Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రయోదశాధిక త్రిశతతమో7ధ్యాయః

అథ నానామంత్రాః

అగ్ని రువాచ :

ఓం వినాయకార్చనం వక్ష్యే యజేదాధారశక్తికమ్‌ | ధర్మాద్యష్టకకందంచ నాలం పద్మంచ కర్ణికమ్‌. 1

కేసరం త్రిగుణం పద్మం తీవ్రం చ జ్వలినీం యజేత్‌ |

నందాఞ్చ సుయశాంచోగ్రాం తేజోవతీం వింధ్య వాసినీమ్‌. 2

గణమూర్తిం గణపతిం హృదయం స్యాద్గణం జయం | ఏకదంతోత్కటశిరః శిఖాయాచలకర్ణినే. 3

గజవక్త్రాయ కవచం హ్రూం ఫడన్తం తథాష్టకమ్‌ |

మహోదరో దండహస్తః పూర్వాదౌమధ్యతోయజేత్‌. 4

జయోగణాధిపో గణనాయకో7థ గణశ్వరః | వక్రతుండ ఏకదంతోత్కటలంబోదరోగజః. 5

వక్రో వికటనామా7థ హ్రూం పూర్వో విఘ్ననాశనః |

ధూమ్రవర్ణో మహేంద్రాద్యో బాహ్యే విఘ్నేశపూజనమ్‌. 6

అగ్నిదేవుడు పలికెను. ఇపుడు వినాయకార్చనను చెప్పెదను. ముందు ఆధార శక్తిని పూజించవలెను. ఆగ్నేయాది విదిక్కులందును పూర్వాది దిక్కులందును క్రమముగ ధర్మజ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన అవైరాగ్య, అనైశ్వర్యములను పూజించి కందనాల పద్మకర్ణికా కేసరములను సత్త్వాది గుణత్రయమును పద్మాసనమును పూజించవలెను. పిదప తీవ్రా - జ్వాలినీ - నందా - సుయశా, కామరూపిణీ - ఉగ్రా - తేజోవతీ సత్యా - విఘ్ననాశి నీయను తొమ్మిది శక్తులను పూజించవలెను. పిదప గణశమూర్తిని, మూర్తి లభించనదో ధ్యానోక్త గణపతి మూర్తిని పూజించి హృదయాద్యంగ పూజలు చేయవలెను. పూజా ప్రయోగ వాక్యములు ఈ విధముగా నుండును. ''గణంజయాయ హృదయాయ నమః ఏకదంతాయ ఉత్కటాయ శిరసే స్వాహా అచట కర్ణినే శిఖాంయై వషట్‌, గజ వక్త్రాయ హుంఫట్‌ కవచాయ హుం, మహోదరాయ దండ హస్తాయ, అస్త్రాయ ఫట్‌ ఈ ఐదు అంగములలో నాల్దింటిని నాలుగు దిక్కులందును ఐదవ దానిని మధ్యభాగమునందును పూజించవలెను. పిదప గణంజయ, గణాధిప, గణనాయక, గణశ్వర, వక్రతుండ, ఏకదంత, ఉత్కట, లంబోదర, గజవక్త్ర వికటాననులను పద్మ దశములపై పూజించవలెను. మధ్యభాగము హూం విఘ్న నాశనాయ నమః మహేంద్రాయ ధూమ్ర వర్ణాయనమః యని పలికి విఘ్ననాశన ధూమ్ర వర్జులను పూజించవలెను. బాహ్య ప్రదేశమున విఘ్నేశ్వరుని పూజించవలెను.

త్రిపురా పూజనం వక్ష్యేఅసితాంగోరురుస్తథా | చండః క్రోధస్తథోన్మత్తః కపాలీ బీషణః క్రమాత్‌. 7

సంహారో భైరవో బ్రాహ్మీ ముఖ్యాహ్రస్వాస్తు భైరవాః |

బ్రహ్మాణీ షణ్ముఖా దీర్ఘా అగ్న్యాదౌ బటుకాః క్రమాత్‌. 8

సమయ పుత్రో బటుకో యోగినీ పుత్రకస్తథా | సిద్ధిపుత్రశ్చ బటుకః కులపుత్రశ్చతుర్థకః. 9

హేతుకః క్షేత్ర పాలశ్చ త్రిపురాన్తో ద్వితీయకః | అగ్ని వేతాలో7గ్నిజిహ్వః కరాలీ కాలలోచనః. 10

ఏకపాదశ్చ భీమాశ్చ ఐం క్షేం ప్రేతస్త థాసనమ్‌ |

ఓం ఐం హ్రీం ద్వౌచ త్రిపురా పద్మాసన సమాస్థితాః. 11

బిభ్రత్యభయ పుస్తం చ వామే వరద మాలికామ్‌ | మూలేన హృదయాది స్యా జ్జాల పూర్ణం చ కామకమ్‌.

