Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

త్వరితా మూలమంత్రాదు

అథ ఏకాదశాధిక త్రిశతతమోధ్యాయః

అథ త్వరితా మూలమంత్రాది

అగ్ని రువాచ

దీక్షాది వక్ష్యేవిన్యస్య సింహవజ్రాకులేబ్జకే |

హేహే హుతివజ్రదంత పురుపురు లులు లులు గర్జగర్జ ఇహ సింహాసనాయనమః.

తిర్వగూర్ధ్వ గతారేఖా చత్వారశ్చతతో భ##వేత్‌. 1

నవభాగవిభాగేన కోష్ఠకాన్కారయేద్బుధః | గ్రాహ్యాదిశాగతాః కోష్ఠావిదిశాసు వినాశ##యేత్‌. 2

బాహ్యేవై కోష్ఠకోణషు బాహ్యరేఖాష్టకంస్మృతమ్‌ | బాహ్యకోష్ఠన్య బాహ్యేతు మధ్యేయావత్సమానయేత్‌. 3

వజ్రస్య మధ్యమం శృంగం బాహ్యరేఖాద్విధార్ధతః | బాహ్యరేఖా భ##వేద్వక్రా ద్విభంగాం కారయేద్బుధః 4

మధ్యకోష్ఠం భ##వేత్పద్మం పీతకర్ణిక ముజ్జ్వలమ్‌ | కృష్ణేన రజసా77లిఖ్య కులిశాసిశిరోర్ధ్వతా. 5

బాహ్యతశ్చతు రస్రంతు వజ్రసంపుట లాంఛితమ్‌ | ద్వారే ప్రదాపయేన్మంత్రీ చతురో వజ్రసంపుటాన్‌ 6

పద్మనామ భ##వేద్వామవీథీచైవ సమాభ##వేత్‌ | గర్భం రక్తం కేసరాణి మండలే దీక్షితాః స్త్రియః. 7

జయేచ్చ పరరాష్ట్రాణి క్షిప్రం రాజ్యమవాప్నుయాత్‌ | మూర్తిం ప్రణవ నందీప్తాం హుంకారేణ నియోజయేత్‌.

మూల విద్యాంసముచ్ఛార్య మరుద్వ్యోమ గతాం ద్విజ | ప్రథమేన పునశ్చైవ కర్ణికాయాం ప్రపూజయేత్‌. 9

అగ్ని దేవుడు చెప్పెను. సింహాసనము నందున్న వజ్ర వ్యాప్తకమలము నందు మంత్రన్యాస పూర్వక దీక్షాది విధానమును చెప్పెదను. "హేహే హుతి వజ్ర దంత పురుపురు, లు, లు, గర్జ, గర్జ, ఇహ సింహాస నాయ నమః". ఇది సింహాసన పూజా మంత్రము. నాలుగు నిలుపు రేఖలు, నాలుగు అడ్డరేఖలు గీయగా తొమ్మిది కోష్ఠములు ఏర్పడును. నాలుగు దిక్కులందును వున్న కోష్ఠములను వుంచి విదిక్కులందున్న కోష్ఠములను చెరిపి వేయవలెను. మిగిలిన కోష్ఠముల కోణముల వరకు వచ్చు రేఖలు ఎనిమిది యుండును. బాహ్య కోష్ఠము యొక్క బాహ్య భాగమునకు సరిగా మధ్య యందు వజ్ర మధ్య శృంగమగును. బాహ్య రేఖను రెండు భాగములు చేయగా యెంత రేఖార్ధ మగునో అంత శృంగము మాత్రమే వుండవలెను. బాహ్య రేఖ వక్రముగా నుండవలెను. దానిని రెండు గా విభజించవలెను. మధ్య కోష్ఠమును కమలాకారముగ మార్చి పీత వర్ణ మగు కర్ణిక ఏర్పరుప వలయును. నల్లటి చూర్ణముతో కులిశ చక్రమును ఏర్పరచి దానిపై శృంగము ఆకారము ఖడ్గాకారములో వుండునట్లు చేయవలెను. చక్ర బాహ్య భాగమున చతురస్ర చక్రము వ్రాసి వజ్ర సంపుటముతో చిహ్నితము చేయవలెను. భూపుర ద్వారమున నాల్గు వజ్ర సంపుటములు ఏర్పరుప వలయును. పవ్మము వామ వీతియు సమముగా నుండవలయును. కమలము లోపలి భాగము కేసరములు ఎర్రగా నుండవలెను. మండలము నందు స్త్రీలకు దీక్ష ఇచ్చి మంత్ర జపానుష్ఠాము చేయించినచో రాజు శీఘ్రముగా ఇతర రాజ్యములను జయించును. తాను తన రాజ్యమును కోల్పోయినచో దానిని మరల పొందును. ఓంకారముచే సందీప్తమగు మూర్తిని హుంకారముతో నియుక్తము చేసి వాయ్వాకాశ బీజములతో సంపుటితమగు మూల విద్యనుచ్చరించి ఆద్యంతము లందు కర్ణిక యందు పూజించవలెను. ప్రదక్షిణ క్రమమున ఒక్కొక్క అక్షర రూప మగు బీజములను ఉచ్చరించుచు కమల దళములపై పూజ చేయవలయును.

