Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ దశాధిక త్రిశతతమోధ్యాయః

అథ త్వరితామంత్రాది

అగ్ని రువాచ :

అపరాం త్వరితావిద్యాం వక్ష్యే7హం భుక్తిముక్తిదామ్‌ | పురేవజ్రాకులే దేవీం రజోభిర్లఖితేయజేత్‌. 1

పద్మగర్భే దిగ్విదిక్షు చాష్టావజ్రాణి వీథికామ్‌ | ద్వారశోభోవ శోభాచ లిఖేచ్ఛీఘ్రం స్మరేన్నరః. 2

అష్టాదశ భుజాం సింహే వామజంఘా ప్రతిష్ఠితా | దక్షిణాద్వి గుణాతస్యాః పాదపీఠే సమర్పితా. 3

నాగభూషాం వజ్రకుండే ఖడ్గం చక్రం గదాం క్రమాత్‌ |

శూలం శరం తథా శక్తిం వరదం దక్షిణౖః కరైః. 4

ధనుఃపాశం శరం ఘంటాం తర్జనీం శంఖమంకుశమ్‌ |

అభయంచ తథా వజ్రం వామ వార్శ్వే ధృతాయుధమ్‌. 5

పూజనాచ్ఛత్రునాశః స్యాద్రాష్ట్రం జయతిలీలయా | దీర్ఘాయా రాష్ట్రభూతీః స్యాద్ధివ్యాది సిద్దిభాక్‌. 6

అగ్నిదేవుడు పలికెను. భుక్తిముక్తి ప్రదమగు మరియొక త్వరితా విద్యను చెప్పెదను. ధూళిచే నిర్మించబడినదియు, వజ్ర చిహ్నముచే అవరింపబడినదియగు భూపుర మండలమున త్వరితా దేవిని పూజించవలయును. ఆ మండలములో యోగపీఠముపై కమలమును నిర్మించి మండలము యొక్క పూర్వాది దిక్కులందును విదిక్కులందును వజ్ర చిహ్నమును, మండలములోపల వీథి ద్వారము, శోభ, ఉపశోభ వాటిని రచించవలెను. దాని లోపల త్వరితా దేవిని భావన చేయవలయును, ఆమెకు పదునెనిమిది భుజము లుండును. ఎడమకాలు సింహము వీపుపైనను కుడికాలు దానికి రెట్టింపు ఆకారముతో పాదపీఠముందును ఉంచబడి యుండును. ఆమె (సర్ప) నాగమయ అలంకారములతో అలం కరింపబడి యుండును, కుడివైనవున్న హస్తములలో క్రమముగ వజ్ర - దండ - ఖడ్గ - చక్ర - గదా - శూల - బాణ - శక్తి - వరద ముద్రలు, ఎడమ ప్రక్కన వున్న చేతులలో ధనుః - పాశ - శర - ఘంటా - తర్జనీ - శంఖ - అంకుశ - అభయ ముద్ర వజ్రా యుధములును ధరించి యుండును. ఆదేవుని పూజించుటచే శత్రువులు నశింతురు. ఆవలీలగా రాష్ట్రమును జయించగలుగును. దీర్ఘా యుర్దాయవంతుడై రాష్ట్రైశ్వర్యమును పొందును. దివ్యసిద్ధులను అదివ్య సిద్థులను కూడ పొందును. తలయనగా సప్తపాతాశములు కాలము, అగ్ని సకల భువనములు, అంతకుడు యని అర్థము, ఓంకారముచే పరమేశ్వరుడు మొదలు బ్రహ్మాండములన్నియు ప్రతి పాదింపబడిను. తన మంత్రము యొక్క ఆద్యక్షరమగు ఓం కారముచే తల పర్యంతము దేవి తోయము శీఘ్రముగ త్రిప్పును. అందుచే ఆమెకు "తోతలాత్వరితా" యని పేరు.

తలేతి సప్తపాతాలాః కాలాగ్ని భువనాం తకాః | 7

ఓంకారాది స్వరారభ్య యావడ్చ్రహ్యాండ వాచకమ్‌.