గోమధ్యే నామ సంలిఖ్య చాష్టపత్రే చ మధ్యతః | శ్మశానాదిపటే శ్మశానాంగారేణ విలేఖయేత్‌. 13

చితాంగార పిష్ట కేన మూర్తిం ధ్యాత్వాతు తస్య చ | క్షిప్త్వోదరే నీల సూత్రైర్వేష్ట్య చోచ్చాటనం భ##వేత్‌. 14

ఇపుడు త్రిపురాభైరవ పూజల విధిని చెప్పెదను. ఎనమండుగురు భైరవులను పూజించవలెను. అసితాంగభైరవరురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాలి భీషణ సంహార భైరవులు యని వారల పేర్లు. బ్రాహ్మి మొదలగు మాతృకలను కూడ పూజించవలెను. అకారాదిహ్రస్వ స్వరముల బీజమును ఆదియందుంచి భైరవవుల పూజ చేయవలెను. బ్రాహ్మాది మాతృకలను ఆకారాది దీర్ఘాక్షరములు ఆదియందుంచి పూజించవలెను. ఆగ్నేయాది దిక్కులందు వటుకులను పూజించవలెను. సమయపుత్రవటుక, యోగినీ పుత్రకసిద్ధిపుతవటుక కుల పుత్ర వటుకులు వీరి పేర్లు. పిమ్మట హేతుక, త్రిపురాంత, అగ్ని వేతాల అగ్ని జిహ్వ, కరాల కాలలోచన ఏకపాద భీమాక్షులను ఎనమండుగురు క్షేత్రపాలకులను పూజించి, త్రిపురాదేవి యొక్క ప్రేత రూపపద్మాసనమును పూజించవలెను. ఐం, క్షైం, ప్రేత పద్మాసనా యనమః. ఓం, హైం హ్రీం, అసౌః త్రిపురాయై ప్రేతపద్మాసనస్థితాయై నమః యను మంత్రముతో త్రిపురాభైరవిని పూజించవలెను. త్రిపురాదేవి వామహస్తము లందు అభయపుస్తకములను, దక్షిణ హస్తములందు వరముద్రాజపమాలి కలమ ధరించి యుండును. బాణసమూహముతో నిండిన అంబుల పొదిని ధనుస్సును ధరించి యుండును. మూల మంత్రమును హృదయాది న్యాసము చేయవలయును. గో సమూహ మధ్యమున నిలిచి శ్మశానాది వస్త్రముపై చితిలోనే బొగ్గుతో అష్ట దళ కముల చక్రమును వ్రాయించవలెను. శత్రువు పేరును వ్రాసి మడత పెట్టి చితా భస్మముతో శత్రు మూర్తి నిర్మించి, ఆతడు దాని యందున్నట్లు భావన చేసి పైన చెప్పిన యంత్రమును నల్లటి దారముతో చుట్టి ఆ మూర్తి పొట్టలో దూర్చవలెను. అపుడు ఆ వ్యక్తి నశించును.

ఓం నమో భగవతి జ్వాలామాలిని గృధ్రగణ పరివృతే స్వాహా |

యుద్ధే గచ్ఛం జపన్మంత్రం పుమాన్సాక్షాజ్జయీ భ##వేత్‌ |

ఓం శ్రీం హ్రీం క్లీం శ్రియై నమః ఉత్తరాదౌ చ ఘృణినీ సూర్యాపూజ్యా చతుర్దలే. 15

ఆదిత్యా ప్రభావతీ చ హేమాద్రి మధురాశ్రియః. |

(అ) 2/37

ఓం హ్రీం గౌర్యై నమః | గౌరీమంత్రః సర్వకరో హోమాద్ధ్యానాజ్జపార్చనాత్‌. 16

రక్తా చతుర్భుజా పాశవరదా దక్షిణ కరే | అంకుశాభయయుక్తాం తాం ప్రార్థ్య సిద్ధాత్మ నా పుమాన్‌. 17

జీవేద్వర్ష శతం ధీమాన్న చోరాది భయం భ##వేత్‌ | క్రుద్ధః ప్రసాదీ భవతి యుధి మంత్రాంబు పానతః. 18

అంజనే తిలకం వశ్యే జిహ్వాగ్రే కవితా భ##వేత్‌ | తజ్జపాన్మైథునం వశ్యే తజ్జపాద్యోని వీక్షణమ్‌. 19

స్పర్శాద్వశీ తిలహోమాత్సర్వం చైవతు సిధ్యతి | సప్తాభి మంత్రితం చాన్నం భుంజం స్తస్య శ్రియః సదా.

