Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏకోత్తర త్రిశతతమో7ధ్యాయః
అథ సూర్యార్చనమ్
అగ్ని రువాచ :
శయ్యాతు దండి సాజేశ పావకశ్చతురాననః | సర్వార్థ సాధక మిదం బీజం పిండార్థముచ్యతే. 1
స్వయం దీర్ఘ స్వరాద్యంచ బీజేష్వంగాని సర్వశః | ఖాతం సాధు విషంచైవ సబిందుం సకలం తథా. 2
గణస్యపంచ బీజాని పృథగ్ దృష్టఫలం మహత్ |
గజంజయాయ నమః ఏక దంష్ట్రాయ చలకర్ణినే గజవక్త్రాయ మహోదర హస్తాయ |
పంచాంగం సర్వసామాన్యం సిద్ధిః స్యాల్లక్ష జాప్యతః. 3
గణాధిపతయే గణశ్వరాయ గణనాయకాయ గణక్రీడాయ |
దిగ్ధలే పూజయేన్మూర్తీః పురావచ్చాంగ పంచకమ్ |
వక్రతుండాయ ఏక దంష్ట్రాయ మహోదరాయ గజవక్త్రాయ
వికటాయ విఘ్నరాజాయ ధూమ్ర వర్ణాయ | దిగ్విదిక్షు యజేదేతాన్లోకేశాంశ్చైవ ముద్రయా. 4
మధ్యమాతర్జనీ మధ్య గతాంగుష్ఠా సముష్టికౌ | చతుర్భుజం మోదకాఢ్యం దండ పాశాంకుశాన్వితమ్. 5
దంత భక్ష్యధరం రక్తం సాబ్జం పాశాంకుశైర్వృతమ్ | పూజయేత్తం చతుర్థ్యాంచ విశేషేణాథనిత్యశః. 6
శ్వేతార్క మూలేన కృతం సర్వాప్తిః స్యాత్తిలైర్ఘృతైః |
తండులైర్ధధి మధ్వాజ్యైః సౌభాగ్యం వశ్యతా భ##వేత్. 7
(అ) 2 /33
అగ్నిదేవుడు చెప్పెను. శార్‌జ్గి(గ కారము) దండి (అనుస్వార యుక్తము కావలెను). దానిలో పద్మేశుడు (ఈకారము) పాపకుడు (రకారము) ఈ నాలుగు అక్షరములను కలుపగ ఏర్పడిన బీజా క్షరము (గ్రీం) సర్వార్థ సాధకము పైబీజమునకు క్రమముగా దీర్ఘ స్వరములను చేర్చి అంగన్యాసము చేయవలయును. గణాధిపతికి గంగః గౌం గంఃగ్, అను ఐదు బీజాక్షరములున్నవి. అవి వేరువేరు ఫలమునిచ్చును. గజం జయాయనమః, ఏకదంష్ట్రాయ, చలకర్ణినే గజ వక్త్రాయ, మహోదర హస్తాయ, ఇవి సర్వ సామాన్యమైన పంచాంగములు. లక్ష పర్యాయములు జపించుటచే మంత్రసిద్ధికలుగును. అష్టదళకమలము ఏర్పరచి దిగ్దళములందు గణశుని నాలుగు విగ్రహములను పూజించవలయును. క్రమముగా ఐదు అంగములను కూడ పూజించవలయును. నమః చివర చేర్చి గణాధిపతయే, గణశ్వరాయ, గణనాయకాయ, గణక్రీడాయ అనునాల్గు మంత్రములు దిగ్దళమునందున్న మూర్తులను పూజించుటకు ఉపయోగించవలెను. అంగపంచకమును వెనుకటి వలెనే పూజించవలయును. వక్రతుండాయ ఏకదంష్ట్రాయ, మహోదరాయ, గజవక్త్రాయ, వికటాయ, విఘ్నరాజాయ, ధూమ్రవర్ణాయ, యని దిగ్వి దిక్కులందున్న మూర్తులను పూజించవలయును. పిదప దిక్పాలకులను పూజించవలెను. ముద్రా ప్రదర్శన ద్వారా పూజ శ్రేష్ఠము. మధ్యమాతర్జనీల మధ్య బొటన వ్రేలు ఉంచి పిడికిలి బిగించినచో అది గణశముద్ర. ఈ విధముగా ధ్యానించవలెను. నాలుగు భుజములు కలవాడును మోదకములును గ్రహించిన వాడును, దండ పాశాంకుశ, ములతో కూడినవాడును. దంత భక్ష్యములు ధరించినవాడును రక్తవర్ణుడును పద్మ పాశ అంకుశములను ధరించినవాడును అగు గణశుని పూజించవలెను. చతుర్థియందు విశేషముగా పూజించవలెను. శ్వేతార్క మూలముతో మూర్తి నిర్మించి తిలఘృత హోమములు చేసినచో సకల మనోరథములు సిద్ధించును. దధి మధు ఆజ్యములతో తండులములు హోమము చేసినచో సౌభాగ్యము వశిత్వము కలుగును.
