Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ద్వాదశాధిక త్రిశతతమో7ధ్యాయః
అథ త్వరితావిద్యా
అగ్నిరువాచ :
విద్యా ప్రస్తార మాఖ్యాస్యే ధర్మకామాది సిద్ధిదమ్ | నవకోష్ఠ విభాగేన విద్యాభేదం చ విన్దతి. 1
అనులో మవిలో మేన సమస్తవ్య స్తయోగతః | స్తయోగతః | కర్ణావికర్ణ యోగేన ఆధ ఊర్ధ్వం విభాగశః. 2
త్రిత్రికేణచ యోగేన దేవ్యా సన్నద్ధ విగ్రహః | జానాతి సిద్ధిదాన్మంత్రాన్ప్రస్తారాన్నిర్గతాన్బహూన్. 3
శాస్త్రే శాస్త్రేస్మృతామంత్రాః ప్రయోగాస్తత్ర దుర్లభాః
గురుః స్యాత్ర్పథమో వర్ణః పూర్వేద్యుర్నచ వర్ణ్యతే. 4
ప్రస్తారేతత్ర చైకార్ణ ద్వ్యర్ణాత్ర్యర్ణాదయో7భవన్ | తిర్య గూర్ధ్వగతా రేఖాశ్చతురశ్చతురోభ##జేత్. 5
నవ కోష్ఠా భవన్త్యేవం మధ్యదేశే తథాదిమాన్ | ప్రదక్షిణన సంస్థాప్య ప్రస్తారం భేదయేత్తతః. 6
ప్రస్తార క్రమయోగేన ప్రస్తారం యుస్తు విన్దతి | కరముష్టి స్థితాస్తస్య సాధకన్య హి సిద్దయః, 7
త్రైలోక్యం పాదమూలే స్నాన్నవ ఖండాం భువం లభేత్ | కపాలేతు నమాలిఖ్య శివతత్త్వం సమంతతః. 8
శ్మశాన కర్పటే వాథ బాహ్యం నిష్క్రమ్య మంత్రవిత్ | తన్యమధ్యే లిఖేన్నామ కర్ణికోపరి సంస్థితమ్. 9
తాపయే త్ఖాదిరాంగారైర్బూర్జమాక్రమ్య పాదయోః . సప్తాహా దానయేత్సర్వం త్రైలోక్యం నచరాచరమ్. 10
వజ్ర సంపుట గర్భేతు ద్వాదశారేతు లేఖయేత్ | మధ్యే గర్భగతం నామ సదాశివ విదర్భితమ్. 11
కుడ్యే ఫలకకే వాథ శిలాపట్టే హరిద్రయా | ముఖన్తంభం గతిస్తంభం సైన్యస్తంభం తుజాయతే. 12
అగ్నిదేవుడు పలికెను. ఇపుడు ధర్మకామాది సిద్ధి ప్రదముగు విద్యా ప్రస్తారమును చెప్పెదను. నవకోష్ఠ విభాగముచే విద్యా భేదము లభించును. అనులోమ విలోమయోగము సమస్త వ్యస్త యోగము కర్ణావి కర్ణయోగము అధ ఊర్ధ్వ విభాగయోగము త్రిత్రిక యోగము వీటిచే ఎవని శరీరముకు దేవీరక్ష ఏర్పరుపబడునో ఆతడు సిద్ధిదాయకములగు మంత్రములను అనేకములగు ప్రస్తారమును తెలుసుకొనగలుగును. ప్రతి శాస్త్రము నందును మంత్రములు చెప్పబడినవి కాని వాటి వాటి ప్రయోగము దుర్లభము మొదటి వర్ణము గురువు యగును. పూర్వము దాని వర్ణనము చెప్పబడలేదు. దాని ప్రస్తారముచే ఏకాక్షర ద్వక్షరత్ర్యక్షర మంత్రములు ఏర్పడును. నిలువుగను అడ్డముగను నాలుగేసి రేఖలు గీయ తొమ్మిది కోష్ఠములగును. మద్యకోష్ఠముతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమమున మంత్రాక్షరములు వాటిపై వ్రాసి ప్రస్తారం భేదనము చేయవలెను. ప్రస్తార క్రమయోగముచే ప్రస్తారమును పొందగలిగిన సాధకుని చేతిలో అన్ని