Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తశాధిక త్రిశతతమో7ధ్యాయః
అథ సకలాది మంత్రోద్ధారః
ఈశ్వర ఉవాచ :
సకలం నిష్కలం శూన్యం కాలాఢ్యం స్వమలం కృతమ్ |
క్షపణం క్షయమన్తః స్థం కంఠోష్ఠం చాష్టమం శివమ్. 1
ప్రసాదస్య పరాఖ్యస్యస్మృతం రూపం గుహాష్టధా | సదాశివస్య శబ్దస్య రూపస్యా ఖిల సిద్ధయే. 2
అమృతశ్చాంశు మాంశ్చేన్ధుశ్చేశ్వర శ్చోగ్ర ఊహకః | ఏకపాదేన ఓజాఖ్య ఔషధశ్చాంశు మాన్వశీ. 3
అకారాదేః క్షకారశ్చ కకారాదేః క్రమాదియే | కామదేవః శిఖండీచ గణశః కాలశంకరౌ. 4
ఏకనేత్రో ద్వినేత్రశ్చ త్రిశిఖో దీర్ఘబాహుకః | ఏకపాదర్థ చంద్రస్య బలపూయోగినీ ప్రియః. 5
శక్తీశ్వరో మహాగ్రంథిస్తర్పకః స్థాణుదంతురౌ | నిధిశో నందిపద్మశ్చ తథాన్యః శాకినీ ప్రియః. 6
ముఖ బింబో భీషణశ్చ కృతాంతః ప్రాణ సంజ్ఞకః | తేజస్వీ శక్ర ఉదధిః శ్రీకంఠఃసింహ ఏవచ. 7
శశాంకో విశ్వరూపశ్చ క్షశ్చస్యాన్నర సింహకః | సూర్యమాత్రా సమాక్రాంతం విశ్వరూపన్తు కారయేత్. 8
అంశుమత్సయుతం కృత్వా శశి బీజం వినాయుతమ్ | ఈశానమోజసా క్రాంతం ప్రథమంతు సముద్ధరేత్. 9
తృతీయం పురుషం విద్ది దక్షిణం పంచమం తథా | సప్తమం వామదేవన్తు సద్యో జాతం తతః పరమ్. 10
రసయుక్తన్తు నవమం బ్రహ్మపంచక మీరితమ్ | ఓంకారాద్యాశ్చతుర్థ్యన్తా నమో7న్తాః సర్వమంత్రకాః 11
సద్యోదేవా ద్వితీయన్తు హృదయంచాంగ సంయుతమ్ | చతుర్థస్తు శిరోవిద్ధి ఈశ్వరన్నామ నామతః. 12
ఊహకన్తు శిఖాజ్ఞేయా విశ్వరూప సమన్వితా | తన్మంత్ర మష్టమం ఖ్యాతం నేత్రం తు దశమం మతమ్. 13
అస్త్రం శశీ సమాఖ్యాతం శివసంజ్ఞం శిఖిధ్వజః | నమః స్వాహాతథా వౌషట్ హూం చ ఫట్ కక్రమేణతు. 14
జాతిఫట్కం హృదాదీనాం ప్రాసాదం మంత్రమావదే |
ఈశానాద్రుద్ర సంఖ్యాతం ప్రోద్ధరేచ్చాంశు రంజితమ్. 15
ఔషధాక్రాంత శిరసమూహకస్యోపరిస్థితమ్ | అర్ధచంద్రోర్ద్వనాదశ్చ బిందు ద్వితయ మధ్యగమ్. 16
తదన్తే విశ్వరూపన్తు కుటిలన్తు త్రిధాతతః | ఏవం ప్రాసాద మంత్రశ్చ సర్వకర్మకరోమనుః. 17
శిఖాబీజం సముద్ధృత్య ఫట్కారాన్తంతు చైవఫట్ | అర్ధ చంద్రాసనం జ్ఞేయం కామదేవం ససర్పకమ్. 18
మహాపాశుపాతస్త్రంతు సర్వదుష్ట ప్రమర్దనమ్ | ప్రాసాదః సకలః ప్రోక్తో నిష్కలః ప్రోచ్యతే7ధునా. 19