ఘోషాసృక్ర్పాణధాత్వర్ధీ దండీ మార్తాండ భైరవః | ధర్మార్థ కామమోక్షానాం కర్తాబింబ పుటావృతః. 8
హ్రస్వాః స్యుర్మూర్తయః పంచ దీర్ఘాణ్యంగాని తస్యచ | సిందూరారుణ మీశానే వామార్దదయితం రవిమ్.
పాశాంకుశధరం దేవం హ్యక్షమాలాకపాలినమ్ | ఖట్వాంగాదికశక్తించ దధానం చతురాననమ్. 10
అంతర్బాహ్యే విషద్భక్తం పద్మస్థం రవిమండల్ |
ఆదిత్యాది యుతం ప్రార్చ్య ఉదితే7ర్కే7 ర్ఘకం దదేత్. 11
శ్వాసం విషాగ్ని విపదండీన్దులేఖాసకలో భృగుః | అర్కాయ భూర్భువఃస్వరే జ్వాలి కురస్త్ర్య జంగకమ్.
పద్మాసనో7రుణో రక్తవస్తు సద్యుతి బింబగః | ఉదానః పద్మ దృగ్ధోర్భ్యాం ధూమ్రకేతు రుదాహృతః. 13
రక్తా హృదాదయః సౌమ్యా వరదాః పద్మధారిణః |
విద్యుత్పుంజ నిభస్త్వర్కః శ్వేతః సోమో7రుణ కుజః. 14
బుధస్తద్వద్గురుః పీతః శుక్లః శుక్రః శ##నైశ్చరః | కృష్ణాం గారనిభోరాహుర్ధూమ్రః కేతురుదాహతః.
వామోరువా మహాస్తాస్తే దక్షహస్తాభయప్రదాః. 15
స్వనామాద్యన్త బీజాస్తే హస్తౌ సంశోధ్య చాస్త్రతః | అంగుష్ఠాదౌ తలే నేత్రే హృదాద్యం వ్యాపకం న్యసేత్.
మూల బీజైస్త్రిభిః ప్రాణవ్యాపకం న్యస్య సంగకమ్ |
ప్రక్షాల్య పాత్రమస్త్రేణ మూలేనా77పూర్య వారిణా. 17
గంధపుష్పాక్షతం న్యస్య దూర్వామర్ఘ్యం చమంత్రయేత్ |
ఆత్మానం తేన సంప్రోక్ష్య పూజాద్రవ్యంచ వైభవమ్. 18
ప్రభూతం విమలం సారమారాధ్యం పరమం సుఖమ్ | పీఠాద్యాన్కల్పయేదేతాన్హృదా మధ్యే విదిక్షుచ. 19
పీఠోపరి హృదాద్యంచ కేసరేష్వస్త్ర శక్తయః | రాందీప్తాం రీం తథాసూక్ష్మాంరూం జయారౄంచ భద్రయా.
రేం విభూతి రైం విమలాం రోమపోద్యాథ విద్యుతమ్ |
రౌం సర్వతోముఖీరం చపీఠం ప్రార్చ్యరవిం యజేత్. 21
ఆవాహ్యదద్యాత్పాద్యాది హృత్షడంగేన సువ్రతః | ఖకారౌ దండినౌ చండౌ మజ్జాదశనసంయుతా. 22
మాంసాదీర్ఘా జవద్వాయు హ్చదైతత్సర్వదం రవేః | వహ్నీశరక్షోమరుతాం దిక్షుపూజ్యా హృదాదయః. 23
స్వమంత్రైః కర్ణికాన్తఃస్థాదిక్షుతం పురతశ్చధృక్ | పూర్వాదిదిక్షు సంపూజ్యాశ్చంద్రజ్ఞ గురుభార్గవాః. 24
ఆగ్నేయాదిషు కోణషు కుజమన్దాహికేతవః | స్నాత్వావిధివదాదిత్య మారాధ్యార్ఘ్య పురఃసరమ్. 25
కృతాంతమైశే నిర్మాల్యం తేజశ్చండాయ దీపితమ్ | రోచనం కుంకుమం వారిర క్తగంధాక్ష తాంకురాః. 26
వేణుబీజయవాః శాలిశ్యామాక తిలరాజికాః | జపాపుష్పాన్వితాం దత్త్వాపాత్రైః శిరసిధార్యతత్. 27
జానుభ్యామవనిం గత్వాసూర్యాయార్ఘ్యం నివేదయేత్ |
స్వవిద్యా మంత్రితైః కుంభైర్నవభిః ప్రార్చ్య వైగ్రహాన్. 28
గ్రహాదిశాంతయే స్నానం జప్త్వార్కం సర్వమాప్నుయాత్|
సంగ్రామ విజయంసాగ్ని బీజదోషం సబిందుకమ్. 29
న్యస్య మూర్ధాదిపాదాంతం మూలంపూజ్యతు ముద్రయా |
స్వాంగానిచ యథాన్యాసమాత్మానం భావయేద్రవిమ్. 30
ధ్యాపం చ మారణస్తంభే పీతమాప్యాయనే సితమ్ | రిపుఘాతవిధౌ కృష్ణం మోహయేచ్ఛక్ర చాపవత్. 31
యో7భిషేకజప ధ్యాన పూజా హోమవరః సదా | తేజస్వీ హ్యజయః శ్రీమాన్స ముద్రాదౌ జయం లభేత్.