అర్ధనారీశ రూపో7యం లక్ష్మ్యాది వైష్ణవాదికః | అనంగ రూపాశక్తిశ్చ ద్వితీయా మదనాతురా. 21

పవనవేగా భువనపాలావై సర్వసిద్ధిదా | అనంగ మదనానంగ మేఖలాన్తం జపేచ్ఛ్రియే. 22

పద్మ మధ్య దలేషు హ్రీం స్వరాన్కాదీంస్తతఃస్త్రియాః | షట్‌ కోణవా ఘటేవాథ లిఖిత్వాస్యా ద్వశీకరమ్‌.

''ఓం నమో భగవతి జ్వాలా మాలిని గృధ్ర గణ పరివృతే స్వాహా'' యను మంత్రమును జపించుచు యుద్ధమునకు వెళ్ళు వాని జయము కలుగును. ఓం, శ్రీం, హ్రీం, క్లీం శ్రియై నమః యను మంత్రముతో చతుర్దళ కమలపై ఉత్తర దిక్క్రమమున గృణినీ సూర్యా, అదిత్యా ప్రభావతీ యను నలుగురు శ్రీ దేవులను పూజించి ఈ శ్రీ మంత్రమును జపించుటచే శ్రీ లభించును. ఈ శ్రీ దేవులందరును సువర్ణ గిరి వలె సుందర కాంతి కలవారు. ఓం హ్రీం గౌర్యై నమః యను గౌరీమంత్రముతో జప హోమ ధ్యాన పూజలు చేసిన వానికి సమస్తము లభించును. గౌరి దేవి శరీర కాంతి అరుణము, నాలుగు భుజములు వుండును. దక్షిణహస్తము నందు పాశ, వర ముద్రలను, వామ హస్తము లందు అంకుశ అభయ హస్తములను ధరించి యుండును. శుద్ధ చిత్తముతో గౌరీదేవిని ప్రార్థించువానికి నూరు వర్ణముల ఆయుర్దాయ ముండును. చోరాది భయముండదు. యుద్ధ రంగమున ఈ మంత్రముతో అభిమంత్రించిన ఉదకమును త్రాగినచో వానిపై అధిక కోపము కలవాడు కూడ ప్రసన్నుడగును. ఈ మంత్రముతో అంజనము తిలకము ధరించినచో వశీకరణము సిద్ధించును. జిహ్వపై దీనిని వ్రాసినచో కవిత్వ శక్తి లభించును. దీని జపముచే స్త్రీ పురుషులు వశమగును. సూక్ష్మ ప్రాణులు కూడ చూడబడును. స్పర్శమాత్రముచే మనుష్యులు వశమగుదురు. మంత్రముతో తిలలు హోమము చేసినచో సర్వ మనోరథములు సిద్ధించును. ఈ మంత్రముతో ఐదు పర్యాయములు అభిమంత్రించి అన్నమును భుజించు వాని యొద్ద సర్వ ధనముండును. దీని ప్రారంభమున లక్ష్మీ బీజమును (శ్రీం) వైష్ణవ బీజమును (క్లీం) చేర్చినచో ఆది అర్ధనారీశ్వర మంత్రమగును. అనంగ రూపా మదనా, అనంగ మేఖలా యను శక్తుల నామ మంత్రములను జపించుటచే లక్ష్మీ ప్రాప్తించును. కమల దశములపై హ్రీం, స్వరములు, కాది వ్యంజనములు వ్రాసి మధ్య అభీష్ట స్త్రీ నామధేయము వ్రాయవలయును. షట్కోణ చక్రముపై గాని కలశముపై గాని వ్రాయవచ్చును. పిమ్మట ఆ స్త్రిని ఉద్దేశించి జపము చేసినచో వశీకరణ మగును.

