Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ త్రిశతతమో7ధ్యాయః
అథ గ్రహహృన్మంత్రాదికమ్
అగ్ని రువాచ :
గ్రహోపహార మంత్రా దీన్వక్ష్యే గ్రహ విమర్ధనాన్ | హర్షేచ్ఛాభయ శోకాది విరుద్ధాశుచి భోజనాత్. 1
గురుదేవాది కోపాచ్చ పంచోన్మాదా భవన్త్యథ | త్రిదోషజాః సన్నిపాతా ఆగంతవ ఇతిస్మృతాః. 2
దేవాదయోగ్రహాజాతా రుద్రక్రోధా దనేకధా | సరిత్సరస్తడా గాదౌ శైలోప వనసేతుషు. 3
నదీసంగే శూన్యగృహే బిలద్వార్యేక వృక్షకే | గ్రహా గృహ్ణంతి పుంసశ్చ స్త్రియం సుప్తాంచ గర్భిణీమ్. 4
ఆసన్న పుష్పాం నగ్నాంచ ఋతుస్నానం కరోతియా |
అవమానం నృణాం వైరం విఘ్నం భాగ్య విపర్యయః. 5
దేవతా గురు ధర్మాది సదా చారాది లంఘనమ్ | పతనం శైల వృక్షా దేర్విధున్వన్మూర్ధ జాన్ముహుః. 6
రుదన్నృత్యతి రక్తాక్షో హ్రూంరూపో7నుగ్రహీనరః | ఉద్విగ్నః శూలదాహార్తః క్షుత్తృష్ణార్తః శిరోర్తిమాన్. 7
దేహి దేహీతి యాచేత బలికామగ్ర హీనరః | స్త్రీమూలా భోగస్నానేచ్ఛూరతి కామ గ్రహీనరః. 8
మహాసుదర్శనో వ్యోమ వ్యాపీ విటపనాసికః | పాతాల నారసింహాద్యా చండీమంత్రాగ్రహార్దనాః. 9
పృశ్నీ హింగువచాచుక్ర శిరీష దయితం పరమ్ | పాశాంకుశ ధరందేవ మక్షమాలా కపాలినమ్. 10
ఖట్వాంగాబ్జాది శక్తించ దఢానం చతురాననమ్ | అంతర్బాహ్యాది ఖట్వాంగ పద్మస్థం రవిమండలే. 11
ఆదిత్యాదియుతం ప్రార్చ్య ఉదితే7ర్కే7ర్ఘ్యకం దదేత్ |
శ్వాసవిషాగ్ని విప్రకుండీ హృల్లేఖాసకలోభృగుః. 12
ఆర్కాయ భూర్భువః స్వశ్చజాలినీం కులముద్గరమ్ | పద్మాసనో7రుణో రక్తవస్త్రః సద్యుతి విశ్వకః. 13
ఉదారః పద్మధృగ్ధోర్భ్యాం సౌమ్యః సర్వాంగ భూషితః | రక్తాహృదాదయః సౌమ్యావరదాః పద్మధారిణః.
విద్యుత్పుంజనిభం వస్త్రంశ్వేతః సౌమ్యో7రుణః కుజః | బుధస్తద్వద్గురుః పీతః శుక్లః శుక్రః శ##నైశ్చరః 15
కృష్ణాంగార నిభోరాహుర్ధూమ్రః కేతురుదాహృతః | వామోరువామ హస్తాన్తే దక్షహస్తోరుజానుషు. 16
స్వనామాద్యన్తబీజాస్తే హస్తౌసంశోధ్యశాస్త్రతః | అంగుష్ఠాదౌ తలేనేత్రే హృదాద్యం వ్యాపకం న్యసేత్. 17
మూలబీజైస్త్రిభిః ప్రాణధ్యాయకం న్యస్యసాంగకమ్ | ప్రక్షాల్యపాత్రమన్త్రేణ మూలేన పూర్వవారిణా. 18
గంధపుష్పాక్షతం న్యస్యదూర్వామర్ఘ్యంచ మంత్రయేత్ |
ఆత్మానం తేనసంప్రోక్ష్య పూజాద్రవ్యంచ వైధ్రువమ్. 19
అగ్ని దేవుడు పలికెను. ఇపుడు గ్రహోపహార మంత్రాదులను చెప్పెదను. ఇవి గ్రహ శాంతి నిచ్చును. హర్ష ఇచ్ఛా భయశోకాదుల చేతను పకృతి విరుద్ధము అపవిత్రముయైన ఆహారము భుజించుట చేతను గురు దేవాది కోపము చేతను మానవునకు ఐదు విధములగు ఉన్మాదములు కలుగు. వాటికి త్రిదోషజములు, సన్నిపాతజములు, ఆగంతుకములు అని పేర్లు. రుద్రుని క్రోధముచే అనేక విధములగు దేవాది గ్రహములు కలుగును. ఈ గ్రహములు నదులు చెరువులు తటాకములు శైలములు ఉపవనములు సేతువులు నదీ సంగమము. శూన్య గృహము బిల ద్వారము, ఏకైక వృక్షము, వీటియందుండి అక్కడికి వెళ్ళినవారిని ఆవహించును. నిద్రపోవుచున్న గర్భిణిస్త్రీని, ఆసన్న