Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ నవాధిక త్రిశతతమో7ధ్యాయః

అథ త్వరితా పూజాః

అగ్నిరువాచ :

త్వరితాంగాన్సమాఖ్యాస్యే భుక్తిముక్తి ప్రదాయకాన్‌ |

ఓం ఆధారశ##క్త్యైనమః . ఓం హ్రీం (ప్రోం) పురుపురు మహాసింహాయ నమ) | ఓం పద్మాయ నమః |

ఓం హ్రీం హ్రూం ఖేచఛేక్షః . స్త్రీం ఓం హ్రూం క్షైం హ్రూం ఫట్‌ త్వరితాయై నమః |

ఖేచ హృదయాయనమః | చఛే శిరసే సమః |

చేక్షః శిఖాయై నమః | క్షస్త్రీం కవచాయ నమః |

స్త్రీం హ్రూం నేత్రాయ నమః | హూంఖే అస్త్రాయఫట్‌ నమః |

ఓం త్వరితా విద్యాం విద్మేహే తూర్ణ విద్యాచ ధీమహి |

తన్నోదేవీ ప్రచోదయాత్‌ | శ్రీప్రణీతాయై నమః |

హ్రూం కారాయై నమః | ఓం కారాయై నమః | ఓం ఖేచ

హృదయాయ నమః | ఖేచర్యై నమః | ఓం చండాయై

నమః | క్షస్త్రీం కవచాయ నమః | ఛేదన్యై నమః |

క్షేపణ్యౖనమః | స్త్రీయై హూంకార్యైనమః|

క్షేమం కర్యై జయాయై విజయాయై కింకరాయరక్ష |

ఓం త్వరితాజ్ఞయా స్థిరోభవ వషట్‌ | తోతలాత్వరితా తూర్ణేత్యేవం విద్యేయ మీరితా. 1

శిరోభ్రూమస్తకే కంఠే హృదినాభౌచ గుహ్యకే | ఊర్వోశ్చ జానుజంఘెరుద్వయే చరణయోః క్రమాత్‌. 2

న్యస్తాంగో న్యస్తమంత్రస్తు సమస్తం వ్యాపకం న్యసేత్‌| పార్వతీ శబరీ చేశా వరదా భయ హస్తికా. 3

మయూరవలయా పిచ్ఛమౌలిః కిసలయాంశుకా | సింహాసనస్థా మయూర బర్హచ్ఛత్ర సమన్వితా. 4

త్రినేత్రాశ్యామలాదేవీ వనమాలా విభూషణా | విప్రాహి కర్ణాభరణా క్షత్రకేయూర భూషణా. 5

వైశ్యనాగ కటీబంధా వ్భషలాహి కృతనూపురా | ఏవం రూపాత్మికా భూత్వాతన్మంత్రం నియుతంజపేత్‌. 6

ఈశః కిరాతరూపో7భూత్పురా గౌరీ చతాదృశీ | జపేద్ద్యాయే త్పూజయేత్తాం సర్వసిద్ధై విషాదిహృత్‌. 7

అష్ట సింహాసనే పూజ్యాదలే పూర్వాది కేక్రమాత్‌ | అంగగాయత్రీ ప్రణీతా హూంకారాద్యా దలాగ్రకే.

ఫట్‌కారీ చాగ్రతోదేవ్యాః శ్రీభీజే నార్చయేదిమాః | లోకేశాయుధవర్ణాస్తాః ఫట్‌ కారీతు ధనుర్ధరా. 9

జయాచవిజయా ద్వాఃస్థే పూజ్యే సౌవర్ణయష్టికే | కింకరా బర్బరీముండీ లగుడీ చ తయోర్బహిః. 10

ఇష్ట్వెవం సిద్ధయే ద్రవ్యైః కుండేయోన్యాకృతౌహునేత్‌ | హేమలాభో7ర్జునైర్థానైర్గోధూమైః పుష్టిసంపదః. 11

యవైర్దాన్యైస్తిలైః సర్వసిద్ధిరీతి వినాశనమ్‌ | అక్షైరున్మత్తతాశత్రోః శాల్మలీభిశ్చమారణమ్‌. 12

జంబూభిర్ధన ధాన్యాప్తిస్తుష్టిర్నీలోత్పలైరపి | రక్తోత్పలైర్మహాపుష్టిః కుంద పుషై#్పర్మహోదయః 13

మల్లికాభిః పురక్షోభః కుముదైర్జన వల్లభః అశోకైః పుత్రలాభః స్యాత్పాటలాభిః శుభాంగనా. 14

అమ్రై రాయుస్తిలైర్లక్ష్మీర్భిల్వైః శ్రీశ్చమ్ప కైర్ధనమ్‌ |

ఇష్టం మధుక పుషై#్పశ్చ బిల్వైః సర్వజ్ఞతాం లఖేత్‌. 15

త్రిలక్షజప్యా త్సర్వాప్తిర్హోమాద్ద్యా నాత్తథేజ్యయా | మండ7లేభ్యర్చ్య గాయత్ర్యాఆహుతీః పంచవింశతిమ్‌.