సిద్ధులుండును. మూడులోకములును ఆతని పాదముపై వంగును ఆతడు నవ ఖండ విభక్తయగు భూమిని పొందును. కపాలముపై గాని, శ్మశాన వస్త్రముపై గాని అన్ని వైపులను శివతత్త్వమును వ్రాసి మంత్ర వేత్తదాని మధ్యభాగము నందలి కర్ణికపై తానుదలచిన వ్యక్తి పేరు భూర్జ పత్రముపై వ్రాసివుంచవలెను. ఖదిర వృక్షము యొక్క బొగ్గులతో భూర్జపత్రమును వెచ్చచేసి రెండు పాదముల కింద తొక్కి వుంచవలెను. ఈ ప్రయోగముచే ఒకేసప్తాహము నందు సచరాచరములగు మూడు లోకములను తన పాదములపై పడవేయగలుగును. వజ్ర సంపుట గర్భయుక్తమగు ద్వాదశార చక్రము మధ్యయందు శత్రువు పేరు వ్రాసి, దానిని సదాశివ మంత్రము చెప్పుచు దర్భలతో మార్జనము చేయవలెను. పైన చెప్పిన ద్వాదశార చక్రమున నామాధికరణములను పశువుతో గోడపైగాని, పీఠిపైగాని, శిలా పట్టంపైగాని వ్రాయవలెను. ఇట్లు చేయుటచే శత్రువున ముఖస్తంభము, గతస్తంభము, సైన్య స్తంభము కలుగును.
విషరక్తేన సం లిఖ్య శ్మశానే కర్పరే బుధః | షట్‌కోణం దండమాక్రాన్తం సమంతాచ్ఛక్తి యోజితమ్. 13
మారయే దచిరా దేష శ్మశానే నిహతం రిపుమ్ | ఛేదం కరోతి రాష్ట్రస్య చక్రమధ్యేన్యసేద్రిపుమ్. 14
చక్రధారాంగతాం శక్తిం రిపు నామ్నా రిపుం హరేత్ | తార్‌క్ష్యేణౖవతు బీజేన ఖడ్గమధ్యేతులేఖయేత్. 15
విదర్భ రిపునామాథ శ్మశానాంగార లేఖితమ్ | సప్తాహాత్సాధయేద్దేశంతాడయేత్ప్రేత భస్మనా. 16
భేదనే భెదనే చైవ మారణషు శివో భ##వేత్ | తారకం నేత్ర ముద్దిష్టం శాంతి పుష్టా నియోజయేత్. 17
దహనాది ప్రయోగోయం శాకినీం చైవ కర్షయేత్ | మధ్యాది వారుణీం యావద్వక్రతుండ సమన్వితః. 18
కుష్ఠాద్యావ్యాధయోయేతు నాశ##యేత్తాన్న సంశయః | మధ్యాది ఉత్తరాంతంతు కరాలీ బంధనాజ్జపేత్. 19
రక్షయేదాత్మనో విద్యాం ప్రతివాదీయ దాశివః | వారుణ్యాది తతోన్యస్య జ్వరక్లేశ వినాశనమ్. 20
సౌమ్యాది మధ్యమాన్తంతు గురుత్వం జాయతే వటే |
పూర్వాది మధ్యమాన్తంతు లఘుత్వం కురుతేక్షణాత్. 21
భూర్జేరోచనయా లిఖ్యఏతద్వజ్రా కులంపురమ్ |
క్రమస్థైర్మంత్ర బీజైస్తురక్షాం దేహేషు కారయేత్. 22
వేష్టితాం భావహేమ్నాచ రక్షేయం మృత్యునాశినీ | విఘ్నపాపారి దమనీ సౌభాగ్యాయుః ప్రదాధృతా. 23
ద్యూతేరణ చ జయదా శక్రసైన్యేన సంశయః | వంధ్యానాం పుత్రదాహ్యేపా చింతామణి రివాపరా. 24
సాధయేత్పర రాష్ట్రాణి రాజ్యంచ పృథివీం జయేత్ |
ఫట్‌స్త్రీం క్షీం హ్రూం లక్ష్యజప్యాద్యదిరక్ష్వాశగోభ##వేత్. 25
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే త్వరితా విద్యా సిద్ధి కథనం నామ ద్వాదశాధిక త్రిశతతమో7ధ్యాయః.
