద్రేణదష్ట చికిత్సయను రెండువందల తొంబది ఆరవ అధ్యాయము సమాప్తము.