ఋతుకాలయగుస్త్రీని నగ్నస్త్రీని ఋతుస్నానము చేయుచున్న స్త్రీని కూడ ఆవహించును. ఇవి మానవులకు అవమానము, వైరము, విఘ్నము. భాగ్య విపర్యయము మొదలగునవిచేయించును. దేవతా గురు ధర్మాది సదాచారాదులను ఉల్లంఘించిన వారిని పర్వత వృక్షాదులనుండి పడినవారిని మాటి మాటికిజుట్టు దుల్పుకొను వానిని, కండ్లు ఎర్రచేసి ఏడ్చుచు గంతులు వేయుచున్న వానిని ఈలక్షణములను బట్టి రూప అనుగ్రహవిశేషముచే పీడితుడైనట్లు గ్రహించవలెను. ఉద్వేగయుక్తుడై దాహ శూల పీడితుడై ఆకలి దప్పులతో బాధపడుచు శిరో రోగముతో బాధపడుచు నాకు ఇమ్ము, నాకు ఇమ్ము యని యాచన చేయువాడు బలి కామి యనుగ్రహముచే పీడితుడని తెలుసుకొనవలెను. స్త్రీ. మాలా స్నాన, సంభోగముల యందు అధికేచ్ఛ కల వానిని రతి కామి యనుగ్రహి ఆవహించినట్లు తెలుసుకొనవలెను. ఆకాశ వ్యాపియైన మహా సుదర్శనము, విటప నాశికము, పాతాళ నారసింహాది మంత్రములు, చండీ మంత్రములు గ్రహ పీడను తొలగించును. గ్రహ పీడ నాశనము చేయు సూర్యా రాధన ఈ క్రింది విధముగా చేయవలయును. సూర్యుడు తన దక్షిణ హస్తములందు పాశాంకుశ అక్షమాలా కపాలములను వామ హస్తము లందు ఖట్వాంగ కమల చక్రశక్తులను ధరించి యుండును. నాలుగు ముఖములు ఎనిమిది హస్తములు, పన్నెండు నేత్రములు కలిగి యుండును. సూర్యుడు సూర్య మండలము లోపల కమలాసనముపై ఆదిత్యాది దేవగణ పరివృతుడై కూర్చుండి యుండును. ఈ విధముగ సూర్యుని ధ్యాన పూజాదులు చేసి ఉదయ కాలమున అర్ఘ్యము ఇవ్వవలెను. అందులకు మంత్రము శ్వాస (య) విష (ఓం) అగ్నిమాన్ రండి (ర్ ఓం) హృల్లేఖా (హ్రీం) ఇవి సంకేతాక్షరములు. వీటిని కలుపగా ''¸°ః రౌం, ఐం, హ్రీం- కలశార్కాయ భూర్భువః స్వరోం జ్వాలి నీ కుల ముద్ధర'' అని ఏర్పడును. సూర్యుడు పద్మాసన గతుడై ఎర్రగా రక్తవస్త్రములు ధరించి యుండును. అతని మండలము జ్యోతిర్మయము. ఉదార స్వభావుడు. రెండు హస్తము లందును పద్మమును ధరించి అన్ని అయవయములందును అలంకారములు ధరించి సౌమ్య మూర్తియై యుండును. సూర్యాది గ్రహము లన్నియు సౌమ్యములై బలాదాయకములై కమలములు ధరించి యుండును. వారి వస్త్రములు విద్యుత్పుంజమువలె నుండును. బృహస్పతి పసుపుపచ్చగాను శుక్రుడు తెల్లగను శని, నల్లటిబొగ్గు వలెను. రాహు కేతువులు ధూమ సమాన వర్ణులుగను వుందురు. వీరందరున ఎడమ చేతులను ఎడమ తొడల పైనుంచి దక్షిణ హస్తము లందు అభయ ముద్రను ధరించి యుందురు. గ్రహముల పేర్ల అధ్యక్షరములకు బిందువులు చేర్చినచో అవి బీజ మంత్రములగును. ''షట్'' యని ఉచ్చరించుచు హస్తముల శోధించి అంగుష్ఠము మొదలు కరతల పర్యస్తము, కరన్యాసము నేత్రములు తప్ప హృదయాది పంచాంగన్యాసము చేసి సూర్యుని మూల బీజ రూపములగు మూడు అక్షరములతో (హ్రాం హ్రీం, సహ) వ్యాపక న్యాసము చేయవలయును. పిదప అర్ఘ్య పాత్రమును హస్త్ర మంత్రముతో ప్రక్షాళన చేసి పూర్వోక్త మూల మంత్రమును ఉచ్చరించుచు ఉదకము నింపి గంధ పుష్ప అక్షత దూర్వములు వేసి మరల అభిమంత్రించి ఆ జలముతో తనను పూజా ద్రవ్యములను ప్రోక్షణ చేసి కొనవలెను.
