Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ అష్టనవత్యధిక ద్విశతతమోధ్యాయః
అథ గోనసాదిచికిత్సా
అగ్ని రువాచ :
గోనసాది చికిత్సాంచ వసిష్ఠశృణువచ్మితే | హ్రీం హ్రీం అమలపక్షిస్వాహా |
తాంబూలఖాదనాన్మంత్రీ హరేన్మండ లినోవిషమ్. 1
లశునం రామఠఫలం కుష్ఠాగ్ని వ్యోషకంవిషే | స్నుహీక్షీరం గవ్యఘృతం పక్షం పీత్వా7హిజేవిషే. 2
అథరాజి దష్టేచ పేయాకృష్ణా ససైందవా | ఆజ్యక్షౌద్రశకృత్తోయం పురీతత్యా విషాపహమ్. 3
నకృష్ణా ఖండదుగ్ధాజ్యం పాతవ్యం తేన మాక్షికమ్ | వ్యోషం పిచ్ఛం బిడాలాస్థి నకులాంగురుహైఃసమైః. 4
చూర్ణితైర్మేష దుగ్ధా క్తైర్ధూపః సర్వవిషాపహః | రోమ నిర్గుండికా కోలవర్ణైర్వా లశునం సమమ్. 5
మునిపత్రైః కృతస్వేదం దష్టం కాంజికపాచితైః | మాషికాః షోడశ ప్రోక్తారసం కార్పానజం పిబేత్. 6
సతైలం మూషికార్తిఘ్నం ఫలినీ కుసుమంతథా | సనాగరగుడం భక్ష్యం తద్విషారోచ కాపహమ్. 7
చికిత్సా వింశతిర్భూతా లూతావిషహరో గణః | పద్మకం పాటలీకుష్ఠం నతముశీర చందనమ్. 8
నిర్గుండీ సారివాశేలు లూత్తారం సేచయేజ్జలైః | గుంజా నిర్గుండకం కోల పర్ణం శుంఠీ నిశాద్వయమ్. 9
కరం జాస్థిచ తత్సంకైర్వృశ్చి కార్తిహరం శృణు | మంజిష్ఠా చందనం వ్యోష పుష్పం శిరీషకౌముదమ్. 10
సంయోజ్యా శ్చతురో యోగా లేపాదౌ వృశ్చికాపహాః |
ఓం నమో భగవతే రుద్రాయ చివి చివి ఛింద ఛింద.
కిరికిరి భిందభింద ఖడ్గేనే చ్ఛేదయచ్ఛేదయ శూలేన భేదయభేదయ చక్రేణ దారయదారయ ఓం హ్రూంఫట్.
మంత్రేణ మంత్రితో దేయో గార్ధభాదీన్నికృన్తతి. 11
త్రిఫలో శీర ముస్తాంబు మాంసీ వద్మకచం దనమ్ | అజాక్షీరేణ పానాదేర్గర్ద భాదేర్విషం హరేత్. 12
హరేచ్ఛిరీష పంచాంగం వ్యోషం శతపదీ విషమ్ | స కంధరం శిరీషాస్థి హరేదుందూరజం విషమ్. 13
వ్యోషం ససర్పిః పిండీత మూలమస్య విషం హరేత్ | క్షారవ్యో షవచాహింగు విడంగం సైంధవంనతమ్.
అంబష్ఠాతి బలా కుష్ఠం నర్వకీట విషం హరేత్ | యష్టివ్యోష గుడక్షీరయోగః శునో విషాపహః. 15
ఓం సుభద్రాయైనమః ఓం సుప్రభాయైనమః | యాన్యౌషధాని గృహ్యన్తే విధానేన వినాజనైః. 16
తేషాం బీజం త్వయా గ్రాహ్యమితి బ్రహ్మా7బ్రవీచ్చతామ్ |
తాం ప్రణమ్యోషధీం పశ్చాద్యవాన్ర్పక్షిప్య ముష్టినా. 17
దశ జప్త్వా మంత్రమిదం నమస్కుర్యాత్తదౌషధమ్ | త్వాముద్ధరా మ్యూర్ధ్వ నేత్రామనేనైవచ భక్షయేత్.
