Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతురధిక త్రిశతతమో7ధ్యాయః

అథ పంచాక్షరాది పూజాదికమ్‌

అగ్నిరువాచ:

మేషః సంజ్ఞా విషం సాజ్యమస్తి దీర్ఘోదకంరసః | ఏతత్పంచాక్షరం మంత్రం శివదంచ శివాత్మకమ్‌. 1

తారకాది సమభ్యర్చ్య దేవత్వాది సమాప్నుయాత్‌ | జ్ఞానాత్మకం పరంబ్రహ్మ పరం బుద్ధిః శివోవృది. 2

తచ్ఛక్తి భూతః నర్వేశో భిన్నో బ్రహ్మాది మూర్తిభిః|

మంత్రార్ణాః పంచ భూతాని తన్మాత్రా విషయాస్తథా. 3

ప్రాణాది వాయవః పంచ జ్ఞాన కర్మేంద్రియాది చ| సర్వం పచాక్షరం బ్రహ్మ తద్వదష్టాక్షరాత్మకమ్‌. 4

గవ్యేన ప్రోక్షయేద్దీక్షా స్థానం మంత్రేణ చోదితమ్‌ | తత్రసంభూత సంభారః శివమిష్ట్వా విధానతః. 5

మూల మూర్త్యంగా విద్యాభి స్తండులక్షేపణాదికమ్‌ | కృత్వాచరుం పచేతర్షీరం పునస్తద్విభ##జేత్త్రిధా. 6

నివేద్యైకం పరం హుత్వా సశిష్యో7న్యన్యద్భజేద్గురుః | ఆచమ్య సకలీకృత్య దద్యాచ్ఛిష్యాయదేశికః. 7

దంతాకాష్ఠంహృదా జప్తం క్షీరి వృక్షాది సంభవమ్‌ | సంశోధ్య దంతాన్‌ తం క్షిప్త్వా ప్రక్షాల్యైత త్షిపేద్బువి.

పూర్వేణ సౌమ్యవారీశగతం శుభమతో7శుభమ్‌ | పునస్తం శిష్యమాయాన్తం శిఖాబంధాది రూక్షితమ్‌. 9

కృత్వా వేద్యాం సహానేన స్వపేద్దర్భాస్తరే బుధః | సుషుప్తం వీక్ష్యతం శిషః ప్రభాతే శ్రావయేద్గురమ్‌. 10

అగ్ని దేవుడు పలికెను. మేషము (న) సంజ్ఞా విషము (మః) శకార పూర్వాక్షరము (శ) దానితో అక్షి (సి) దీర్ఘోదకము (వా) మరుత్‌ (య) ఇది పంచాక్షర మంత్రము (నమః శివాయ) ఇది శివ స్వరూపము. మంగళప్రదము. దీనికి ఓంకారము చేర్చి జపింనచో దేవత్వాదులను పొందును. జ్ఞానాత్మక మగు పరబ్రహ్మయే పరమ బుద్ధి రూపము. అదియే శివ రూపమున హృదయము నందున్నది. శక్తి రూపము మగు ఆ సర్వేశ్వరుడే బ్రహ్మాది మూర్తులతో వున్నాడు. మంత్రము నందలి అక్షరములు ఐదు మహా భూతములు. ఐదు తన్మాత్రలు, ఐదు విషయములు, ఐదు ప్రాణాది వాయువులు, ఐదు జ్ఞానేంద్రయములు, ఐదుకర్మేంద్రియములు ఐదు. ఇవన్నియు పంచాక్షర బ్రహ్మ స్వరూపమైనవి. అట్లే అష్టాక్షరాత్మకమైనవి. దీక్షా స్థానమును మంత్రోచ్చారణ చేయుచు పంచగవ్యములతో ప్రోక్షించవలయును. సంభారములు సమకూర్చుకుని శివును పూజించి మూల మంత్రము ఇష్ట మూర్తికి సంబంధించిన మంత్రములు, అంగ మంత్రములు పఠించుచు అక్షతలను చల్లి భూతములను తొలగించుకొని ఆత్మ రక్షణ చేసికొనవలెను. పిదప చెరువు వండి మూడు భాగములు చేసి ఒక భాగము ఇష్ట దేవతకు నివేదన చేసి రెండవ భాగము ఆహుతి యిచ్చి మూడవ భాగము శిష్య సహితుడై తాను భుజించవలెను. పిదప ఆచమనసకలీకరణములు చేసి శిష్యుని హృదయ మంత్రముతో అభిమంత్రించి పాల చెట్టుకు సంబంధించిన కాష్టమును దంత ధావనార్థమై ఇవ్వవలెను. దానితో దంతములు శోధన చేసుకుని, దానిని చీరి నాలుక శుభ్రము చేసుకొని కడిగి నేలపై విసిరి వేయవలెను. తూర్పవైపు విసిరిన ఆ దంత కాష్ఠము ఉత్తరము వైపు కాని పశ్చిమము వైపు కాని వెళ్ళి పడినచో శుభమగును. అట్లు కానిచో అశుభము. పిదప తన ఎదుటకు వచ్చుచున్న శిష్యునకు శిఖా బంధముచే రక్షణ కల్పించి జ్ఞానవంతుడైన గురువు ఆతనితో కలిసి వేదికపై నున్న కుశాస్తరణముపై నిద్ర పోవలయును. శిష్యుడు రాత్రి తాను చూసిన స్వప్నము ప్రాతః కాలమున గురువునకు చెప్పవలెను.