శివుడు చెప్పెను. స్కంధా ! సకల నిష్కల శూన్య కాలాఢ్య సమలంకృత క్షపణ క్షయ, అంతస్థ కంఠోష్ఠ, శివ, యనునవి ప్రాసాద పరాసంజ్ఞక మగు మంత్రము యొక్క ఎనిమిది స్వరూపము. ఇవి శబ్ద మయములగు సదా శివ రూపములు. సకల సిద్ధులను యిచ్చునవి. అమృత అంశుమత్, ఇంద్ర ఈశ్వర ఉగ్ర ఊహక్ ఏక పాద ఐల, ఓజ, ఔషధ అంశుమత్ వశి యనునవి వరుసగ అకారాది ద్వాదశ స్వరములకు వాచకములు. చెప్పబోవునవి కకారాద్యక్షర సూచకములు. వరుసగా కామ దేవశిఖండి గణశ, కాల శంకర, ఏక నేత్ర ద్వినేత్ర, త్రిశిఖ, దీర్ఘ బాహుక, ఏకపాద, అర్ధ చంద్ర, వలయ, యోగినీ ప్రియ. శక్తీశ్వర, పద్మ శాకినీ ప్రియ, ముఖబింబ. భీషణ, కృతాంత, ప్రాణ, తేజస్వి, శక్ర ఉదధి శ్రీకంఠ సింహ శశాంక విశ్వరూప నారసింహములు విశ్వ రూపమును పండ్రెండు మాత్రలతో కలిపి వ్రాయవలెను. విశ్వరూపమును (హ) అంశముతో (ం) తోను ఓజస్ (ఓ) తోను కలిపి శశి బీజమును (స) కలుపుకొన్నచో (ఓం) యను ప్రథమ బీజము ఉద్ధృత మగును. ఇది ఈశాన సంబద్ధము. పైన చెప్పిన పండ్రెండు బీజములలో ఐదు హ్రస్వయుక్త బీజములు ఆరు దీర్ఘ బీజములు. మొదటి మాత్ర యందును పదకొండవ మాత్ర యందును ఒకే ''హం'' యను బీజము ఏర్పడును. తృతీయ బీజము తత్పురుష బీజము ఐదవది. అఘోర బీజము ఏడవది. వామ దేవము. దాని తరువాతది సద్యోజాతము. ఇది రసయుక్తమగు నవము బీజము. ఈ విధముగ ఐదు బీజములతో కూడిన ఈశానాదులకు బ్రహ్మ పంచకమని పేరు వీటి ప్రారంభమున ప్రణవము చివర ''నమః'' చేర్చవలెను. ఈశానాది నామములను చతుర్థ్యంతముగ మార్చినచో పూజోపయుక్త మంత్రములగును. ద్వితీయ చతుర్థాది మాత్రలు దీర్ఘములు. వాటిని హృదయాద్యంగ న్యాసము నందు ఉపయోగించవలెను. చతుర్థము శిరో మంత్రము. ఇది ఈశ్వర నామకము. హకారమునకు ఊకార అను స్వారము చేర్చగా ఏర్పడినది శిఖా మంత్రము. ఎనిమిదవది విశ్వరూప సమన్వితము. దశమము నేత్ర మంత్రము. అస్త్ర మంత్రము విసర్గ యుక్తము.
(అ) 2 /38
శివ సంజ్ఞక మని చెప్పబడినది. హృదయాద్యంగముల ఆరు జాతులను క్రమముగా నమః స్వాహా వషట్ హూం, వౌషట్ ఫట్ యని వుండును. ఇపుడు ప్రాసాద మంత్రమును చెప్పెదను. ''హీం, హౌం, హూం. ఇది ప్రాసాద మంత్ర బీజములు. వీటికి కుటిలములని పేరు. ఇది సర్వ కార్య సంపాదకము. హృదయ శిఖాది బీజములను వెనుక చెప్పిన విధమున ఉద్ధారము చేసి ఫట్కారము వరకును సకలాంగ న్యాసము చేయవలయును. ఆసనము అర్ధ చంద్రాకారము. శివుడు కామ పూరకుడు. సర్పాలంకృతుడు. మహా పాశుపతాస్త్రము సర్వ దుష్ట వినాశకరము. ఈ విధముగ సకల ప్రాసాదము చెప్పబడినది. ఇపుడు నిష్కల ప్రాసాదమును చెప్పెదను.