శ్మశాన వస్త్రముపై విష మిశ్రిత మగు రక్తముతో షట్కోణ చక్రము వ్రాసి దాని మధ్య శత్రువు పేరు వ్రాయవలెను. చక్రము నలువైపుల శక్తి బీజములు వ్రాసి దానిపై దండము ఉంచవలెను. స్మశాన భూమిపై వుంచబడిన ఆ శత్రువుపై శీఘ్రముగా దండ ప్రహారము చేసినచో శత్రు రాజు యొక్క రాష్ట్రము ఖండితమై పోవును. చక్రాకార మండలము ఏర్పరచి దాని మధ్య భాగమున శత్రు నామము వ్రాసి చక్రధార యందు శక్తి బీజ న్యాసము చేసి శత్రువుపేరు ఉచ్ఛరించుచు చక్రధారతో వాటిని కొట్టుచున్నట్లు భావన చేసినచో శత్రువు నశించును. ఖడ్గ మధ్య భాగమున గరుడ బీజముతో శత్రువు నామ ధేయము వ్రాసి దర్భతో మార్జనము చేయవలెను. పేరు వ్రాయుటకు స్మశానము నందు బొగ్గు ఉపయోగించవలెను. దానిపై చితాభస్మముతో ప్రహారము చేయవలెను. ఇట్లు చేసిన సాధకుడు ఒక్క వారంలో శత్రు దేశమును జయించును. భేదన భేదన మారణము లందు అతడు శివుని వలె శక్తిశాలి యగును. తారకములనకు (షట్) నేత్రమని పేరు. దీనిని శాంతి పుష్టికరముల యందు వినియోగించవలెను. ఈ దహనాది ప్రయోగము శాకినిని కూడ ఆకర్షించును. పైచెప్పిన నూరు చక్రములలో మధ్య నున్న మంత్రాక్షరము మొదలు పశ్చిమ దిక్కులనందున్న కోష్టము వరకు నున్న రెండు అక్షరములన ''వక్రతుండ'' మంత్రములలు జపించుటచే కుష్టాది చర్మరోగములన్నియు నశించును. సందేహము లేదు. మధ్య కోష్టము నుండి ఉత్తర కోష్టము వరకు వున్న రెండక్షరముల మంత్రములను కరాళి బంధముతో జపించినచో ఆద్వ్యక్షరీ విద్యా సాక్షాత్తు శివుడే ప్రతి వాదియైనను రక్షణము నిచ్చును. పశ్చిమమునందున్న మంత్రాక్షరమును మొదట వుంచి ఉత్తర కోష్టము వరకు వున్న మంత్రాక్షరము లను వక్రతుండ మంత్రములతో జపించినచో చివర కాసాదులు శమించును. ఉత్తరకోష్టము మొదలు మధ్యకోష్టము వరకునున్న మంత్రాక్షరములను జపించినచో పట బీజమునందు కూడ గురుత్వమును కల్గించ కలుగును. పూర్వాది మధ్యమాంత పక్షముల జపము వెంటనే లఘుత్వమును కల్గించును. భూర్జపత్రముపై గోరోచనముతో వజ్రవ్యాప్తమగు భూపుర చక్రమును నిర్మించి మంత్ర బీజములను క్రమముగ వ్రాసి దానిని ధరించినచో శరీరరక్ష కలుగును. దానిని సువర్ణము చుట్టి ధరించినచో ఆరక్షా యంత్రము మృత్యువును రానీయదు. విఘ్నపాప శత్రువులను అణచి సౌభాగ్య దీర్ఘాయువులను ఇచ్చును. జూదము నందును, యుద్ధము నందును విజయమును ఇచ్చును. ఇంద్రుని సేనతో యుద్ధము చేయవలసి వచ్చినను విజయము నిచ్చును. సందేహము లేదు. వలధ్య స్త్రీలకు పుత్రుల నిచ్చును. ఇది రెండవ చింతామణి వంటిది పరరాష్ట్రములపై అధికారమును పొందును. రాజ్యమును భూమిని జయించును. ఫట్ స్త్రీం, క్షీం, హ్రూం అను మంత్రమును లక్షపర్యాయములు జిపించినచో యక్షాదులు కూడ వశమగుదురు.