దద్యాచ్ఛతత్రయం మూలాత్పల్ల వైర్దీక్షితోభ##వేత్‌ | పంచగవ్యం పురాపీత్వా చరుకం ప్రాశ##యేత్సదా. 17

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే త్వరితా పూజావిధివర్ణనంనామ నవాధికత్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. త్వరితావిద్య యొక్క అంగములు భుక్తిముక్తి ప్రదాయకములు వాటిని చెప్పెదను. "ఓం ఆధారశ##క్యైనమః" మొదలు "అస్త్రాయ ఫట్‌ నమః" వరకును చెప్పినవి అంగన్యాస మంత్రములు. "ఓంత్వరితా విద్యాం" మొదలు "ప్రచోదయాత్‌" వరకు త్వరితాగాయత్రి. పిదప పీఠమునందలి కమల కర్ణికయొక్క కేసరమునందు ఈ క్రింది అంగదేవతలను పూజించవలెను. "ప్రణీతాయైనమః" మొదలు "క్షేమంకర్యైనమః" వరకు మంత్రములతో ఆయా అంగదేవతలను పూజించవలెను. త్వరితా విద్యకు తోతలా, త్వరితా తూర్ణాయని మూడు పేర్లు. దీని అక్షరములను శిరోభ్రూలలాట కంఠ హృదయ, నాఖి, గుహ్య ఊరు, జాను, జంఘా, చరణములపై న్యాసముచేసి సమస్త విద్యతో వ్యాపకన్యాసము చేయవలెను. ఈమెను పార్వతీ శబరి ఈశ, వరదా భయహస్తికా, మయూరవలయా పిచ్చ మౌళి, కిసల యాంశుక, సింహాసనస్థ మయూరబర్హచ్ఛత్రసమన్విత, త్రినేత్ర శ్యామల, దేవి, వనమూలావిభూషణ, విప్రాహి కర్ణాభరణ, క్షత్రకేయూరభూషణ, వైశ్యనాగ కటిబంధ, వృషలాహికృత నూపుర యను రూపమున ధ్యానించి పదివేలు జపము చేయఫలెను. ఈశ్వరుడు కిరాత రూపుడైనపుడు గౌరి ఆరూపమును ధరించినది. ఈదేవిని జపించి ధ్యానముచేసి పూజించినచో సర్వసిద్ధులు లభించును. విషాదులు తొలగిపోవును. పూర్వాది దళములలోపల కర్ణికయందు ఎనిమిది సింహాసనములపై ఈ దేవతలను క్రమముగా పూజించవలెను. హృదయాది అంగషట్కముతో కూడిన గాయత్రి ప్రణీతలను పూజించవలెను. పూర్వాది దళములందు హుంకారాదులను పూజించవలెను. దళాగ్రభాగమున దేవీ సమ్ముఖమున ఫట్కారిని పూజించవలెను. శ్రీ బీజముతో పూజించవలెను. హుంకారి మొదలగు వారి ఆయుధ వర్ణాదులు ఆయా దిక్కుల దిక్పాలకుల ఆయుధ వర్ణాదులతో సమానములు. ఫట్కారిమాత్రము ధనుర్భాణములను ధరించి యుండును. మండ ద్వారమున జయా విజయలను పూజించవలెను. వారు సువర్ణయష్టి ధరించి యుందురు. వారికి బయట బర్బరి; యనుకింకరిని పూజించవలెను. ఆమె ముండితమస్తకయై కర్ర ధరించి యుండును. పిదప హోమద్రవ్యము తో యోన్యాకృతియగు కుండమున హోమము చేయవలయును. తెల్లని ధాన్యమును హోమము చేసినచో సువర్ణము గోధూమల చేత పుష్టి సంపదలు యవ ధాన్య తిలలచే సర్వసిద్ధి ఈ తినాశనములు కల్గును. అక్షములతో హోమము చేసినచో శత్రువుకు ఉన్మాదమ, శాల్మలీ బీజములచే మారణము, జంబూ ఫలములచే ధనధాన్య ప్రాప్తి, నీలోత్పలములచే తుష్టి రక్తోత్పలములచే మహాపుష్టి, కుందములచే అభ్యుదయము కలుగును. మల్లికా పుష్పములు హోమము చేసినచో నగరమున క్షోభ కలుగును. కుముదములచే జనప్రియత్వము లభించును. అశోక కుసుమములచే పుత్రప్రాప్తి, పాటలా పుష్పములచే ఉత్తమాంగనా ప్రాప్తి, ఆమ్రఫలములచే, ఆయుర్దాయము, తిలలచే లక్ష్మి, బిల్వలచే ఐశ్వర్యము, చంపకములచే ధనము, కలుగును, మధుక పుష్పబిల్వ ఫలములు కలిపి హోమము చేసినచో సర్వజ్ఞత్వము లభించును. త్వరితా మంత్రము మూడు లక్షలు జపము, హోమధ్యాన పూజలు చేసినచో అభిలషిత ఫలము లభించును. మండలములపై త్వరితా దేవిని అర్చించి త్వరితా గాయత్రితో ఏబది హోమములు ఇవ్వవలెను. పిదప మూలమంత్రముతో పల్లవములు మూడు వందలు హోమములు చేసి దీక్షాగ్రహణము చేయవలయును. దీక్షకు పూర్వము పంచగవ్య ప్రాశన చేయవలెను. దీక్షా సమయమున చెరువు మాత్రమే భుజించవలయును.

అగ్ని మహాపురాణమున త్వరితా పూజా విధివర్ణనమను మూడు వందల తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page