శుభైః సిద్ధిదైర్భక్తిసై#్తః పునర్మండలార్చనమ్‌ | మండలం భద్రకా ద్యుక్తం పూజయేత్సర్వ సిద్ధిదమ్‌. 11

స్నాత్వాచమ్మ మృదాదేహం మంత్రైరాలిప్య కల్ప్యతే | శివ తీర్థేనరః స్నాయాదఘ మర్షణ పూర్వకమ్‌. 12

హస్తాభిషేకం కృత్వాథ ప్రాయాత్పూజాగృహంబుధః | మూలేనాబ్జాసనం కుర్యాత్తైన పూరకకుంభకాన్‌.

అత్మానం యోజయిత్వోర్ధ్వం శిఖాన్తే ద్వాదశాంగులే | సంశోష్య దగ్ధ్వా స్వతనుం ప్లావయేదమృతేనచ. 14

ధ్యాత్విదివ్యం వపుస్తస్మిన్నాత్మానంచ పునర్నయేత్‌ |

కృత్వైవం చాత్మశుద్ధిః స్యాద్విన్యస్యార్చన మారభేత్‌. 15

క్రమాత్కృష్ణాసితశ్యామ రక్తపీతా నగాదయః | మంత్రార్ణా దండినాంగాని తేషు సర్వాస్తు మూర్తయః. 16

అంగుష్ఠాదికనిష్ఠాన్తం విన్యస్యాంగాని సర్వతః | న్యసేన్మంత్రాక్షరం పాదగుహ్య హృద్వక్త్రమూర్ధను. 17

వ్యాపకం న్యస్య మూర్దాది మూలమంగాని విన్యసేత్‌ | రక్తపీత శ్యామసితాన్పీఠపాదాన్స్వకోణజాన్‌. 18

స్వాంగాన్మంత్రైర్న్యసేద్గాత్రాణ్యధర్మాదీనిదిక్షుచ |

తత్రపద్మం చ సూర్యాది మండల త్రితయం గుణాన్‌. 19

పూర్వాది పత్రే వామాద్యా నవమీ కర్ణికోపరి | వామాజ్యేష్ఠాక్రమాద్రౌదీ కాలీకల వికారిణీ. 20

