Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తనవత్యధిక ద్విశతతమోధ్యాయః
అథ విషహృన్మంత్రౌషధమ్
అగ్ని రువాచ :
ఓం నమోభగవతే రుద్రాయఛిందఛింద విషం జ్వలిత పరశుపాణయేచ |
నమోభగవతే పక్షిరుద్రాయ దష్టకం ఉత్థాపయఉత్థాపయ దష్టకం కంపయకంపయ జల్పయజల్పయ
సర్పదష్టముత్థాపయ లలలలబంధబంధమోచయమోచయ
వరరుద్రగచ్ఛగచ్ఛవధవధత్రుటత్రుటబుకబుకభీషయభీషయ ముష్టినా సంహార విషం ఠర.
పక్షి రుద్రేణ హవిషం నాశ మాయాతి మంత్రాణాత్ |
ఓం నమో భగవతే రుద్ర నాశయ విషం స్థావర జంగమమ్ .
కృత్రిమా కృత్రిమ విషముపవిషం నాశయ నానావిషం
దష్టక విషం నాశయ ధమధమధమవమవమమేఘాంధకార
ధారావర్ష నిర్విషీభవ సంహరసంహరగచ్ఛగచ్ఛఆవేశయఆవేశయవిషో
త్థాపన రూపం మంత్రాన్తా ద్విష ధారణమ్. ఓంఓం క్షిపక్షిపస్వాహా.
ఓం హ్రాం హ్రీం ఖీం సః ఠం ద్రౌం హ్రీం ఠః. జపాదినా సాధితస్తు సర్పాన్బధ్నాతి నిత్యశః. 1
ఏక ద్విత్రి చతుర్బీజః కృష్ణ చక్రాంగ పంచకః | గోపీజన వల్లభాయ స్వాహా సర్వార్థ సాధకః. 2
ఓం నమో భగవతే రుద్రాయ ప్రేతాధిపతయే గుత్త్వగుత్త్వ
గర్జగర్జభ్రామయభ్రామయముంచముంచముహ్యముహ్యకటకటఆవిశ
ఆవిశ సువర్ణ పతంగ రుద్రోజ్ఞాపయతి ఠఠ.
పాతాలక్షోభమంత్రో7యం మంత్రాణాద్విషనాశనః | దంశకాహిదంశే సద్యో దష్టః కాష్ఠశిలాదినా. 3
విషశాంత్యై దహేద్ధంశం జ్వాలకోకనదాదినా | శిరీష బీజపుష్పార్క క్షీరబీజకటుత్రయమ్. 4
విషం వినాశ##యేత్పానలేపనే నాంజనాదినా | శిరీష పుష్పస్యరస భావితం మరిచం సితమ్. 5
పాననస్యాంజ నాద్యైశ్చ విషం హన్యాన్న నంశయః | కోషాత కీవచా హింగు శీరీషార్క పయోయుతమ్. 6
కటుత్రయం సమేషాంభో హరేన్న స్యాదినా విషమ్ |
రామఠేక్ష్వాకు సర్వాంగ చూర్ణం నస్యా ద్విషాపహమ్. 7
ఇంద్రబలాగ్నికం ద్రోణం తులసీ దేవికాసహా | తద్రసాక్తం త్రికటుకం చూర్ణం భక్ష్యం విషాపహమ్.
పంచాంగం కృష్ణపంచమ్యాం శిరీషస్య విషాపహమ్. 8
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే విషహృన్మంత్రౌషధ కథనంనామ సప్తనవత్యధిక ద్విశతతమోధ్యాయః.
అగ్నిదేవుడు పలికెను. ''ఓం నమోభగవతే రుద్రాయ'' మొదలుపరశుపాణయే'' వరకును వున్న మూలోక్త మంత్రము ''నమోభగవతే పక్షి రుద్రాయ'' మొదలు ''విషం ఠఠ వరకునువున్న మూలోక్త మంత్రము చేతను సర్పదుష్టుని అభి మంత్రించినచో వాని విషము తొలగిపోవును. ''ఓం నమోభగవతే రుద్ర'' మొదలు ''ద్రౌం హ్రీం - ఠః'' వరకును వున్న మూలోక్త మంత్రమును జపించి మంత్ర సిద్ధిపొందిన వాడు నిత్యము సర్పములను బంధించగలడు. ఒక రెండు మూడు, నాలుగు బీజములుకలదియు కృష్ణ చక్రముచే అంగపంచకముగల గోపీజనవల్లభాయ స్వాహాయను మంత్రమును సర్వార్థసాధకము. 'ఓం నమోభగవతే రుద్రాయ'' మొదలు ''జ్ఞాపయతి ఠఠ'' వరకును వున్న మూలోక్త మంత్రమునకు పాతాళ క్షోభ మంత్రమని పేరు. ఈ మంత్రముతో అభిమంత్రించినచో విషము తొలగిపోవును. సర్పము కాటువేసినపుడు మండుచున్న కాష్టముతో గాని, కాలుతున్న శిలతోకాని అగ్ని జ్వాలతోగాని కోకనదముతో గాని, కరచిన స్థానమున కాల్చినచో విషము ఉపశమించును. శిరీష వృక్ష బీజములు పుష్పములు, అర్కక్షీరము బీజము, కటుత్రయము వీటిని త్రాగించినను పైన పూసినను కాటుకపెట్టినను విషము నశించును. శిరీష పుష్పరసముతో భావనచేసిన తెల్లని మరిచము పాననశ్య, అంజనాది రూపమున నిచ్చినచో విషమును నశింపచేయును. సందేహములేదు. కోశాతకీ వచా హింగు శిరీష, అర్కక్షీర - త్రికటు మోషాంభస్సులను నశ్యాది రూపమున నిచ్చినచో విషము నశించును. రామఠ ఇక్ష్వాకు సర్వాంగముల చూర్ణము నశ్యముగా ఇచ్చినచో విషమును తొలగించును. ఇంద్రబల, అగ్నికము ద్రోణము తులచిదేవిక సహ, వీటిరసములో త్రికటు చూర్ణము కలిపితిన్నచో విషము నశించును, కృష్ణపంచమినాడు తీసుకుని వచ్చిన శరీష పంచాంగము విషనాశకము.
అగ్ని మహాపురాణమున విషహృన్మంత్రౌషధమను రెండువందల తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.