ఔషధం విశ్వరూపన్తు రుద్రాఖ్యం సూర్యమండలమ్ | చంద్రార్థనాద సంయోగం విసంజ్ఞం కుటిల న్తతః. 20
నిష్కలో ముక్తిముక్తౌ స్యాత్పంచాంగో7యం సదాశివః |
అంశుమాన్విశ్వరూపంచ ఆవృతం శూన్యరంజితమ్. 21
బ్రహ్మాంగ రహితః శూన్యస్తస్య మూర్తిరసస్తరుః విఘ్ననాశాయ భవతి పూజితో బాలబాలికైః. 22
అంశుమాన్విశ్వరూపాఖ్య మూహకస్యో పరిస్థితమ్ | కలాఢ్య సకలసై#్యవ పూజాంగాది చ సర్వతః. 23
నరసింహం కృతాంతస్థతేజస్వి ప్రాణమూర్ధ్వగమ్ | అంశుమానూహకాక్రాంత మథోర్ధ్వం ఖమలం కృతమ్.
చంద్రార్ధనాద నాదాంతం బ్రహ్మ విష్ణు విభూషితమ్ | ఉదధిం నరసింహశ్చ సూర్యమాత్రా విభేదితమ్. 25
యదాకృతం తదాతస్య బ్రహ్మణ్యంగాని పూర్వవత్ |
ఔషధ (ఔ) విశ్వరూప - (హ) ఏకదశమాత్ర సూర్యమండలం (ం) ములతో కూడిన అర్ధ చంద్రము (అనునాసిక) నాదము వీటితో కూడినది ''హౌం'' యను మంత్రం ఇదినిష్కల ప్రాసాద మంత్రము, దీనికి విసంజ్ఞ కుటిలము యని పేరు యిది భుక్తి ముక్తి ప్రదము. ప్రాసాదమంత్రము ఈ శానాది బ్రహ్మమూర్తి పంచక యుక్తము. అందు చేత దీనిని పంచాంగము సాంగము యని చెప్పుదురు. అంశముతో (ం) విశ్వరూప (హ) అమృత (అ) ముల కలయికచే వ్యక్తమగు హం బీజమునకు శూన్యమని పేరు. ఈ శానాది బ్రహ్మాత్మ కాంకములతో రహితమగుటచే దీనికి శూన్యయని పేరు. ఈశానాది మూర్తులు ఈ బీజముల అమృతతరువులు వీటి పూజనము సమస్త విఘ్నములను తొలగించును. అంశుమాన్ (ం) చేర్చిన విశ్వరూపము (హ) ఊహకము (ఊ) పైన అధిష్ఠితమైనచో ఏర్పడిన హూం బీజమునకు కలాఢ్యమని పేరు ఇది సకలాం తర్గతము పూజాంగాది కములు సకలమునకే వుండును. నరసింహుడు యమరాజుపై కూర్చుండును. యనగా ''క్ష'' కారము, ''మ'' కారముపై వుండును. తేజస్వి (ర) ప్రాణ (య) ములు కూడ కలియును. పైన అంశుమత్ (ం) క్రింద ఊహకము (ఊ) వున్నచో (క్ష్మ్యూ) అను బీజము ఏర్పడును. ఇది పైనను క్రిందను మాత్రలచే అలంకరింపబడినది గాన సమలంకృతమని చెప్పబడును. చంద్రార్థాకారబిందు నాదములతో గూడిన బ్రహ్మ విష్ణునామ విభూషితములగు ఉదధి (వ) నరసింహ (క్ష) లను పండ్రెండు మాత్రలతో ఖేదితములు చేయవలయును. హ్రస్వస్వరములతో కూడిన బీజములు ఈశానాది బ్రహ్మాత్మకాది అంగములగును. దీర్ఘస్వరయుక్త బీజములు వున్న మంత్రములు హృదయాద్యంగ విన్యాసమునకు ఉపయోగించును.
ఓజాఖ్య మంశుమద్యుక్తం ప్రథమం వర్ణముద్ధరేత్. 26
అంశుమచ్చాంశునాక్రాన్తం ద్వితీయం వర్ణనాయకమ్ | అంశుమానీశ్వరస్తద్వత్తృతీయం ముక్తిదాయకమ్.