బలవికారిణీ చాథ బరప్రమథనీతథా | సర్వభూత దమనీ చ నవమీ చ మనోన్మనీ. 21

శ్వేతారక్తాసితా పీతా శ్యామా వహ్ని నిభా7సితా |

కృష్ణారుణాశ్చతాః శక్తీర్జ్వారూపాః స్మరేత్ర్కమాత్‌. 22

ఆ స్వప్నము శుభ##మై సిద్ధి సూచకమైనచో మంత్ర దేవతల విషయమున భక్తి కలుగును. పిదప మండలార్చనము చేయవలయును. సర్వతో భద్రాది మండలములలో పూజించినచో సర్వ సిద్ధులు కలుగును. స్నానాచమనములు చేసి మంత్రోచ్చారణ పూర్వకముగ శరీరమునకు మట్టి పూసుకొని శివతీర్థమునందు అఘమర్షణ పూర్వకముగా స్నానము చేయవలెను. హస్తశుద్ధి చేసికొని పూజాగృహమును ప్రవేశించి మూలమంత్రముతో కమలాసనమును భావనచేసి మూల మంత్రముతో పూరక కుంభక, ప్రాణాయామములు చేయవలెను. జీవాత్మను పైన బ్రహ్మరంధ్రమునందు వున్న పర మాత్మతో కలువవలెను. శిరస్సు మొదలు శిఖాంతము వరకువున్న పన్నెండు అంగులముల విస్తృత స్థానమే బ్రహ్మ రంధ్రము. వాయుబీజముతో శరీరమును శుష్కింపచేసి అగ్ని బీజముతో శరీరమును భస్మముచేసి అమృతబీజముతో ఆభస్మమును ఆప్లావితము చేయవలయును. దివ్యరూపధ్యానము చేయుచు జీవాత్మను మరల తన శరీరములో ఉంచుకొనవలెను. ఇట్లు చేయుటచే ఆత్మశుద్ధియగును. పిదప న్యాసముచేసి పూజ ప్రారంభించవలెను. పంచాక్షరిలోని ఐదు అక్షరముల వర్ణములు క్రమముగ కృష్ణశ్వేత, శ్యామ, రక్త పీతములు. నకారాద్యక్షరములతో వరసగా అంగన్యాసము చేసి ఆ అంగముల పైననే తత్పురుషాది మూర్తి పంచకాది న్యాసము చేయవలెను. పిదప అంగుష్ఠము మొదలు కనిష్ఠిక వరకు ఐదు వ్రేళ్ళపై క్రమముగా ఆంగ మంత్రిములను న్యాసము చేసి పాద గుహ్య హృదయముఖ శిరస్సులందు మంత్రాక్షర న్యాసము చేయవలయును. పిదప శిరస్సు మొదలగు వాటియందు ఈ అంగముల వ్యాపకన్యాసము చేయవలయును. మూల మంత్రమును అంగమంత్రములను కూడ అచట న్యాసము చేయవలయును. ఆగ్నేయాది విదిక్కులందు ధర్మాది పీఠపాదములు క్రమముగా రక్త పీత శ్యామశ్వేత వర్ణములను భావనచేసి వాటిపై మంత్రాక్షర న్యాసము చేసి పూర్వాది దిక్కులందు ఆధ్ర్మాదులను భావనచేసి వాటిపై ఆంగమంత్ర న్యాసము చేయవలెను. ఇట్లే యోగపీఠమును దానిపై అష్టదళ కమలమును సూర్య సోమ అగ్ని మండలములను సత్త్వాది గుణత్రయమును భావన చేయవలెను. పూర్వాది దళములందు వామాది శక్త్యష్టకమును కర్ణికపై తొమ్మిదవ శక్తిని భావన చేయవలయును. వామా జ్యేష్టారౌద్రీ కాళీ, కల వికారిణీ బల

(అ) 2/34

వికారిణీ బలప్రమథనీ సర్వ భూతదమనీ మనోన్మనీయను ఈ శక్తులు జ్వాలా స్వరూపములు. వీటి వర్ణములు క్రమముగ శ్వేత రక్త సితపీత శ్యామ అగ్ని సదృశ అసిత, కృష్ణ, అరుణములు ఈవిధముగ భావన చేయవలెను.

అనన్తయోగ పీఠేచ ఆవాహ్యాథ హృదబ్జతః | స్ఫటికాభం చతుర్బాహుం ఫలశూలధరం శివమ్‌. 23

సాభయం వరదం పంచవదనంచ త్రిలోచనమ్‌ | పత్రేషు మూర్తయః పంచస్థాప్యాస్తత్పురుషాదయః. 24

పూర్వే తత్పురుషః శ్వేతోహ్యఘెరో7ష్టభుజోసితః | చతుర్భాహు ముఖః పీతః సద్యోజాతశ్చ పశ్చిమే. 25

వామదేవః స్త్రీవిలాసీ చతుర్వక్త్రభుజో7రుణః | సౌమ్యే పంచాస్య ఈశానే ఈశానః సర్వదః సితః. 26

ఇష్టాంగాని యథాన్యాయ మనన్తం సూక్ష్మమర్చయేత్‌ | సిద్ధేశ్వరం త్వేకనేత్రం పూర్వాదౌదిశిపూజయేత్‌.