ఓంకారాద్ర్భామయేత్తోయం తోతలా త్వరితా తతః |

తకారాద్ర్బామయేత్తోయం తోతలాత్వరితా తతః | ప్రస్తావం సంప్రవక్ష్యామి స్వరవర్గం లిఖేద్భువి. 8

తాలువర్గః కవర్గః స్యాత్తృతీయో జిహ్వతాలుకః | చతుర్థస్తాలు జిహ్యాగ్రో జిహ్వాదంతస్తు పంచమః. 9

షష్ఠోష్ఠపుటసంపన్నో మిశ్ర వర్గస్తు సప్తమః | ఊష్మాణాః స్యాచ్ఛ వర్గస్తు ఉద్దరేచ్చ మనుంతతః. 10

షష్ఠస్వర సమారూఢ మూష్మణాస్తంన బిందుకమ్‌ | తాలువర్గ ద్వితీయం తు స్వరైకాదశ యోజితమ్‌. 11

జిహ్వాతాలు సమాయోగః ప్రథమం కేవలం భ##వేత్‌ | తదేవ చ ద్వితీయన్తు ఆధస్తాద్వినియోజయేత్‌. 12

ఏకాదశ స్వరైర్యుక్తం ప్రథమం తాలువర్గతః | ఊష్మాణస్య ద్వితీయంతు అధస్తాద్‌దృశ్య యోజయేత్‌. 13

షోడశస్వర సంయుక్త మూష్మాణస్య ద్వితీయకమ్‌ |జిహ్వాదంత సమాయోగే ప్రథమం యోజయే దధః. 14

మిశ్రవర్గాద్ధ్వితీయంతు అధస్తాత్పునరేవతు | చతుర్థస్వరసంభిన్నం తాలువర్గాది సంయుతమ్‌. 15

ఊష్మణశ్చ ద్వితీయంతు అధస్తాద్వినియోజయేత్‌ | స్వరైకాదశ భిన్నంతు ఊష్మణాన్తం సబిందుకమ్‌. 16

పంచస్వర సమారూడం ఓష్ఠసంపుట యోగతః | ద్వితీయమక్షరం చాన్యజ్జిహ్వాగ్రే తాలుయోగతః. 17

ప్రథమం పంచమేయోజ్యం స్వరార్ధేనోద్ధృతా ఇమే | ఓంకారాద్యా నమో7న్తాశ్చ జహేత్స్వాహాగ్నికార్యకే. 18

ఇపుడు, త్వరితా మంత్ర ప్రస్తారమును చెప్పెదను. భూతలముపై సర్వ సమదాయమును వ్రాయవలయును, కవర్గమునకు సాంకేతిక నామము స్వరవర్గ మొదటిది, తాలువర్గము రెండవది. మూడవది జిహ్వాతాలుక వర్గము నాల్గవది తాలు జిహ్వాగ్ర వర్గము ఐదవది జిహ్వా దంతక వర్గము ఆరవది ఓష్ఠ పుటసంపన్నము. ఏడవది మిశ్ర వర్గము ఎనిమిదవది ఊష్మవర్గము. ఈ వర్గముల అక్షరముల నుండి మంత్రోద్ధారము చేయవలెను. ఆరవస్వరమైన "" కారముపై ఊష్మవర్గ ద్వితీయాక్షరమైన "" కారము బిందు సంయుక్తము చేయవలెను. (హూం) తాలువర్గ తృతీయా క్షరమగుఖ కారమును పదకొండవ స్వరమగు ఏకారముతో కూర్చవలెను. (ఖే) జిహ్వాతాలు సమాయోగము యొక్క మొదటి అక్షరమగు "" కారము దాని క్రింద అదేవర్గము యొస్క ద్వితీయాక్షరమగు "" కారము పదకొండవ స్వరమగు ఏ కారముతో కలుపవలెను (చ్ఛ్యే) తాలువర్గ ప్రథమాక్షరమగు '' కారమును దాని క్రింద ఊష్మవర్గ ద్వితీయాక్షరమగు షకారముచేర్చి పదునారపస్వమగు అఃతో కలువవలయును. (క్షః) ఊష్మవర్గ తృతీయాక్షరమగు సకారమునకు క్రింద జిహ్వా దంతసమాయోగ ప్రథమాక్షరమగు తకారమ చేర్చి దాని క్రింద మిశ్రవర్గ ద్వితీయాక్షరమగు రకారము కలుపవలెను. పిదప నాల్గవ స్వరమగు ఈకారము చేర్చవలెను. (స్త్రీ) తాలువర్గ ప్రథామక్షరమగు కకారమునకు క్రింద ఊష్మవర్గ ద్వితీయాక్షరమగు షకారమును చేర్చి పండ్రెండవ స్వరమగు ఏకారమును కలుపవలెను. (క్షే) పిదప ఊష్మ వర్గ అంత్యాక్షరమగు హకారమునకు అనుస్వారము చేర్చి ఐదవస్వరమును కలువవలె. (హూం) ఓష్ఠ సంపుట యోగము నుండి రెండవ అక్షరమగు పకారమునకు జిహ్వాగ్ర తాలు యోగమునుండి ఠకారమును పంచమమగు నకారముగా మార్చి కలువవలెను. స్వర అర్ధవ్యంజనములతో ఉద్ధృతములగు ఈ ఆక్షరములుతోతలాత్వరితామంత్రము. దీని, ఆదియందు ఓం కారమును అంతమునందు నమఃను చేర్చిన మంత్రమును జపము చేయవలయును. హోమమునందు మాత్రము నమః తొలగించి స్వాహా చేర్చవలెను, అనగా ఓం హూం-ఖే-చ్ఛ్యే-క్షః-స్త్రీ క్షే, హూం-ఫట్‌ నమః అనునది జపమంత్రము. నమఃబదులు స్వాహా చేర్చిన హోమ మంత్రము