నమః పురుష సింహాయ నమోగోపాల కాయచ | ఆత్మనైవాభి జానాతి రణకృష్ణ పరాజయమ్. 19
ఏతేన సత్య వాక్యేన ఆగదో మే7స్తు సిధ్యతు | నమో వైదూర్య మాత్రే తత్ర రక్షరక్షమాం సర్వవిషేభ్యో
గౌరిగాంధారి చాండాలి మాతంగిని స్వాహా హరిమాయే |
ఔషధాదౌ ప్రయోక్తవ్యో మంత్రోయం స్థావరేవిషే. 20
భుక్తమాత్రేస్థితే జ్వాలే పద్మం శీతాంబు సేవితమ్ | పాయయేత్సఘృతం క్షౌద్రం విషం చేత్తదనంతరమ్.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గోనసాది చికిత్సానామా7ష్ట నవత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
అగ్ని దేవుడు పలికెను. వశిష్ఠా! ఇపుడు గోనసాది సర్ప విషమునకు చికిత్స చెప్పెదను. వినుము. ''ఓహ్రాం హ్రీం, అమల పక్షిస్వాహా'' అను మంత్రముతో అభిమంత్రించిన తాంబూలమును ఇచ్చుటచే మంత్రవేత్త మండలి సర్ప విషమును తొలగించును. లశునము రామఠ ఫలము కుష్టము, అగ్ని, వ్యోషకము వీటిని సర్పవిషము నందు త్రాగవలయును. స్నుహీక్షీరము గోఘృతము పదునైదు దినములు త్రాగవలయును. రాజిల సర్పము కరచినపుడు సైంధవలవణము ఆజ్యమధు గోమయరసములు పురీరత్'' భక్షించినచో విషము తొలగును. సర్పము కరచిన వాడు కృష్ణఖండము దుగ్ధము, ఆజ్యము, తేనె, వీటిని త్రాగవలెను. త్రికటుపులు మయూర పించము పిల్లి యెముక ముంగిసరోమములు వీటిని సమానభాగములుగ గ్రహించి చూర్ణము చేసి గొఱ్ఱపాలలో తడిపిదాని ధూపమువేసినచో అన్ని విధములగు విషములు నశించును. రోమ నిర్గుండికా, అంకోల, పత్రములను సమభాగముల గ్రహించి, వాటి అన్నిటితో సమముగ లశునము చేర్చి వేసిన ధూపము కూడ విషనాశకము. ఆగస్త్యపత్రములను, గంజిలో ఉడికించి దానితో పాము కరచిన చోట కాచినచో విషము దిగిపోవును. మూషకములు పదహారు విధములు కార్పాస రసమును త్రాగినచో వాటి విషము తొలగును. ఫలునీ పుష్పములను నాగర గుడములతో కలిపి భక్షించినచో విష రోగము పోవును. సాలె పురుగులు ఇరువది విధములైనవి. వాటిని విషమునకు చికిత్స చేయుటకకు పద్మక పాటలీ కుష్ట ఉశీర, చందన, నత, నిర్గుండి, శారివ, సేలులను ఉపయోగించవలయును గుంజ నిర్గుండి కంకోల పత్ర శుంఠి, ద్వివిధ హరిద్ర కరంజ వల్కములను ఉడికించి (సాలె పురుగు) లూత విషముతో బాధపడు వానికి పైన చెప్పిన ఓషధులు కలిపిన నీటిని త్రాగించవలయును. ఇపుడు వృశ్చిక విషమును తొలగించు చికిత్సను వినుము. మంజిష్ఠా చందన వ్యోష శిరీష, కుముద పుష్పములను, నాలుగు యోగములను కలిపి లేపాదికము చేసినచో వృశ్చిక విష బాధ నశించును. ''ఓం నమో భగవతే రుద్రాయ'' మొదలు ''ఓం హ్రూంషట్'' వరకు వున్న మూలోక్త మంత్రముతో అభిమంత్రించిన ఔషధము మనుమ్మనికి ఇచ్చినచో గర్ధభాది విషములను తొలగించును. త్రిఫలా ఉశీర, ముస్తా. అంబు మాంసి, పద్మక. చందనములను మేక పాలతో కలిపి త్రాగించినచో గర్దభాది విషము నశించును. శిరీష పంచాంగములు వ్యోషము శత పదీ విషమును నశింప చేయును. కంధరముతో కూడిన శిరీష వృక్షపు బెరడు ఉందూరజ విషమును తొలగించును. వ్యోషమును తగర మూలమును ఘృతముతో ఉపయోగించినచో ''మత్స్యవిషము నశించును. యవ, క్షార, వ్యోష, వచా, హింగు, విడంగ, సైంధవ - తగర, అంబష్ఠా, అతిబలాకుష్ఠములు సకల విధకీట విషములను హరించును. యష్టివ్యోషగుడ క్షీరములతో చేసిన యోగము శూనక విషమును తొలగించును. ''ఓం సుభద్రాయైనమః'' ఓం సుప్రభాయై నమః అనునవి ఓషధులును పైకి తీయునపుడు ఉపయోగించు మంత్రములు. విధానానుసారముగ కాక మానవులు ఏ ఓషధులను గ్రహింతురో వాటి సారమును నీవు తీసుకొనుము యని బ్రహ్మ ''సుప్రభా'' దేవికి చెప్పెను. అందుచేత ముందుగ సుప్రభాదేవికి నమస్కరించి పిడికిలితో యవలు చల్లి పదిపర్యాయములు జపించి ఓషధికి నమస్కరించి ''ఊర్ధ్వనేత్రవగు నిన్ను ఉద్ధరించుచున్నాను'' యని చెప్పుచు ఆ ఓషధినిపైకిలాగి ''పురుష సింహుడగు గోపాలునకు నమస్కారము. యుద్ధమునందు తనపరాజయమును గూర్చి శ్రీకృష్ణుడే యెరుగును. ఈ సత్యవాక్య ప్రభావముచే నాకు ఈ ఓషధి సిద్ధి ప్రదమగు గాక ! యని చెప్పుచు దానిని భక్షించవలయును. స్థావరవిషమునకు ఉపయోగించు ఓషధుల విషయమున ''నమోవైదూర్య మాత్రే'' మొదలు హరిమాయే'' వరకును వున్న మూలోక్త మంత్రమును జపించవలయును. విషమును భక్షించిన వానిచే ముందుగవమనము చేయించి వాని శరీరము చల్లని జలము తడుపవలయును. పిదప తేనె నెయ్యి త్రాగించి విరేచనము చేయించవలయును.
అగ్ని మహాపురాణమున గోనసాది చికిత్సా కథనమను రెండువందల తొంబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.