ప్రభూతం విమలం సారమారాధ్యం పరమం సుఖమ్ | పీఠాద్యాన్కల్పయే దేతాన్హృదా మధ్యేవిదిక్షుచ. 20
పీఠోపరి హృదోమధ్యే దిక్షుచైవ విదిక్షుచ | పీఠోపరి హృదాబ్జంచ కేసరేష్వష్టశక్తయః. 21
వాందీప్తాం వీంతథా సూక్ష్మాం వూంజయాం వౄంజభద్రికామ్ |
వేం విభూతీం వైంవిమలాం వోమసిఘాత విద్యుతామ్. 22
వౌం సర్వతోముఖీం వంపీఠం వఃప్రార్చ్య రవింయజేత్ | ఆవాహ్య దద్యాత్పాద్యాది హృత్షడంగేన సువ్రత.
ఖకారౌ దండినౌ చండౌ మజ్జాదశన సంయుతా | మాంసదీర్ఘా జరద్వాయు హృదైతత్సర్వదంరవేః. 24
వహ్నీశరక్షో మరుతాం దిక్షుపూజ్యా హృదాదయః | స్వమంత్రైః కర్ణికాంతస్థాదిక్ష్వస్త్రం పురతః సదృక్.
పూర్వాదిదిక్షు సంపూజ్యాశ్చంద్రజ్ఞ గురుభార్గవాః | పృశ్నిహింగువచా చుక్రశిరీషలశు నామయైః
నస్యాంజనాది కుర్వీత సాజమూత్రైర్గ్రహాపహైః. 26
పాఠాపథ్యావచాశిగ్రు సింధువ్యోషైః పృథక్పలైః | అజాక్షీరాఢకే పక్వసర్పిః సర్వగ్రహాన్హరేత్. 27
వృశ్చికాలీఫలీ కుష్ఠంలవణాని చ శార్జ్గకమ్ | అపస్మారవినాశాయ తజ్జలం త్వభిభోజయేత్. 28
విదారీకుశకాశేక్షు క్వాథజం పాయయేత్పయః | ద్రోణసయష్టి కూష్మాండరసే సర్పిశ్చ సంస్కృతమ్. 29
పంచగవ్యం ఘృతం తద్వద్యోగం జ్వరహరం శృణు |
ఓం భస్మాస్త్రాయ విద్మ హే ఏకదంష్ట్రాయ ధీమహి | తన్నోజ్వరః ప్రచోదయాత్ |
కృష్ణోషణ నిశారాస్నాద్రాక్షా తైలంగుడం లిహేత్. 30
శ్వాసవానథ వాభార్గీసయష్టి మధుసర్పిషా | పాఠాతిక్తాకణా భార్గీబథ వామధునాలిహేత్. 31
ధాత్రీవిశ్వసితా కృష్ణాముస్తా ఖర్జూరమాగధీ | పివరశ్చేతి హిక్కాఘ్నం తత్త్రయం మధునాలిహేత్. 32
కామలీజీర మండూకీ నిశాధాత్రీరసం పిబేత్ | వ్యోషపద్మక త్రిఫలా విడంగ దేవదారవః.
రాస్నా చూర్ణం సమం ఖండైర్జగ్ధ్వా కాసహరం ధ్రువమ్. 33
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గ్రహహృన్మంత్రాది నిరూపణం నామ త్రిశతతమో7ధ్యాయః.