ఓం హ్రీం ఛ్రూం నిత్యక్లిన్నే మదద్రవే ఓంఓం |

మూలమంత్రః షడంగోయం రక్తవర్ణేత్రికోణకే | ద్రావణీహ్రాదకారిణీ క్షోభిణీ గురుశక్తికా. 24

ఈశానాదౌ చ మధ్యేతాం నిత్యాం పాశాంకుశౌతథా | కపాల కల్పకతరుం వీణారక్తాచ తద్వతీ. 25

నిత్యాభయా మంగళాచ నవవీరాచ మంగలా | దుర్భగా మనోన్మనీ పూజ్యా ద్రావాపూర్వాదితఃస్థితా. 26

ఓం హ్రీం అనంగాయనమః | ఓం హ్రీం హ్రీం స్మరాయనమః |

మన్మథాయ చ మారాయ కామాయైపంచపంచధా | కామాః పాశాంకుశో చాపబాణాధ్యేయాశ్చ బిభ్రతః. 27

రతిశ్చ విరతిః ప్రీతిర్వి ప్రీతిశ్చ మతిర్దృతిః విధృతిః పుష్టిరేభిశ్చ క్రమాత్కామాదికైర్యుతాః.

ఓం ఛం నిత్యక్లిన్నే మదద్రవే ఓం ఓం |

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, బుూ, ?? ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆః.

కఖ గఘ ఙ చఛ జఝ ఞ టఠ డఢ ణ తథ దధ న పఫ బభ మ యరలవశషసహక్ష

ఓం ఛం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహా |

ఆధార శక్తింపద్మంచ సింహే దేవీం హృదాదిషు |

ఓం హ్రీం గౌరి రుద్రదయతే యోగేశ్వరి హ్రూం ఫట్‌ స్వాహా.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానామంత్ర నిరూపణం నామ త్రయోదశాధిక త్రిశతతమో7ధ్యాయః.

''ఓం, హ్రీం, ఛూం నిత్య క్లిన్నే మదద్రవే ఓం ఓం''యనునది ఆరు అంగముల మూల మంత్రము. ఎర్రటి త్రికోణ చక్రముపై అష్ట దళ కమలమును భావించి దానిపై ద్రావిన్యాదులను పూజించవలెను. పూర్వాది దిక్కు లందు, ద్రావిణి మొదలగు నలుగురు శక్తులను ఈశానాది కోణము లందు అపర మొదలగు నాలుగు శక్తులను భావన చేసి పూజించవలెను. ద్రావిణీ, వామజ్యేష్టా ఆహ్లాదకారిణీ, అపరా, క్షోభిణీ, రౌద్రీ గుణ శక్తి యనునవి ఈ శక్తుల పేర్లు. దేనిని ఈ విధముగా ధ్యానము చేయవలెను. రక్త వర్ణములగు వస్త్రాలంకారాదులను ధరించి రెండు హస్తములలో పాశాంకుశములను రెండు హస్తములలో కపాల కల్ప వృక్షములను, రెండు హస్తములతో వీణను ధరించి యుండును. నిత్యాఅభయా, మంగళా, నవవీరా, సుమంగళా, దుర్భగా మనోన్మణీ ద్రాహ యను ఎనమండుగురు దేవులను మారాది దిక్కుల కమల దళములపై పూజించవలెను. వీటి బాహ్య భాగమున ఐదు దళములపై ఓం హ్రీం అనంగాయ నమః. ఓం హ్రీం, స్మరాయ నమః, ఓం హ్రీం మన్మథాయ నమః ఓం హ్రీం మారాయ నమః ఓం హ్రీం కామాయ నమః యను ఐదుగురు కామ దేవులను పూజించవలెను. వారి హస్తములలో పాశ అంకుశ, ధనుస్సు బాణములువున్నట్లు ధ్యానించవలెను. వీటి బాహ్య భాగమున పదిదళములపై క్రమముగ రతి విరతి, ప్రీతి విప్రీతి, మతి దుర్మతి, ధృతి విధృతి, తుష్టి వితుష్టి యను కామ వల్లభలను పూజించవలెను. ''ఓం, భం నిత్య క్లిన్నే ఓం ఓం'' మొదలు ఓం భం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహా వరకును. మూలోక్తమైనది నిత్యక్లిన్నావిద్యా. సింహాసనముపై ఆధార శక్తిని పద్మమును పూజించి దాని దళముపై హృదయాద్యంగములను స్థాపించి పూజించి మధ్యకర్ణికపై దేవిని పూజించవలెను. ఓం హ్రీం, గౌరి, రుద్రదైతే యోగేశ్వరి హూం ఫట్‌ సాహా. ఇది గౌరీ మంత్రము.

అగ్ని మహా పురాణమున నానామంత్ర నిరూపణ మను మూడు వందల పదమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page