ఓం హ్రీం, హ్రూం హ్రః హృదయం హాం హశ్చేతి శిరః |

హ్రీం జ్వలజ్వల శిఖాస్యాత్కవచం హులుద్వయమ్‌ |

హ్రీం శ్రీం క్షూం నేత్రత్రయాయ విద్యానేత్రం ప్రకీర్తితమ్‌ |

క్షైం హం క్షాం హూం ఫడస్త్రాయ గుహ్వాంగాని పురాన్యసేత్‌|

త్వరితాంగాని వక్ష్యామి విద్యాంగాని శృణుష్వమే | ఆదిద్వి హృదయం ప్రోక్తం త్రిచతుః శిరఇష్యతే. 19

పంచషష్ఠ శిఖాప్రోక్తా కవచం సప్తమాష్టమమ్‌ | తారకంతు భ##వేన్నేత్రం నవార్ధాక్షర లక్షణమ్‌. 20

తోతలేతి సమాఖ్యాతా వజ్రతుండే తతోభ##వేత్‌ | ఖఖహూందశ బీజాస్యాద్వజ్ర తుండేంద్ర దూతికా. 21

ఖేచరీ జ్వాలినీ జ్వాలీఖఖేతి జ్వాలిన దశ | వర్చశరవి భీషణీ ఖఖేతి చశబర్యపి. 22

ఛేఛేదని కరాలిని ఖచేతి చకరాల్యపి | పక్షః శ్రవద్రవప్లవనీ ఖఖదూతీ ప్లవంగ్యపి. 23

స్త్రీకాలకారే ధునని శాస్త్రీ వసనవేగికా | క్షేవ క్షేకపిలో హంసకపిలా నామదూతికా. 24

హ్రూంతేజోవతి రౌద్రీచ మాతంగీ రౌద్ర దూతికా | పుటేపుటే ఖఖఖడ్గే ఫట్‌బ్రహ్మక దూతికా. 25

వేతాలిని దశార్ణాః స్యుస్త్యజాన్యహి పలాలవత్‌ | హృదాదికన్యాసాదౌస్యాన్మధ్యే నేత్రేన్యసేత్సుధీః. 26