ఏక రుద్రం త్రినేత్రంచ శ్రీకంఠంచ శిఖండినమ్‌ | ఐశాన్యాది విదిక్ష్వేతే విద్యేశాః కమలాసనాః. 28

శ్వేతః పీతః సితోరక్తో ధూమ్రో రక్తో7రుణః సితః శూలాశనిశ##రేష్వాసబాహవశ్చతురాననాః. 29

ఉమా చండీశ నందీశౌ మహాకాలో గణశ్వరః | వృషో భృంగరిటి స్కందానుత్తరాదౌ ప్రపూజయేత్‌ 30

కులిశం శక్తి దండౌచ ఖడ్గం పాశధ్వజౌ గదామ్‌ | శూలం చక్రం యజేత్పద్మం పూర్వాదౌ దేవమర్చ్యచ.

తతో7ధి వాసితం శిష్యం పాయయేద్గవ్య పంచకమ్‌ |

ఆచాన్తం ప్రోక్ష్య నేత్రాన్తైర్నేత్రే నేత్రేణ బంధయేత్‌. 32

ద్వారే ప్రవేశ##యేచ్ఛిష్యం మండపన్యాథ దక్షిణ | సాసనాది కుశాసీనం తత్ర సంశోధయేద్గురుః. 33

ఆదితత్త్వాని సంహృత్య పరమార్థేలయః క్రమాత్‌ | పునరుత్పాదయేచ్ఛిష్యం సృష్టిమార్గేణ దేశికః. 34

న్యాసం శిష్యే తతః కృత్వాతం ప్రదక్షిణ మానయేత్‌ |

పశ్చిమద్వార మానీయ క్షేపయేత్కు సుమాంజలిమ్‌. 35

యస్మిన్పతంతి పుష్పాణి తన్నామాద్యం వినిర్దిశేత్‌ | పార్శ్వే యాగభువః ఖాతే కుండే సన్నాభి మేఖలే. 36

శివాగ్నిం జనయిత్వేష్ట్వా పునః శిష్యేణ చార్చయేత్‌ |

ధ్యానేనాత్మని తం శిష్యం సంహృత్య ప్రలయకమ్రాత్‌. 37

పునరుత్పాద్య తత్పాణౌ దద్యాద్దర్భాంశ్చ మంత్రితాన్‌ | పృథివ్యాదీని తత్త్వాని జుహుయాద్ధృదయాదిభిః

ఏకైకన్య శతం హుత్వా వ్యోమమూలేన హోమయేత్‌ | హుత్వా పూర్ణాహుతిం కుర్యాదస్త్రేణాష్టాహుతీర్హునేత్‌.

ప్రాయశ్చిత్తం విశుద్ధ్యర్థం తతః శేషం సమాపయేత్‌ |

కుంభం సుమంత్రితం ప్రార్చ్య శిశుం పీఠే7భిషేచయేత్‌. 40

శిష్యేతు సమయం దత్త్వా స్వర్ణాద్యైః స్వగురుం యజేత్‌ | దీక్షా పంచచాక్షర స్యోక్తా విష్ణ్వాదే రేవమేవహి. 41

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పంచాక్షరదీక్షా విధానం నామ చతురధిక

త్రిశతతమో7ధ్యాయః.