ఏవం ప్రదక్షిణం పూజ్య ఏకైకం బీజమాదితః |

దలమధ్యేతు విద్యాంగా ఆగ్నేయ్యాం పంచ నైరృతమ్‌.

మధ్యే నేత్రం దిశాస్త్రంచ గుహ్యకాంగేతు రక్షణమ్‌ | హుతయః కేసర స్థాస్తు వామ దక్షిణ పార్శ్వతః.

పంచపంచ ప్రపూజ్యాస్తుసై#్వః సై#్వర్మంత్రైః ప్రపూజయేత్‌ |

లోకపాలాన్‌న్య సేదష్టౌ బాహ్యతో గర్భమండలే. 12

వర్ణాంతమగ్ని మారూఢం షష్ఠస్వర విభేదితమ్‌ | పంచదశేన చాక్రాన్తంసై#్వః సై#్వర్నామభిర్యోజయేత్‌. 13

శీఘ్రం సింహే కర్ణికాయాం యజే ద్గంధాదిభిఃశ్రియే |

అష్టాభిర్వేష్టయేత్కుంభైః మంత్రాష్ట గ త మంత్రితైః. 14

మంత్రమష్టనహస్రంతు జప్త్వాంగానాం దశాంశకమ్‌ |

హోమం కుర్యాదగ్నికుండే వహ్నిమంత్రేణ చాలయేత్‌. 15

నిక్షి పేద్ధృదయే నాగ్నిం శక్తిం మధ్యే7గ్నిగాం స్మరేత్‌ |

గర్భాధానం పుంనవనం జాతకర్మచ హోమయేత్‌. 16

హృదయేన శతం హ్యేకం గుహ్యాంగే జనయేచ్ఛిఖిమ్‌ |

పూర్ణాహుత్యాతు విద్యాయాః శివాగ్నిర్జ్వలితోభ##వేత్‌. 17

హోమయేన్మూల మంత్రేణ శతంచాంగం దశాంశతః | నివేదయేత్తతో దేవ్యాస్తతః శిష్యం ప్రవేశ##యేత్‌. 18

అస్త్రేణ తాడనం కృత్వా గుహ్యాంగాని తతోన్యసేత్‌ |

విద్యాంగైశ్చైవ నన్నద్ధం విద్యాంగేషు నియోజయేత్‌. 19

పుష్పం శిక్షాపయేచ్ఛిష్యమానయే దగ్నికుండకమ్‌ | యవైర్ధాన్యైస్తిలైరాజ్యైర్మూల విద్యాశతం హునేత్‌. 20

స్థావరత్వం పురాహోమం నరీసృపమతః పరమ్‌ | పక్షిమృగ పశుత్వంచ మానుషం బ్రాహ్మమేవచ. 21

విష్ణుత్వం చైవ రుద్రత్వమన్తే పూర్ణాహుతిర్భవేత్‌ | ఏకయాచైవ హ్యా హుత్యా శిష్యః స్యాద్దీక్షితోభ##వేత్‌. 22