దీని అంగన్యాసము ఈ విధముగ నుండును. ఓం హ్రీం హ్రూం హ్రః హృదయాయనముః, హాం హః శిరసే స్వాహా, హ్రీం జ్వల జ్వల శిఖాయైవ షట్‌ హులు హులు కవచాయ హుం- హ్రీం శ్రీం క్షూం నేత్ర త్రయయవౌషట్‌ ఫట్‌ యనునది దేవీ నేత్రముగా చెప్పబడినది. క్షౌం హః ఖౌం, హూం - ఫట్‌, అస్త్రాయ ఫట్‌ ఇవి గుహ్యాంగ మంత్రములు. వీటి వ్యాసము ముందుగా చేయవలయును. త్వరితాంగములను తరువాత చెప్పెదను. విద్యాంగములను వినుము. మొదటి రెండు బీజాక్షరములు హృదయము. తృతీయ చతుర్థాక్షరములు స్థిరములు, పంచషష్ఠ అక్షరములు శిఖా మంత్రము, సప్త మాష్టమ వర్ణములు కవచ మంత్రములు నవమాక్షరము అర్ధాక్షరము తారకము"తో తలే వజ్రతుండే ఖఖ హూం" యను పదియ క్షరములు కలది వజ్ర తుండికా నామకమగు ఇంద్రదూతికా విద్య. ఖేచరి - జ్వాలిని - జ్వాలే ఖఖ అను పది అక్షరములు కలది జ్వాలినీ విద్య వర్చేశర విభీషణి ఖఖే యనునది దశాక్షర శబరీ విద్య ఛేఛేదని, కరాలిని ఖఖ ఇది దశా క్షర కరాలినీ విద్య, క్షః శ్రవ ద్రవ ప్లవని, ఖఖే ఇది దశాక్షర ప్లవంగ దూతీవిద్య. "స్త్రీ బలం కలిదొనని శాసి" ఇది దశాక్షర శ్వసన వేగికా విద్య, క్షే పక్షే కపిలే హంస ఇది దశాక్షరకపిలా దూతికావిద్యా. హ్రూం తేజోవతి రౌద్రి మాతంగి" ఇది దశాక్షరరౌది దూతికావిద్య. పుటేపుటే ఖఖ ఖడ్గే ఫట్‌ ఇది దశాక్షర బ్రహ్మ దూతికావిద్య. వైతాలలో చెప్పబడిన అన్ని మంత్రములును దశాక్షరములు ఇతరమైన వాటినన్నింటిని పొల్లువలె సారహేయములుగా భావించి విడిచి వేయవలెను. న్యాసాదుల యందు హృదయాద్యంగములు ఉపయోగించవలెను. నేత్రమును మధ్యమునందు న్యాసము చేయవలెను.

పాదాదారభ్య మూర్దాన్తం శిర ఆరభ్య పాదయోః | ఆంఘ్రిజానూరు గుహ్యేచ నాభిహృత్కంఠదేశతః 27

వజ్ర మండల మూర్ద్వేచ ఆధోర్ధ్వోచాది బీజతః | సోమారూపం తతో గావం డారామృత సువర్షిణమ్‌. 28

విశస్తం బ్రహ్మ రంధ్రేణ సాధకస్తు విచిస్తయేత్‌| మూర్దాన్య కంఠ హృన్నాభౌ గుహ్యోరుజాను పాదయోః.

ఆదిబీజం న్యసేన్మంత్రీ తర్జన్యాది పునః పునః | ఊర్ద్వం సోమమధః పద్మం శరీరం బీజ విగ్రహమ్‌ 30

యోజానాతి నమృత్యుః స్యాత్తన్య నవ్యాధయోజ్వరాః | యజేజ్ఞపేత్తాం విన్యస్యధ్యాయేద్దేవీం శతాష్టకమ్‌.

(అ) 2/36

ముద్రావక్ష్యే ప్రణీతాద్యాః ప్రణీతాః పంచధాన్మృతాః |

గ్రథితౌతు కరౌకృత్వా మధ్యేం7గుష్ఠౌనిపాతయేత్‌. 32

తర్జనీం మూర్ద్నిసంలగ్నాం విన్యసేత్తాం శిరోవరి | ప్రణీతేయం సమాఖ్యాతా హృద్దేశేతాం సమానయేత్‌. 33

ఊర్ద్వంతు కన్యసామధ్యే స బీజాన్తాం విదుర్ద్విజాః | నియోజ్య తర్జనీ మధ్యే7నేకలగ్నాం పరస్పరామ్‌. 34

జ్యేష్టాగ్రం నిక్షిపేన్మధ్యే బేదనీ సా ప్రకీర్తితా | నాభిదేశే తు తాంబద్ధ్వా ఆంగుష్ఠావుత్షిపేత్తతః. 35

కరాలీతు మహాముద్రా హృదయే యోజ్యమంత్రిణః | పునస్తు పూర్వవద్ర్బహ్మాలగ్నాం జ్యేష్ఠాం సముత్షిపేత్‌.