అనంతయోగ పీఠముపై తన హృదయ పద్మములోనున్న శివుని ఆ "స్పటిక కాంతిని కలవాడు, నాలుగు బాహువులు కలవాడు, పంచవదనుడు త్రిలోచనుడు. అగు శివుని ఆవాహన చేయుచున్నాను." అని చెప్పచు ఆవాహన చేయవలెను. పిదప కమల దళములపై తత్పురుషాది పంచమూర్తులను స్థాపించవలెను. తూర్పున తత్పురుషుడు శ్వేతవర్ణుడు. అష్ట భుజుడగు ఆఘోరుడు కృష్ణవర్ణుడు. సద్యోజాతుడు పశ్చిమమున వుండును. ఆతనికి నాలుగు బహువులు నాలుగు ముఖములు వుండును. వర్ణము పీతము. వామదేవరూపము స్త్రీతో ప్రకాశించును. ఆరుణవర్ణుడగు ఇతడు నాలుగు ముఖములతో నాలుగు భుజములతో ఉత్తరము నందుండును. ఈ శాన్య దిక్కునందున్న ఈశానునకు ఐదు ముఖము లుండును. ఆతడు శ్వేతవర్ణుడు సర్వకామ ప్రదాత పిదప అంగదేవతలను యథోచితముగ పూజించి పూర్వాది దిక్కులందు అనంత సూక్ష్మ సిద్దేశ్వశ ఏకనేత్రులను పూజించవలెను. ఈశాన్యాదివిదిక్కులందు ఏకరుద్ర త్రినేత్ర శ్రీ కంఠ, శిఖండులను, పూజించవలెను. వీరందరును విద్యేశ్వరులు. కమలాసనముపై కూర్చుందురు వీరి శరీర కాంతి క్రమముగ శ్వేత పీత సిత రక్తధూమ్రరక్త అరుణనీలములు. వీరందరును చతుర్భుజులు. శూల అశని, శర, చాపములను ధరించి యుందురు. వీరికి ముఖములు కూడ నాల్గేసి యుండును. తృతీయ అష్టదళ కమలమునందు ఉత్తరాది దళములపై ప్రదక్షిణ క్రమమున ఉమాచండీశ నందీశ మహాకాల గణశ్వర వృషభ భృంగీరిటి, స్కందులను పూజించవలెను. పిదప పూర్వాది దిక్కులందు చతురస్రరేఖపై ఇంద్రాది దిక్పాలకులను వారి అస్తములగు వజ్రశక్తి ఖడ్గ పాశ ధ్వజగదాశూల చక్రపద్మములను పూజించవలెను. ఈ విధముగా దేవతా పూజచేసి గురువు అధివాసితుడగు శిష్యునిచే పంచగవ్యపానము చేయించి, ఆచమనానంతరము ఆతనిని ప్రోక్షించవలెను. పిదప నూతన వస్త్రముచే "వౌషట్‌" యని ఉచ్చరించుచు ఆతని నేత్రముల బంధించి మండప దక్షణ ద్వారమున ప్రవేశము చేయించికుశాసనముపై కూర్చుండ బెట్టి శోధనము చేయవలెను. పాంచ భౌదికతత్త్వముల సంహారము చేసి క్రమముగా శిష్యుని పరమాత్మవిలీనుని చేసి పిదప సృష్టి మార్గముచే యాతనిని మరల పుట్టించవలెను. పిదప శిష్యుని దివ్య శరీరముపై న్యాసము చేసి దక్షిణ క్రమమున పశ్చిమ ద్వారమునకు తీసుకొని వచ్చి వానిచే పుష్పాంజలి విసరునట్లు చేయవలెను. ఆ పుష్పములు ఏ దేవత శిరస్సుపై బడునో ఆదేవత నామమును ఆదియందుంచి శిష్యునకు పేరుపెట్టవలెను. యజ్ఞభూమి ప్రక్క సుందరమగు నాభియు మేఖలయు యున్న అగ్ని కుండమునందు శివాగ్నిని ఆవిర్భవింప చేసి తాను పూజించి శిష్యుని చేత కూడ పూజ చేయించవలెను. ఆశిష్యుని సంహార క్రమమున తనలో విలీనుని చేసుకొని మరల సృష్టి క్రమమున ఉత్పాదనము చేసి ఆతని హస్తమునందు అభి మంత్రితములగు కుశలువుంచి హృదయాది మంత్రములతో పృథివ్యాది తత్త్వములను ఉద్దేశించి వాటి మంత్రము తో వందచొప్పున హోమములుచేసి ఆకాశ తత్త్వమునకు కూడ నూరు హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి యిచ్చి ఆస్తమంత్రమును ఉచ్చరించుచు ఎనిమిది హోమములు చేయవలెను. పిదప, విశుద్ధికొరకై ప్రాయశ్చిత్తము చేసి, అభిమంత్రితమగు కలశను పూజించి, పీఠముపైనున్న శిష్యునకు అభిషేకముచేసి, ఆతనికి సమయాచారము ఉపదేశింపవలెను. శిష్యుడు స్వర్ణాదులను ఇచ్చి గురువును పూజించవలెను. ఇది శివపంచాక్షరీ దీక్ష; విష్ణ్వాది దేవతా మంత్రదీక్షకూడ ఇట్లే చేయవలెను.

అగ్ని మహా పురాణమున పంచాక్షర దీక్ష విధాన మను మూడు వందల నాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page