ఊహకం చాంశునాక్రాంతం వరుణ ప్రాణతైజసమ్ |
పంచమన్తు సమాఖ్యాతం కృతాంతంతు తతఃపరమ్. 28
అంశుమానుదక ప్రాణః సప్తమం వర్ణముద్ధృతమ్ | పద్మమిందు సమాక్రాన్తం నందీశ##మేకపాదధృక్. 29
ప్రథమం చాన్తతోయోజ్యం క్షపణం దశబీజకమ్ | అస్యార్థం తృతీయం చైవ పంచమం సప్తమం తథా. 30
సద్యోజాతంతు నవమం ద్వితీయాద్ధృదయాదికమ్ | దశార్ణ ప్రణవం యత్తు ఫడన్తం చాస్త్రముద్ధరేత్. 31
నమస్కార యుతాన్యత్రబ్రహ్మాంగాని తు నాన్యథా | ద్వితీయాదష్టమం యావత్ అష్టౌవిద్యేశ్వరామతాః. 32
అనన్తేశశ్చ సూక్ష్మశ్చ తృతీయశ్చ శివోత్తమః | ఏకమూర్త్యేక రూపస్తుత్రిమూర్తిపరస్తథా. 33
శ్రీకంఠశ్చ శిఖండీచ అష్టౌవిద్యేశ్వరాః స్మృతాః | శిఖండినో7ప్య నన్తాంతం మత్రాంతం మూర్తిరీరితాః. 34
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ సకలాది మంత్రోద్ధార నిరూపణం నామ సప్తదశాధిక త్రిశతతమో7ధ్యాయః.
ఇపుడు దశరూప బీజ ప్రణవములను చెప్పెదను. బీజమును అనుస్వార యుక్తము చేసి ''ఓం'' యను ప్రథమ వర్ణోద్ధారము చేయవలెను. అంశుమత్ అంశువుల యోగముచే ''అం'' యను నాయకస్వరూప ద్వితీయ వర్ణము ''అంశుమత్'' ఈశ్వరులచే ఈం యను ముక్తి ప్రదమగు తృతీయ వర్ణము ఏర్పడును. అంశు అక్రాంతమగు ఊహకము (ఊం) చతుర్థ వర్ణము సానుస్వార వరుణ (వ్) ప్రాణ (వ్య) తేజస్ (ర) (వ్యు) ఇది పంచమ బీజాక్షరము. స్వాను స్వార కృతాంతము (మం) షష్ఠ బీజము. స్వాను స్వార ఉదక ప్రాణములు (వ్యం) సప్తమ బీజము ఇందు యుక్త పద్మము (పం) అష్టమ బీజము ఏకపాద యుక్త నందీశుడు (నేం) నవమ బీజము. అంతమున ప్రథమ బీజమును చేర్చవలెను. ఇట్లేర్పడిన దశ బీజాత్మక మంత్రమునకు క్షపణము యనిపేరు దీని ప్రథమ తృతీయ, పంచమ, సప్తమ, నవమ బీజములు క్రమముగ ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత స్వరూపములు ద్వితీయాది బీజములు హృదయాద్యంగన్యాసోప యుక్తములు ఈ పది ప్రణవాత్మక బీజములును ఒక్కసారి ఉచ్చరించుచు ''అస్త్రాయ ఫట్'' యని అస్త్ర న్యాసము చేయవలెను. ఈశానాది మూర్తుల అంతమున నమః యనునది చేర్చియే చెప్పవలెను. ద్వితీయ బీజము మొదలు నవమ బీజము వరకు వున్నవి విద్వేశ్వర రూపములు. ''అవంతేశ'' సూక్ష్మ ''శివోత్తమ'' ఏకమూర్తి, ఏకరూప త్రిమూర్తి, శ్రీకంఠ, శిఖండి, యని వీటిపేర్లు శిఖండి, మొదలు అనంతేషుని వరకు విలోమ క్రమముచే బీజమంత్రములను చేర్చవలెను.
అగ్ని మహాపురాణమున సకలాది మంత్రోద్ధారణమను మూడువందల పదియేడవ అధ్యాయము సమాప్తము.