వజ్రతుండా నమాఖ్యాత్‌ వజ్రదేశేతు బంధయేత్‌

ఉభాభ్యాం చైవ హస్తాభ్యాం మణిబంధం తు బంధయేత్‌. 37

త్రీణిత్రీణి వ్రసార్యేతి వజ్రముద్రా ప్రకీర్తితా | దండం ఖడ్గం చక్రగదాముద్రా చాకారతః స్మృతా. 38

ఆంగుష్టేనాక్రమేత్త్రీణి త్రిశూలం చోర్ద్వతో భ##వేత్‌ | ఏకాతు మధ్యమోర్ధ్వాతు శక్తిరేవ విధీయతే. 39

శరంచ వరదం చాపం పాశం భారంచ ఘంటయా | శంఖ మంకుశ మభయం పద్మమష్టచ వింశతిః. 40

మోహణీ మోక్షణీ చైవ జ్వాలినీ చామృతాభయా | ప్రణీతాః పంచముద్రాస్తు పూజాహోమేచ యోజయేత్‌. 41

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే త్వరితామంత్రాది వర్ణనంనామ దశాధిక త్రిశతతమోధ్యాయః.

పాదము నుండి శిరస్సు వరకు, శిరస్సు నుండి పాదముల వరకు చరణజాను గుహ్య నాభి హృదయములను కంఠ దేశము నుండి ముఖ మండల పర్యంతము పైకిని క్రిందకును ఆది బీజము నుండి నిర్గతమైనదియు, అమృత ధారను వర్షించునదియు హోమ రూప మగు ఆకారము బ్రహ్మ రంధ్రము నుండి నాలో ప్రవేశించు చున్నది యని సాధకుడు భావన చేయవలెను. మంత్రోపాసకుడు శిరోముఖ కంఠ హృదయ నాభి గుహ్య ఊరుజాను పాదము లందును తర్జని యందును మాటి మాటికి ఆది బీజమును న్యాసము చేయవలెను. అమృత మయ హోమము పైనను బీజాక్షర రూప మగు శరీర కమలము క్రిందను వున్నది యను రహస్యము తెలిసిన వానికి మృత్యు భయము గాని వ్యాధి జరాదలు గాని వుండవు. న్యాస ధ్యాన పూర్వకముగ ధ్యానము చేసి త్వరితా మంత్రము నూట యెనిమిది పర్యాయములు జపించవలెను. ఇపుడు ప్రణీతాది ముద్రలను చెప్పెదను. ప్రణీతా ముద్రలు ప్రణీత, సబీజా ప్రణీత, భేదని కరాలి వజ్రతుండ యని ఐదు విధములు. రెండు చేతులు కలిపి ఆంగుష్ఠములను మధ్య యందుంచి తర్జని పైకి చాపినచో ప్రణీత. దీనిని హృదయ దేశము నందు చూపవలెను. ఈ ముద్ర యందు కనిష్టికను పైకి వుండునట్లు చేసి మధ్య యందుంచినచో అది సబీజ తర్జని. మధ్య యందు అనామికను పసర్పర సంలగ్నము చేసి అంగుష్ఠాగ్ర భాగమును మధ్యయందుంచినచో అది భేదనీ ముద్ర. ఆ ముద్రను నాభి దేశము నందుంచి అంగుష్టము నందలి జలమును జల్లవలెను. దీనినే హృదయమునందుంచినచో కరాలి యని మహా ముద్ర యగును మరల బ్రహ్మ లగ్నా జ్యేష్ఠను వెనుకటి వలె పైకి నిలబడునట్లు చేసినచో అది వజ్ర తుండ ముద్ర దానిని వజ్ర దేశమును ఉంచవలెను. రెండు హస్తములతో మణి బంధమును బంధించి మూడే వ్రేళ్ళు చాపినచో వజ్ర ముద్ర యగును. వాటి వాటి ఆకారములను అనుసరించి దండ - ఖడ్గ - చక్ర - గదాది ముద్రలు చెప్పబడినవి. అంగుష్ఠముచే ఊర్ధ్వ ముఖములగు మూడు వ్రేళ్ళను ఆక్రమించినచో అది త్రిశూల ముద్ర. మధ్య మాంగుళిని మాత్రము పైకి నిలిపినచో శక్తి ముద్ర యగును. బాణ - వరద-ధనుష్‌-పాశ-భార-ఘంటా-శంఖ-అంకుశ - అభయ పద్మములు పైన చెప్పిన ప్రణీత మొదలగు ముద్రలు కలిపి ఇరువది యెనిమిది ముద్ర లగును. గ్రహణి- మోక్షణి - జ్వాలిని - అమృత - అభయ - ఈ ఐదును ప్రణీతా ముద్రలు. వీటిని పూజా హోమములందుపయోగించ వలెను.

అగ్ని మహా పురాణమున త్వరితా మంత్రాది వర్ణన మను మూడు వందల పదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page