అధికారో భ##వేదేవం శృణు మోక్షమతః పరమ్‌ |

దళములపై విద్యాంగములను పూజించవలెను. ఆగ్నేయము నుండి వామ క్రమమున నైఋతి దిక్కు వరకు హృదయ శిరః శిఖా కవచ, నేత్రములను అన్ని దిక్కు లందును అస్త్రమును పూజించవలెను. గుహ్యాంగమున రక్షా పూజను కేసరములపై వామ దక్షిణ పార్శ్వము లందున ఐదేసి హుతులను వాటి వాటి నామ మంత్రములతో పూజించవలెను. గర్భ మండము వెలుపల ఎనమండుగురు లోక పాలకుల న్యాసము చేయవలెను. వర్ణాంతమును (క్ష హ) అగ్నిపై (ర) ఎక్కించి దానిని ఆరవ స్వరముతో (ఊ) భిన్నము చేసి పదునైదవ స్వరమును (ం) దానిని శిరస్సుపై చేర్చి (క్షూం) లేదా హూం) ఆ బీజమును ఆది యందుంచి దిక్పాలకులను తమ తమ నామ మంత్రములతో పూజించవలెను. పిదప శీఘ్రముగా సింహాసనముపై కమల కర్ణిక యందు గంధాద్యుపచారములతో పూజ చేయవలయును. దీనిచే ఐశ్వర్యము లభించును. పిదప నూట యెనిమిది మంత్రములతో అభి మంత్రితములగు ఎనిమిది కలశలను కమలము చుట్టు వుంచి వెయ్యి పర్యాయములు జపము చేసి దశాంశము హోమము చేయవలయును. ముందు అగ్ని మంత్రముతో (రం) కుండము దగ్గరకు అగ్నిని తీసుకొని పోయి హృదయ మంత్రముతో (నమః) దానిని వుంచవలెను. కుండము నందు అగ్ని యుక్తమగు శక్తిని భావన చేయవలెను. ఆ శక్తియందు గర్భాధాన, పుంసవన జాతకర్మ సంస్కారములనుద్దేశించి హృదయ మంత్రముతో కూడ యెనిమిది పర్యాయములు హోమము చేయవలెను. గుహ్యాంగము నుండి నూతనాగ్ని జన్మించినట్లు భావన చేసి మూలవిద్యను నుచ్చరించుచు పూర్ణాహుతి నివ్వవలెను దీనితో శివాగ్ని జన్మ సిద్ధించును. పిదప మూల మంత్రముతో దానిలో నూరుహోమములు చేసి ఆంగములనుద్దేశించి దశాంశ హోమము చేసి శిష్ముని దేవి చేతిలో సమర్పించి వానిని మండపము నందు ప్రవేశ పెట్టవలెను. అస్త్ర మంత్రముతో తాడనము చేసి గుహ్యాంగముల వ్యాసము చేయవలెను. విద్యాంగములచే సన్నద్దులగు శిష్యుని విద్యాంగములందు నియోగింపవలెను. వానిచే ఒక పుష్పము విసిరినట్లు చేసి వానిని అగ్నికుండ సమీపమునకు తీసుకొని వెళ్ళి మూలవిద్యను ఉచ్చరించుచు యవధాన్య తిల ఘృతములతో నూరు హోములు చేయవలెను. ప్రథమ హోమము స్థావర జన్మము నిచ్చి వానికి ముక్తి నిచ్చును. రెండవది సరిస్రుప జన్మమును పిదప వరసగా పక్షి మృగ పశు మానవ జన్మమును ఇచ్చి దాని యందు విముక్తి నిచ్చును. పిదప క్రమముగ బ్రహ్మ విష్ణుపద, రుద్ర పదము లభించును. అంతమున పూర్ణాహుతి ఇవ్వవలెను. ఒక ఆహుతిచే శిష్యుడు మోక్షాధికారి యగును. మోక్షమనగా యెట్లుండునో వినుము.

సుమేరుస్థో యదామంత్రీ సదాశివ పదేస్థితః. 23

పరేచ హోమయేత్స్వస్థో7కర్మకర్మ శతాన్దశ | పూర్ణాహుత్యాతు తద్యోగీ ధర్మాధర్మైర్నలిప్యతే. 24

మోక్షం యాతిపరం స్థానం యద్గత్వాననివర్తతే | యథా జలేజలం క్షిప్తం జలం దేహీశివస్తథా. 25

కుంభైః కుర్యాచ్చాభిషేకం జయరాజ్యాది సర్వభాక్‌ |

కుమారీ బ్రాహ్మణీ పూజ్యా గుర్వాదేర్దక్షిణాం దదేత్‌. 26

యజేత్సహస్రమేకంతు పూజాం కృత్యాదినేదినే | తిలాజ్య పురహోమేన దేవీశ్రీః కామదాభ##వేత్‌. 27

దదాతి విపులాన్భోగాన్యదన్యచ్చ సమీహతే | జప్త్వాహ్యక్షర లక్షంతు నిధానాధిపతిర్భవేత్‌. 28

ధ్విగుణన భ##వేద్రాజ్యం త్రిగుణన చ యక్షిణీ | చతుర్గుణన బ్రహ్మత్వం తతో విష్ణుపదం భ##వేత్‌. 29

షడ్గుణన మహాసిద్ధిర్లక్షేణౖ కేన పాపహా | దశజప్త్వాదేహశుద్ధ్యై తీర్థస్నానఫలం శతాత్‌. 30

వటేవా ప్రతిమాయాం వాశీఘ్రం వైస్థండిలేయజేత్‌ | శతం సహస్రమయుతం జపే హోమేప్రకీర్తితమ్‌. 31