తాంబూలా దావిదం న్యస్య జప్త్వా దద్యా దుశీరకమ్ |
న్యస్త బీజేన హస్తేన స్పర్శనం తద్వశే స్మృతమ్. 33
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సూర్యార్చన విధానం నామైకోత్తర త్రిశతతమో7ధ్యాయః.
ఘోష (హ) అసృక్ (ర) ప్రాణ (య) శాంతి (ఔ) అర్థీ (ఉ) దండ (ం) కలుపగ ఏర్పడిన (హ్యౌ) ఓం అనుమార్తాండ భైరవమును బింబ బీజముతో సంపుటితము చేసినచో సాధకునకు ధర్మార్థకామ మోక్షములు లభించును. ఐదు హ్రస్వాక్షరములను ఆదియందు బీజముగ చేర్చి పంచమూర్తుల న్యాసము చేయవలయును. దీర్ఘస్వర బీజములతో హృదయాద్యంగన్యాసము చేయవలయును. ధ్యానము సిందూరమువలె ఎర్రగానున్నవాడును, ఈశాన్య దిక్కునందు వామార్థమున భార్యా సహితుడై వున్నవాడును అగు సూర్యునకు నమస్కారము. ఆదిత్యాదిపరివృతమగు రవి మండలమును పూజించి ఉదయ సమయము అర్ఘ్యము ఇవ్వవలెను. ఈ శాన్యమునందు కృతాంతునకు నిర్మాల్యమును చండునకు దీపిత తేజస్సును సమర్పించవలెను. రోచన కుంకుమ జల రక్త చందన అక్షతాంకుర వేణు బీజయవశాలి శ్యామాక తిల రాజక జపాపుష్పములు అర్ఘ్య పాత్రము నందుంచి, దానిని శిరస్సుపై ధరించి మోకాళ్ళపై కూర్చుండి సూర్యునకు అర్ఘ్యము ఇవ్వవలెను. స్వమంత్రములచే అభిమంత్రితములగు కలశములతో గ్రహములను పూజించి గ్రహాది శాంతి కొరకై శాంతికలశజలముతో శాంతిచేసి సూర్యమంత్రము జపించువాడు సకల మనోరథములను పొందును. సంగ్రామ విజయ మంత్రమునందు బిందు పోషక బిందుయుక్తర చేర్చి ఆమంత్రముతో శిరస్సు నుండి పాదముల వరకు ముద్రా ప్రదర్శన పూర్వకముగ ఆవాహన చేయుచు సూర్యుని పూజించవలెను. అంగన్యాసము చేసి తానే రవియని భావించవలెను. మారణస్థంబనము లందు సూర్యుని పీతవర్ణునిగాను ఆప్యాయనమునందు శ్వేతవర్ణుని గాను శత్రు సంహారమునందు కృష్ణవర్ణునిగాను మోహన కర్మయందు ధనుస్సు వంటి ఆకారము కలవానినిగాను భావన చేయవలయును. సూర్యుని అభిషేక, జప, ధ్యానపూజ, హోమములందు సర్వదా లగ్నుడైనవాడు తేజశ్శాలియై అజేయుడై శ్రీమంతుడై యుద్ధాదులందు జయమును పొందును. తాంబూలాదులందు ఈ మంత్రన్యాసము చేసి దానియందు ఉశీరకము పుంచి తన చేతిలో కూడ సంగ్రామ విజయ బీజమును వ్రాసి ఆ తాంబూలము ఎవరికైన ఇచ్చినను హస్తముతో స్పృశించినను అతడు వశుడగును.
అగ్ని మహాపురాణమును గణపతి సూర్యార్చనకథనమను మూడువందల ఒకటవ అధ్యాయము సమాప్తము.