పిదప యోగ పీఠమును కల్పించి దాని పాదములుగా ప్రభూత విమల, సార, ఆరాధ్య పరమ సుఖములను కల్పించవలెను. ఆగ్నేయాది దిక్కులు నాల్గింటి యందును మధ్య భాగము నందును వీటి పేర్లకు చివర నమః చేర్చి వాటికి ఆవహనపూజలు చేయవలయును. యోగ పీఠము పైనను, హృదయ కమలము నందును దిక్కు నందును విదిక్కునందును, దీప్త మొదలగు శక్తులను స్థాపించవలెను. పీఠముపై హృదయ కమలము స్థాపించి దాని కేసరములపై ఎనిమిది శక్తులను పూజించ వలెను. ''వాం దీప్తాం'' ''వీం సూక్ష్మాం'' ''పూం జయాం'' ''వౄం భద్రి కాం '' ''వేం విభూతీం'' ''వైం విమలాం'' ''వోం అసిఘాత విద్యుతాం'' ''వౌం సర్వతో ముఖీం'' ''వం పీఠమ్''. ఈ విధముగ శక్తులను పూజించి పిదప రవిని పూజించవలెను. ఆవహనము చేసి పాద్యాదులు సమర్పించి హృదయాది షడంగ న్యాస పూర్వకముగ పూజ చేయవలయును. ''ఖ కారౌ మొదలు జర ద్వాయుహృదా'' వరకు సంకేతములచే సూచించిన రవి మంత్రము సర్వ ఫల ప్రదము. ఆగ్నేయ నైఋతి ఈశాన వాయవ్య దిక్కులందును, మధ్య యందును హృదాది పంచాంగములతో వాటి మంత్రములతో పూజించ వలెను. కర్ణి కామధ్యము నందే పూజించవలెను. తన యెదురుగా నున్న దిక్కు నందు అస్త్ర పూజ చేయవలెను. పూర్వాది దిక్కు లందు క్రమముగా చంద్ర బుధ గురు శుక్రులను ఆగ్నేయాది విదిక్కు లందు మంగళశ##నైశ్చర రాహుకేతువులను పూజించవలెను. పుష్ణిహింగు వచా చక్ర శిరీష లశున ఆమయములను మేకమాత్రము నందు నూరి అంజనము నశ్యము తయారు చేయవలయును. ఈ ఓషధులను ఈవిధముగ ఉపయోగించినచో గ్రహబాధతొలగును. పాఠాపథ్యావచా, శిగ్రుసింధు వ్యోషములును బొక్కక్క పలము చొప్పున గ్రహించి ఒక కుంచెడు మేకపాళ్ళతో ఉడకబెట్టి ఆ పాలనుండి తీసిన నెయ్యి సమస్త గ్రహబాధలను తొలగించును. వృశ్చికాశి, ఫల కుష్ఠ, లవణ శార్జ్గకములను నీటిలో ఉడికించి ఇచ్చినచో అపస్మార రోగము తొలగును. విదారి కుశకాశ, ఇక్షు క్వాథములతో చేసిన పాలనురోగికి త్రాగించవలెను. యష్టికూష్మాండరసమునందు సంస్కృతమైన ఘృతమును కాని పంచగవ్యమును గాని, ఇచ్చినచో జ్వరము తొలగును. ''ఓం భస్మాస్త్రాయ విద్మహే| ఏక దంష్ట్రాయధీమహి| తన్నోజ్వరః ప్రచోదయాత్'' ఈ మంత్రమును జపించుటచే జ్వరము తొలగును. శ్వాసరోగి కృష్ణాశన, నిశా, రాస్నా, ద్రాక్ష తైల గుడములను సేవించవలెను. లేదా మధు ఘృతములతో బార్ఞిని సేవించవలెను. లేదా పాఠా, తిక్త, కణ బార్జీలను తేనెతో నాకవలెను. ధాత్రీ విశ్వసితా, కృష్ణాముస్తా, ఖర్జూర మాగధీ, పీవరా, యివి ఎక్కిళ్ళను తగ్గించును. పైమూడు యోగములను తేనెతో సేవించవలెను. కామల రోగముకలవాడు జీరమాండూకి నిశా, ధాత్రీ రసములను త్రాగవలెను. త్రికటు పద్మకాష్ఠ, త్రిఫలా విడంగ దేవదారు రాస్నలను సమమైన పాళ్ళతో గ్రహించి చూర్ణముచేసి పటికి బెల్లముతో సేవించినచో కాసరోగము తప్పక నశించును.
అగ్ని మహాపురాణమున గ్రహహృన్మంత్రాది నిరూపణమును మూడువందలవ అధ్యాయము సమాప్తము.