ఏవంవిధానతో జప్త్వా లక్షమేకం తు హోమయేత్‌ | మహిషాజ మేషమాంసేన నరజేన పురేణవా. 32

తిలైర్యవైస్తథా లాజైర్ర్వీహి గోధూమ కామ్రకైః | శ్రీఫలైరాజ్య సంయుక్తైర్హోమయిత్వా వ్రతంచరేత్‌. 33

అర్ధరాత్రేషు సన్నద్ధః ఖడ్గచాప శరాదిమాన్‌ | ఏక వాసా విచిత్రేణ రక్తపీతాసి తేనవా. 34

నీలేన వాథ వస్త్రేణ దేవీం తైరేవ చార్చయేత్‌ | ప్రజేద్దక్షిణ దిగ్భాగం ద్వారేదద్యాద్బలిం బుధః. 35

దూతీ మంత్రేణ ద్వారాదౌ ఏకవృక్షేశ్మసానకే | ఏవంచ సర్వకామాప్తిం భుం క్తే సర్వాం మహీంనృపః. 36

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే త్వరితామూల మంత్రాది వర్ణనం నామైకాదశాధిక త్రిశతతమోధ్యాయః.

మంత్రోపాసకుడు సుమేరువుపై సదాశివ పదమునందున్నచో రెండవ దిమున స్వస్థచిత్తుడై కర్మ క్షయనిమిత్తమై వెయి హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చిన మంత్రయోగి ధర్మా ధర్మ సంబంధ శూన్యుడై మోక్షమును పొందును. అచ్చటి వెళ్ళి మళ్ళి తిరిగి రాడు జలములో పోసిన జలము దానితో కలిసి ఏకరూపమైనట్లు జీవుడు శివునితో కలిసి శివ రూపుడగును. కలశలతో అభిషేకము చేసినవాడు విజయ రాజ్యాదులను పొందును. బ్రాహ్మణ కన్యకను పూజించి గుర్వాదులకు దక్షిణ ఇవ్వవలెను. ప్రతి దినము పూజ చేసి వెయ్యి హోమములు చేయవలెను. తిల ఘృతములతో హోమం చేసినచో దేవిలక్ష్మీని, సమస్త కామములను ఇచ్చును. అనేకమైన భోగములను ఇచ్చి కోరిన కోరికలన్నియు తీర్చును. మంత్రములో ఎన్ని అక్షరములున్నవో అన్ని లక్షల జపము చేయుటచే నిధులకు అధిపతి యగును. రెట్టింపు జపము చేసిన వాడు రాజ్యమును పొందుచు. మూడు రెట్లు జపము చేసినవానికి యక్షిణి సిద్ధించును. నాబుగు రెట్లు జపము బ్రహ్మపదం, ఐదురెట్లు ఎక్కువచేసిన విష్ణు పదము ఆరురెట్లు ఎక్కువచేసిన మహాసిద్ధియు లభించును. ఈ మంత్రమును లక్ష పర్యాయము జపించినచో పాపము నశించును. పది పర్యాయములు జపించినచో దేహశుద్ధి కలుగును నూరు పర్యాయములు జపించినచో తీర్థస్నాన ఫలము లభించును. వేదికపై పలమును గాని, ప్రతిమను గాని పుంచి దాని మొదటి లక్ష లేదా పదివేల జపము చేసి హోమము చేయవలెను. ఈ విధముగా జపము చేసి లక్ష హోమములు చేయవలెను. తిల యవ, లాజ, వ్రీహి గోధూమ, ఆమ్ర ఫలబిల్వ ఫలములను కలిపి వాటిపై నెయ్యిపోసి వాటితో హోమము చేసి వ్రతమును అవలంభించవలెను. రాత్రి కవచాదులు ధరించి ఖడ్గ ధనుర్బాణాదులు గ్రహించి ఏకవస్త్ర ధారియే పైన చెప్పిన వస్తువులతో దేవుని పూజించవలెను. వస్త్రము రంగు రక్తముగాని పీతముగాని కృష్ఠము గాని నీలము గాని వుండవలెను. దక్షిణ దిశకు వెళ్ళి మండప ద్వారముపై దూతి మంత్రముతో బలి సమర్పించవలెను. ఈ బలి ద్వారాదులందుగాని, ఒక వృక్షము వున్న శ్మశానము నందుగాని ఇవ్వవచ్చును. ఇట్లుచేసిన సాధకుడు రాజ్యము పొంది సమస్త కామములను అను భవించును సకల పృథ్విని ఏలును.

అగ్ని మహాపురాణమున త్వరితా మూలమంత్రాది వర్ణనయను మూడు వందల పదకొండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page